From Wikipedia, the free encyclopedia
మూస:Terrorism ఉగ్రవాదం (ఆంగ్లం Terrorism) అనే పదము ఉగ్రము (Terror) అనే పదము నుండి ఉద్భవించినది. ఉగ్రము - భయం నుండి పుట్టినది. భయం అనేది, భయాన్నికలుగజేసే, భయపెట్టే, లేదా అపాయాన్ని కలుగజేసే విషయాల పట్ల 'మానసిక ప్రతిచర్య'. ఆత్మన్యూనతాభావనలకు, ఉద్రేకాలకు లోనై, ఇతరులకు భయపెట్టి తమ పంతాలను నెగ్గించుకొనువారు, తమ భావాలను, బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించేవారు, తమ స్వీయవిషయాల రక్షణకొరకు, సమాజవ్యతిరేక మార్గాలను ఎంచుకొనువారు - 'ఉగ్రవాదులు'. మానసికంగా చూస్తే ఇదో రుగ్మత. సామాజికంగా చూస్తే ఇదో పైశాచికత్వం, మతపరంగా చూస్తే ఇది నిషిద్ధం. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాల మూలంగా ఎంతో మంది అమాయకులైన ప్రజలు బలవుతున్నారు.
భారత హోం మంత్రిత్వ విభాగం, ఆగస్టు 2013 నాటికి, తన వెబ్సైట్లో ఉంచిన నిషేధింపబడ్డ తీవ్రవాద / ఉగ్రవాద సంస్థల జాబితా:[1]
సంఖ్య | సంస్థ పేరు |
---|---|
1 | బబ్బర్ ఖల్సా |
2 | ఖలిస్తాన్ కమెండో ఫోర్స్ |
3 | రెవల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ ఇన్ మనిపూర్ |
4 | అంతర్జాతీయ సిక్కు యువజన సమాఖ్య |
5 | లష్కరె తోయిబా లేదా పాస్బానె అహ్లె హదీస్ |
6 | జైషె మొహమ్మద్ |
7 | హర్కతుల్ జిహాద్ అల్ ఇస్లామీ |
8 | హిజ్బుల్ ముజాహిదీన్ - en:Hizb-ul-Mujahideen/ Hizb-ul-Mujahideen Pir Panjal Regiment |
9 | రెవల్యూషనరీ పీపుల్స్ ప్రంట్ ఇన్ మణిపూర్ - Revolutionary People's Front (RPF) in Manipur |
10 | జమ్మూ కాశ్మీర్ ఇస్లామిక్ ఫ్రంట్ - Jammu and Kashmir Islamic Front |
11 | యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సామ్ లేదా ఉల్ఫా - United Liberation Front of Assam |
12 | నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్ - National Democratic Front of Bodoland |
13 | పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ - People’s Liberation Army |
14 | యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ - United National Liberation Front |
15 | పీపుల్స్ రెవల్యూషనరీ పార్టీ ఆఫ్ కాంగ్లైపాక్ - People’s Revolutionary Party of Kangleipak |
16 | కాంగ్లైపాక్ కమ్యూనిస్ట్ పార్టీ Kangleipak Communist Party |
17 | కాంగ్లై యఓల్ కాంబా లుప్ - Kanglei Yaol Kanba Lup |
18 | మణిపూర్ పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ - Manipur People’s Liberation Front |
19 | ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ - All Tripura Tiger Force |
20 | నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర - National Liberation Front of Tripura |
21 | లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్.టి.టి.ఇ. - Liberation Tigers of Tamil Eelam |
22 | స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) - Students Islamic Movement of India |
23 | దీందార్ అంజుమన్ - Deendar Anjuman |
24 | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు-లెనినిస్టు - పీపుల్స్ వార్ - Communist Party of India - People’s War, All its formations and front organizations |
25 | మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ - Maoist Communist Centre - All its formations and Front Organisations |
26 | అల్ బద్ర్ - Al Badr |
27 | జమీయతుల్ ముజాహిదీన్ |
28 | అల్ ఖైదా |
29 | దుఖ్తరానె మిల్లత్ Dukhtaran-e-Millat |
30 | తమళనాడు లిబరేషన్ ఆర్మీ - Tamil Nadu Liberation Army |
31 | తమిళ్ నేషనల్ రెట్రైవల్ ట్రూప్స్ - Tamil National Retrieval Troops |
32 | అఖిల్ భారత్ నేపాల్ ఏక్తా సమాజ్ - Akhil Bharat Nepali Ekta Samaj |
33 | హిన్న్యూట్రెప్ నేషనల్ లిబరేషన్ కౌంసిల్ - Hynniewtrep National Liberation Counsel |
34 | అచిక్ నేషనల్ వాలంటీర్ కౌంసిల్ ఇన్ మేఘాలయా - Achik National Volunteer Counsel (ANVC) in Meghalaya |
35 | గరో నేషనల్ లిబరేషన్ ఆర్మీ - Garo National Liberation Army |
36 | ఇండియన్ ముజాహిదీన్ |
హిందూ రైట్ వింగ్ సంస్థ, మహాత్మాగాంధీ హత్యారోపణలపై 1948 లో నిషేధింపబడింది. అలాగే ఎమర్జెంసీ కాలంలో 1975-77 లోనూ, బాబ్రీమసీధు విధ్వంసం తరువాతనూ 1992 లో నిషేధింపబడింది. తరువాత నిషేధింపులు తొలగింపబడ్డాయి.
