Remove ads

ఇదే పేరుతో విడుదలైన దేవాలయం సినిమా గురించి చూడండి.

Thumb
కంబోడియాలోని 12వ శతాబ్దానికి చెందిన అంగ్ కోర్ వాట్ మందిరం ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయం.

దేవళం లేదా దేవాలయం, మత సంబంధమైన ప్రార్థనల వంటి కార్యక్రమాలకు వినియోగించే కట్టడం. దాదాపు అన్ని మతాలలోను ఇవి పవిత్రమైన ప్రదేశాలుగా భావింపబడుతాయి. 'దేవుడు' లేదా 'దేవత' ఉండే ప్రదేశం గనుక 'దేవాలయం' అని పిలువబడుతుందని అర్థం చేసుకోవచ్చును. వివిధ మతాలలో దేవాలయాలకు చెందిన అనేక సంప్రదాయాలు, నిర్మాణ రీతులు, నిర్వహణా విధానాలు ఉన్నాయి. శ్రీ వైఖానస శాస్త్రం ప్రకారం భక్తజనుల సౌకర్యార్థం భగవంతుడు అర్చారూపియై భూలోకానికి వచ్చాడు. ప్రతి దేవాలయంలోను ద్వారపాలకులు, పరివార దేవతలు, ప్రాకార దేవతలు ఆయా స్థానాలలో ఆవాహన చేయబడిఉంటారు. చారిత్రికంగా దేవాలయం చాలా ప్రాధాన్యత కలిగివుంది. సా.శ. 1వ శతాబ్ది నాటి నుంచి నిర్మింపబడిన అనేక దేవాలయాలు దక్షిణ భారతదేశంలో కనిపిస్తూంటాయి. వీటి వలన హిందూయుగపు చరిత్రను అవగాహన కలిగి, వ్రాసేందుకు చరిత్రకారులకు ఉపయోగపడుతున్నాయి.[1]

Remove ads

హిందూ దేవాలయాలు

Thumb
ముచ్చివోలు గ్రామంలో నిర్మాణమౌతున్న ఈ ఆలయం నమూనాలో సాధారణ హిందూదేవాలయాల నిర్మాణశైలిని చూడవచ్చును

ఆలయాలు అయిదు రకాలుగా ఉన్నాయి.

  • స్వయంవ్యక్త స్థలాలు - భగవంతుడే స్వయంగా అవతరించినవి.
  • దివ్య స్థలాలు - దేవతలచే ప్రతిష్ఠ చేయబడినవి.
  • సిద్ధ స్థలాలు - మహర్షులు, తపస్సుచేసి సిద్ధి పొందిన స్వాములు ప్రతిష్ఠించినవి.
  • పౌరాణ స్థలాలు - పురాణాలలో చెప్పబడి ప్రసిద్ధిగాంచినవి.
  • మానుష స్థలాలు - రాజుల చేత, భక్తుల చేత ప్రతిష్ఠ చేయబడినవి.

దేవాలయ నిర్మాణం

దేవాలయాలలో గాలి గోపురం, ప్రధాన ద్వారం, వైకుంఠ ద్వారం, ధ్వజ స్తంభం, గర్భగుడి, ద్వారపాలకులు, వంటశాల మొదలైన వివిధ భాగాలుంటాయి.

దేవాలయ నియమావళి

Thumb
హిందూ దేవాలయాలలో సాధారణంగా ఉండే భాగాలు, దేవాలయ సందర్శన సమయంలో భక్తులు పాటించే ఆచారాలు ఈ చిత్రంలో గమనించవచ్చును.

ఆగమ శాస్త్రములో దేవాలయాలలో అర్చకులు, భక్తులు, అధికారులు ఏ విధముగా వ్యవహరించకూడదో వివరించబడింది.

  1. ఆలయం లోపల వాహనము మీదగానీ, పాదరక్షలతో గాని తిరుగరాదు.
  2. ఆలయానికు ప్రదక్షిణం చేసిన, పిమ్మట లోనికి ప్రవేశించాలి.
  3. ఆలయంలోనికి తలపాగా ధరించిగాని, చేతితో ఆయుధం పట్టుకొనిగాని ప్రవేశించరాదు.
  4. ఆలయంలోనికి ఉత్తచేతులతోగాని, తిలకం ధరించకుండా గాని, తాంబూల చర్వణం చేస్తూగాని, ఆహారాదులు తినుచూగాని ప్రవేశించరాదు.
  5. ఆలయ ప్రాంగణంలో మల, మూత్ర విసర్జన చేయరాదు.
  6. ఆలయముందు కాళ్ళు చాపుకొని కూర్చుండుట, నిద్రపోవుట చేయరాదు.
  7. ఆలయంలో ఏ ప్రాణికైనా దుఃఖం కలిగించే ఏ హింసనూ చేయరాదు.
  8. ఆలయంలో ఎన్నడూ వివాదాలు పెట్టుకోరాదు.
  9. ఆలయంలో అహంకారముతో, గర్వముతో, అధికార దర్పముతో ఉండరాదు.
  10. ఆలయంలో దేవుని ఎదుట పర స్తుతిని, పర నిందను కూడా చేయరాదు.
  11. ఆలయంలో దేవుని ఎదుట పృష్ఠభాగం చూపిస్తూ కూర్చుండరాదు.
  12. అధికార గర్వంతో అకాలంలో ఆలయం ప్రవేశించి అకాల సేవలను చేయరాదు.
  13. ఒక చేతితో ప్రణామం చేయరాదు.
  14. ఆలయాలలో ఇతరులకు నమస్కరించడం చేయరాదు. భగవంతుని ఎదుట అందరూ సమానులే అని భావించవలెను.

దేవాలయాలలో రకాలు

Remove ads

వివిధ మతాల దేవాలయాలు

చర్చీలు

క్రైస్తవులు దేవుడైన యెహోవాను ఏసుక్రీస్తు ద్వారా ప్రార్థించే మందిరాన్ని చర్చి అంటారు.

మసీదులు

ముస్లింలు ప్రవక్త మహమ్మద్ చెప్పినపద్ధతిలో దేవుడైన అల్లాహ్ను ప్రార్థించే స్థలాలను మసీదులు అంటారు.

గురుద్వారాలు

సిక్కు మతస్థులు ప్రార్థించే ప్రదేశాలను గురుద్వారాలు అంటారు.

బౌద్ధారామాలు

బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనాస్థలాలు, ఆలయాలు

రోడ్లు, పార్కులు వంటి బహిరంగ ప్రదేశాల్లో నిర్మించిన ప్రార్థనా స్థలాలను తొలగించాలి/ వేరేచోటుకు తరలించాలి/ క్రమబద్ధీకరించాలి.తమిళనాడులో అత్యధిక సంఖ్యలో 77,450 ప్రార్థనాస్థలాలు బహిరంగ ప్రదేశాల్లో ఉన్నాయి. ఆ తరువాతి స్థానాల్లో రాజస్థాన్‌ (58,253), గుజరాత్‌ (15వేలు) ఉన్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఒక్కటి కూడా లేదు.ఆ రాష్ట్రాన్ని అత్యంత నాగరిక రాష్ట్రంగా సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశంసించింది.

కొన్ని ప్రసిద్ధ ఆలయాలు

ఆంధ్రప్రదేశ్‌లో

తక్కిన భారతదేశంలో

ఇతర దేశాలలో

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.

Remove ads