Remove ads
బీహార్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో కగారియా జిల్లా ఒకటి. కగారియా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 1486 చ.కి.మీ, 2001 గణాంకాల ప్రకారం జనసంఖ్య 1,276,677.
ఖగరియా జిల్లా
खगडिया जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
డివిజను | ముంగేర్ |
ముఖ్య పట్టణం | ఖగరియా |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | ఖగరియా |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,485 కి.మీ2 (573 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 16,57,599 |
• జనసాంద్రత | 1,100/కి.మీ2 (2,900/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 60.87 % |
• లింగ నిష్పత్తి | 883 |
ప్రధాన రహదార్లు | NH 31, NH 107 |
సగటు వార్షిక వర్షపాతం | 1182 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
.
ఖగరియాను ప్రాంతీయవాసులు ఫరాకియా అంటారు. ఇందుకు ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. 5 దశాబ్ధాల ముందు ముగల్ చక్రవర్తి అక్బర్ తన ఆర్థిక మంత్రి తొడరమల్లును తన మొత్తం సామ్రాజ్యన్ని మ్యాపుగా తయారు చేసి తయారు చేయమని కోరాడు. తొడరమల్లు మొత్తం రాజ్యాన్ని వివరిస్తూ వివరణా చిత్రాన్ని తయారు చేసి దట్టమైన అడవులు, నదుల మధ్య ఉన్న ఈ ప్రదేశాన్ని ఫరాకియా అని వర్ణిచాడు. హిందీ భాషలో ఫరక్ అంటే ప్రత్యేక అని అర్ధం. అందువలన ఈ ప్రాంతానికి ఫారాకియా అనే పేరుకూడా ప్రజలలో వాడుకలో ఉంది. ప్రస్తుతం ఇందుకు గుర్తుగా ఈ ప్రాంతంలో " ఫరాకియాంచల్ టైంస్ ", " ఫరాకియా టైంస్ " వీక్లీ ప్రచురించబడుతున్నాయి.
ఖగారియా జిల్లా వైశాల్యం 1486 చ.కి.మీ.[1] ఇది గ్రీన్లాండ్లోని నరేస్ లాండ్ వైశాల్యానికి సమానం.[2] జిల్లా ఏడు నదుల మద్య ఉపస్థితమై ఉంది. (గంగా, కమల, కోషి, బుర్హి గంధక్, కరేష్, కాళి కోషి, బాగ్మతి). ప్రతిసంవత్సరం ఈ నదులకు సంభవించే వరదల కారణంగా ప్రజల ధనప్రాణాలకు, జంతువులకు హాని జరుగుతూ ఉంది.
ఖగారియా జిల్లా ఉపవిభాగాలు ;-
2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో [3] జిల్లా ఒకటి అని గుర్తించింది. బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న రాష్ట్ర .. జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]
ఖగారియా చిన్న పట్టణమైనా ఇక్కడ ఉన్న రైల్వేస్టేషన్ భారతీయ రైల్వే విభాగాలలో ఒకటైన బరూని - గౌహతీ రైల్వే విభాగంలో ప్రధాన రైల్వే స్టేషన్లలో ఒకటిగా గుర్తుంచబడుతుంది. ఇక్కడి నుండి ఉత్తర బీహార్ ప్రయాణించడానికి మరొక రైలు మార్గం సహర్సా, సమస్తిపూర్ రైలు మార్గం ఉంది. జిల్లాలోని ముంగర్ వద్ద గంగానది మీద జార్ఖండ్ - బీహార్ రాష్ట్రాలను కలుపుతూ ఒక రైలు వంతెన నిర్మించబడింది.
జాతీయరహదారి - 31 ఖగారియాను మిగిలిన భారతీయ ప్రధాన నగరాలతో చక్కగా అనుసంధానం చేస్తుంది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,657,599,[4] |
ఇది దాదాపు. | గునియా- బిస్సౌ దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని. | ఇడాహో నగర జనసంఖ్యకు సమం.[6] |
640 భారతదేశ జిల్లాలలో. | 300 వ స్థానంలో ఉంది..[4] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1115 [4] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 29.46%.[4] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 883:1000 [4] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 60.87%.[4] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.