Remove ads
భారతదేశ కేంద్రపాలిత ప్రాంతం From Wikipedia, the free encyclopedia
చండీగఢ్, ఉత్తర భారతదేశంలోని ఒక నగరం, కేంద్రపాలిత ప్రాంతం.[4] ఇది పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాలకు రాజధాని, కాని ఆ రెంటిలో ఏ రాష్ట్రానికి చెందని కేంద్రపాలిత ప్రాంతంగా ఉండడం చండీగఢ్ ప్రత్యేకత. చండీగఢ్ ఉత్తర భారతదేశం లోని ప్రముఖనగరాలలో ఒకటి. భారతదేశంలో నగరనిర్మాణ ప్రణాళిక (ప్లాండ్ సిటీ) ద్వారా నిర్మించబడిన నగరాలలో చండీగఢ్ మొదటిది. ఈ నగరానికి స్విట్జర్లాండ్ నగర రూపకల్ప నిర్మాత "లె కార్బ్యూసియె" రూపకర్తగా పనిచేసాడు.ఈ నగర నిర్మాణం, రూపకల్పన స్వాతంత్ర్యానికి ముందే జరిగింది.ఈ నగర రూపకల్పన ద్వారా లె కార్బ్యూసియె భవనిర్మాణానికి, నగర రూపకల్పనకు అంతర్జాతీయ గుర్తింపు పొందాడు.[5] నగరం ప్రాథమికంగా లె కార్బ్యూసియె వలన రూపకల్పన చేయబడినప్పటికీ దీనికి " పిర్రే జన్నరెట్, జాన్ డ్ర్యూ , మ్యాక్స్‌వెల్ ఫ్రై వంటి వారు సహకరించారు. తలసరి ఆదాయంలో చండీగఢ్ రాష్ట్రాలలో , కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రధమ స్థానంలో ఉంది.[6] 2010 లో భారతదేశంలో పరిశుభ్రమైన నగరంగా జాతీయ ప్రభుత్వ పరిశోధనల గుర్తింపు పొందింది.[7] అలాగే చండీగఢ్ రాష్ట్రాలలో , కేంద్రపాలిత ప్రాంతాలలో " హ్యూమన్ డెవలెప్మెంట్ ఇండెక్స్ " లో కూడా ప్రథమ స్థానంలో ఉంది. చండీగఢ్ మెట్రో , పంచకుల , మొహలి కలిసి త్రినగరాలుగా (ట్రై సిటీ) గా గుర్తింపు పొందింది.
చండీగఢ్
పంజాబీ: ਚੰਡੀਗੜ੍ਹ | |
---|---|
దేశం | భారతదేశం |
నగరం, కేంద్రపాలిత ప్రాంతం | చండీగఢ్ |
ప్రభుత్వ స్థానం | చండీగఢ్ |
Government | |
• నిర్వాహకుడు | వి.పి. సింగ్ బాద్నోర్ (అడ్మినిస్ట్రేటర్) |
• మేయర్ | శ్రీమతి. రాజ్ బాలా మాలిక్ (2020 జనవరి నుండి) |
• కమీషనర్ | కె.కె.యాదవ్ |
విస్తీర్ణం | |
• నగరం, కేంద్రపాలిత ప్రాంతం | 114 కి.మీ2 (44 చ. మై) |
• Rank | 33 |
Elevation | 350 మీ (1,150 అ.) |
జనాభా | |
• నగరం, కేంద్రపాలిత ప్రాంతం | 10,54,686 |
• Rank | 29th |
• జనసాంద్రత | 9,300/కి.మీ2 (24,000/చ. మై.) |
• Metro | 9,60,787 |
[2] | |
భాషలు | |
• అధికార[3] | పంజాబీ |
Time zone | UTC+05:30 (IST) |
పిన్ | 160xxx |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | 91-172-XXX XXXX |
ISO 3166 code | IN-CH |
Vehicle registration | CH-01 to CH-04, PB-65, HR-70 |
మానవ పురోగతి సూచిక | 0.892 |
అక్షరాస్యత | 81.9 |
యూనియన్ భూభాగం, చండీగఢ్ నగరం అన్ని ప్రాంతాలను కలిగి ఉంది |
