Remove ads

గ్వాలియర్ మధ్యప్రదేశ్‌లో ఒక ప్రధాన నగరం. గ్వాలియర్ జిల్లా ముఖ్యపట్టణం. ఇది ఢిల్లీకి దక్షిణంగా 343 కి.మీ. దూరంలో ఉంది. ఇది ఆగ్రా నుండి 120 కి.మీ., రాష్ట్ర రాజధాని భోపాల్ నుండి 414 కి.మీ. దూరంలో ఉంది. ఢిల్లీ నగరంపై వలస వచ్చేవారి వత్తిడిని తగ్గించేందుకు ఉద్దేశించిన కౌంటర్-మాగ్నెట్ నగరాల్లో ఇది ఒకటి. గ్వాలియర్ భారతదేశంలోని గిర్డ్ ప్రాంతంలో ఒక వ్యూహాత్మక స్థానంలో ఉంది.. ఈ చారిత్రిక నగరాన్ని, దాని కోటనూ అనేక ఉత్తర భారత రాజ్యాలు పాలించాయి. 10 వ శతాబ్దంలో కచ్ఛపగతులు, 13 వ శతాబ్దంలో తోమర్‌లు, ఆ తరువాత మొఘలులు, 1754 లో మరాఠాలు, తరువాత 18 వ శతాబ్దంలో సింధియాలూ పాలించారు. 2016 లో పట్టణ కాలుష్యంపై జరిపిన అధ్యయనంలో ఈ నగరం భారతదేశంలో అత్యధిక స్థాయిలో వాయు కాలుష్యం ఉన్న నగరమని, ప్రపంచంలో రెండవ స్థానంలో ఉందనీ తేలింది.[4]

త్వరిత వాస్తవాలు గ్వాలియర్, దేశం ...
గ్వాలియర్
మెట్రోపాలిటన్ నగరం
ThumbThumb
ThumbThumb
ThumbThumb
Clockwise from top: Gwalior Fort and the city skyline, Jai Vilas Mahal Interior, British era monument, Sanatan Dharam Mandir, Jai Vilas Palace, Jhansi ki Rani monument, Birla Sun Temple of Gwalior
Thumb
గ్వాలియర్
గ్వాలియర్
Coordinates: 26.221521°N 78.178024°E / 26.221521; 78.178024
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
ప్రాంతమ్గిర్డ్
జిల్లాగ్వాలియర్
Founded bySuraj Sen (according to a legend)
విస్తీర్ణం
  మెట్రోపాలిటన్ నగరం289 కి.మీ2 (112 చ. మై)
Elevation
211 మీ (692 అ.)
జనాభా
 (2011)[2]
  మెట్రోపాలిటన్ నగరం10,69,276
  జనసాంద్రత5,478/కి.మీ2 (14,190/చ. మై.)
  Metro
11,17,740
  జనాభా ర్యాంకు
48
భాష
  అధికారికహిందీ[3]
Time zoneUTC+5:30 (IST)
PIN
474001 to 474055 (HPO)
టెలిఫోన్ కోడ్0751
Vehicle registrationMP-07
లింగ నిష్పత్తి930 /
మూసివేయి

గ్వాలియర్ మాజీ మధ్య భారత్ రాష్ట్రానికి శీతాకాల రాజధాని, తరువాత ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగమైంది. భారత స్వాతంత్ర్యానికి ముందు గ్వాలియర్, బ్రిటిష్ పాలనలో సంస్థానంగా సింధియాలు స్థానిక పాలకులుగా కొనసాగింది. ఎత్తైన రాతి కొండలు నగరాన్ని అన్ని వైపుల నుండి చుట్టుముట్టి ఉంటాయి. ఉత్తరాన ఇది గంగా- యమునా డ్రైనేజ్ బేసిన్‌కు సరిహద్దుగా ఉంది. అయితే ఈ నగరం కొండల మధ్య లోయలో ఉంది. గ్వాలియర్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో గ్వాలియర్ నగరం, మోరార్ కంటోన్మెంట్,[2] లష్కర్ గ్వాలియర్ (లష్కర్ ఉపనగరం), మహారాజ్ బడా, ఫూల్ బాగ్, తటీపూర్‌లు భాగంగా ఉన్నాయి . 

