Remove ads
From Wikipedia, the free encyclopedia
కళ్లకురిచి, తమిళనాడు రాష్ట్రం, కళ్లకురిచి జిల్లా లోని పట్టణం.ఇది ఒక జిల్లా కేంద్రం.[1] కళ్లకురిచి పూర్వం విలుప్పురం జిల్లాలో భాగంగా ఉండేది. విలుప్పరం జిల్లాను విభజించుటద్వారా, కళ్లకురిచి జిల్లా 2019 నవంబరు 26న ఏర్పడింది. దానిలో భాగంగా కల్లకురిచి పట్టణం ఇది అధికారికంగా జిల్లా కేంద్రంగా మారింది. ఈ ప్రాంతంలో వరి, మొక్కజొన్న, చెరకు, నల్లరేగడి తదితర ప్రధాన పంటలు సాగుచేస్తారు. ప్రధానంగా గోముఖి, మణిముక్త నదుల ఆనకట్టలతో పాటు, వర్షాధారం, ఇతర చెరువులు ద్వారా నీటిపారుదల సౌకర్యాలు ఉన్నాయి.[2]
వాతావరణం వేడిగా ఉంటుంది, గరిష్ట ఉష్ణోగ్రత 38° సెంటీగ్రేడ్ వద్ద, కనిష్ట 21 సెంటీగ్రేడ్ వద్ద ఉంటుంది. శీతాకాలంలో ఈశాన్య ఋతుపవనాల నుండి, వేసవి నెలల్లో నైరుతి ఋతుపవనాల నుండి ఈ పట్టణంలో వర్షపాతం కురుస్తుంది. సగటు వార్షిక వర్షపాతం 1,070 మి.మీ. [3]
కల్లకురిచికి 2020లో తమిళనాడు హస్తకళా అభివృద్ధి సంస్థ లిమిటెడ్, “పూంపుహార్” (తమిళనాడు ప్రభుత్వం అండర్టేకింగ్) ద్వారా “వుడ్ కార్వింగ్స్”, “గంధపు చెక్కల” కోసం జిఐ ట్యాగ్ పొందింది. [4]
2011 జనాభా లెక్కల ప్రకారం, కల్లకూరిచి జనాభా 52,508, ప్రతి 1,000 మంది పురుషులకు 984 మంది స్త్రీలు, ఇది జాతీయ సగటు 929 కన్నా ఎక్కువ. [5] మొత్తం జనాభాలో 5,541 మంది ఆరేళ్ల లోపు వారు ఉన్నారు.
వారిలో 2,914 మంది పురుషులు, 2,627 మంది మహిళలు ఉన్నారు. వెనకబడిన కులాలు జనాభా 15.49% మంది, వెనకబడిన తెగలు జనాభా 27% మంది ఉన్నారు. పట్టణం సగటు అక్షరాస్యత 77.08%,ఇది జాతీయ సగటు 72.99% తో పోలిస్తే తక్కువ.
కల్లకురిచి పట్టణంలో మొత్తం 12801 గృహాలు ఉన్నాయి. మొత్తం 19,013 మంది కార్మికులు, 471 మంది సాగుదారులు, 840 మంది ప్రధాన వ్యవసాయ కూలీలు, 537 గృహనిర్మాణ పరిశ్రమలు , 14,673 మంది ఇతర కార్మికులు, గృహ పరిశ్రమలలో కార్మికులు 1,943 మంది ఇతర కార్మికులు ఉన్నారు.[6]
2011 మత జనాభా లెక్కల ప్రకారం, కల్లకురిచిలో 83.87% హిందువులు, 13.4% ముస్లింలు, 1.72% క్రైస్తవులు, 0.04% సిక్కులు, 0.02% బౌద్ధులు, 0.17% జైనులు, 0.71% ఇతర మతాలను అనుసరిస్తున్నారు. [7]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.