From Wikipedia, the free encyclopedia
హైదరాబాదు జిల్లా శాసనసభ నియోజకవర్గాలలో ఒకటైన ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖమైనది. పునర్విభజనకు పూర్వం ఈ నియోజకవర్గం జనాభా పరంగా, ఓటర్ల పరంగా రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఉండేది. ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజన ఫలితంగా ఈ నియోజకవర్గం అనేక శాసనసభ నియోజకవర్గాలుగా విడిపోయింది.
సంవత్సరం | గెలుపొందిన సభ్యుడు | పార్టీ | ప్రత్యర్థి | ప్రత్యర్థి పార్టీ |
---|---|---|---|---|
1967 | బి.వి.గురుమూర్తి | కాంగ్రెస్ పార్టీ | ఎస్.శంకరయ్య | ఇండిపెండెంట్ |
1972 | ఎన్.కృష్ణారావు | కాంగ్రెస్ పార్టీ | ఇ.వి.పద్మనాభన్ | |
1978 | పి.జనార్ధనరెడ్డి[1] | కాంగ్రెస్ పార్టీ | ఆలె నరేంద్ర | జనతా పార్టీ |
1983 | మాధవరం రామచంద్ర రావు | తెలుగుదేశం | పి.జనార్ధనరెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
1985 | పి.జనార్ధనరెడ్డి | కాంగ్రెస్ పార్టీ | ఎన్.మోహన్ రెడ్డి | తెలుగుదేశం |
1989 | పి.జనార్ధనరెడ్డి | కాంగ్రెస్ పార్టీ | ఎం.నారాయణ స్వామి | తెలుగుదేశం |
1994 | పి.జనార్ధనరెడ్డి | కాంగ్రెస్ పార్టీ | బి.విజయ్ కుమార్ | తెలుగుదేశం |
1999 | కె.విజయరామారావు | తెలుగుదేశం | పి.జనార్ధనరెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
2004 | పి.జనార్ధనరెడ్డి | కాంగ్రెస్ పార్టీ | కె.విజయరామారావు | తెలుగుదేశం |
2008 | పి.విష్ణువర్ధన్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | కె.శ్రీనివాస్ రావు | లోక్సత్తా |
2009 | దానం నాగేందర్ | కాంగ్రెస్ పార్టీ | కె.విజయరామారావు | తెలుగుదేశం |
2014 | చింతల రామచంద్రరెడ్డి | బి.జె.పి | దానం నాగేందర్ | కాంగ్రెస్ పార్టీ |
2018 | దానం నాగేందర్ | టిఆర్ఎస్[2] | చింతల రామచంద్రరెడ్డి | బి.జె.పి |
2023[3] | దానం నాగేందర్ | బీఆర్ఎస్ | పి. విజయా రెడ్డి | కాంగ్రెస్ |
2004 శాసనసభ ఎన్నికలలో ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి పి.జనార్థన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి కె.విజయరామారావుపై 32419 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. పి.జనార్థన్ రెడ్డి 157600 ఓట్లు సాధించగా, విజయరామారావుకు 125181 ఓట్లు లభించాయి.
పి.జనార్థన్ రెడ్డి మరణం వలన జరిగిన ఉప ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి జనార్థన్ రెడ్డి కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి సమీప లోక్సత్తా పార్టీకి చెందిన అభ్యర్థి కె.శ్రీనివాస్ రావుపై 1,96,269 ఓట్ల ఆధిక్యంతో గెలిచాడు. ఈ స్థానం నుంచి ముందుగా కుదిరిన అవగాహన మేరకు తెలుగుదేశం పార్టీ పోటీకి దిగలేదు.[4] విష్ణువర్థన్ రెడ్డి 2,54,676 ఓట్లు సాధించగా, శ్రీనివాస్ రావు 58,407 ఓట్లు పొందాడు. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన అభ్యర్థి అరీఫుద్దీన్ 54,134 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచాడు.
Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
తెలంగాణ రాష్ట్ర సమితి | దానం నాగేందర్ | 63,068 | 45.0% | ||
భారతీయ జనతా పార్టీ | చింతల రామచంద్రరెడ్డి | 34,666 | 24.7% | ||
భారత జాతీయ కాంగ్రెస్ | దాసోజు శ్రవణ్ కుమార్ | 33,549 | 23.9% | ||
మెజారిటీ | 28,402 | 20.3% | |||
మొత్తం పోలైన ఓట్లు | 1,40,150 | 53.3% | |||
తెలంగాణ రాష్ట్ర సమితి gain from భారతీయ జనతా పార్టీ | Swing |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.