Thumb
గ్వాలియర్ మహారాహాజ్ బిఫోర్ హిస్ ప్యాలెస్ సి. 1887 CE.

పురాణాల ప్రకారం, గ్వాలిపా అనే సిద్ధుడు ఇచ్చిన పానీయం తాగడంతో, స్థానిక అధిపతి సూరజ్ సేన్‌కు కుష్టు వ్యాధి నయం అయింది. సా.శ. 8 లో అతడి పేరిట గ్వాలియర్ నగరాన్ని స్థాపించాడు.[5]

గ్వాలియర్ వద్ద లభించిన తొలి చారిత్రక రికార్డు హూణ పాలకుడు మిహిరకులుడు వేయించిన శాసనం. మిహిరకులుడి తండ్రి తోరమానుడు (493-515) ను కీర్తిస్తూ "[భూమి] యొక్క పాలకుడు, గొప్ప యోగ్యత కలిగినవాడు, అద్భుతమైన తోరమానుడి పేరుతో ప్రసిద్ధి చెందాడు; వీరి ద్వారా, ప్రత్యేకించి నిజాయితీతో కూడిన (అతని) వీరత్వం ద్వారా భూమి ధర్మంగా పరిపాలించబడింది"

9 వ శతాబ్దంలో, గుర్జర-ప్రతీహార రాజవంశం గ్వాలియర్‌ను పాలించింది, తమ పాలనలో వారు తేలి కా మందిర్ ఆలయాన్ని నిర్మించారు. 1021 లో గ్వాలియర్‌ను మహమూద్ ఘజ్ని నేతృత్వంలోని దళాలు దాడి చేశాయి, కాని గ్వాలియర్ పాలకులు వారిని తిప్పికొట్టారు.[5]

Thumb
గ్వాలియర్ కోట లోపల ఉన్న సిద్దాచల్ గుహల వద్ద జైన విగ్రహాలు.

1231 లో ఇల్టుట్మిష్ 11 నెలల సుదీర్ఘ ప్రయత్నం తర్వాత గ్వాలియర్‌ను స్వాధీనం చేసుకున్నాడు, అప్పటి నుండి 13 వ శతాబ్దం వరకు ఇది ముస్లింల పాలనలో ఉంది. 1375 లో రాజా వీర్ సింగ్‌ గ్వాలియర్ పాలకుడయ్యాడు. అతను తోమర్ వంశ పాలనను స్థాపించాడు. వారి పాలనా కాలంలో గ్వాలియర్ స్వర్ణ దశను అనుభవించింది.

గ్వాలియర్ కోటలోని జైన శిల్పాలు తోమర్ పాలనలో నిర్మించారు. మాన్ సింగ్ తోమర్ తన కలల భవంతి, మాన్ మందిర్ ప్రాసాదాన్నినిర్మించాడు. గ్వాలియర్ కోట వద్ద ఇప్పుడిది ఒక పర్యాటక ఆకర్షణ.[6] బాబర్ "ఇది భారతదేశపు కోటల హారంలో ఉన్న ముత్యం, గాలులు కూడా దాని బురుజులను తాకలేవు" అని ఈ కోట గురించి అభివర్ణించాడు. అక్కడ ఏర్పాటు చేసిన రోజువారీ సౌండ్ అండ్ లైట్ షో గ్వాలియర్ కోట, మాన్ మందిర్ ప్రాసాదాల చరిత్ర గురించి చెబుతుంది. 15 వ శతాబ్దం నాటికి, నగరంలో ప్రసిద్ధ సంగీత పాఠశాల ఉంది. ఇక్కడ తాన్‌సేన్ అభ్యసించాడు. తరువాత 1730 లలో, సింధియాలు గ్వాలియర్‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్రిటిష్ పాలనలో ఇది ఒక సంస్థానంగా మిగిలిపోయింది.

