ఊరేగింపు (సినిమా)
From Wikipedia, the free encyclopedia
ఊరేగింపు అదే పేరుతో ప్రజాదరణ పొందిన నాటకానికి సినిమా రూపం.
ఊరేగింపు (1988 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | పి.ఎల్.నారాయణ |
తారాగణం | శివకృష్ణ , ప్రభాకర్ రెడ్డి, పి.ఎల్.నారాయణ, వరలక్ష్మి, కోట శ్రీనివాసరావు |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | కృషి నికేతన్ |
భాష | తెలుగు |
సాంకేతికవర్గం
- కథ, చిత్రానువాదం, మాటలు, దర్శకత్వం: పి.ఎల్.నారాయణ
- నిర్మాత: డి.వి.ఎస్.నారాయణ
- పాటలు: జాలాది, వంగపండు ప్రసాదరావు, పి.ఎల్.నారాయణ
- సంగీతం: సత్యం
- ఛాయాగ్రహణం: ఆర్.రామారావు
నటీనటులు
- శివకృష్ణ
- ప్రభాకరరెడ్డి
- పి.ఎల్.నారాయణ
- జీవా
- హరిప్రసాద్
- టెలిఫోన్ సత్యనారాయణ
- ఏలేశ్వరం రంగా
- వంకాయల సత్యనారాయణ
- త్యాగరాజు
- కోట శ్రీనివాసరావు
- రాళ్ళపల్లి
- నిర్మలమ్మ
- వరలక్ష్మి
- లక్ష్మీప్రియ
- జయశీల
కథాసంగ్రహం
సత్యం మేష్టారు గాంధేయవాది. అహింసకు ప్రతీక. సత్యానికి సార్థకనామదేయుడు. అన్యాయాలకు, అక్రమాలకు బలైపోతున్నవారిని చూసి స్పందించినందుకు చేయని నేరానికి ఉరిశిక్ష విధిస్తారు. దానితో అతడు విప్లవం వైపుకు మరలి అడవులకు వెళ్లి తుపాకీ పడతాడు. శివాజీ విప్లవ వీరుడు. పల్లెల్లో, పట్టణాలలో ఆధునిక వ్యవస్థ మధ్య బతుకుతున్న బడుగుజీవులను, అడవులలో చెట్లమధ్య జీవితాలను వెళ్ళబోస్తున్న గిరిజనులను చైతన్యవంతులుగా మార్చి వారిని గర్జించేటట్లు చేయడమే ఇరువురి లక్ష్యం. ముగింపులో ఇరువురూ బలైపోతారు. పోలీసులదే పైచేయి అవుతుంది.[1][2]
పాటలు
- మాయల మనిషో తమాషాలు చెయ్యొద్దు
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.