1947 భారతదేశ విభజన తరువాత పంజాబు భూభాగం కూడా విభజించబడింది. తూర్పు పంజాబు భారతదేశం లోనూ పశ్చిమ పంజాబు పాకిస్తాన్ దేశంలోనూ కలుపబడింది. భారతీయ పంజాబుకు లాహోరుకు సమానమైన రాజధాని నగరం అవసరమైంది.[8] చండీగఢ్ అంటే చంఢీదేవి కోట అని అర్ధం.ఇక్కడ ఉన్న హిందూ ఆలయం చండీమందిర్ ఉన్న కారణంగా ఈ నగరానికీ పేరు వచ్చింది. ఈ ఆలయం నగరంలోని పంచకుల ప్రాంతంలో ఉంది..[9] చండీగఢ్‌లో " లె కార్బుజియె " చెక్కిన " ఓపెన్ హ్యాండ్ " శిల్పాలు అనేకం ఉన్నాయి. ఈ శిల్పాలు 26 మీటర్ల ఎత్తు ఉన్నాయి. " ఓపెన్ హ్యాండ్ " ఙాపికలు లె కార్బుజియె శిల్పచాతుర్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఈ శిల్పాలు శాంతికి చిహ్నాలుగా ఉన్నాయి. తెరచిన హస్తానికి ఇచ్చి తీసుకోవడానికి గుర్తుగా భావించవచ్చు.[10] వీటిలో హైకోర్ట్, అసెంబ్లీ హాలు, సెక్రెటరేట్ ఉన్న కాపిటల్ కాంప్లెక్స్‌లో ఉన్న 6 ఙాపక చిహ్నాలు అసంపూర్తిగా మిగిలిఉన్నాయి. వీటితో జామెంట్రిక్ హిల్, మార్టిర్స్ మెమోరియల్ వద్ద ఉన్న చిత్రాలు కూడా పూర్తిచేయబడలేదు.[11] 1966 నవంబరు 1న సరికొత్తగా రూపుదిద్దుకున్న హర్యానా రాష్ట్రం, పంజాబు రాష్ట్ర తూర్పు భూభాగం నుండి హిందీ మాట్లాడే ప్రజల భూభాగం వేరుచేస్తూ రూపుదిద్దబడింది.చండీగఢ్ నగరం మద్యలో ఉన్నందున దీనిని కేంద్రపాలిత ప్రదేశం చేసి రెండు రాష్ట్రాలకు రాజధానిని చేసారు.[12] ఈ నగర చివరి పాలకుడు బ్రిజిందర్ సింగ్.
జవహర్లాల్ నెహ్రూ ప్రేరేపణపై 1950 దశకంలో ఫ్రెంచి భవన నిర్మాణకారుడు లె కార్బుజియె (architect Le Corbusier) చండీగఢ్ నగరాన్ని, అందులో చాలా భవనాలను రూపొందించాడు. అప్పుడే స్వతంత్రమైన భారతదేశపు ప్రగతిశీల పధం ఇందులో ప్రతిఫలించాలని అతని సంకల్పం.చండీగఢ్ నగరం చదరాలు అమర్చినట్లుగా సెక్టార్లుగా డిజైన్ చేయబడింది. ప్రతి సెక్టారు సుమారుగా 1.5 కి.మీ x 1.5 కి.మీ. చదరం వైశాల్యం ఉంటుంది. ప్రతి సెక్టారు ఒక చిన్న పట్టణంలా, దాని స్వంత మార్కెట్, పూజా స్థలాలు, స్కూళ్ళు, కాలేజీలు కలిగి ఉంటుంది.1 నుండి 60 వరకు సెక్టారులు ఉన్నాయి. కాని సెక్టారు నెం.13 మాత్రం లేదు. 13వ సంఖ్య అదృష్టానికి దూరమని లె కార్బుజియె నమ్మడమే దీనికి కారణం కావచ్చును.
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం చండీగఢ్ రాష్ట్ర జనాభా 1,055,450.వారిలో హిందువులు 78.6%, సిక్కులు 16.1%, ముస్లిములు 4%.[13] ప్రపంచ 50 ఉత్తమ నగరాలలో చండీగడ్ ఒకటిగా ఉందని తెలుస్తుంది.[14]
చండీగడ్ నగరంలో పర్యాటక ఆకర్షణీయ ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటిలో పలు విధాలైన తోటలు కొన్ని చారిత్రాత్మక ప్రదేశాలు కూడా ఉన్నాయి.[15]
చండీగఢ్ హిమాలయ పర్వతశ్రేణులలోని శివాలిక్ పాదపర్వతాల వద్ద ఉంది. చండీగఢ్ వైశాల్యం 44.5 చదరపు కి.మీ. అలాగే మెట్రో వైశాల్యం 114 చదరపు కి.మీ. నగరసరిహద్దులలో పంజాబు, హర్యానాలు ఉన్నాయి.[16] చండీగఢ్ సముద్రమట్టానికి 321 మీటర్ల ఎత్తున ఉంది.