గ్వాలియర్ కోటలోని చతుర్భుజ్ ఆలయం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సున్నాను ఇక్కడే లిఖించినట్లు పేర్కొంది.[7]

Thumb
గ్వాలియర్ కోటలోని మాన్ మందిర్ ప్యాలెస్.
Remove ads

1857 తిరుగుబాటు

గ్వాలియర్ 1857 తిరుగుబాటులో పాల్గొనకపోవటానికి ప్రసిద్ధి చెందింది. ప్రధానంగా రాణి లక్ష్మీబాయితో సహకరించకుండా ఉండడమే దీనికి కారణం . 1858 మే 24 న కల్పి (ఝాన్సీ) బ్రిటిష్ వారి చేతుల్లోకి వచ్చిన తరువాత, లక్ష్మీబాయి గ్వాలియర్ కోట వద్ద ఆశ్రయం కోసం వెళ్ళింది. గ్వాలియర్ మహారాజా బ్రిటిష్ వారి బలమైన మిత్రుడు కావడంతో పోరాటం లేకుండా తన కోటను ఆమెకు వదులుకోవడానికి ఇష్టపడలేదు. కాని చర్చల తరువాత, అతని దళాలు లొంగిపోయాయి, తిరుగుబాటుదారులు కోటను స్వాధీనం చేసుకున్నారు. వెనువెంటనే బ్రిటిష్ వారు గ్వాలియర్ పై దాడి చేశారు. లక్ష్మీబాయి వారితో యుద్ధం చేసింది.[8] భారత దళాలు 20,000 కాగా, బ్రిటిష్ దళాలు 1,600 మంది ఉన్నారు. లక్ష్మీబాయి పోరాటాన్ని భారత జాతీయవాదులు ఈ రోజుకూ స్మరించుకుంటారు. ఆమె పోరాడుతూ మరణించింది. గ్వాలియర్ తిరుగుబాటుదారుల నుండి విముక్తి పొందింది. గుర్రంపై లక్ష్మీబాయి ఉన్న విగ్రహం ఇక్కడ ఉంది. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఆమె చేసిన కృషిని గుర్తుచేస్తుంది. తాంతియా తోపే, రావు సాహిబ్ తప్పించుకున్నారు.[9] తాంతియా తోపే ఆ తరువాత 1859 ఏప్రిల్‌లో బ్రిటిషు వారికి పట్టుబడ్డాడు.

Remove ads

గ్వాలియర్ సంస్థానం

సింధియా ఓ మరాఠా వంశం. ఈ వంశంలో 18, 19 వ శతాబ్దాలలో గ్వాలియర్ రాజ్య పాలకులు. ఆ తరువాత భారతదేశం స్వతంత్రమయ్యే వరకు బ్రిటిష్ ప్రభుత్వానికి మిత్రులు. స్వతంత్ర భారతదేశంలో రాజకీయ నాయకులు.

Thumb
నగరం యొక్క మ్యాప్, ca 1914

సింధియాల గ్వాలియర్ రాజ్యం [10] 18 వ శతాబ్దం రెండవ భాగంలో ఒక ప్రధాన ప్రాంతీయ శక్తిగా మారింది. మూడు ఆంగ్లో-మరాఠా యుద్ధాలలో ప్రముఖంగా కనిపించింది. 1780 లో గ్వాలియర్ మొదటిసారి బ్రిటిష్ వారి చేతిలో ఓడింది..సింధియాలకు అనేక రాజ్‌పుత్ర రాజ్యాలపై గణనీయమైన అధికారం ఉండేది. అజ్మీర్ రాజ్యాన్ని జయించారు. 1857 నాటి భారతీయ తిరుగుబాటు సమయంలో, తిరుగుబాటు దళాలు బ్రిటిష్ వారి చేతిలో ఓడేవరకు కొద్ది కాలం పాటు నగరాన్ని తమ అధీనంలో ఉంచుకున్నారు.[11] 1947 లో భారతదేశం స్వాతంత్ర్యం పొందే వరకు సింధియా కుటుంబం గ్వాలియర్‌ను పాలించింది. మహారాజా జివాజిరావ్ సింధియా తన సంస్థానాన్ని భారత ప్రభుత్వంలో కలిపేసాడు. గ్వాలియర్ అనేక ఇతర సంస్థానాలతో కలిసి మధ్య భారత్ అనే కొత్త భారత రాష్ట్రంగా అవతరించింది. జివాజీరావ్ సింధియా రాష్ట్ర రాజప్రముఖ్గా 1948 మే 28 నుండి 1956 అక్టోబరు 31 వరకు (మధ్యభారత్‌ను మధ్యప్రదేశ్‌లో విలీనం చేసేంతవరకు) పనిచేశాడు.

