పి.ఎల్. నారాయణ

సినిమా, రంగస్థల నటుడు, నాటక రచయిత From Wikipedia, the free encyclopedia

పి.ఎల్. నారాయణ

పి.ఎల్.నారాయణ గా పేరుపొందిన పుదుక్కోటై లక్ష్మీనారాయణ (సెప్టెంబర్ 10, 1935 - నవంబరు 3, 1998) విలక్షణమైన నటుడు, రచయిత, నాటక ప్రయోక్త. సినిమాల్లోకి ప్రవేశించక మునుపు నాటక రచయితగా, నటుడిగా పని చేశాడు. సినిమాల్లో ఈయన ఎక్కువగా సహాయ పాత్రలు, కొన్ని హాస్య ప్రధానమైన పాత్రలు పోషించాడు. 1992 లో యజ్ఞం అనే సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నాడు. కుక్క, నేటి భారతం, మయూరి, రేపటి పౌరులు సినిమాల్లో ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నాడు.

త్వరిత వాస్తవాలు పి. ఎల్. నారాయణ, జననం ...
పి. ఎల్. నారాయణ
Thumb
జననం
పుదుక్కోట్టై లక్ష్మీ నారాయణ

(1935-09-10)1935 సెప్టెంబరు 10
బాపట్ల
మరణంనవంబరు 3, 1998(1998-11-03) (aged 63)
వృత్తినటుడు
మూసివేయి

జననం

ఈయన సెప్టెంబర్ 10, 1935లో బాపట్లలో జన్మించాడు.

సినిమాలు

ఖైదీ సినిమాలో చిరంజీవి తండ్రి పాత్రలో నటించాడు. టి. కృష్ణ దర్శకత్వం వహించిన అన్ని సినిమాల్లో ఆయన నటించాడు. ఆర్. నారాయణ మూర్తి సినిమాల్లో ఆయన రచయితగా పనిచేశాడు.[1]

పురస్కారాలు

తెలుగు సినిమా యజ్ఞంలో అప్పలనాయుడుగా నటించి జాతీయస్థాయిలో ఉత్తమ సహాయ నటుడిగా కేంద్రప్రభుత్వ అవార్డు అందుకున్నారు.[2] ఈయన కుక్క చిత్రంలోని వేషానికి ఉత్తమ సహాయనటుడిగా, మయూరి చిత్రంలో వేషానికి ఉత్తమ కారెక్టర్ నటుడిగా నంది అవార్డులు గెలుపొందాడు. అర్ధరాత్రి స్వాతంత్ర్యం చిత్రానికి ఉత్తమ సంబాషణల రచయితగా నంది అవార్డు పొందాడు.

మరణం

ఈయన తన అరవై మూడో ఏట ఆకస్మికంగా 1998 సంవత్సరం, నవంబరు 3 న మరణించాడు.

చిత్ర సమాహారం

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.