డోలా బెనర్జీ

From Wikipedia, the free encyclopedia

డోలా బెనర్జీ

1980, జూన్ 2న కోల్‌కత సమీపంలోని బారానగర్‌లో జన్మించిన డోలా బెనర్జీ (Dola Banerjee) భారతదేశపు ప్రముఖ ఆర్చెరీ క్రీడాకారిణి. తొమ్మిదేళ్ళ వయస్సులోనే బారానగర్ ఆర్చెరీ క్లబ్‌లో చేరి శిక్షణ పొందడం ఆరంభించిన డోలా బెనర్జీ 1996లో శాన్‌డీగోలో జరిగిన వరల్డ్ యూత్ చాంపియన్ కప్‌లో ప్రాతినిధ్యం వహించి తొలి అంతర్జాతీయ పోటీలో ఆరంగేట్రం చేసింది.[1] 2005లో భారత ప్రభుత్వం నుంచి డోలా అర్జున అవార్డు స్వీకరించింది.

Thumb
డోలా బెనర్జీ

క్రీడాజీవితం

తొమ్మిదేళ్ళ ప్రాయంలోనే డోలా బెనర్జీ బారానగర్ ఆర్చెరీ క్లబ్‌లో శిక్షణకై చేరింది.[2] 1996 నాటికి అంతర్జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగింది. 2004 ఒలింపిక్ క్రీడలలో కూడా భారత్‌కు ప్రాతినిధ్యం వహించి 13వ స్థానం పొందినది. 2007 ఆగష్టులో ఇంగ్లాండులోని డోవర్‌లో జరిగిన మెటక్సాన్ ప్రపంచ ఆర్చెరీ కప్‌లో పాల్గొని స్వర్ణపతకాన్ని సాధించింది. 2007 నవంబర్లో దుబాయిలో జరిగిన ఆర్చెరీ ప్రపంచ కప్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. బీజింగ్లో జరిగిన 2008 ఒలింపిక్ క్రీడలలో వ్యక్తిగత, టీం విభాగాలలో పాల్గొనిననూ ఫైనల్స్‌కు అర్హత పొందలేదు.

అవార్డులు

  • 2005లో భారత ప్రభుత్వం నుంచి అర్జున అవార్డు పొంది ఈ అవార్డు పొందిన తొలి మహిళా ఆర్చెరీ క్రీడాకారిణిగా నిలిచింది.

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.