1962 లో, మహారాజా జివాజీరావ్ సింధియా వితంతువు అయిన రాజమాతా విజయరాజే సింధియా లోక్‌సభకు ఎన్నికైంది. ఎన్నికల రాజకీయాల్లో తమ కుటుంబ ప్రాతినిధ్యాన్ని ప్రారంభించింది. ఆమె మొదట కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు, తరువాత భారతీయ జనతా పార్టీలో ప్రభావవంతమైన సభ్యురాలు అయ్యారు. ఆమె కుమారుడు, మహారాజా మాధవరావు సింధియా 1971 లో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ లోక్సభకు ఎన్నికయ్యాడు. 2001 లో మరణించే వరకు కాంగ్రెసు లోనే పనిచేశాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అతని కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా గతంలో 2004 లో తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన సీటుకు ఎన్నికయ్యాడు. 2020 లో అతడు భారతీయ జనతా పార్టీలో చేరాడు.

Thumb
1949 నాటి కింగ్ జార్జ్ VI స్టాంపుపై 'గ్వాలియర్'
Remove ads

జనాభా

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, గ్వాలియర్ జనాభా 10,69,276. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47% ఉన్నారు. గ్వాలియర్ సగటు అక్షరాస్యత 84.14%. ఇది జాతీయ సగటు 74% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 89.64%, స్త్రీల అక్షరాస్యత 77.92%. గ్వాలియర్ జనాభాలో 11% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు. మొరార్ కంటోన్మెంటుతోకూడా కలిసిన గ్వాలియర్ మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా 1,117,740.[2]

మతం

గ్వాలియర్ (88.84%) లో ఎక్కువ మంది ప్రజలు హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు. ఇస్లాం (8.58%), జైన మతం (1.41%), సిక్కు మతం (0.56%), క్రైస్తవ మతం (0.29) కూడా ఉన్నాయి.

మరింత సమాచారం గ్వాలియర్ నగరంలో మతం ...
గ్వాలియర్ నగరంలో మతం[12]
మతం శాతం
హిందూ మతం
 
88.84%
ఇస్లాం
 
8.58%
జైన మతం
 
1.41%
సిక్కు మతం
 
0.56%
క్రైస్తవం
 
0.29%
ఇతరాలు†
 
0.19%
మూసివేయి
Remove ads

భౌగోళికం

గ్వాలియర్ ఉత్తర మధ్యప్రదేశ్‌లో 26.22°N 78.18°E / 26.22; 78.18 వద్ద [13] ఢిల్లీ నుండి 300 కి.మీ. దూరంలో ఉంది. ఇది సముద్ర మట్టం నుండి 197 మీటర్ల ఎత్తున ఉంది.

రవాణా సౌకర్యాలు

రైల్వే

Thumb
గ్వాలియర్ జంక్షన్

గ్వాలియర్ ఉత్తర మధ్య ప్రాంతంలో ఒక ప్రధాన రైల్వే జంక్షన్. గ్వాలియర్ జంక్షన్ (స్టేషన్ కోడ్: జిడబ్ల్యుఎల్) ఉత్తర మధ్య రైల్వేలో భాగం. న్యారో గేజ్, బ్రాడ్ గేజ్ రైల్వే ట్రాక్‌లు రెండూ ఉన్న కొద్ది ప్రదేశాలలో గ్వాలియర్ ఒకటి. గ్వాలియర్, ప్రపంచంలోని అతి పొడవైన న్యారో గేజ్ మార్గానికి టెర్మినస్. ఇది గ్వాలియర్ జంక్షన్ నుండి షియోపూర్ వరకు 198 కి.మీ.పొడవుంది. గ్వాలియర్ జంక్షన్ ఐదు రైల్వే ట్రాక్ల కూడలి. ఇది ఉత్తర అధ్య రైల్వే జోన్ లోని ఉత్తమ, అత్యంత పరిశుభ్రమైన స్టేషన్ పురస్కారాన్ని గెలుచుకుంది.

