Remove ads
కర్ణాటక లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
కర్నాటక రాష్ట్ర 30 జిల్లాలలో రాయచూరు జిల్లా ఒకటి. రాయచూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. కర్నాటక రాష్ట్ర ఈశాన్య భూభాగంలో ఉంది.
సరిహద్దు వివరణ | జిల్లా |
---|---|
ఉత్తర సరిహద్దు | యాద్గిర్ |
ఈశాన్య సరిహద్దు | బీజ్పూర్, బాగల్కోట్ |
పశ్చిమ సరిహద్దు | కొప్పల్ |
దక్షిణ సరిహద్దు | బళ్ళారి |
తూర్పు సరిహద్దు | మహబూబ్నగర్ (తెలంగాణా), కర్నూల్ (ఆంధ్రప్రదేశ్) |
Raichur district
ರಾಯಚೂರು ಜಿಲ್ಲೆ | |
---|---|
district | |
Country | India |
రాష్ట్రం | కర్ణాటక |
డివిజన్ | Gulbarga Division |
ప్రధాన కార్యాలయం | Raichur |
Boroughs | Raichur, Sindhanur, Lingsugur, Manvi, Devadurga |
Government | |
• District collector | Smt. M.V.Savithri, IAS |
విస్తీర్ణం † | |
• Total | 8,386 కి.మీ2 (3,238 చ. మై) |
Elevation | 400.0 మీ (1,312.3 అ.) |
జనాభా (2001) | |
• Total | 16,69,762 |
• జనసాంద్రత | 200/కి.మీ2 (520/చ. మై.) |
భాషలు | |
• అధికార | కన్నడం |
Time zone | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 584101,584102,584103 |
టెలిఫోన్ కోడ్ | 08532 |
ISO 3166 code | IN-KA-RA |
Vehicle registration | KA-36 |
లింగ నిష్పత్తి | 0.983 ♂/♀ |
అక్షరాస్యత | 48.8% |
Lok Sabha constituency | Raichur Lok Sabha constituency |
Precipitation | 680.6 మిల్లీమీటర్లు (26.80 అం.) |
†Raichur district at a glance |
రాయచూరు నది కృష్ణా, తుంగభద్రా నదీ సంగమ మైదానంలో ఉంది. జిల్లాలు ఉత్తరంలో కృష్ణా నది దక్షిణంలో తుంగభద్రా నది ప్రవహిస్తున్నాయి.
సరిహద్దు వివరణ | జిల్లా |
---|---|
ఉత్తర సరిహద్దు | బీజాపూర్, గుల్బర్గ్ (కృష్ణా నదికి అటువైపు) |
పశ్చిమ సరిహద్దు | కొప్పల్, బాగల్కోట్ |
ఆగ్నేయ సరిహద్దు | బళ్ళారి (తుంగభద్రా నదికి అటువైపు) |
ఈశాన్య సరిహద్దు | మహబూబ్నగర్ (తెలంగాణా) |
తూర్పు సరిహద్దు | కర్నూల్ (ఆంధ్రప్రదేశ్) |
జిల్లా చరిత్ర క్రీ.పూ 3 శతాబ్దం నుండి లభిస్తుంది. లింగసుగుర్ తాలూకాలోని మస్కి వద్ద అశోకుని ఒకటి, కొప్పల్ సమీపంలో రెండు శిలాశాసనాలు లభిస్తున్నాయి. వీటి ఆధారంగా ఈ ప్రాంతం కొంతకాలం (273-236) మయూర చక్రవర్తి అశోకుని స్వాధీనంలో ఉన్నట్లు భావిస్తున్నారు. క్రిస్టియన్ శకం ఆరంభంలో ఈ ప్రాంతం శాతవాహనుల ఆధీనంలోకి మారింది. 3-4 శతాబ్ధాలలో ఈ ప్రాంతం ఒకతకాల ఆధీనంలోకి మారింది. తరువాత ఈ ప్రాంతాన్ని కదంబ పాలకులు స్వాధీనం చేసుకున్నారు. తరువాత ఈ ప్రాంతాన్ని చాళుక్గ్యులు స్వాధీనం చేసుకున్నారు. అయిహోల్ శలాశాసనాల ఆధారంగా రెండవ పులకేశి పల్లవులను ఓడించి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారని భావిస్తున్నాడు. పులకేశి కుమారుడు ఈ ప్రాంతానికి పాలకుడయ్యాడు.8 శతాబ్దం తరువాత రాయచూరు ప్రాంతం అంతా రాష్ట్రకూటులు స్వాధీనం చేసుకున్నారని శిలాశాసనాలు తెలియజేస్తున్నాయి. మంవి తాలూకాలో లభిస్తున్న శిలాశాసనాలు ఆధారంగా రాష్ట్రకూటుల సామంతరాజు రెండవ కృష్ణా రాజు ఈ ప్రాంతానికి పాలకుడయ్యాడు. రాష్ట్రకూట రాజు నృపతుంగ కన్నడ రచనలలో ఈ ప్రాంతంలోని కొప్పల్ భూభాగాన్ని గ్రేట్ కొప్పల్ అని వర్ణించాడు.