రష్యా దళాల చేతిలో భర్తలను, లేదా ప్రేమికులను కోల్పోయిన మహిళలు కసితో ఉగ్రవాదులుగా మానవ బాంబులుగా అవతారమెత్తి రష్యాలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. మతం పట్ల ఆసక్తి లేని వారు సైతం బ్లాక్ విడోస్ అవుతున్నారని తేలింది. ఎక్కువమంది వయసు 15 నుంచి 19 సంవత్సరాల మధ్యే ఉంటుంది. కొందరిని తల్లిదండ్రులే ఉగ్రవాదులకు విక్రయిస్తున్నారు. కొన్ని కుటుంబాల వారు బలవంతంగా తమ పిల్లలను ఉగ్రవాదుల్లో చేర్చుతున్నారు. బ్లాక్ విడోస్‌కు ఎలాంటి ఆయుధ శిక్షణ ఉండదు. శరీరానికి పేలుడు పదార్థాలు అమర్చుకుని... మీట నొక్కడమే వారి పని. అమెరికాలో 'బ్లాక్ విడో' అనే ఆడ విషపు సాలె పురుగు సంయోగానంతరం మగ సాలీడును భక్షిస్తుంది. .
కాశ్మీర్ తీవ్రవాదులగుండెల్లో బుల్లెట్లు దింపిన మహిళ రుక్సానా (19)..కాశ్మీర్లో తీవ్రవాదుల దుశ్చర్యలు, కల్లోలం, రాత్రి వేళ ఇళ్లల్లోకి చొరబడటం, ఆకస్మిక దాడులకు తెగబడటం, అమ్మాయిల అపహరణలు, లైంగిక వేధింపులు నరకయాతనే. అలాంటి తీవ్రవాదులపై గొడ్డలితో విరుచుకుపడి, ఒకరిని చంపి... మిగిలిన వారిని పరుగులు తీయించింది రుక్సానా.అరుదైన సాహసం. ఆమె హతమార్చింది ఒక కమాండర్ స్థాయి తీవ్రవాది ని. రుక్సానా బాగా చదువుకున్న అమ్మాయి కాదు.తండ్రి వ్యవసాయదారుడు. వ్యవసాయ పనులు లేనప్పుడు రోజుకూలీగా పని చేసేవాడు.సరిహద్దు జిల్లా రాజౌరీ. ఎనిమిదేళ్ల క్రితం ఓసారి రుక్సానా కుటుంబం తీవ్రవాదుల దాడికి గురయింది. తండ్రి గాయాలపాలయ్యాడు. మొన్న సంఘటనలోనూ తల్లిదండ్రులను తీవ్రంగా కొట్టడం, వారు పడిపోవడం గమనించిన రుక్సానా తట్టుకోలేకపోయింది. తీవ్రవాదులను ధైర్యంగా ఎదుర్కొంది.'నేను పెరిగిన వాతావరణం, ఆ క్షణంలో ఉన్న పరిస్థితి, టీవీల్లో తుపాకీ పేల్చడం చూసిన సందర్భాలు నాకు తెలియకుండానే స్పందించేలా చేశాయి. కళ్లు మూసి తెరిచేలోపు బుల్లెట్లు బయటికొచ్చాయి' అందామె.తీవ్రవాదులు తమ కుటుంబంపై ప్రతీకార దాడి చేస్తారని ఆందోళన చెందుతున్న రుక్సానా భవిష్యత్తు లక్ష్యం పోలీసు శాఖలో చేరడం. యువతకు తుపాకీ శిక్షణ ఇవ్వాలన్న వాదనకూ ఆమె మద్దతు పలుకుతుంది. ఆమె తమ్ముడు ధ్యేయమూ రాబోయే రోజుల్లో భారత సైన్యంలో చేరడమే.రుక్సానా సాహసం దేశంలోని మహిళలకు ఎనలేని ప్రేరణనిచ్చింది. 'ప్రాణ, మానాలకు హాని ఎదురైనప్పుడు అపర కాళిక లా మారి అంతు చూడాలన్న రుక్సానా తీరుని మేం అనుసరిస్తాం అంటున్నారు.http://www.eenadu.net/archives/archive-8-10-2009/vasundhara.asp?qry=manulu
క్రింద పేర్కొనబడ్డ సంస్థలు, ప్రపంచంలోని పలుదేశాలు, ఉగ్రవాద సంస్థలుగా ప్రకటిస్తూ వీటిని నిషేధించాయి. ఇలాంటి సంస్థల పట్ల అప్రమత్తంగా వుండడం చాలా అవసరం. ఈ పట్టికలో భారతదేశం ప్రకటించిన సంస్థలూ ఉన్నాయి.
ఉగ్రవాదంపై భారత్-పాక్‌లు సంయుక్త పోరు జరపాలని పాక్ విదేశాంగమంత్రి షా మహ్మద్ ఖురేషీ పిలుపునిచ్చారు. పాక్ భూభాగంపై ఏ దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదచర్యలను అనుమతించే ప్రసక్తే లేదన్నారు.ఉభయదేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం కోసం చర్చలే శరణ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. (ఈనాడు2.11.2009)
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.