ఆగ్నేయాసియాలో గణతంత్ర దేశం From Wikipedia, the free encyclopedia
ఇండోనేషియా లేదా ఇండోనీషా[3] మలయ్ ద్వీపసముదాయంలో ఉన్న దేశం. మలయ్ ద్వీపాల సముదాయం ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీప సముదాయం, ఇది భారత్ - చైనా , ఆస్ట్రేలియాల మధ్య, ఇండియన్ , ఫసిఫిక్ సముద్రాలలో విస్తరించి ఉంది. ప్రపంచం లోనే ముస్లిం జనాభా అధికంగా ఉన్న దేశం , మొత్తం జనాభా పరంగా నాలుగో స్థానంలో ఉంది. 1965లో అధికారం చేజిక్కించుకున్న జనరల్ సుహార్తో 1998లో జరిగిన ప్రజా విప్లవంతో అధికారం కోల్పోవటంతో ఇక్కడ స్వేచ్ఛా ఎన్నికలు జరుగుతున్నాయి.
Republic of Indonesia రిపబ్లిక్ ఇండోనేషియా | |
---|---|
రాజధాని | జకార్తా |
అధికార భాషలు | ఇండోనేషియన్ |
ప్రభుత్వం | రాష్ట్రపతి తరహా గణతంత్రము |
Susilo Bambang Yudhoyono | |
ముహమ్మద్ Jusuf కల్లా | |
స్వాతంత్ర్యం నెదర్లాండ్స్ నుండి | |
• ప్రకటితం | ఆగస్టు 17 1945 |
• గుర్తింపబడినది | డిసెంబరు 27 1949 |
• నీరు (%) | 4.85 |
జనాభా | |
• జూలైJuly 2007 స్థాపనం. estimate | 234,693,997 (4వది) |
• 2000 census | 206,264,595 |
GDP (PPP) | 2007 estimate |
• Total | US$845.6 bn[2] (15) |
• Per capita | US$3,400[2] (110వది) |
జినీ (2002) | 34.3 medium |
హెచ్డిఐ (2004) | 0.711 Error: Invalid HDI value · 108వది |
ద్రవ్యం | రుపయ్యా (IDR) |
కాల విభాగం | UTC+7 to +9 (అనేక) |
• Summer (DST) | లేదు |
ఫోన్ కోడ్ | 62 |
Internet TLD | .id |
హిందూ , బౌద్ధ మత ప్రభావాలతో, 7వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు సుమాత్రా , జావా ద్వీపాలలో కొన్ని రాజ్యములు ఏర్పడ్డాయి. తరువాతి కాలాల్లో భారతీయ గుజరాతీ అరబ్బు వర్తకుల రాకతో ద్వీప సముదాయంలో చాలా చోట్ల ఇస్లాం ప్రబలమైన మతంగా అవతరించి, హిందూ , బౌద్ధ రాజ్యముల పతనానికి దారితీసింది.
16వ శతాబ్దంలో యూరోపియన్లు వచ్చి అనేక చిన్న చిన్న రాజ్యాలుండటాన్ని గమనించారు. సుగంధద్రవ్యాల వ్యాపారంలో ఆధిపత్యం చెలాయించే యత్నంలో ఉన్న యూరోపియన్లకు ఈ చిన్న చిన్న రాజ్యాలు దాడులకు అనువుగా కనిపించాయి.
17వ శతాబ్దంలో స్పానిష్ , పోర్చుగీస్ వారిని బయటకు తరిమి, డచ్ వారు మరింత శక్తివంతమైనారు. తిమూర్ ద్వీపం లోని పోర్చుగీస్ తిమూర్ మాత్రం పోర్చుగీస్ వారి వలస రాజ్యం గానే ఉంది. మొదట డచ్ ఈస్ట్ ఇండియా కంపెని VOC నియంత్రణలోను, తరువాత డచ్ ప్రభుత్వం ఆధ్వర్యంలోను 19వ శతాబ్దం నుండి 2వ ప్రపంచ యుద్ధం వరకు ఇందోనేసియాను డచ్ వారు పరిపాలించారు.
19వ శతాబ్దపు వ్యవసాయ పద్ధతి Cultuveerstelsel పేరుతో జావా ద్వీపంలో విశాలమైన వనాలు , నిర్బంధ వ్యవసాయం, డచ్ ప్రభుత్వానికి లాభాలు తెచ్చాయి. 26 డిసెంబరు 2004 నాటి సునామీ వలన సుమత్రా దీవి లోని ఉత్తర భాగాలు కొన్ని ముఖ్యంగా Aceh, తీవ్రంగా నష్టపోయాయి.
2007లో తయారు చేసిన అంచనాల ప్రకారం ఇండోనేషియా GDP 410.3 బిలియను డాలర్లు ఉంది (అనగా 845.6 బిలియను డాలర్ల కొనుగోలు శక్తి).[2]
ఇండోనేషియా ప్రజలను రెండు గ్రూపులుగా విభజింపవచ్చును. పశ్చిమాన అత్యధికంగా మలయ్ లు, తూర్పున పాపుఅన్ లు, వీరి మూలాల మెలనేసియాకు చెందినవి. ఇండోనేషియాలోని చాలామంది ప్రజలు భాష , ప్రాంతీయ పరంగా జావనీలు (జావా ద్వీపాలకు చెందినవారు), సుందనీలు లేదా బాటక్లు. ఇండోనేషియాలోని ప్రధాన మతం ఇస్లాం, 2000 గణాంకాల ప్రకారం దాదాపు 89% (88.22%) లు ముస్లింలు. ప్రపంచంలోనే అత్యధిక ముస్లింలు గల దేశంగా పేరొచ్చింది. క్రైస్తవులు (9%), బౌద్ధులు (2%), , హిందువులు (7%).
దాదాపు ప్రజలందరూ 'బహాసా దీరాహ్' తమ ప్రథమ భాషగా మాట్లాడుతారు. కానీ అధికారిక భాష ఇండోనేషియన్ లేదా 'బహాసా-ఇండోనేషియా'. ఇది మలయ్ భాషతో దగ్గర సంబంధాలను కలిగి ఉంది. దాదాపు ఇండోనేషియాలోని అన్ని పాఠశాలలలోనూ ఉపయోగించ బడుతున్నది.
ఇండోనేషియాలోని కళలపై అనేక సంస్కృతుల ప్రభావం ఉంది. ప్రఖ్యాత 'జావనీ' నృత్యాలు, హిందూ సంప్రదాయాలను సంస్కృతులనూ కలిగివున్నది. ప్రఖ్యాత జావనీ , బాలినీ నృత్యం 'వయాంగ్-కులిత్' అనేక థియేటర్ షోలు, పలు మతపరమైన ఘటనలను చూపెడతాయి. అనేక ద్వీపాలు తమ 'బాతిక్' , 'ఇఖత్' వస్త్రాలకు పేరుగాంచినవి. 2012 ఆగస్టు 27న ఇండోనేషియాలోని వే రెబో గ్రామంను ప్రపంచ సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా యునెస్కో ప్రకటించింది.
సిలాట్ అనునది ఏకైక 'యుద్ధ కళ', ఇది ద్వీపసమూహాలన్నింటిలోనూ ప్రసిద్ధి.
Official Sites (owned and operated by the government of Indonesia and its agencies)
Other Sites (not owned nor operated by the government of Indonesia and its agencies)
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.