ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి From Wikipedia, the free encyclopedia
జలగం వెంగళరావు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు 6 వ ముఖ్యమంత్రి, నక్సలైట్లను ఉక్కుపాదంతో అణచి వేసిన ముఖ్యమంత్రిగా అతను దేశవ్యాప్తంగా ప్రసిద్ధిచెందాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పలు మంత్రి పదవులు నిర్వహించాడు.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
జలగం వెంగళరావు | |||
జలగం వెంగళరావు | |||
పదవీ కాలం 10 డిసెంబరు, 1973 నుండి 6 మార్చి 1978 | |||
ముందు | పి.వి.నరసింహారావు | ||
---|---|---|---|
తరువాత | మర్రి చెన్నారెడ్డి | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | మే 1921 | ||
మరణం | జూన్ 12 , 1999 | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
సంతానం | జలగం వెంకటరావు | ||
నివాసం | హైదరాబాదు | ||
మతం | హిందూ మతం |
వెంగళరావు 1921 మే నెలలో ఆంధ్ర రాష్ట్రం, శ్రీకాకుళంలోని[1] రాజాంలో జన్మించాడు.
తన 20 వ ఏట నిజాముకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. ఆ రోజుల్లో కాంగ్రెసు పార్టీ నిర్వహించిన సరిహద్దు క్యాంపుల్లో పాల్గొన్నాడు. తెలంగాణ ప్రాంతంలో అమలవుతున్న కౌలుదారీ చట్టాలను నిరసిస్తూ చేపట్టిన ఈ ప్రచారంలో పాల్గొని రెండు సార్లు జైలుకు వెళ్ళాడు[2].
1952 లో శాసనసభకు స్వతంత్రుడిగా పోటీ చేసి ఓడిపోయాడు. 1952 నుండి 1962 వరకు ఆయన కాంగ్రెసు పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు.[3] 1962లో కాంగ్రెసు పార్టీ తరపున ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుండి గెలిచి శాసనసభలో ప్రవేశించాడు. ఆ తరువాత 1978 వరకు మరో మూడు సార్లు సత్తుపల్లి నియోజకవర్గానికి శాసనసభలో ప్రాతినిధ్యం వహించాడు. 1967లో పంచాయితీరాజ్ ఛాంబరు చైర్మనుగా ఎన్నికయ్యాడు.
కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో 1969 నుండి 1971 వరకు హోంమంత్రిగాను, నరసింహారావు మంత్రివర్గంలో 1972-73 లో పరిశ్రమల మంత్రిగాను పనిచేసాడు.
జై ఆంధ్ర ఉద్యమ ఫలితంగా రాష్ట్రంలో విధించిన రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన తరువాత వెంగళరావు ముఖ్యమంత్రి పదవికి ఎంపికయ్యాడు.[4] 10 డిసెంబరు 1973 - 6 మార్చి 1978 వరకు ఆంధ్రప్రదేశ్ 5వ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ప్రాంతంలో కాకతీయ విశ్వవిద్యాలయం, కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, రాయలసీమ ప్రాంతంలో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనే మూడు విశ్వవిద్యాలయాలు ప్రారంభించబడ్డాయి.[5][6] తన హయాంలో 1975లో హైదరాబాదు నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభించాడు.[7]
అతని పాలనా కాలంలోనే ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ (ఆత్యయిక పరిస్థితి) ని విధించింది. ముఖ్యమంత్రిగా వెంగళరావు మంచి పరిపాలకుడిగా పేరుతెచ్చుకున్నాడు. అతను సాధించిన కార్యాలలో ముఖ్యమైనవి:
కాంగ్రెసు పార్టీ చీలిపోయి కాంగ్రెసు (ఐ) ఏర్పడినపుడు, వెంగళరావు కొన్నాళ్ళు పార్టీకి దూరమయ్యాడు. మళ్ళీ 1984 లో కాంగ్రెసుకు తిరిగి వచ్చి, 1984, 1991 మధ్య ఖమ్మం నియోజకవర్గం నుండి లోక్సభకు రెండుసార్లు ప్రాతినిధ్యం వహించాడు. 1986 నుండి 1989 వరకు కేంద్ర పరిశ్రమల మంత్రిగా పనిచేసాడు.
1999 జూన్ 12 న హైదరాబాదులో జలగం వెంగళరావు మరణించాడు.[3] అతనికి ఇద్దరు కుమారులు - జలగం ప్రసాదరావు, జలగం వెంకటరావు. వీరిద్దరూ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. జలగం వెంకటరావు 2004లో సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.