Remove ads
From Wikipedia, the free encyclopedia
మొక్కలోని ఆకులను ఆహార పదార్ధాలుగా ఉపయోగించే మొక్కలను ఆకు కూరలు అంటారు. కొన్ని కొన్ని సార్లు ఈ మొక్కలలోని ఆకులతో పాటు కాండాలను, లేత ఆకుకాడలను కూడా తినటానికి ఉపయోగిస్తారు. ఆకు కూరలు అనేక కుటుంబాలకు చెందిన మొక్కలనుండి వచ్చినా వీటి పోషక విలువలలో, వండే విధానములో మాత్రము ఇవన్నీ ఒకే వర్గానికి చెందుతాయి.
దాదాపు వెయ్యికి పైగా ఆహారయోగ్యమైన ఆకులుగల మొక్కలు ఉన్నాయి అయితే ఆకు కూరలు సాధారణంగా పొట్టిగా, గుబురుగా పెరిగే, స్వల్పకాల పరిమితిగల బచ్చలి, తోటకూర వంటి చిన్న చిన్న మొక్కల నుండే వస్తాయి. తినయోగ్యమైన ఆకులు ఉన్న వృక్షాకార మొక్కలకు ఆడంసోనియా, అరేలియా, మోరింగా, మోరస్,, టూనా రకాలు కొన్ని ఉదాహరణలు.
అనేక పశుగ్రాస పంటల యొక్క ఆకులు కూడా మనుషులు తినడానికి యోగ్యమైనవే కానీ దుర్భర కరువు కాటక సమయాల్లోనే అటువంటివి తింటారు. ఆల్ఫాఆల్ఫా, లవంగము, గోధుమ, జొన్న, మొక్కజొన్న మొదలుకొని అనేక గడ్డులు వీటికి ఉదాహరణలు. ఈ మొక్కలు సాంప్రదాయక ఆకుకూరల కంటే త్వరితగతిన పెరుగుతాయి అయితే పీచు శాతము ఎక్కువగా ఉండటము మూలాన వీటి నుండి మెండైన పోషక విలువలు రాబట్టడము చాలా కష్టము. ఈ అడ్డంకిని ఎండబెట్టడము, పొడి చేయడము, పిప్పి చేయడము, రసము పిండటము మొదలైన ప్రక్రియల ద్వారా అధిగమించవచ్చు.
మనకి ప్రకృతి ఇచ్చిన ఆరోగ్యవరాలలో ఆకు కూరలు చేసే అద్భుతాలెన్నో.... శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తూ... నిత్యం తమని ఏదో ఓరకంగా తీసుకునే వ్యక్తుల జీవనశైలినే మార్చేసే సత్తా ఆకుకూరలకు ఉంది. ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండాతినే ఆహారాన్ని రుచి కరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని ఆకుకూరలు కలిగి ఉంటాయి. ఆకు కూరలు వండుకునే ముందు కచ్చితంగా ఒకటికిరెండు సార్లు కడగటం మంచిది. ఎందుకంటే వాటిలో చేరే చిన్న చిన్న పురుగులు, ధుమ్మూ, ధూళి మన ఆరోగ్యానికి హాని కలిగించ వచ్చు. అవసరమైతే ఆకు కూరలు కడిగేప్పుడు గట్టిగా ఉండే భాగాలను ఏరివేయండి. వీలైతే పొటాషియం పర్మాంగనేట్‌తో ఆకు కూరలు శుభ్రం చేస్తే మంచి ఫలితా లుంటాయి.
ఆకు కూరల్లో సాధారణంగా క్యాలరీలు చాలా తక్కువ, కొవ్వు పదార్ధాలు కూడా తక్కువే. క్యాలరీకిగల మాంసకృత్తుల శాతము చాలా అధికము. అలాగే పీచు పదార్థాలు, ఇనుము, కాల్షియం కూడా అధిక మోతాదుల్లో ఉంటాయి. వృక్ష సంబంధ రసాయనాలు (ఫైటో కెమికల్స్) అయిన విటమిన్ సి, విటమిన్ ఎ, ల్యూటిన్, ఫోలిక్ ఆమ్లం కూడా అధికముగా ఉంటాయి.