చండీగఢ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Climate chart (explanation) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
చండీగఢ్ పరిసరాలలో పంజాబు రాష్ట్రానికి చెందిన మొహలి, పాజ్టలియా, రూప్‌నగర్ ఉన్నాయి. హర్యానా రాష్ట్రానికి చెందిన అంబాలా, పంచకుల నగరాలు ఉన్నాయి. నగర ఉత్తర భాగంలో స్వల్పంగా హిమాచల ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు ఉంది.
చండీగఢ్‌లో తేమతో కూడిన ఉప ఉష్ణ వాతావరణం కలిగి ఉంటుంది. చాలా వేడి వేసవి, స్వల్పమైన చలి, అప్పుడప్పుడూ వచ్చే వర్షాలు ఉష్ణోగ్రతలో తీవ్రమైన వ్యత్యాసాలు ఉంటాయి. సంవత్సరంలో ఉష్ణోగ్రతలు 40-1 సెల్షియస్ ఉంటుంది. సంవత్సర సరాసరి వర్షపాతం 1110.7 మి.మీ ఉంటుంది. నగరంలో ఒక్కోసారి శీతాకాలంలో కూడా వర్షాలు కురుస్తుంటాయి. ఉత్తరంలో ఉన్న సిమ్లా, జమ్ముకాశ్మీరు నుండి చలిగాలులు వీస్తుంటాయి.
చండీగఢ్‌లో అధికంగా మర్రి, యూకలిఫ్టస్ ప్లాంటేషన్లు ఉంటాయి. అశోక, కసియా, మల్బరీ, ఇతర చెట్లు ఉన్నాయి. నగరమంతటా వన్యప్రాంతంలాంటి వాతావరణం గోచరిస్తుంది. నగరం చుట్టూ అరణ్యాలు ఉన్నందువలన అగరంలో అనేక జంతువులు, వృక్షాలు కనిపిస్తుంటాయి. జింకలు, సాంబారు జింకలు, బార్కింగ్ డీర్, రామచిలుకలు, వడ్రంగిపిట్టలు, నెమళ్ళు మొదలైనవి అభయారణ్యాలలో ఉన్నాయి. సుఖ్నా సరసులో వైవిధ్యమున్న బాతులు, గీస్ ఉన్నాయి. అలాగే శీతాకాలంలో సైబీరియా, జపాన్ దేశాల నుండి వచ్చే వలసపక్షులను కూడా ఈ సరసు ఆకర్షిస్తుంది. చండీగఢ్ నగరంలో ఉన్న రామచిలుకల అభయారణ్యంలో పలు ఇతర జాతుల పక్షులకు ఆశ్రయం ఇస్తుంది. నగరంలో ప్రఖ్యాతి వహించిన " జాకీర్ హుస్సేన్ రోజ్ గార్డేన్ ", టెర్రస్ గార్డేన్, బోగన్విల్లా గార్డెన్, శాంతికుంజ్, ఇతర పూదోటలు ఉన్నాయి.
2012 ఆర్.బి.ఐ గణాంకాలు నిధి జమచేయడంలో దేశంలో చండీగడ్ 12వ స్థానంలోనూ రుణాలు అందించడంలో 10 వ స్థానంలోనూ ఉందని తెలియజేస్తున్నాయి.చండీగడ్ నగరంలో ప్రజలకు ప్రభుత్వం అత్యధికంగా ఉపాధి కల్పిస్తుంది. మూడు ప్రభుత్వాలకు కేంద్రంగా ఉన్నందువలన ప్రభుత్వం ప్రజలకు అత్యధికంగా ఉపాధి కల్పించడానికి వీలుకలుగుతుంది. ఈ కారణంగానే చండీగడ్ " పెంషన్ అందుకునేవారి స్వర్గంగా " గుర్తింపు పొందింది. " ఆర్డినెంస్ ఫ్యాటరీస్ బోర్డ్ " సంస్థకు చెందిన " ఆర్డినెంస్ కేబుల్ ఫ్యాక్టరీ " భారతపభుత్వం చండీగడ్‌లో స్థాపించింది. చండీగడ్‌లో ప్రభుత్వసంస్థలతో చేర్చి మొత్తం 15 మద్య, బృహత్తర సంస్థలు ఉన్నాయి.అంతేకాక చండీగడ్‌లో " 2000 " స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు నమోదయ్యాయి. కాగితం తయారీ, బేసిక్ మెటల్, అల్లాయ్స్, మెషనరీ పరిశ్రమలు ప్రధాఅమైనవి. అదనంగా ఆహారతయారీ సస్థలు, శానిటరీ వేర్, ఆటోపార్ట్స్, మెషిన్ టూల్స్, ఫార్మాస్యూటికల్స్, ఎలెక్ట్రికల్ అప్లయంసీస్ సంస్థలు గుర్తించతగినవి. 99,262 తలసరి ఆదాయంతో చండీగడ్ దేశంలో సంపన్న నగరంగా గుర్తింపు పొందింది.[17] 2004 చండీగడ్ మొత్తం ఉత్పత్తి విలువ 2.2 బిలియన్ల అమెరికన్ డాలర్లు ఉంటుందని అంచనా.
