నాగపట్టినం
తమిళనాడులో ఒక పట్టణం From Wikipedia, the free encyclopedia
తమిళనాడులో ఒక పట్టణం From Wikipedia, the free encyclopedia
నాగపట్నం, (గతంలో నాగపట్టినం లేదా నెగపటం అని పిలుస్తారు) భారతదేశం, తమిళనాడు రాష్ట్రంలోని ఒక పట్టణం.ఇది నాగపట్నం జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం. ఈపట్టణం మధ్యయుగ చోళుల కాలంలో (సా.శ. 9వ-12వ శతాబ్దం) ప్రాముఖ్యతను సంతరించుకుంది. తూర్పు వైపు నౌకాదళ యాత్రలకు, వాణిజ్యానికి.. ముఖ్యమైన నౌకాశ్రయంగా పనిచేసింది. రాజరాజ చోళ I సహాయంతో శైలేంద్ర రాజవంశానికి చెందిన విజయ రాజు మారా విజయత్తుం గవర్మన్ నిర్మించిన నాగపట్నంలోని చూడామణి విహారం ఆ కాలంలోముఖ్యమైన బౌద్ధ నిర్మాణం.[1][2]
Nagapattinam
Chola nadu | |
---|---|
Municipality | |
Nickname: City of Coromandel | |
Coordinates: 10.767200°N 79.844900°E | |
Country | India |
State | Tamil Nadu |
District | Nagapattinam |
Region | Cauvery Delta |
Established | 1866 |
Government | |
• Type | Selection Grade Municipality |
• Body | Nagapattinam Municipality |
విస్తీర్ణం | |
• Total | 17.92 కి.మీ2 (6.92 చ. మై) |
Elevation | 29 మీ (95 అ.) |
జనాభా (2011) | |
• Total | 1,02,905 |
• Rank | 32 |
• జనసాంద్రత | 5,800/కి.మీ2 (15,000/చ. మై.) |
Languages | |
• Official | Tamil |
Time zone | UTC+05:30 (IST) |
PIN | 611xxx |
Telephone code | 04365 |
Vehicle registration | TN 51 |
నాగపట్నం పోర్చుగీసు వారిచే స్థిరపడింది. తరువాత, డచ్ వారిఆధ్వర్యంలో 1660 నుండి 1781 వరకు డచ్ కోరమాండల్ రాజధానిగా పనిచేసింది. 1781 నవంబరులో ఈ పట్టణాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనంచే సుకుంది. ఇది 1799 నుండి 1845 వరకు బ్రిటిష్ వారి మద్రాసు ప్రెసిడెన్సీ కింద తంజావూర్ జిల్లాకు రాజధానిగా పనిచేసింది.[3] ఇది స్వతంత్ర భారతదేశంలో తంజావూరు జిల్లాలో భాగంగా కొనసాగింది. తరువాత 1991లో కొత్తగా సృష్టించబడిన నాగపట్నం జిల్లాకు ఇది ప్రధాన కార్యాలయంగా చేయబడింది. నాగపట్నం 17.92 కి.మీ2 (6.92 చ. మై.) విస్తీర్ణంలో ప్రత్యేక తరగతి పురపాలక సంఘం ద్వారా పరిపాలన సాగుతుంది. 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం ఈ పట్టణం 1,02,905 మొత్తం జనాభాను కలిగి ఉంది.
నాగపట్నంలో ఎక్కువ మంది ప్రజలు సముద్రమార్గం ద్వారా చేపలు పట్టడం, వ్వాపార, వ్యవసాయ, పర్యాటక రంగాలలోఉపాధి పొందుతున్నారు.కాయారోహణస్వామి ఆలయం, సౌందరరాజపెరుమాళ్ ఆలయం ప్రధాన హిందూపుణ్యక్షేత్రాలు. నాగపట్నం సిక్కల్, వేలన్ కన్ని, పూంపుహార్, కొడియక్కరై, వేదారణ్యం, తరంగంబాడి ప్రాంతాలు పర్యాటకానికి ఆధారం. నాగపట్నానికి ప్రధాన రవాణా మార్గం రోడ్డు మార్గాలు. నగరానికి రైలు, సముద్ర రవాణా సౌకర్యాలు ఉన్నాయి.
