Remove ads
From Wikipedia, the free encyclopedia
గోద్రా, భారతదేశం, గుజరాత్ రాష్ట్రం, పంచమహల్ జిల్లాలోని ఒక పురపాలక పట్టణం. ఇది పంచమహల్ జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం. వాస్తవానికి ఈ పేరు గోవు నుండి వచ్చింది. అంటే "ఆవు" లేదా ధారా - ఈ పదాన్ని ఎలా ఉచ్చరిస్తారు అనే దానిపై ఆధారపడి రెండు అర్థాలు ఉన్నాయి.'ధార' అంటే స్త్రీలింగ విషయం లేదా ఏదైనా "పట్టుకున్న" వ్యక్తి, సాధారణంగా "భూమి" అని అర్థం. ఇతర ఉచ్ఛారణ 'ధారా' అంటే "ప్రవాహం".అయితే, రెండవ ఉచ్చారణ ప్రజాదరణ పొందలేదు, లేదా సాధారణంగా ఈ పదం సరిపోలేదు. అందుకే 'గోద్రా లేదా గోధరా' అంటే ఆవుల భూమి అని అర్థం.
Godhra | |
---|---|
City | |
Nickname: Land of Cows | |
Coordinates: 22°46′38″N 73°37′13″E | |
Country | India |
రాష్ట్రం | గుజరాత్ |
జిల్లా | Panchmahal |
Named for | Cows |
విస్తీర్ణం | |
• Total | 20.16 కి.మీ2 (7.78 చ. మై) |
Elevation | 73 మీ (240 అ.) |
జనాభా (2011) | |
• Total | 1,43,644 |
• జనసాంద్రత | 7,100/కి.మీ2 (18,000/చ. మై.) |
Languages | |
• Spoken | Gujarati |
• Official | Gujarati, Hindi, English and Urdu |
Time zone | UTC+5:30 (భా.ప్రా.కా) |
పిన్ కోడ్ | 389001 |
Telephone code | 02672 |
Vehicle registration | GJ-17 |
Sex ratio | 935/1000 ♀/♂ |
Literacy rate | 87.51 % |
గోద్రా 2002 గుజరాత్ అల్లర్ల ప్రారంభ బిందువుగా భారతదేశంలో అంతర్జాతీయంగా, విస్తృతంగా ప్రసిద్ధి చెందింది. 2002 ఫిబ్రవరి 27న గోద్రా రైల్వే స్టేషన్ సమీపంలో గోద్రా రైలు దహనం సంఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా హిందువులు, ముస్లింల మధ్య మతపరమైన అల్లర్లు ప్రారంభమయ్యాయి, ఆ విధ్వసంలో సుమారు 59 మంది రైలు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.[1] గోద్రా రోడ్డు, రైలు జంక్షన్, కలప, వ్యవసాయ ఉత్పత్తులకు వాణిజ్య కేంద్రం. పరిశ్రమలలో నూనెగింజల నుండి గానుగ ద్వారా నూనెతయారి, పిండిమరలు అడించటం, గాజుల తయారీ లాంటి కుటీర పరిశ్రమలు ఉన్నాయి. వివిధ జైన ప్రబంధాల ఆధారంగా జావర్చంద్ మేఘానీ రచించిన గుజరాతీ చారిత్రాత్మకమైన గుజరాతీ నవలలో నగరాన్ని గోధ్పూర్ (గోధపూర్) గా వర్ణిస్తుంది.[2]
సా.శ. 975 నుండి లార్డ్ రిషభనాథ్ కంచు అకోటాలో కనుగొనబడింది. ఇది గోహద్ర కులాన్ని ప్రస్తావిస్తుంది. అంటే గోహద్రలోని జైన సన్యాసుల పాఠశాల.[3] గోధ్రా చారిత్రక పేరు "గోధ్రాహ్క్", దీనిని సా.శ. 1415లో ధుధుల్ మాండలిక్ అనే పర్మార్ రాజు స్థాపించాడు. సా.శ. 15వ శతాబ్దంలో సెయింట్ వల్లభాచార్య తన ఉదయం చేసే ఆచార ప్రసంగంలో తన కలల నగరానికి ఉదాహరణగా నిలిచాడు. తన కుమార్తెకు కలలో కనిపించి, నగరాన్ని ముస్లిం నివాసి, హిందూ కుటుంబానికి ఎలా అప్పగించిందో అతను వివరించాడు.
గోద్రా నగరం స్థానిక స్వపరిపాలన సంస్థచే పాలించబడుతుంది.[4] పరిపాలన నిమిత్తం నగరం 12 వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు కౌన్సిలరు ప్రాతినిధ్యం వహిస్తాడు.[5] గోద్రా నగరం పంచమహల్ లోక్‌సభ నియోజకవర్గం (పూర్వపు గోద్రా లోక్‌సభ నియోజకవర్గం) లో ఒక భాగం. 2019 సాధారణ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి భారత జనతా పార్టీకి చెందిన రతన్‌సిన్హ్ రాథోడ్ ఎన్నికయ్యాడు.[6] గోద్రా శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికైన సికె రౌల్జీ, లోక్‌సభ సభ్యుడు రతన్‌సిన్హ్ రాథోడ్ ఈ నగరంతో అనుభంధం ఉన్న ఈ రెండు నియోజక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.[7] II చుండ్రిగర్, పాకిస్తాన్ మాజీ ప్రధాని 1897లో గోద్రాలో జన్మించాడు. వల్లభ్‌భాయ్ పటేల్ 1917లో గోద్రాలో గాంధీని తొలిసారిగా కలిశారు. ఆ తర్వాత భారత స్వాతంత్ర్య పోరాటంలోకి ఆకర్షితులయ్యాడు.[8]
భారతదేశానికి స్వాతంత్ర్యానికి ముందు, తరువాత గోద్రాలో అనేక మతపరమైన హింసాత్మక సంఘటనలు జరిగాయి. వాటిలో గుర్తించదగిన హింసాత్మక చర్యలు వివరాలు
గుజరాత్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా నిర్వహించబడే ప్రజా రవాణా సేవల ద్వారా గోద్రా నగరం నుండి, గుజరాత్‌లోని అన్ని ప్రధానపట్టణాలకు అనుసంధానించబడి ఉంది. గోద్రా నుండి గుజరాత్ రాష్ట్రంలోని, దేశంలోని వివిధ ప్రాంతాలతో గోద్రాను కలిపే రైల్వే కూడలి ఉంది. భారతదేశంలో అతిపెద్ద జాతీయ రహదారి ఢిల్లీ-ముంబై ఎక్సెప్రెస్ రహదారి గోద్రా నగరం గుండా వెళుతుంది.
ఈ ప్రాంతంలో భౌగోళిక, మానవ నిర్మిత లక్షణాలలో మెశ్రీ నది, రాంసాగర్ సరస్సు, వోహర్వాడ్ మస్జిద్ టవర్, పోలన్ బజార్, మెథడిస్ట్ చర్చి, నహెరు ఉద్యానవనం తూర్పున కనేలావ్ సరస్సు ఉన్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.