పశ్చిమ చాళుఖ్యులకు సంబంధించిన శిలాశాసనాలు జిల్లాలో పలు ప్రాంతాలలో లభిస్తున్నాయి. వీటి ఆధారంగా సా.శ. 10-12 వ శతాబ్దం వరకు ఈ ప్రాంతం చాళుఖ్యుల ఆధీనంలో ఉంది. లింగ్సుగుర్ తాలూకాలో లభించిన ఆధారలను అనుసరించి చాళుఖ్యుల పాలనాకాంలో రాయచూరు ప్రాంతాన్ని ఐదవ విక్రమాదిత్యుని సోదరుడు మొదటి జగదేకమల్లుడు పాలించాడని భావిస్తున్నారు. మస్కి తాలూకాలో లభిస్తున్న ఆధారాలను అనుసరించి ఈ నగరం ఒకప్పుడు జయసింహునికి రాజధానిగా ఉందని భావిస్తున్నారు. రాయచూరు ప్రాంతంలో దక్షిణభారతీయ పాలకులైన చోళరాజులకు, కల్యాణి సామ్రాజ్య పాలకులైన చాళుఖ్యులు (అక పశ్చిమ చాళుఖ్యులు) మద్య ఆధిక్యత కొరకు పలు యుద్ధాలు సంభవించాయి. ఈ ప్రాంతం కొంతకాలం చోళుల ఆధిక్యతలో ఉంది. జిల్లాలోని కొన్ని ప్రాంతాలను హయహయులు, సిందాలు పాలించారు. చాళుఖ్యల పతనం తరువాత రాయచూరు ప్రాంతం కలచూరి, తరువాత సెవ్న యాదవ రాజుల పాలనలో ఉంది. తరువాత 13వ శతాబ్దంలో కాకతీయుల పాలనలోకి మారింది. రాయచూరు కోట గోడలమీద లభించిన శిలాశాసనాల ఆధారంగా సా.శ. 1294 రాణి రుద్రమదేవి సైనికాధికారి గోర్ గంగయ్యరెడ్డి రాయచూరు కోటను నిర్మించాడని తెలుస్తుంది. .[1] తరువాత సా.శ. 1312లో రాయచూరు ప్రాంతాన్ని ఢిల్లీ సుల్తాన్ సైన్యాధ్యక్షుడు మాలిక్ కాఫిర్ స్వాధీనం చేసుకున్నాడు.
