Remove ads
From Wikipedia, the free encyclopedia
కె.వి. నరేందర్ ( 1967 జూన్ 7) తెలుగు కవి, కథ రచయిత.[1] 2016లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం అందుకున్నాడు.[2]
కె.వి. నరేందర్ | |
---|---|
జననం | కె.వి. నరేందర్ జూన్ 7, 1967 చిల్వాకోడూర్, జగిత్యాల జిల్లా, తెలంగాణ |
నివాస ప్రాంతం | చిల్వాకోడూర్, జగిత్యాల జిల్లా, తెలంగాణ |
వృత్తి | కవి, ఉపాధ్యాయుడు , కథ రచయిత |
భార్య / భర్త | శ్రీదేవి |
పిల్లలు | కె.వి.మన్ ప్రీతమ్, మాన్విత |
తండ్రి | కె వెంకట్ రెడ్డి |
తల్లి | సుశీల |
కె.వి. నరేందర్ 1967 జూన్ 7 న జగిత్యాల జిల్లాలోని చిల్వాకోడూర్ గ్రామంలో జన్మించాడు. బిఎస్ సి, బి.ఇడి. పూర్తి చేశాడు.
ఇతని రచనలు ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, విపుల, ఉదయం, ఆంధ్రజ్యోతి, నవ్య, వార్త, ఈనాడు, ఆదివారం, రచన, పుస్తకప్రపంచం తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
ఇతను వందకు పైగా కథలు రచించారు. కొన్ని కథలు తెలుగు, తమిళ, హింది భాషల్లోకి అనువదించారు. 'ఊరు' కథా సంకలనంలో 14 కథలు ఉన్నాయి. తెలంగాణ పల్లెలు శిథిలమవుతున్న తీరును, గ్రామాల్లో మారుతున్న మానవ సంబంధాలను, గ్రామీణ జీవితాల్లో వచ్చిన పరిణామాలను, సామాజిక సంబంధాలు తలకిందులవుతున్న వైనాలను, మారిన దోపిడీ రూపాలను ఈ కథల్లో నరేందర్ చిత్రించారు.
ఇతను 1982 నుంచి కథలు రాస్తున్నారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.