From Wikipedia, the free encyclopedia
క్రిస్మస్ ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా,[1][2] ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన, సాంస్కృతిక పండుగ.[3][4] క్రిస్టియన్ మతపరమైన పండుగల కేలండర్ కి క్రిస్మస్ కేంద్రం లాంటిది. క్రైస్తవ కేలండర్లో అడ్వెంట్ (పశ్చిమ క్రైస్తవం) లేక నేటివిటీ (తూర్పు క్రైస్తవం) ఉపవాస దినాలకి ఆయన జన్మదినానికి 30 సంవత్సరాలు తేడా ఉంది ఎవడో ఒక అబద్ధాన్ని ఇక్కడ క్రియేట్ చేశాడు ఉపవాస దినాలు తర్వాతనే క్రిస్టమస్ అనేది వస్తుందని అది తప్పు వచ్చే క్రిస్మస్, క్రిస్మస్ టైడ్ (చారిత్రకంగా పశ్చిమాన పన్నెండు రోజుల పాటు ఉండే పండుగ రోజులు. ఇవి, పన్నెండవ రోజు రాత్రికి ఇవి తారాస్థాయికి చేరుకుంటాయి.) అని పిలిచే సీజన్ ఆరంభంగా నిలుస్తుంది. ఇది ఒక అబద్ధం క్రీస్తు నిరంతరము స్తోత్రర్హుడై ఉన్నాడు అని వ్రాయబడింది దాని కొంతమంది అబద్ధ బోధకులు దీన్ని డిసెంబర్ నెలకే పరిమితం చేశారు [5][6]
కొత్త నిబంధన లోని సంప్రదాయిక క్రిస్మస్ కథనం ప్రకారం,యేసు క్రీస్తు ప్రభువు జనన విధానం, మరియ కనడానికి కనీసం సత్రంలో స్థలం లేదు, ప్రసవం అయిన తరువాత పశువుల తొట్టిలో పడుకోబెట్టారు. అప్పుడు దేవుని దూత మొదటిగా వారి కొరకు రక్షకుడు పుట్టాడని తెలియజేస్తుంది, ఆ తరువాత తూర్పు దేశ జ్ఞానులు యేసుని దర్శించి, ఆరాధించి వెళ్లారు.[7]దేవదూతలు ఈ విషయాన్ని పశువుల కాపరులకు చెప్పగా, వారు సమాచారం మిగిలినవారికి చెప్పారు.[8]
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో క్రిస్మస్ సెలవు రోజు,[9][10][11] ఈ పండుగను క్రైస్తవుల్లో అత్యధికులు మతపరంగానూ,[12] క్రైస్తవేతరులు సాంస్కృతికంగానూ జరుపుకుంటారు,[13] పశ్చిమదేశాల్లో సెలవుల సీజన్లో అత్యంత ముఖ్యమైన భాగం.
క్రీస్తు ఏ నెలలో, ఏ తేదీన జన్మించాడన్న విషయం తెలియకపోయినా, నాలుగవ శతాబ్ది మధ్యభాగం నాటికల్లా పశ్చిమ క్రైస్తవ చర్చి క్రిస్మస్ ను డిసెంబరు 25 నాటికి నిర్వహించడం సాగించింది,[14] ఇదే తేదీని తర్వాత తూర్పు క్రైస్తవం కూడా స్వీకరించింది.[15][16] ప్రస్తుత కాలంలో క్రైస్తవుల్లో అత్యధికులు గ్రెగోరియన్ కేలండర్లోని డిసెంబరు నెల 25వ తేదీన నిర్వహించుకుంటున్నారు.