ఢిల్లి సుల్తానులు కాకతీయ సామ్రాజ్యాన్ని ధ్వంసం చేసిన తరువాత రాయచూరు జిల్లా సా.శ. 1323లో విజయనగర సామ్రాజ్యం ఆధీనంలోకి మారింది. 1363లో రాయచూరు ప్రాంతాన్ని బహమనీ సుల్తానులు స్వాధీనం చేసుకున్నారు. బీజపూర్ సుల్తానేట్ విచ్ఛిన్నం అయిన తరువాత 1489లో బీజపూర్ సుల్తానేట్కు చెందిన ఆదిల్షా స్వాధీనం చేసుకున్నాడు. 1520లో రాయచూరు యుద్ధం తరువాత విజయనగర పాలకులు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేదుకున్నారు. 1565లో దక్కన్ సుల్తానేట్ సాగించిన తాలికోట యుద్ధంలో విజయనగర రాజు ఓడిపోయిన తతువాత బీజపూర్ రాజులు ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 1853 - 1860 వరకు ఔరంగజేబు చక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించాడు. నిజాముల కాలంలో ఈ ప్రాంతం గుల్బర్గా డివిషన్లో భాగంగా ఉంది. పోలో ఆపరేషన్ తరువాత 1948 సెప్టెంబరు 17 న నిజాం రాజ్యం తప్పనిసరిగా ఇండియన్ యూనియన్లో విలీనం చేయబడింది. తరువాత ఈ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉంది. భాధాప్రయుక్త రాష్ట్రాల విభజన తరువాత ఈ ప్రాంతం మైసూరు రాష్ట్రంలో (తరువాత ఇది కర్నాటక రాష్ట్రం)!భాగం అయింది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | |
ఇది దాదాపు. | దేశ జనసంఖ్యకు సమానం. |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | వ స్థానంలో ఉంది. |
1చ.కి.మీ జనసాంద్రత. | |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | |
స్త్రీ పురుష నిష్పత్తి. | |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | |
జాతియ సరాసరి (72%) కంటే. |
2011 జనాభా లెక్కల ప్రకారం రాయచూరు జిల్లాలో 1,924,773 జనాభా ఉంది, ఇది లెసోతో దేశానికి లేదా అమెరికా రాష్ట్రమైన వెస్ట్ వర్జీనియాకు సమానం. ఇది భారతదేశంలో 246 వ ర్యాంకును ఇస్తుంది (మొత్తం 640 లో). జిల్లాలో జనాభా సాంద్రత చదరపు కిలోమీటరుకు 228 మంది (590 / చదరపు మైళ్ళు). 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 15.27%. రాయచూరులో ప్రతి 1000 మంది పురుషులకు 992 మంది స్త్రీలు, అక్షరాస్యత 60.46%.
రాయచూరు జిల్లాలో ఐదు తాలూకాలు ఉన్నాయి: రాయచూరు, దేవదుర్గా, సింధనూర్, మాన్వి, లింగ్సుగూర్. జిల్లా రాజధాని రాచూర్ నగరం, ఇది రాష్ట్ర రాజధాని బెంగళూరు నుండి 409 కి.మీ.
జిల్లాలో ఉన్న చారిత్రక ఆకర్షణలలో 1294లో నిర్మించబడిన రాయచూరు కోట ఒకటి. సమీపంలో ఉన్న అనెగుండి పట్టణంలో విజయనగరానికి చెందిన రంగనాథ ఆలయం, పంపానది, కమల్ మహల్ మొదలైన పలు స్మారకచిహ్నాలు ఉన్నాయి.
జిల్లాలో శక్తి నగర్ వద్ద " రాయచూరు ధర్మల్ పవర్ స్టేషను " నుండి కర్ణాటక రాష్ట్రం విద్యుత్తు అవసరాలకు అధికభాగం విద్యుత్తు లభిస్తుంది. భారతదేశంలో బంగారం లభిస్తున్న ప్రదేశాలలో రాయచూరు జిల్లా ఒకటి. రాయచూరు నగరానికి 90 కి.మీ దూరంలో హట్టి బంగారు గనులు ఉన్నాయి. జిల్లాలోని 5 తాలూకాలకు చక్కటి నీటి పారుదల సౌకర్యం లభిస్తుంది. కృష్ణానది మీద నారాయణపూర ఆనకట్ట నిర్మించబడింది. రాయచూరు వరి పంటలకు ప్రసిద్ధి చెందింది. జిల్లాలో అత్యుత్తమ నాణ్యమైన వరిధాన్యం లభిస్తుంది. రాయచూరులో అనేక రైసు మిల్లులు ఉన్నాయి. ఇక్కడి నుండి ఇతరదేశాలకు బియ్యం ఎగుమతి చేయబడుతున్నాయి. రాయచూరులో పత్తికి మంచి మార్కెట్ వసతి లభిస్తుంది.
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో రాయచూరు జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న కర్ణాటక రాష్ట్ర 5 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.