పోషకాలు (ప్రతి 100 గ్రములకు) | పుదీన | తోటకూర | పాలకూర | మునగ ఆకులు | కొత్తిమీర | గోంగూర |
---|---|---|---|---|---|---|
క్యాలరీలు | 48 | 45 | 26 | 92 | 44 | 56 |
మాంసకృత్తులు. (గ్రా) | 4.8 | 4.0 | 2.0 | 6.7 | 3.3 | 1.7 |
క్యాల్షియం (మి.గ్రా) | 200 | 397 | 73 | 440 | 184 | 1720 |
ఇనుము (మి.గ్రా) | 15.6 | 25.5 | 10.9 | 7.0 | 18.5 | 2.28 |
కెరోటిన్ (మై.గ్రా) | 1620 | 5520 | 5580 | 6780 | 6918 | 2898 |
థైమిన్ (మి.గ్రా) | 0.05 | 0.03 | 0.03 | 0.06 | 0.05 | 0.07 |
రిబోఫ్లేవిన్ (మి.గ్రా) | 0.26 | 0.30 | 0.26 | 0.06 | 0.06 | 0.39 |
విటమిన్ సి (మి.గ్రా) | 27.0 | 99 | 28 | 220 | 135 | 20.2 |
ఆకుకూరలు తినండి.. మధుమేహానికి చెక్ పెట్టండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆకుకూరలను తినడం వల్ల మధుమేహానికి దూరంగా ఉండవచ్చని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది.
అంతేకాదు, ఆకుకూరలే కాకుండా రోజూ పల్లీలు, ఇతర డ్రై ఫ్రూట్స్ తీసుకునే వారిలో కూడా మధుమేహంతోబాటు ఇతర గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రతిరోజూ పల్లీలు తినేవారిలో మధుమేహం వచ్చే ప్రమాదం ఇరవైవొక్క శాతం తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. డ్రైఫ్రూట్స్ శరీరానికి అవసరమైన కొవ్వును అందిస్తూనే బరువును అదుపులో ఉంచుతాయని న్యూట్రీషన్లు అంటున్నారు.
ఆకుకూరల్లో కెలోరీలు, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ప్రతిరోజూ ఏదో ఒక ఆకుకూర తీసుకొనే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పధ్నాలుగు శాతాన్ని తగ్గించవచ్చంటున్నారు. కాబట్టి ఆహారం ఆకుకూరలు వారానికి మూడు సార్లు తీసుకుంటూ వుండండి.
పాశ్చాత్య దేశాల్లో ఆకు కూరలను చాలా మటుకు పచ్చిగానే సలాడ్లలో తింటారు. అయితే వీటిని స్టిర్-ఫ్రై చెయ్యొచ్చు, ఆవిరికి ఉడక పెట్టవచ్చు, భారతీయ వంటకాల వలె కూర చెయ్యవచ్చు. పంజాబ్ ప్రాంతములో చేసే సాగ్, ఉత్తర భారతములో చేసే పాలక్ పనీర్, ఆంధ్రులు లొట్టలు వేసుకొని ఆరగించే గోంగూర పచ్చడి ఆకు కూరలతో చేసిన వంటకాలే. జాగ్రత్తలు; 1. ఆకు కూరలు వండే ముందు సుబ్రముగా కడగాలి.ఏందు కంటే ఈ మధ్య పంటల పై విపరితంగా పురుగు మందులు ఛల్లు తున్నారు. వాటి అవశెసాలు ఆకు కురల పై ఆల ఉంటున్నాయి. 2.అందు వలన ఆకు కూరలు వండే ముందు కూరలను నీటిలో మునిగెలా 10 నిమషాలపాటు ఉంఛాలి. 3.కూరలను నీటిలో ఉంఛే ముందు కొద్ది పాటి ఉప్పును ఆ నీటిలో కలపాలి.దీని వలన కూరలపై ఉన్న రసయన పురుగు మందు అవశెషాలు, రసయన మందులు లవణంతో ఛర్య జరీపీ నిటిలోకి విడుదల అవుతాయి. 4.ఇపుడు ఆకు కూరలను వందుకుంటే ఎటువంటి ప్రమాదమూ ఉండదు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.