జోగులాంబ గద్వాల జిల్లా
తెలంగాణ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
Remove ads
జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా పరిపాలన కేంద్రం గద్వాల.[1] ఈ జిల్లా 2016 అక్టోబరు 11న అవతరించింది. ఈ జిల్లాలో 13 మండలాలు, 1 రెవెన్యూ డివిజన్ ఉన్నాయి. ఇందులోని అన్ని మండలాలు మునుపటి మహబూబ్ నగర్ జిల్లా లోనివే.[2].
Remove ads
భౌగోళిక పరిస్థితి

ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదునుండి నైరుతి దిశలో 200 కిలోమీటర్ల దూరంలో పూర్వపు జిల్లా కేంద్రం మహబూబ్ నగర్కి దక్షిణాన 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జిల్లా పేరు వెనుక చరిత్ర
దేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన ఐదవ శక్తి పీఠం జోగులాంబ అమ్మ వారి పేరిట ఈ జిల్లాకు నామకరణం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానది నారాయణపేట జిల్లాలో ప్రవేశించిన పిదప, జోగులాంబ గద్వాల జిల్లాలో అడుగుపెడుతుంది. తుంగభద్ర నది ప్రవహించే ఏకైక తెలంగాణ జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా మాత్రమే.
సమీప జిల్లాలు, నదులు
ఈ జిల్లాకు దక్షిణాన తుంగభద్ర నది, కర్నూలు జిల్లా; ఉత్తర, ఈశాన్య, తూర్పు, నైరుతి దిశల్లో వనపర్తి జిల్లా; పశ్చిమ, వాయవ్య దిశల్లో కర్ణాటక లోని రాయచూరు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. ఉత్తర భాగంలో నారాయణపేట జిల్లాతోనూ అతి స్వల్పంగా సరిహద్దు ఉంది.
జిల్లా ప్రముఖులు

సురవరం ప్రతాపరెడ్డి, పాగ పుల్లారెడ్డి లాంటి స్వాతంత్ర్య సమరయోధులు, గడియారం రామకృష్ణ శర్మ లాంటి సాహితీవేత్తలు, సురవరం సుధాకర్ రెడ్డి, డి.కె.సమర సింహారెడ్డి, డి. కె. భరతసింహారెడ్డి, డి. కె. అరుణ, ఆముదాలపాడు జితేందర్ రెడ్డి, మందా జగన్నాథం లాంటి వర్తమాన రాజకీయవేత్తలకు ఈ జిల్లా పుట్టినిల్లు.
ప్రత్యేకతలు
చేనేత వస్త్రాలకు పేరుగాంచిన గద్వాల, రాజోలి, కాకతీయుల సామంత రాజ్యానికి రాజధానిగా విలసిల్లిన వల్లూరు, ఒకప్పుడు మామిడిపండ్లకు పేరుగాంచిన అలంపూర్, కృష్ణా, తుంగభద్రల నడుమ 60 కిలోమీటర్ల మేర సాగిపోయే 44వ నెంబరు జాతీయ రహదారి, రెండు రాష్ట్రాలను కలుపుతూ రెండు నదులపై రెండు వంతెనలు, సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం ఈ జిల్లానుంచే వెళ్ళుచున్నాయి.
పరిపాలనా విభాగాలు

జిల్లాలోని మండలాలు
మునుపటి మహబూబ్ నగర్ జిల్లా లోని తొమ్మిది మండలాలు విడగొట్టి నూతనంగా ఏర్పడిన ఈ జిల్లాలో విలీనం చేసారు.వడ్డేపల్లి మండలంలోని రాజోలి,మానవపాడ్ మండలంలోని ఉండవెల్లి, గట్టు మండలంలోని కాలూర్‌తిమ్మన్‌దొడ్డి గ్రామాలు కొత్తమండలాలుగా ఏర్పడినవి.[3]
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (3)
Remove ads
జిల్లాలో దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలు
- దక్షిణ కాశీగా పేరుగాంచిన అలంపూర్.[4] పట్టణంలోని జోగులాంబ ఆలయం, నవబ్రహ్మ ఆలయాలు, కూడవెల్లి సంగమేశ్వర ఆలయం, పాపనాశి ఆలయాలు, ఆలంపూర్ పురావస్తు ప్రదర్శనశాల, ఆలంపూర్ రక్షణగోడ.
- బీచుపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయం, శ్రీ కోదండరామస్వామి ఆలయం, శివాలయం, కలిమి చెట్టుపుట్ట, నిజాంకోట కొండ
- చారిత్రకమైన గద్వాల కోట, ప్రాగటూరు కోట, రాజోలి కోట, లాంటి చారిత్రక కట్టడాలు
- మల్దకల్ గ్రామంలోని శ్రీ స్వయంభూ తిమ్మప్ప స్వామి దేవస్థానం,
- పాగుంట గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం
- చింతరేవుల గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం
- ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్, నెట్టెంపాడు ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులు,
- ర్యాలంపాడు జలాశయం
- రేకులపల్లి దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రం
- చింతరేవుల, జమ్మిచేడ్ లాంటి పుణ్యక్షేత్రాలు
- సద్దలోనిపల్లి లోని శ్రీ కృష్ణ స్వామి దేవాలయం
Remove ads
చిత్రమాల
- గద్వాల రైల్వే స్టేషన్
- గద్వాల కోటలో చెన్నకేశవస్వామి దేవాలయం
- గద్వాల కోట ప్రవేశద్వారం
- అలంపూర్ జోగులాంబ ఆలయం
- ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు
- ర్యాలంపాడు రిజర్వాయర్, నెట్టెంపాడు ప్రాజెక్టు
ప్రధానమైన పంటలు.
ఇవి కూడా చూడండి
మూలాలు
వెలుపలి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads