తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. From Wikipedia, the free encyclopedia
జలగం వెంకటరావు (జననం జూలై 28, 1968) తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. 2004లో భారత జాతీయ కాంగ్రెస్ తరపున సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి, 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశాడు.[1] కొంతకాలం పార్లమెంటరీ కార్యదర్శిగా కూడా ఉన్నాడు.
జలగం వెంకటరావు | |||
పదవీ కాలం 2023 జులై 25 - ప్రస్తుతం | |||
ముందు | వనమా వెంకటేశ్వరరావు | ||
---|---|---|---|
నియోజకవర్గం | కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం | ||
మాజీ శాసనసభ్యుడు | |||
పదవీ కాలం 2014-2018 | |||
ముందు | కూనంనేని సాంబశివరావు | ||
తరువాత | వనమా వెంకటేశ్వరరావు | ||
నియోజకవర్గం | కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం | ||
మాజీ శాసనసభ్యుడు | |||
పదవీ కాలం 2004 - 2009 | |||
నియోజకవర్గం | సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | ఖమ్మం, తెలంగాణ | 1968 ఏప్రిల్ 18||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | బీఆర్ఎస్, భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | జలగం వెంగళరావు |
వెంకటరావు 1968, జూలై 28న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 5వ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు దంపతులకు ఖమ్మంలో జన్మించాడు. 1990లో అమెరికాలోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ విద్యను చదివాడు. వెంకటరావు అన్న జలగం ప్రసాదరావు కూడా మంత్రిగా పనిచేశాడు.
ఇతను ఒక టెక్నోక్రాట్. హైదరాబాదులోని విజే ఇన్ఫోలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీని నడుపుతున్నాడు.[2]
జలగం వెంకటరావు, తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి 2004లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై 9,536 ఓట్ల తేడాతో గెలుపొందాడు.[3][4]
2009లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున ఖమ్మం శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు చేతిలో 2,472 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
2014లో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు 16,521 ఓట్ల తేడాతో ఎమ్మెల్యేగా గెలిచాడు. 2014లో ఖమ్మం జిల్లా నుండి గెలిచిన తొలి, ఏకైక టిఆర్ఎస్ శాసనసభ్యుడు.[5][6]
2018లో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో 4,120 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అఫిడవిట్ కేసులో ఆయన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు 2023 జులై 25న తీర్పును వెల్లడించింది. దీంతో 2018లో ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకటరావును కోర్టు ఎమ్మెల్యేగా ప్రకటించింది.[7][8]
జలగం వెంకటరావు 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు చేతిలో ఓడిపోయి 2024 మార్చి 10న ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్ సమకంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[9][10]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.