లోక్‌సత్తా పార్టీ

From Wikipedia, the free encyclopedia

లోక్‌సత్తా పార్టీ

లోక్ సత్తా పార్టీ (ఆంగ్లం : The Lok Satta Party) 2006 అక్టోబరు 2 న స్థాపించబడింది.[1] దీని స్థాపకుడు డా. జయప్రకాశ్ నారాయణ్. ఇదో సాంఘిక సంక్షేమ సంస్థగా ప్రారంభమైనది. రాజకీయరంగంలో విప్లవాత్మకమైన శుద్ధ వాతావరణం తీసుకురావాలనేది సంకల్పం. ఈ సంస్థ గత తొమ్మిదేండ్లుగా తన కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తున్నది.

మరింత సమాచారం లోక్ సత్తా పార్టీ ...
లోక్ సత్తా పార్టీ
నాయకత్వము డా. జయప్రకాశ్ నారాయణ్
స్థాపితము అక్టోబరు 1 2006
ముఖ్య కార్యాలయము ఇ.నెం. : 5-10-180/A&A1, బ్యాండ్ లేన్స్, హిల్‌ఫోర్ట్ రోడ్, ఆదర్శనగర్, హైదరాబాదు-500 001
కూటమి లేదు
సిద్ధాంతము
ప్రచురణలు లోక్ సత్తా టైమ్స్
లోక్ సభ సీట్లు
0 / 545
రాజ్య సభ సీట్లు
0 / 245
శాసనసభ సీట్లు
0 / 294


వెబ్ సైట్ లోక్ సత్తా అధికార వెబ్ సైట్
చూడండి భారత రాజకీయ వ్యవస్థ

భారతదేశ రాజకీయ పార్టీలు

భారతదేశంలో ఎన్నికలు

మూసివేయి

ఉద్యమం

దారి తప్పిన ప్రస్తుత భారత రాజకీయానికి లోక్ సత్తా ఒక ప్రత్యమ్నాయం. దీనిని డా. జయప్రకాష్ నారాయణ స్థాపించాడు. డా.జయప్రకాష్ నారాయణ్ 1980 సంవత్సరం బ్యాచ్ కు చెందిన ఐ.ఏ.ఎస్ ఆఫీసరు. తదనంతర కాలంలో తన పదవికి రాజీనామా చేసి, లోక్ సత్తా ఉద్యమాన్ని స్థాపించాడు.

లోక్ సత్తా లక్ష్యాలు

  • ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయ పార్టీలను పారదర్శకంగా, జవాబుదారీ తనంతో ఉండేలా సంస్కరించడం.
  • ఆడ, మగ అందరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చేయడం.
  • స్థానిక సంస్థలను బలోపేతం చేయడం. అన్ని జిల్లాల్లో స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం.
  • ప్రతి చిన్న పనికీ రాష్ట్ర రాజధానికి వెళ్ళవలసిన అవసరం లేకుండా, మండల స్థాయిలోనే పని నెరవేరే ఏర్పాటు చేయడం.
  • చిన్న చిన్న వ్యాధులకు ప్రాథమిక వైద్యశాల, శస్త్రచికిత్సలకు జిల్లా ప్రధాన వైద్యశాలలను దాటి వెళ్ళవలసిన అవసరం లేకుండా అన్ని సదుపాయాలను పెంచడం. ప్రతి జిల్లా కేంద్రంలోను నిమ్స్ వంటి వైద్యశాలలను ఏర్పాటు చేయడం.
  • అందరికీ ఉచిత విద్య, వైద్యం.
  • గ్రామం లేదా పట్టణానికి ప్రభుత్వం కేటాయించిన నిధులను ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో తెలుసుకోవడం.[2]

మహారాష్ట్రలో లోక్ సత్తా

మహారాష్ట్ర పూణే జిల్లాలోని మావల్ తాలూక "అడెలె" గ్రామ పంచాయతీ ఎన్నికలలో, గ్రామంలో గల తొమ్మిది వార్డ్లకు గాను ఎనిమిదింటికి పోటీచేయగా, ఆరు వార్డ్లలో నెగ్గి గ్రామపంచాయతీలో సర్పంచ్ పదవి పొందింది. గ్రామ సర్పంచ్ శ్రీమతి నికితా ఘోట్కులే.[3]

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.