రోడ్లు

గ్వాలియర్ నుండి జాతీయ, రాష్ట్ర రహదారుల ద్వారా మధ్యప్రదేశ్ లోనే కాక, భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా చక్కటి రోడ్డు సౌకర్యం ఉంది

గోల్డెన్-క్వాడ్రిలేటరల్ హైవే ప్రాజెక్ట్ లోను ఉత్తర-దక్షిణ-కారిడార్ నగరం గుండా వెళుతుంది. ఆగ్రా-బొంబాయి జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 3) కూడా గ్వాలియర్ గుండా వెళుతుంది. ఇది గ్వాలియరును ఒక వైపు శివపురితో, మరోవైపు ఆగ్రాతో కలుపుతుంది. న్యూ ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులు ఆగ్రా నుండి యమునా ఎక్స్‌ప్రెస్ వే సులభంగా చేరుకోవచ్చు.

నగరం నుండి ఝాన్సీకి జాతీయ రహదారి 75 ద్వారా రోడ్డు సౌకర్యం ఉంది నగరం ఉత్తర భాగం నుండి మధుర నగరానికి జాతీయ రహదారి 3 ద్వారా అనుసంధానం ఉంది. భోపాల్, ఆగ్రా, ఢిల్లీ, జబల్పూర్, ఝాన్సీ, భిండ్, మొరేనా, ధోల్పూర్, ఎటావా, దతియా, జైపూర్, ఇండోర్లతో సహా గ్వాలియర్ సమీపంలో ఉన్న అన్ని పెద్ద, చిన్న నగరాలకు బస్సు సర్వీసులు ఉన్నాయి.

విమానాశ్రయం

గ్వాలియర్ విమానాశ్రయం పేరు రాజమాత విజయ రాజే సింధియా విమానాశ్రయం. నగరంలో మిరాజ్ యుద్ధవిమానాలను ఉంచే భారతీయ వైమానిక దళ స్థావరం ఉంది. గ్వాలియర్ విమానాశ్రయం నుండి ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, జమ్మూలకు రోజువారీ విమానాలు అందుబాటులో ఉన్నాయి.

Remove ads

శీతోష్ణస్థితి

త్వరిత వాస్తవాలు Gwalior, Climate chart (explanation) ...
Gwalior
Climate chart (explanation)
ఫిమామేజూజుసెడి
 
 
17
 
23
7
 
 
8
 
27
10
 
 
7
 
33
16
 
 
2.6
 
39
22
 
 
8.9
 
44
27
 
 
78
 
41
30
 
 
262
 
35
27
 
 
313
 
32
25
 
 
146
 
33
24
 
 
43
 
33
18
 
 
4.2
 
29
12
 
 
7.7
 
24
7
Average max. and min. temperatures in °C
Precipitation totals in mm
Source: IMD
మూసివేయి

గ్వాలియర్‌లో ఉప-ఉష్ణమండల శీతోష్ణస్థితి ఉంటుంది. మార్చి చివరి నుండి జూలై ఆరంభం వరకు వేసవి, జూన్ చివరి నుండి అక్టోబరు మొదలయ్యే వరకు తేమతో కూడిన రుతుపవనాలు, నవంబరు మొదటి నుండి ఫిబ్రవరి చివరి వరకు చల్లటి, పొడి శీతాకాలం ఉంటుంది. కొప్పెన్ వాతావరణ వర్గీకరణ కింద నగరం తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణాన్ని కలిగి ఉంది . నగరంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 49 °C, అత్యల్పం −10 °C. జైపూర్, ఢిల్లీ వంటి ఇతర నగరాలతో పాటు, భారతదేశం, ప్రపంచంలోని అత్యంత వేడిగా ఉండే నగరాల్లో ఇది ఒకటి. మే, జూన్లలో ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా రోజువారీ సగటు 33-35 °C వరకు ఉంటాయి. రుతుపవనాల ప్రారంభంతో జూన్ చివరలో వేసవి ముగుస్తుంది. గ్వాలియర్ వార్షిక వర్షపాతం 900 మి.మీ. దీనిలో ఎక్కువ భాగం రుతుపవనాల నెలల్లోనే (జూన్ చివరి నుండి అక్టోబరు ప్రారంభం వరకు) పడుతుంది. 310మి.మీ. సగటు వర్షపాతంతో ఆగస్టు అత్యంత తేమగా ఉండే నెల. గ్వాలియర్‌లో శీతాకాలం అక్టోబరు చివరలో మొదలవుతుంది, సాధారణంగా 14-16°Cలో రోజువారీ ఉష్ణోగ్రతలతో చాలా తేలికగా ఉంటుంది  ఎక్కువగా పొడి, ఎండ పరిస్థితులుంటాయి. 5-6 °C సగటు కనిష్ఠాలతో జనవరి అత్యంత శీతలంగా ఉండే నెల. అప్పుడప్పుడు వచ్చే అతిశీతల పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు ఒకే అంకెకు పడిపోతాయి.