చండీగడ్‌లో 3 ప్రధాన తయారీ సంస్థలు వారి కార్యాలయాలను ఏర్పాటు చేసాయి. అవి వరుసగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ,, (ఎఫ్.ఐ.సి.సి.ఐ), ది పి.హెచ్.డి చంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, (పి.హెచ్.డి.సి.సి.ఐ), ది కాంఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, (సి.సి.ఐ) సంస్థల ప్రాంతీయ ప్రధానకార్యాలయాలు సెక్టర్ 31లో ఉన్నాయి.
చండీగడ్ ఐ.టి పార్క్ (రాజీవ్ గాంధీ చండీగర్ టెక్నాలజీ పార్క్ ) స్థాపనతో చండీగడ్ ఇంఫర్మేష టెక్నాలజీ ప్రపంచంలో ప్రవేశించింది. చండీగడ్ నుండి ఢిల్లీ, హర్యానా, పంజాబు, హిమాచల్ ప్రదేశ్ లకు సౌకర్యవంతమైన రోడ్డు మార్గాలు ఉండడం కూడా ఐ.టి అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఐ.టి టాలెంట్ పూల్ ఐ..టి బిజినెస్ సంబంధిత కార్యాలయాలు ఏర్పాటు చేసే వారిని కూడా ఆకర్షిస్తుంది. పలు ఇండియన్ ఫర్ంస్ అలాగే క్యుయార్క్, ఇంఫోసిస్, డెల్, ఐ.ఐ.ఎం.బి, టెక్‌మహీంద్రా సంస్థలకు నగరంలోనూ నగరం వెలుపల కార్యాలయాలు ఉన్నాయి.
చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంలో చండీగఢ్ జిల్లా పేరుతో ఒకే ఒక జిల్లా ఉంది.[18] జిల్లా ప్రధాన కార్యాలయాలు చండీగడ్ లోనే ఉన్నాయి.చండీగఢ్ జిల్లా ఉత్తర రైల్వేలోని చండీగఢ్ రాష్ట్రంలో ఒక భాగం.జాతీయ స్థాయిలో జిల్లా, జనాభా ర్యాంక్ స్థానంలో 51 ర్యాంక్ గా ఉంది.రాష్ట్ర స్థాయిలో 1 వ స్థానంలో ఉంది.2011 భారత జనాభా ఔవుట్‌గ్రోత్ ప్రకారం చండీగఢ్ జిల్లాను కూడా పరిపాలనాపరంగా చండీగఢ్ నగరపాలక సంస్థగా ప్రకటించారు.చండీగఢ్ రైల్వే స్టేషన్లో ప్రతిరోజూ 66 రైళ్లు ప్రయాణిస్తున్నాయి.దీనిని గ్రేడ్ బి రైల్వే స్టేషన్‌గా పరిగణించారు.[19]
జిల్లా ప్రధాన కార్యాలయం చండీగఢ్ నగరం.జిల్లాలో ప్రధానంగా పంజాభీ, హిందీ మాట్లాడతారు.జిల్లా విస్తీర్ణం 114 చ.కి.మీ.ఇది సముద్ర మట్టానికి సరాసరి 334 మీటర్ల ఎత్తులో ఉంది.[20]
జిల్లాలో ఒక నగరపాలక సంస్థ, 5 జనగణన పట్టణాలు ఉన్నాయి.[21]
జిల్లాలో 5 గ్రామాలు ఉన్నాయి.[21]
చండీగఢ్ జిల్లాలో అనేక విద్యాసంస్థలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యంలో నడుస్తున్న పలు విద్యాసంస్థలు, పంజాబు యూనివర్శిటీ మొదలగు విద్యాసంస్థలు జిల్లా, నగర ప్రజలకు విద్యను అందిస్తున్నాయి.ఈ విద్యాసంస్థలు ప్రపంచం అంతటి నుండి విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి.