నాగపట్ట్టినం నగరం అనేది శ్రీలంక నుండి వలసవచ్చి నాగపట్టినం నగరంలో స్థిరపడిన ప్రజలను సూచించే నగర్ నుండి ఉద్భవించింది. పట్టినం పట్టణాన్ని సూచిస్తుంది.ఇది కులోత్తుంగ I కాలంలో చోళకులవల్లిపట్టినం అని పిలువబడింది.[4]
ఈ పట్టణం మద్రాసు ప్రెసిడెన్సీ ప్రధాన ఓడరేవులలో ఒకటిగా ఉంది. ట్రాన్క్విబార్, టుటికోరిన్ ఓడరేవులను ఏర్పడిన తర్వాత ఈ ఓడరేవు పవితనం క్షీణించింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, సిర్కాళి 1991 వరకు తంజావూరు జిల్లాలోభాగంగా కొనసాగింది.తరువాత కొత్తగా సృష్టించబడిన నాగపట్నం జిల్లాలో భాగమైంది. 2004 హిందూ మహాసముద్రం భూకంపం తరువాత వచ్చిన సునామీ కారణంగా నాగపట్నం తీవ్రంగా నష్టానికి గురైయింది. ఇది 2016 సంవత్సరంలో బాగా అభివృద్ధి చెందింది.అనేక పెద్ద వస్త్ర దుకాణాలు, మిఠాయి గృహాలు, పాఠశాలలు, కళాశాలలు, వివిధ రకాల చేపలు వ్యాపారాలతో అందుబాటులోఉన్నాయి.
నాగపట్టణం 10.77°N 79.83°E వద్ద ఉంది [5] ఈ పట్టణానికి తూర్పున బంగాళాఖాతం,దక్షిణాన ఉప్పనార్ నది, పశ్చిమాన తిరువారూర్ జిల్లా,వాయవ్యంలో తంజావూరు జిల్లా, ఉత్తరాన కారైక్కల్,పుదుచ్చేరి సరిహద్దులుగా ఉన్నాయి.[5] ఈ పట్టణం సముద్ర మట్టానికి సమానంలో ఉంది. [5] పురపాలక సంఘం 14.92 కి.మీ2 (5.76 చ. మై.) విస్తీర్ణంలో ఉంది.[5] నాగపట్నం చెన్నై నుండి, 350 కి.మీ. (220 మై.), కారైకల్ నుండి 14 కి.మీ. (8.7 మై.), మైలాదుత్తురై నుండి, 40 కి.మీ. (25 మై.), కుంభకోణం నుండి, 40 కి.మీ. (25 మై.), తంజావూరు నుండి 80 కి.మీ. (50 మై.), తిరువారూర్ నుండి . 25 కి.మీ. (16 మై.) దూరంలో ఉంది.
నాగపట్నం ఇసుక, బంకమట్టితో కూడిన ఒండ్రు మట్టితో కూడిన సాదా భూభాగంలో ఉంది. వెట్టార్ నది, కావేరి నది ఉపనదులు ప్రధాన నీటి వనరులు. ఈప్రాంతంలో వరి ప్రధాన పంట. తరువాత వేరుశెనగ, పప్పుధాన్యాలు, చెరకు, పత్తి, నువ్వులు పంటలు పండుతాయి.[5]
2004లో సంభవించిన హిందూ మహాసముద్ర భూకంపం కారణంగా తమిళనాడులో అత్యధికంగా ప్రభావితమైన ప్రాంతం. రాష్ట్రంలో 8,009 మంది మరణించగా, నాగపట్నం ప్రాంతంలో 6,064 మంది వారిలో ఉన్నారు.[6] సముద్రతీరానికి ముఖ్యంగా అక్కరైపట్టై, కించన్కుప్పం సమీపంలో నివసించే మత్స్యకారులు పెద్ద సంఖ్యలో మరణించారు. వరదల కారణంగా చాలా పడవలు దెబ్బతిన్నాయి. ఆస్తి నష్టం మత్స్య పరిశ్రమపై బాగా ప్రభావం చూపింది.[7] తక్షణ పరిణామాలు పర్యాటకరంగంలో ఒక నిశ్చలతను సృష్టించాయి.[8]
2011 జనాభా లెక్కల ప్రకారం, నాగపట్నంలో 10,2,905 జనాభా ఉంది, ప్రతి 1,000 మంది పురుషులకు 1,026 స్త్రీల లింగ నిష్పత్తి ఉంది,ఇది జాతీయ సగటు 929 కంటే చాలా ఎక్కువ. [9] జనాభా మొత్తంలో 11,884 మంది ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు, 6,089 మంది పురుషులు, 5,795 మంది మహిళలలు ఉన్నారు. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు వారు 8.67%, షెడ్యూల్డ్ తెగలు వారు 0.62% ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత 78.74%, ఇది జాతీయ సగటు 72.99% కన్నా ఎక్కువగా ఉంది. [9] పట్టణంలో 24,688 గృహాలుఉన్నాయి. 33,532 మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 209 మంది రైతులు, 320 మంది ప్రధాన వ్యవసాయ కార్మికులు, 605 మంది గృహ పరిశ్రమలు,29,875 మంది ఇతర కార్మికులు,2,523 సన్నకారు కార్మికులు, 35 సన్నకారు రైతులు,130 మందిసన్నకారు వ్యవసాయ కార్మికులు, 62 మంది సన్నకారు వ్యవసాయ కార్మికులుఉన్నారు.[10]
