Remove ads
From Wikipedia, the free encyclopedia
వైశాఖి, లేదా బైశాఖి సిక్కులకు పెద్ద పండుగ. 1699 లో గురు గోబింద్ సింగ్ ఇదే రోజున ఖల్సా స్థాపించాడు. దానికి గుర్తుగా ఈ పండుగను జరుపు కుంటారు. హిందువులకు కూడా ఇది పండుగ దినమే. వైశాఖమాసంలో మొదటిరోజున ఈ పండుగ వస్తుంది. సూర్య మాన పంచాంగం ప్రకారం ఇది సంవత్సరంలో మొదటి రోజు. పంట ఇంటికి వచ్చే రోజుగా దీన్ని హిందువులు, సిక్కులు జరుపుకుంటారు. రోమన్ కాలెండర్ ప్రకారం ఇది సాధారణంగా ఏప్రిల్ 13 / 14 తేదీలలో వస్తుంది.
వైశాఖి | |
---|---|
యితర పేర్లు | బైశాఖి, వైశాఖి, ఖల్సా సిర్జాణా దివస్ |
జరుపుకొనేవారు | ఖల్సా సిర్జాణా దివస్-సిక్కులు. పంట పండుగ/పంజాబీ కొత్త సంవత్సరం- రెండు మతాలు |
రకం | పంజాబీ పండుగ |
ప్రాముఖ్యత | పంట కాలం మొదలయ్యే రోజు, పంజాబీ ఉగాది, కొత్త సంవత్సరం, ఖల్సా పుట్టినరోజు |
ఉత్సవాలు | ఊరేగింపులు, నగర సంకీర్తనలు. తిరునాళ్ళు, బారసాలలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయి (అమృత సంచార వేడుక) |
వేడుకలు | ప్రార్థనలు, ఊరేగింపులు, నిషాన్ సాహిబ్ జండా ఎగరవెయ్యడం, తిరునాళ్ళు. |
వైశాఖి పండుగ సాధారణంగా ఏప్రిల్ 13 తేదీన వస్తుంది.[1]
ఇది ముఖ్యంగా సిక్కు సమాజానికి చాలా ప్రధానమైన పండుగ. అదేరోజు ఖల్సా స్థాపించబడడం వలన దీనికి ఖల్సా సిర్జాన దినం (Khalsa Sirjana Divas) అని కూడా పిలుస్తారు.[2] నానక్షాహీ క్యాలెండర్లో, రెండో నెల వైశాఖ్ మొదటి రోజున ఈ పండుగ వస్తుంది. ఈ కాలెండరు ప్రకారం, ఖల్సా సిర్జానా దినం ఏప్రిల్ 14 న వస్తుంది.[3][4]
మరి కొన్ని సందర్భాల్లో వైశాఖి ఏప్రిల్ 14 న వస్తుంది. ఉపఖండంలోని చాలా ప్రాంతాల్లో మేష సంక్రాంతిని కొత్త సంవత్సర ప్రారంభంగా జరుపుకుంటారు. హిందువులకు ఇది ముఖ్యమైన రోజు. చాంద్ర మానం ప్రకారం కొత్త సంవత్సరం జరుపుకునే ప్రాంతాల వారికి కూడా మేష సంక్రాంతి ముఖ్యమైన రోజే.[5]
ఇదే పండగరోజు మిగిలిన ప్రాంతాలలో కూడా జరుపుకొంటారు. బెంగాల్లో పోహెలా బోయ్షాఖ్ అనే పేరుతో కొత్త సంవత్సర వేడుక చేసుకుంటారు. అస్సాంలో బోహాగ్ బిహు అని, తమిళనాడులో పుత్తండు అనే పేరుతో కొత్త సంవత్సరాన్నీ జరుపుకుంటారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.