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం జిల్లా జనాభా 9,60,787.అందులో పురుషులు 45% మంది ఉండగా, స్త్రీలు 55%మంది ఉన్నారు.జన సాంధ్రత చ. కి.మీ.కు 9258 మంది జనాభాను కలిగి ఉంది.లింగ విష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 829 స్త్రీలును కలిగి ఉంది.ఇది జాతీయ సరాసరి 928 కంటే తక్కువ. అక్షరాస్యత 86.77% ఇది జాతీయ సరాసరి 72% కంటే ఎక్కువ.పురుషుల అక్షరాస్యత 90.81% ఉండగా, స్త్రీల అక్షరాస్యత 81.88% ఉంది.జిల్లా మొత్తం జనాభాలో 6 సంవత్సరాల వయస్సులోపు గల పిల్లలు 10.8% మంది ఉన్నారు.[21]
చండీగఢ్ జిల్లాలో ఈ సెషన్స్ విభాగానికి చెందిన 30 కోర్టులు ఉన్నాయి.చండీగఢ్ జిల్లా కోర్టు 1966 నవంబరు 1 ఏర్పడింది.జాస్మెర్ సింగ్ మొదటి జిల్లా & సెషన్స్ జడ్జిగా,సబ్ జడ్జి ఫస్ట్ క్లాస్, చండీగఢ్ కోర్టుకు సోహన్ లాల్ వర్మలను గా నియమించారు.2014 లో 10 కొత్త కోర్టులు, అంటే అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి కోర్టులు 4, 6 కోర్టులు సివిల్ జడ్జి కోర్టులు (జూనియర్) -6 సృష్టించినప్పుడు కోర్టుల సంఖ్య 30 పెరిగింది.[22]
అవి అన్నీ చండీగఢ్ సెక్టార్ -43 లో కొత్తగా నిర్మించిన జిల్లా కోర్టుల సముదాయంలో ఉన్నాయి. చండీగఢ్ లోని ఇంటర్ స్టేట్ బస్ టెర్మినస్ నుండి కాలినడకన జిల్లా కోర్టుల సముదాయానికి చేరుకోవచ్చు.కొత్త జిల్లా కోర్టుల సముదాయంలో 31 కోర్టు గదులు ఉన్నాయి.ఇది నాలుగు అంతస్థులతో నిర్మించబడింది. , జిల్లా బార్ అసోసియేషన్ ప్రారంభ సభ్యులు 15-20 మంది సభ్యులు నుండి, ప్రస్తుతం 3000 మంది సభ్యులుకు చేరుకుంది.
2014 లో 10 కోత్త కోర్టులు ఏర్పడుటకు ముందు 20 కోర్టులు జిల్లా కోర్టు కాంప్లెక్స్, సెక్టార్ -17, చండీగఢే పనిచేస్తున్నాయి.ఇవి 2013 జనవరి 25న న చండీగఢ్ లోని న్యూ డిస్ట్రిక్ట్ కోర్ట్సు కాంప్లెక్సుకు మార్చబడ్డాయి.[22]
చండీగఢ్ నగరంలో రాష్ట్రాంతర క్రీడా బృందాలు అనేకం ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐ.పి.ఎల్) లోని కింగ్స్ XI పంజాబు ఒక భాగం. నగరంలో బత్రా, నీలం , కిరన్ వైల్ వంటి సినిమాహాళ్ళు , పలు మాల్స్ , పి.వి.ఆర్ ఎలెంటే మాల్, పి.వి.ఆర్ సెంట్రా మాల్, వేవ్ ఎంపోరియం మాల్, డి.టి మాల్, ఫన్ రిపబ్లిక్ , ఎలెంటే మాల్ (ఉత్తర భారతదేశంలో అత్యంత పెద్దది) వంటి మల్టీ కాంప్లెక్స్ ఉన్నాయి.[23] నగరంలో సెక్టర్ 1 లో ఉన్న " రాక్ గార్డెన్, సెక్టర్ 16 లో ఉన్న " జాకీర్ హుస్సేన్ రోజ్ గార్డెన్ " ప్రపంచ ప్రఖ్యాత కలిగినవిగా గుర్తింపు పొందాయి. అంతర్జాల అనుసంధానంలో చండీగఢ్ ప్రత్యేకత సంతరించుకుంది.
