Remove ads
From Wikipedia, the free encyclopedia
కాళరాత్రి 1953లో ప్రఖ్య శ్రీరామమూర్తి స్వేఛానుసరణ చేసిన సాంఘీక నాటకం.[1] హోవర్డ్ ఇర్వింగ్ యంగ్ రాసిన "హక్ ఐలాండ్" నాటకం ఆధారంగా ఈ నాటకం రాయబడింది.
కాళరాత్రి | |
కాళరాత్రి పుస్తక ముఖచిత్రం | |
కృతికర్త: | ప్రఖ్య శ్రీరామమూర్తి, (మూల నాటకం: హక్ ఐలాండ్, రచన: హోవర్డ్ ఇర్వింగ్) |
---|---|
సంపాదకులు: | బొందలపాటి శకుంతలాదేవి, శివరామకృష్ణ |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | నాటకం |
ప్రచురణ: | దేశి కవితామండలి, దేశి ప్రెస్, విజయవాడ |
విడుదల: | జూలై 1953 |
పేజీలు: | 138 |
మిత్రులతో కొన్నిరోజులు సరదాగా గడపడానికి భైరవలంకలోని తన ఎస్టేట్ రాజారావు వస్తాడు. ఆరోజు రాత్రి తుఫాన్ రావడంతో కరెంట్ పోతుంది. అప్పుడు వారంతా డిటెక్టివ్ ల గురించి, హత్యల గురించి గొప్పగా చెప్పుకుంటారు. వాళ్ళను పరీక్షించడానికి రాజారావు తను హత్య చేసినట్లు నాటకమాడుతాడు. అది నిజమైన హత్యగా మారుతుంది. ఉత్తుత్తి హత్య, నిజమైన హత్యగా ఎలా మారిపోయింది, అసలు హంతకుడెవరు, ఎందుకు చంపాడు అనేది మిగతా కథ.
ఈ నాటకంలోని పాత్రల వివరాలు[2]
1. 1954, ఏప్రిల్ 19న విజయనగరం రవిరాజ్ మెమోరియల్ క్లబ్ తొలిసారిగా ప్రదర్శించిన వివరాలు:
2. 1954, అక్టోబరు 16న విజయవాడ శ్రీ నవ్యకళా మండలి సంస్థ ప్రదర్శించిన వివరాలు:
1954/55లో హైదరాబాదులో జరిగిన ఆంధ్ర నాటక కళాపరిషత్తు నాటక పోటీలలో శ్రీకాకుళంకు చెందిన నాటక సంస్థ ఈ నాటకాన్ని ప్రదర్శించినప్పుడు ఇతర రచయితల నాటకాల కంటే ఎక్కువ ఆదరణ లభించడంతోపాటు జె. వి. రమణమూర్తికి ఉత్తమ నటుడిగా బహుమతి వచ్చింది.[4] ఈ ప్రదర్శనలో జె.వి.సోమయాజులు, రావి కొండలరావు నటించగా, సినీరచయిత డి.వి.నరసరాజు జడ్జిగా వచ్చాడు.[5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.