అంతరంగాలు (ధారావాహిక)

From Wikipedia, the free encyclopedia

అంతరంగాలు (ధారావాహిక)

అంతరంగాలు ఈటీవీలో చాలాకాలం జనరంజకంగా కొనసాగిన తెలుగు ధారావాహిక. దీనికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, బొమ్మలు, దర్శకత్వ పర్యవేక్షణ చెరుకూరి సుమన్. దీనిని రామోజీరావు నిర్మించగా అక్కినేని వినయ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందుకోసం సాలూరు వాసూరావు సంగీతాన్ని అందించంగా మాధవపెద్ది సురేష్ రీ-రికార్డింగ్ చేశారు.

త్వరిత వాస్తవాలు అంతరంగాలు, తారాగణం ...
అంతరంగాలు
Thumb
తారాగణంశరత్ బాబు
కల్పన
కిన్నెర
మీనాకుమారి
సాక్షి రంగారావు
అచ్యుత్
Theme music composerసాలూరి వాసు రావు
Opening theme"అంతరంగాలు"
by ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సిరీస్‌లసంఖ్య
ప్రొడక్షన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్రామోజీరావు
ప్రొడక్షన్ స్థానంహైదరాబాద్ (filming location)
నిడివి20–22 minutes (per episode)
ప్రొడక్షన్ కంపెనీఈనాడు టెలివిజన్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్ఈటీవీ
మూసివేయి

నటీనటులు

పాట

అంతరంగాలు అనంత మానస చదరంగాలు
అంతే ఎరగని ఆలోచనల సాగరాలు
ఇది మదినదిలో నలిగే భావతరంగాలు
బాధ్యతల నడుమ బందీ అయిన అనురాగాలు

దీనిని ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు.[1]

అవార్డులు

అంతరంగాలు ధారావాహిక 1998 సంవత్సరానికి గాను 5 నంది పురస్కారాలు గెలుచుకున్నది:[2]

  • ఉత్తమ టీవీ మెగా సీరియల్
  • ఉత్తమ నటుడు - శరత్ బాబు
  • ఉత్తమ పాటల రచయిత (ఎంత గొప్పది బ్రతుకు మీద ఆశ - చెరుకూరి సుమన్)
  • ఉత్తమ సంగీత దర్శకుడు - సాలూరు వాసురావు
  • ఉత్తమ నేపథ్య గాయని - (గుండెకీ సవ్వడెందుకు, పెదవులకీ వణుకెందుకు, పరువానికీ పరుగెందుకు, తనువుకీ తపనెందుకు - సునీత)

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.