ఏదేమైనా కొన్ని తూర్పు క్రైస్తవ చర్చిలు పాత జూలియన్ కేలండర్ ప్రకారమే డిసెంబరు నెల 25 తేదీన, అంటే ప్రస్తుత గ్రెగోరియన్ కేలండర్లోని జనవరి 6 తేదీన జరుపుకుంటున్నాయి. ఈ తేదీ తర్వాతి రోజునే పశ్చిమ క్రైస్తవ చర్చిలు ఎపిఫనీ అనే పండుగ చేసుకుంటాయి. ఐతే ఇది డిసెంబరు 25 తేదీపైన అనంగీకారం కాదు, డిసెంబరు 25 తేదీన ఏ కాలెండర్ ని అనుసరించి నిర్ణయించాలన్న అంశంపైన తూర్పు క్రైస్తవుల్లో కొందరికి జూలియన్ కాలెండర్ మీదున్న మొగ్గు. పైపెచ్చు క్రైస్తవులు సరిగ్గా ఏ తేదీన జన్మించాడో అదే తేదీన పండుగ చేసుకోవాలన్నది క్రిస్మస్ప్ర ధాన కారణం కాదనీ, దేవుడు మానవ రూపంలో మానవ జాతి పాపాలను తొలగించడానికి భూమిపైకి వచ్చాడన్న కారణంగానే క్రిస్మస్ జరుపుకోవాలని, అదే క్రిస్మస్ పండుగకు ప్రధాన ఉద్దేశంగా ఉండాలని సిద్ధాంతం.[17][18][19][20]
వివిధ దేశాల్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా నిర్వహించే వేడుకల్లో కొన్ని క్రైస్తవ పూర్వపు పద్ధతులు, కొన్ని క్రైస్తవ పద్ధతులు, కొన్ని లౌకిక విధానాలు ఉన్నాయి.[21] ఆధునికంగా ప్రసిద్ధి చెందిన వేడుకల్లో బహుమతులు ఇవ్వడం, క్రిస్మస్ కోసం ఎడ్వంట్ కేలెండర్ (డిసెంబరు 1 నుంచి) లెక్కించడం, ఎడ్వంట్ రెత్ పేరిట ఓ ఆకుపచ్చని ఆకులతో రింగ్ తయారుచేసి నాలుగు కానీ, ఐదు కానీ కొవ్వొత్తులు వెలిగించడం, క్రిస్మస్ సంగీతం, అందులో క్రిస్మస్క రోల్ అనే గీతాలాపన, క్రిస్టింగల్ అనే కొవ్వొత్తి వెలిగించడం, క్రీస్తు జననం ప్రదర్శనను చూడడం, సామూహిక ప్రార్థనలు, ప్రత్యేక విందు, క్రిస్మస్ చెట్టు, క్రీస్తు జననం దృశ్యాలు, వంటివాటితో కూడిన క్రిస్మస్ అలంకరణలు ప్రదర్శించడం వంటివి ఉన్నాయి.
దీనికితోడు ఒకదానికొకటి సంబంధం లేని శాంతా క్లాజ్, ఫాదర్ క్రిస్మస్, సెయింట్ నికొలస్, క్రైస్ట్ కైండ్ వంటి పాత్రలు పిల్లలకు బహుమతులు తీసుకురావడం వంటి వివిధ సంప్రదాయాలు, జానపద గాథలతో కూడి క్రిస్మస్ సంస్కృతిలో భాగంగా ఉన్నారు. [22] బహుమతులు ఇవ్వడం, అలంకరణలు చేయడం వంటివి ఆర్థిక లావాదేవీలను పెంపొందిస్తాయి కనుక క్రిస్మస్ సెలవులు పలు దేశాల్లో వ్యాపారాలకు, అమ్మకందార్లకు కీలకమైన ఈవెంట్, ముఖ్యమైన వ్యాపార సమయంగా మారింది. క్రిస్మస్ పండుగఆర్థిక ప్రభావం గత కొన్ని శతాబ్దాలుగా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో స్థిరంగా పెరుగుతోంది.
ఇది హిందు పండుగ కాదు. ఇది క్రైస్తవుల పండుగ అసలే కాదు అందరూ ఏదో ఒక రకమైన పండుగ చేసుకుంటున్నారు కనుక మనకి ఈ పండుగ అనేది ఉండాలనే ఆచారం మొదట ఆర్సీఎం వారు తీసుకొచ్చారని నా అభిప్రాయం అంతేగాని ఇది దేవుని నిర్ణయం కాదు.
క్రిస్టమస్ అన్న పదం క్రైస్ట్'స్ మాస్ అన్న పదం నుంచి వచ్చింది. ఈ క్రైస్ట్'స్ మాస్ అన్నది మధ్య ఇంగ్లీష్ లోని క్రిస్టెమాసె నుంచి, అది ప్రాచీన ఇంగ్లీష్ లోని క్రైస్టెస్ మేసె అన్న 1038 నాటి రూపం నుంచి వచ్చాయి. క్రైస్ట్ అన్నది గ్రీక్ ఖ్రిస్టోస్ అన్న పదం నుంచి వచ్చింది, అది హిబ్రూ మెస్సయ్యకు, అనువాదం. మెస్సయ్య అంటే అభిషిక్తుడు.[23][24]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.