మరింత సమాచారం శీతోష్ణస్థితి డేటా - Gwalior (1981–2010, extremes 1951–2011), నెల ...
శీతోష్ణస్థితి డేటా - Gwalior (1981–2010, extremes 1951–2011)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 32.4
(90.3)
37.2
(99.0)
41.7
(107.1)
46.2
(115.2)
48.3
(118.9)
47.4
(117.3)
44.6
(112.3)
41.7
(107.1)
40.0
(104.0)
40.1
(104.2)
38.6
(101.5)
32.1
(89.8)
48.3
(118.9)
సగటు అధిక °C (°F) 22.7
(72.9)
26.5
(79.7)
32.7
(90.9)
38.8
(101.8)
41.9
(107.4)
40.6
(105.1)
35.2
(95.4)
33.2
(91.8)
33.8
(92.8)
34.0
(93.2)
29.6
(85.3)
24.9
(76.8)
32.8
(91.0)
సగటు అల్ప °C (°F) 7.1
(44.8)
10.0
(50.0)
15.4
(59.7)
21.1
(70.0)
26.6
(79.9)
28.5
(83.3)
26.5
(79.7)
25.6
(78.1)
24.1
(75.4)
18.6
(65.5)
12.4
(54.3)
7.9
(46.2)
18.7
(65.7)
అత్యల్ప రికార్డు °C (°F) −1.1
(30.0)
−0.3
(31.5)
5.4
(41.7)
11.8
(53.2)
17.2
(63.0)
18.2
(64.8)
20.1
(68.2)
19.6
(67.3)
15.1
(59.2)
8.9
(48.0)
3.0
(37.4)
−0.4
(31.3)
−1.1
(30.0)
సగటు వర్షపాతం mm (inches) 10.4
(0.41)
12.6
(0.50)
6.3
(0.25)
7.6
(0.30)
15.2
(0.60)
76.0
(2.99)
221.6
(8.72)
218.7
(8.61)
161.1
(6.34)
35.9
(1.41)
9.2
(0.36)
5.3
(0.21)
780.0
(30.71)
సగటు వర్షపాతపు రోజులు 1.1 0.9 0.9 0.7 1.5 4.2 11.0 11.3 6.4 1.6 0.4 0.6 40.7
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 51 37 26 19 21 37 64 72 63 51 54 56 46
Source: India Meteorological Department[14][15]
మూసివేయి
Remove ads

విద్యా సౌకర్యాలు

Thumb
బాలికల హాస్టల్, IIITM గ్వాలియర్
Thumb
మాధవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, గ్వాలియర్ యొక్క ముందు దృశ్యం

గ్వాలియర్ ముఖ్యమైన విద్యా \కేంద్రంగా అభివృద్ధి చెందింది. నగరంలో అనేక ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి

గ్వాలియర్లోని విశ్వవిద్యాలయాలు

మరింత సమాచారం విశ్వవిద్యాలయం, రకం ...
విశ్వవిద్యాలయం రకం స్థానం
అమిటీ విశ్వవిద్యాలయం, గ్వాలియర్ ప్రైవేట్ విమానాశ్రయం రోడ్, మహారాజ్‌పురా
ITM విశ్వవిద్యాలయం ప్రైవేట్ విశ్వవిద్యాలయం ఎదురుగా. సిథౌలి రైల్వే స్టేషన్, ఎన్హెచ్ -75 సిథౌలి, గ్వాలియర్
జివాజీ విశ్వవిద్యాలయం ప్రభుత్వం యూనివర్శిటీ రోడ్, సిటీ సెంటర్
లక్ష్మీబాయి నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రభుత్వం రేస్‌కోర్స్ రోడ్
రాజా మాన్సింగ్ తోమర్ మ్యూజిక్ & ఆర్ట్స్ విశ్వవిద్యాలయం రాష్ట్ర విశ్వవిద్యాలయం నీదం రోడ్
రాజమాత విజయరాజే సింధియా కృషి విశ్వవిద్యాలయ (ఆర్‌విఎస్‌కెవివి) రాష్ట్ర విశ్వవిద్యాలయం రేస్‌కోర్స్ రోడ్
మూసివేయి

