ఈద్ ముబారక్
From Wikipedia, the free encyclopedia
ఈద్ ముబారక్ - Eid Mubarak ( Bengali: ঈদ মুবারক, అరబ్బీ: عيد مبارك, పర్షియన్ / ఉర్దూ: عید مُبارک, హిందీ: ईद मुबारक, మళయాళం: ഈദ് മുബാറക്) ముస్లింల సాంప్రదాయంలో ఈద్ వేళల్లో ఒకరి కొకరు శుభాకాంక్షలు తెలుపుకునే రీతి లేదా రివాజు. ఈదుల్ ఫిత్ర్, ఈదుల్ అజ్ హా, మీలాదె నబి లేదా ఇతర పర్వదినాలకునూ ఉపయోగిస్తారు. "ఈద్" అనగా పండుగ లేదా పర్వం, "ముబారక్" అనగా ఆశీర్వదింపబడిన, శుభీకరింపబడిన, క్లుప్తంగా, "పండుగ-శుభాకాంక్షలు". పండుగ ఏదైనా గావచ్చు, శుభాకాంక్షలు తెలుపుకునే సాంప్రదాయం. ఉదాహరణకు, రంజాన్ ముబారక్ అనగా "రంజాన్ నెల శుభాకాంక్షలు", ఈదుల్-ఫిత్ర్ ముబారక్ అనగా "రంజాన్ పండుగ శుభాకాంక్షలు", "దీవాలి (దీపావళి) ముబారక్" అనగా దీపావళి శుభాకాంక్షలు. ముస్లింలు సాధారణంగా "సలాత్-అల్-ఈద్ (సలాత్ అనగా "నమాజు", - ఈద్ నమాజు) " ఆచరించిన తరువాత, ఈద్ శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
రమదాన్ (రంజాన్) | |
---|---|
![]() బహ్రయిన్ లోని మనామా లో నెలవంక చిత్రం. | |
జరుపుకొనేవారు | ముస్లింలు |
రకం | ధార్మిక |
ప్రారంభం | 1 రంజాన్ |
ముగింపు | 29, or 30 రంజాన్ (నెల) |
జరుపుకొనే రోజు | అవలంబన ఇస్లామీయ కేలండర్ చాంద్రమాన కేలండర్) |
ఉత్సవాలు | సామూహిక ఇఫ్తార్, సామూహిక ప్రార్థనలు |
వేడుకలు | |
సంబంధిత పండుగ | ఈదుల్ ఫిత్ర్, లైలతుల్ ఖద్ర్, ఈద్ ముబారక్ |
ఈ శుభాకాంక్షల ఆచారం, ముస్లింల సాంప్రదాయక ఆచారం, అంతేగాని, ఇస్లామీయ ధార్మిక నిబంధన కాదు.
ప్రాంతాల వారిగా శుభాకాంక్షల విధం

దక్షిణాసియా లో ఈ ఈద్-ముబారక్ సాంప్రదాయం కానవస్తుంది, పశ్చిమాసియా , ఆగ్నేయాసియా దేశాలలో భిన్నంగా ఫిలిపైన్ లో "సలాత్-అల్-ఈద్" అనీ, ఇండోనేషియాలో "సలామత్ లెబరాన్" అనీ, మలేషియాలో ఈదుల్ ఫిత్ర్ శుభాకాంక్షలకు "సెలామత్ హరి రాయ ఐదిల్-ఫిత్రి" అని సంబోధిస్తారు.
తుర్కీ లో ఈద్-ముబారక్ తెలుపుకోవడం సాధారణంగా కానరాదు. అందుకు భిన్నంగా "బైరామినిజ్ ముబారెక్ ఓల్సాన్" అని సంబోధిస్తారు. బోస్నియన్ ల ఆచారంలో "బజ్రాం సెరీఫ్ ఓల్సన్" శుభాకాంక్షలైతే అందుకు ప్రతిగా "అల్లాహ్ రోజియోలా" అనేది సమాధానం. అరబ్బులు ఈద్-ముబారక్ ను సాగదీస్తూ "కుల్లు ఆమ్మ వ అంతుం బిఖైర్" అని పలుకుతారు. దీని అర్థం మన సంస్కృత వచనమైన "సర్వేజనాః సుఖినోభవంతు" అని.
ముహమ్మద్ ప్రవక్త కాలంలో ఈదుల్-ఫిత్ర్ పర్వదినాన, సహాబాలు (అనుచరులు), ప్రవక్త ఒకరినొకరు "తకబ్బలల్లాహు మిన్నా వ మిన్నకుమ్" (మా నమాజులను, ఉపవాసాలను, పుణ్యకార్యాలను అల్లాహ్ స్వీకరించుగాక) అని పలికే వారు. .[1][2]
ఇవీ చూడండి
చిత్రమాలిక
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.