Remove ads
From Wikipedia, the free encyclopedia
ప్రాణ్ కుమార్ శర్మ ఒక భారతీయ రచయిత, చిత్రకారుడు. ఈయన సృష్టించిన చాచా చౌధురీ పాత్ర అమిత ప్రజాదరణ పొందినది[1][2].
ప్రాణ్ కుమార్ శర్మ | |
---|---|
జననం | కసూర్, బ్రిటిష్ ఇండియా | 1938 ఆగస్టు 15
మరణం | 2014 ఆగస్టు 5 75) గుర్గాంవ్ , ఇండియా | (వయసు
వృత్తి | కార్టూనిస్టు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | చాచాచౌదరి సృష్టికర్త. |
వెబ్‌సైటు | Official website |
ఈయన 1938 లో కసూర్‌లో పుట్టారు. గ్వాలియర్‌లో బిఏ చదివి ఢిల్లీకి వచ్చి ఈవెనింగ్ కాలేజీ ద్వారా ఎంఏ పట్టా తెచ్చుకున్నారు. బొంబాయిలోని జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్‌స్ నుండి ఐదేళ్ల ఫైన్ ఆర్ట్‌స్ కోర్సును దూరవిద్య ద్వారా చదివారు. ఏదైనా స్కూలులో డ్రాయింగ్ టీచరు అవుదామనుకుంటూనే ఢిల్లీ నుండి వెలువడే ‘‘మిలాప్’’ అనే దినపత్రికలో తన 22 వ యేట కార్టూనిస్టుగా చేరారు[2]. ‘‘దాబూ’’ అనే ఒక పాత్ర సృష్టించి దాన్ని పాప్యులరైజ్ చేశారు. అదొక్కటే కాదు శ్రీమతీజీ, పింకీ, బిల్లూ, రామన్, చన్నీ చాచీ - ఇలాంటి పాత్రలు సృష్టించి వాటి సీరీస్ నడిపారు. కన్నడంలో ‘‘ప్రజావాణి’’ దినపత్రిక కోరికపై అక్కడ కూడా ‘‘పుట్టి’’, ‘‘రామన్’’ వంటి పాత్రలతో సీరీస్ నడిపారు.
ఆయనకు అమితంగా పేరు తెచ్చిన చాచా చౌధురీ పాత్ర 1969లో పుట్టింది[3].[4] తెలుగులో ‘మునసబు పెదనాన్న’ అనుకోవచ్చు. ఆయన వయసులో పెద్దవాడు, శారీరకంగా మరీ బలవంతుడేమీ కాదు. తలపాగ, వెయిస్టుకోటు, చేతిలో చేతికర్ర, వెంట రాకెట్ అనే ఒక కుక్క. బుద్ధిబలం మాత్రం అపారం. కంప్యూటర్ల వంటి ఆధునిక యంత్రాలేమీ లేకుండా కేవలం నిశిత పరిశీలనతో చురుకుగా ఆలోచించి, కేవలం కామన్‌సెన్స్‌తో సమస్యలు పరిష్కరిస్తాడు, దొంగల్ని పట్టేస్తాడు. ఆయనకు సహాయపడడానికి సాబు అనే పరగ్రహవాసి ఉన్నాడు. గురుగ్రహం నుండి వచ్చాడు. చాచా భార్య బీనీ చాచీ చేతి వంట రుచి మరిగి, ఇక్కడే వుండిపోయాడు. 15 అడుగుల పొడుగుంటాడు. బుద్ధి వుందో లేదో తెలియదు కానీ పెద్దగా వుపయోగించడు. ఇక స్థూలకాయురాలైన చాచీ అతనికి పూటకి 10 చపాతీలు, 12 కిలోల హల్వా, 20 లీటర్ల లస్సీ తయారుచేసి పెట్టలేక అలిసిపోతూ వుంటుంది. ఆవిడ అప్పడాల కర్రతో దొంగల్ని తరిమివేస్తూ వుంటుంది. ఒక్కోప్పుడు తనకు బంగారు గాజుల జత చేయించలేదని మొగుడిపై విరుచుకు పడుతూ వుంటుంది. సాబూ కవల సోదరుడు దాబూ కూడా ఉన్నాడు. ఇక విలన్ కూడా లేకపోతే సెట్టు పూర్తి కాదు కాబట్టి, రాకా అనే విలన్ ఉన్నాడు. ఒకప్పుడు గజదొంగ, చక్రం ఆచార్య అనే ఆయన ఇచ్చిన మంత్రజలం తాగి చావులేని భూతమై పోయాడు. వీళ్లు ఎక్కడో సముద్రగర్భంలో పాతి పెట్టేసినా మళ్లీ మళ్లీ తిరిగి వస్తూ వుంటాడు. అతను కాక గోబర్ సింగ్ అనే ఒక బందిపోటు, ధమాకా సింగ్ అతని అనుచరులు పలీతా, రుల్దూ కూడా ఉన్నారు. ఈ పాత్రలన్నీ భారతీయ వాతావరణంలో పుట్టినవే కాబట్టి ఇక్కడి చిన్నపిల్లలను ఎంతగానో అలరించాయి.
1983 లో అప్పటి భారత ప్రధానమంత్రి అయిఅన్ శ్రీమతి ఇందిరాగాంధీ ప్రాణ్ యొక్క కామిక్స్ ను "రామన్-హం ఏక్ హై" అనే పేరుతో విడుదలచేసింది. ఈ కార్యక్రమం జాతీయ సమైక్యత కోసం జరిగింది. ప్రాణ్ 2001 లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ నుండి జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్నారు.[5] ప్రాణ్ ఆయన కుమారుడైన నిఖిల్ చే నడపబడుతున్న "ప్రాణ్స్ మీడియా ఇనిస్టిట్యూట్"లో విద్యార్థులకు వివిధ అంశాలను బోధించేవారు.[1][2]
"ది వరల్డ్ ఎన్సైక్లోపీడియా ఆప్ కామిక్స్"లో "వాల్ట్ డిస్నీ ఆఫ్ ఇండియా" బిరుదును అందుకున్నట్లు మారిస్ హార్న్ తెలియజేశాడు.[6] "చాచాచౌదరి" పాత్ర అమెరికా లోని "ఇంటర్నేషనల్ మ్యూజియం ఆఫ్ కార్టూన్ ఆర్ట్"లో సముచిత స్థానాన్ని పొందింది.
He had been suffering from colon cancer and subsequently was admitted to a hospital in Gurgaon, where he died on August 5, 2014 at approximately 9:30 pm local time.[7]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.