గ్వాలియర్‌లోని ప్రముఖ ఉన్నత విద్యా సంస్థలు

మరింత సమాచారం ఇన్స్టిట్యూట్, టైప్ చేయండి ...
ఇన్స్టిట్యూట్ టైప్ చేయండి స్థానం
గజారా రాజా మెడికల్ కాలేజీ (జిఆర్‌ఎంసి) ప్రభుత్వం హెరిటేజ్ థీమ్ రోడ్, లష్కర్
గ్వాలియర్ ఇంజనీరింగ్ కళాశాల (జిఇసి) ప్రైవేట్ విమానాశ్రయం రోడ్, మహారాజ్‌పురా, గ్వాలియర్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, గ్వాలియర్ [16] ప్రభుత్వం విమానాశ్రయం రహదారి, మహారాజ్‌పురా
అటల్ బిహారీ వాజ్‌పేయి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (IIITM) ప్రభుత్వం మోరెనా లింక్ రోడ్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్యాటకం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ ప్రభుత్వం గోవింద్‌పురి
మాధవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (MITS) ప్రభుత్వ సహాయంతో గోలా కా మందిర్, రేస్‌కోర్స్ రోడ్
మహారాణి లక్ష్మి బాయి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ (MLB కాలేజ్) ప్రభుత్వం కటోరా తాల్, హెరిటేజ్ థీమ్ రోడ్
రుస్తాంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (RJIT) సెల్ఫ్ ఫైనాన్స్డ్ / బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ అకాడమీ, టెకాన్పూర్
మూసివేయి
Remove ads

ప్రముఖ వ్యక్తులు

  • అమ్జాద్ అలీ ఖాన్, సరోడ్ ప్లేయర్, సంగీతకారుడు
  • అటల్ బిహారీ వాజ్‌పేయి, భారత మాజీ ప్రధాని
  • జావేద్ అక్తర్, ప్రసిద్ధ కవి, సినీ గేయ రచయిత, రచయిత, గ్వాలియర్లో జన్మించారు
  • శరద్ కేల్కర్, నటుడు, గ్వాలియర్లో జన్మించాడు
  • పియూష్ మిశ్రా, భారతీయ చలనచిత్ర, నాటక నటుడు, సంగీత దర్శకుడు, గేయ రచయిత, గాయకుడు, స్క్రిప్ట్ రైటర్.
  • గణేష్ శంకర్ విద్యార్థి, ప్రసిద్ధ హిందీ రచయిత, గ్వాలియర్లో జన్మించారు
  • నిడా ఫజ్లీ, ప్రసిద్ధ ఉర్దూ రచయిత, కవి
  • రూప్ సింగ్, భారత హాకీ ఆటగాడు, ఒలింపియన్
  • తాన్‌సేన్, మొఘల్ చక్రవర్తి అక్బరు దర్బారు లోని సంగీతకారుడు
  • సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, సింధియా పాఠశాలలో చదువుకున్నారు
  • నరేంద్ర సింగ్ తోమర్
  • కార్టూనిస్ట్, చాచా చౌదరి కీర్తి యొక్క కామిక్ సృష్టికర్త ప్రాణ కుమార్ శర్మ దేశ విభజన తరువాత ఇక్కడకు వెళ్లారు
  • సునీల్ భారతి మిట్టల్, భారతీ ఎయిర్‌టెల్ సీఈఓ. అతను మొదట ముస్సోరీలోని వైన్‌బెర్గ్ అలెన్ స్కూల్‌లో చేరాడు. తరువాత గ్వాలియర్‌లోని సింధియా స్కూల్‌లో చేరాడు
  • అనురాగ్ కశ్యప్, భారతీయ చిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత, నటుడు. అతను గ్రీన్ స్కూల్ డెహ్రాడూన్ నుండి తన ప్రారంభ పాఠశాల విద్య నేర్చుకున్నాడు. ఎనిమిది సంవత్సరాల తరువాత, గ్వాలియర్ లోని సింధియా పాఠశాలలో చదివాడు
  • హర్షవర్ధన్ రాణే, తెలుగు, బాలీవుడ్ నటుడు

ప్రస్తావనలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.

Remove ads