జె. వి. రమణమూర్తి (మే 20, 1933 - జూన్ 22, 2016) గా ప్రసిద్ధులైన జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు. వీరు జె.వి.సోమయాజులు తమ్ముడు. యితడు విజయనగరం జిల్లాలో మే 20, 1933లో జన్మించారు. తన పాఠశాల జీవితం నుంచే నటనా ప్రస్థానం ప్రారంభించారు. ఇంటర్ యూనివర్శిటీ పోటీలలో ఆత్రేయ యొక్క "విశ్వశాంతి" అవార్డును పొందారు. "ఎవరు దొంగ", "కప్పలు", "కీర్తిశేషులు", "కాళరాత్రి", "ఫాణి", "కాటమరాజు కథ" వంటి నాటకాలలో నటించారు. తనకు గుర్తింపు తెచ్చిన పాత్ర గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కంలో గిరీశం. చలన చిత్ర పరిశ్రమలో ఎం.ఎల్.ఏ. (1957) సినిమాతో నటనా ప్రస్థానం ప్రారంభించి 150 చిత్రాల వరకు నటించారు. నాటకరంగంలో దశాబ్దాల సేవలకు గానూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జె.వి.రమణమూర్తికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసింది.[1]
వ్యక్తిగత వివరాలు
రమణమూర్తి శ్రీకాకుళం జిల్లాలోని లుకులాం అగ్రహారంలో 1933లో జన్మించాడు. విద్యావంతుల కుటుంబంలో పుట్టి పెరిగిన రమణమూర్తి చిన్నప్పట్నుంచే నాటకాలపై మక్కువ పెంచుకొన్నాడు. సైన్స్ పట్టభద్రుడైన జె.వి.రమణమూర్తి సినిమాల్లోకి రాకముందు కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. స్నేహితులతో కలసి అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని నాటకాల్ని ప్రదర్శించేవాడు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే రంగస్థల నటుడిగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం నాటకం ద్వారా ప్రఖ్యాతి పొందాడు. నాలుగు దశాబ్దాల కాలంలో వెయ్యిసార్లకిపైగా కన్యాశుల్కంలోని గిరీశం పాత్రని పోషిస్తూ అపర గిరీశంగా పేరు పొందాడు.[2] ఆయన భార్య, కుమార్తెలు శారద, నటన, కుమారులు అరుణ్‌కుమార్, హర్షవర్ధన్‌తో కలిసి జీవించేవాడు. రమణమూర్తి మరో ప్రముఖ నటుడైన జె.వి.సోమయాజులు సోదరుడు.[3][4]
నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ ప్రతి సంవత్సరం సినిమా, టెలివిజన్ రంగాలతోపాటు నాటకరంగానికి కూడా నంది పురస్కరాలను అందజేస్తుంది. నాటకరంగానికి విశేషమైన సేవలందించిన వారికి నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం పేరిట ఒక లక్ష రూపాయల నగదు పారితోషికంతో ఘనంగా సత్కరిస్తున్నారు. 2015 సంవత్సరానికి గాను జె. వి. రమణమూర్తి (సాంఘిక నాటకం) గారికి అందజేశారు. 2016 జనవరి 27న ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పురస్కార ప్రదానం జరిగింది[5].
చిత్ర సమాహారం
1950వ దశాబ్దం
- ఎం.ఎల్.ఏ. (1957)
- అత్తా ఒకింటి కోడలే (1958)
- మంచి మనసుకు మంచి రోజులు (1958)
- పెళ్ళి మీద పెళ్ళి (1959)
- శభాష్ రాముడు (1959)
1960వ దశాబ్దం
- అన్నా చెల్లెలు (1960) - కాంతం అన్నయ్య
- బావామరదళ్లు (1960)
- బాటసారి (1961) - మాధవి అన్నయ్య
1970వ దశాబ్దం
- అమాయకురాలు (1971)
- కటకటాల రుద్రయ్య (1978)
- దొంగల దోపిడి (1978)
- మరో చరిత్ర (1978)
- సిరి సిరి మువ్వ (1978)
- ఇది కథ కాదు (1979)
- గుప్పెడు మనసు (1979)
- గోరింటాకు (1979)
1980వ దశాబ్దం
- మూగకు మాటొస్తే (1980)
- మొగుడు కావాలి (1980)
- శుభోదయం (1980)
- సప్తపది (1980)
- అమృతకలశం (1981)
- ఆకలి రాజ్యం (1981)
- గడసరి అత్త సొగసరి కోడలు (1981)
- శుభలేఖ (1982) - జగన్నాథం
- ఆనంద భైరవి (1984)
- కాంచనగంగ (1984)
- డేంజర్ లైట్ (1985)
- శ్రీ దత్త దర్శనం (1985)
- సిరివెన్నెల (1986)
- నాకు పెళ్ళాం కావాలి (1987)
1990వ దశాబ్దం
- ఏడు కొండలస్వామి (1991)
- కర్తవ్యం (1991) - ప్రిన్సిపాల్ రామకృష్ణ
- కొబ్బరి బొండాం (1991)
2000వ దశాబ్దం
- ఆర్య (2004)
మరణం
వీరు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 2016, జూన్ 22 వ తేదీన హైదరాబాదు లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు.[6]
మూలాలు
బయటి లింకులు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.