2011 మత గణన ప్రకారం,నాగపట్నంలో 71.4% హిందువులు, 24.79% ముస్లింలు, 3.68% క్రైస్తవులు, 0.01% సిక్కులు, 0.02% బౌద్ధులు,0.01% జైనులు, 0.08% ఇతర మతాలను అనుసరిస్తున్నారు. [11]
1981తో ముగిసిన దశాబ్దంలోదశాబ్ధ వృద్ధి రేటుఎక్కువగా ఉంది, పట్టణ పరిమితి 8.7 కి.మీ2 (3.4 చ. మై.) నుండి పెరగడం వలన 14.95 కి.మీ2 (5.77 చ. మై.) వరకు విస్తీర్ణం పెరిగింది. [12] ఇతర పట్టణ కేంద్రాలకు ప్రజల వలసల కారణంగా మొత్తం వృద్ధి రేటు ఆ కాలంలో క్షీణించింది. [12] 40 మురికివాడల్లో 2004 14న సంభవించిన సునామీ ప్రభావితమయ్యింది.మంజూరు పథకాలు, సునామీ సహాయ కార్యక్రమాల సహాయంతో, వీటిని సునామీ పక్కా ఇళ్ల పథకం క్రింద పునర్నిర్మించారు. [13]
చేపలు పట్టడం ప్రధాన వృత్తి అయినప్పటికీ, పట్టణానికి పర్యాటకం కీలకమైన ఆర్థిక పాత్ర పోషిస్తుంది. నాగపట్టణం అనేది నాగోర్, వేలంకన్ని, సిక్కల్, కొడియక్కరై, వేదారణ్యం, మన్నార్గుడి, తరంగంబాడి వంటి వారసత్వ, చారిత్రాత్మక ప్రదేశాలకు స్థావరంగా ఉంది. నాగోర్ దుర్గా, 16వ శతాబ్దానికి చెందిన నాగోర్లో ఉన్న మీనార్, పట్టణంలోని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి.
కందూరి పండుగ అనేది 14-రోజుల కార్యక్రమం, పవిత్ర హజ్రత్ షాహుల్ హమీద్ (సా.శ.1490-1579) వార్షిక ఉర్స్ (వార్షికోత్సవం) కోసం జరుపుకుంటారు.[14] చారిత్రాత్మకంగా మినార్ అనేక దేశీయ, అంతర్జాతీయ సందర్శకులను ఆకర్షిస్తుంది.[15] మరో మూడు ప్రముఖ మసీదులు ఉన్నాయి; ఒకటి నాగై పుదూర్ రోడ్ దగ్గర, ఒకటి కొత్త బస్టాండ్ దగ్గర, మరొకటి మూలకడై స్ట్రీట్ వద్ద.[48]
కాయరోహణస్వామి ఆలయం శివునికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఈ ఆలయం 6వ శతాబ్దం నుండి ఉనికిలో ఉంది.7వ-8వ శతాబ్దానికి చెందిన అప్పర్, కాంపాంటార్, సుందరార్లచే శైవ సిద్ధాంత రచనలో తేవరం శ్లోకాలచే గౌరవించబడింది.[16]
ఈ ఆలయం త్యాగరాజ ఆరాధనలోని ఏడు దేవాలయాలలో ఒకటి, సప్త విడంగం అని వర్గీకరించబడింది, ఇక్కడ ప్రధాన దైవం త్యాగరాజు విభిన్న నృత్య రీతులను చిత్రీకరిస్తాడని నమ్ముతారు.[17]ఈ ఆలయం కాయారోహణస్వామి భార్య అయిన నీలయదాక్షి మందిరానికి కూడా ప్రసిద్ధి చెందింది.[17]
సౌందరరాజపెరుమాళ్ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడిన పట్టణంలోని హిందూ దేవాలయం. ఇది దివ్య దేశములలో ఒకటి, 6వ-9వ శతాబ్దానికి చెందిన ఆళ్వార్లు అని పిలువబడే 12 మంది కవి సాధువులలో ఒకరైన తిరుమంగై ఆళ్వార్చే నలయిర దివ్య ప్రబంధంలో పూజించబడిన విష్ణువు యొక్క 108 దేవాలయాలు.[17]
నాగపట్నం సిక్కల్లోని సిక్కల్ సింగరవేలన్ ఆలయం, వేదారణ్యంలోని వేదారణ్యేశ్వర్ ఆలయం, ఎట్టుకుడి మురుగన్ ఆలయం, కూతనూర్ మహా సరస్వతి ఆలయం వంటి కొన్ని ప్రముఖ హిందూ దేవాలయాలకు స్థావరంగా ఉంది.[18]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.