శీతోష్ణస్థితి డేటా - చండీగడ్ | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
సగటు అల్ప °C (°F) | 2.1 (35.8) |
4.3 (39.7) |
9.4 (48.9) |
14.9 (58.8) |
20.2 (68.4) |
22.4 (72.3) |
21.0 (69.8) |
20.3 (68.5) |
17.8 (64.0) |
13.0 (55.4) |
6.5 (43.7) |
2.7 (36.9) |
12.9 (55.2) |
సగటు వర్షపాతం mm (inches) | 46.6 (1.83) |
33.9 (1.33) |
29.3 (1.15) |
11.3 (0.44) |
24.2 (0.95) |
112.6 (4.43) |
276.3 (10.88) |
282.8 (11.13) |
179.0 (7.05) |
41.6 (1.64) |
6.7 (0.26) |
18.9 (0.74) |
1,063.2 (41.83) |
సగటు వర్షపాతపు రోజులు | 3.8 | 3.9 | 2.6 | 2.4 | 2.5 | 7.1 | 12.9 | 13.3 | 6.1 | 1.9 | 1.3 | 1.9 | 59.7 |
Source: World Meteorological Organisation[24] |
చండీగ District ్ జిల్లా ఉత్తర రైల్వేలోని చండీగ state ్ రాష్ట్రంలో ఒక భాగం, జనాభా ర్యాంక్ జాతీయ స్థాయిలో 51 వ స్థానంలో ఉంది, రాష్ట్ర స్థాయిలో 1 వ స్థానంలో ఉంది. G ట్‌గ్రోత్ (2011) తో చండీగ District ్ జిల్లాను కూడా చండీగ మునిసిపల్ కార్పొరేషన్‌గా పరిపాలనాపరంగా ప్రకటించారు. చండీగ Railway ్ రైల్వే స్టేషన్లో ప్రతిరోజూ 66 రైళ్లు ప్రయాణిస్తున్నాయి, కాబట్టి దీనిని గ్రేడ్ బి రైల్వే స్టేషన్‌గా పరిగణిస్తారు.
భారతదేశంలో అత్యధికంగా వాహనాలను ఉపయోగిస్తున్న నగరాలలో చండీగఢ్‌కు ప్రధమస్థానం.[25] వెడల్పైన రహదార్లు, చక్కని నిర్వహణ మార్గమంతా వాహనాల పాత్కింగ్ సౌకర్యం ఉండడం ఇందుకు కారణమని భావించవచ్చు. " ది చంఢీగఢ్ ట్రాంస్పోర్ట్ " ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్స్ నుండి ప్రభుత్వ బసులను నిర్వహించే అధికారాన్ని అందుకున్నది. ఇది సెక్టర్లలో 17 , నగరంలో 43 బస్సులను నడుపుతుంది.[26] సి.టి.యు పొరుగు రాష్ట్రాలైన పంజాబు , హర్యానా, హిమాచల్ ప్రదేశ్ , ఢిల్లీలకు కూడా బస్సు సేవలనను అందిస్తుంది. చండీగఢ్ జాతీయరహదారి 22 , జాయీయరాదారి 21తో రోడ్డు ద్వారా అనుసంధానం చేస్తుంది. చండీగఢ్ రైల్వేస్టేషన్ ఇండియన్ రైల్వే నార్తన్ రైల్వే జోన్లో ఉంది. ఇక్కడి నుండి ఢిల్లీ, ముంబై, కొలకత్తా,విశాఖపట్నం,జైపూర్,లక్నో,భోపాల్, ఇండోర్, త్రివేండ్రం , అమృత్సర్ వంటి ప్రముఖ నగరాలకు రైలు వసతి కల్పిస్తుంది. అంతేకాక ఇక్కడి నుండి అంబాలా , కొల్లం,పానిపట్, తిరువనంతపురం వంటి దక్షిణ భారతీయ ప్రముఖ నగరాలకు కూడా రైలు వసతి కల్పిస్తుంది. " చంఢీగఢ్ విమానాశ్రయం " భారతీయ ప్రముఖనగరాలకు కమర్షియల్ విమాన సేవలను అందిస్తుంది. ఢిల్లీ, ముంబై, జైపూర్, ఇండోర్ నగరాలకు విమానసేవలు అందిస్తుంది. సరికొత్త అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణదశలో ఉంది. చంఢీగఢ్ మెట్రో రైలు విధానం 2018 నాటికి కార్యరూపం దాల్చనుంది. .
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.