Remove ads
అరుణాచల్ ప్రదేశ్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
అంజావ్ జిల్లా, భారతదేశం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జిల్లాలలో ఇది ఒకటి.[1] లోహిత్ జిల్లా లోని కొంత భూభాగం 2004 ఫిబ్రవరి 16న వేరుచేసి అంజావ్ జిల్లా రూపొందించబడింది.[2] జిల్లా ఉత్తర సరిహద్దులో చైనా ఉంది. హవాయ్ సముద్రమట్టానికి 1296 మీ ఎత్తున ఉంది. ఇది జిల్లాకు కేంద్రంగా ఉంది. ఇది బ్రహ్మపుత్ర నది ఉపనది అయిన లోహిత్ నదీతీరంలో ఉంది. ఇది తూర్పు భారతదేశ చివరిభాగంలో ఉంది.[3] అంజావ్ జిల్లా తూర్పు సరిహద్దులో డాంగ్ (అరుణాచల్ ప్రదేశ్) .[4] భారతదేశంలోని అత్యల్ప జనసాంధ్రత కలిగిన జిల్లాలలో ఇది రెండవది.[5]
Anjaw district | |||||
---|---|---|---|---|---|
District of Arunachal Pradesh | |||||
Country | India | ||||
State | Arunachal Pradesh | ||||
Headquarters | Hawai | ||||
Government | |||||
• Lok Sabha constituencies | Arunachal East | ||||
• Vidhan Sabha constituencies | Hayuliang | ||||
విస్తీర్ణం | |||||
• Total | 6,190 కి.మీ2 (2,390 చ. మై) | ||||
జనాభా (2011) | |||||
• Total | 21,167 | ||||
• జనసాంద్రత | 3.4/కి.మీ2 (8.9/చ. మై.) | ||||
Demographics | |||||
• Literacy | 59.4% | ||||
• Sex ratio | 805 | ||||
Time zone | UTC+05:30 (IST) |
1962 యుద్ధం సమయంలో, అంజావ్ లోని కొన్ని ప్రాంతాలను చైనా కొంతకాలం ఆక్రమించింది.[6] వివాదాస్పద సరిహద్దు ప్రాంతం కావడంతో అంజావ్ జిల్లాలో భారత సైన్యం ఎప్పుడూ ఉంటుంది. 2020 చైనా-భారత్ వాగ్వివాదాల సమయంలో ఈ ప్రాంతానికి అదనపు దళాలను మోహరించారు.[7]
2011 జనాభా లెక్కల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్లోని అంజావ్ జిల్లాలో మొత్తం జనాభా 21,167. వీరిలో 11,507 మంది పురుషులు కాగా, 9,660 మంది మహిళలు ఉన్నారు. జిల్లాలో మొత్తం 4,612 కుటుంబాలు ఉన్నాయి. అంజావ్ జిల్లా సగటు లింగ నిష్పత్తి 839. మొత్తం జనాభాలో 4.6% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 95.4% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 80.3% కాగా గ్రామీణ ప్రాంతాల్లో 55.2%. అలాగే జిల్లాలోని పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి 571 కాగా గ్రామీణ ప్రాంతాల వారిది 855. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 3472, ఇది మొత్తం జనాభాలో 16%. 0-6 సంవత్సరాల మధ్య 1744 మంది మగ పిల్లలు, 1728 మంది ఆడ పిల్లలు ఉన్నారు. పిల్లల లింగ నిష్పత్తి 991, ఇది అంజావ్ జిల్లాలోని సగటు లింగ నిష్పత్తి (839) కంటే ఎక్కువ. జిల్లా మొత్తం అక్షరాస్యత రేటు 56.46%. అంజావ్ జిల్లాలో పురుషుల అక్షరాస్యత రేటు 56.69%, స్త్రీల అక్షరాస్యత రేటు 35.89%.[8]
జిల్లా 2 ఉపవిభాగాలుగా విభజించబడి ఉంది.[9]
జిల్లా 4 బ్లాకులుగా విభజించబడి ఉంది.[9]
పరిపాలనను సులభతరం చేయడానికి, అంజావ్ జిల్లా 8 సర్కిల్లుగా విభజించబడింది (తాలూకా/తహసీల్/తహశీల్) ఇవి ఉప-జిల్లాలను సూచించే పరిపాలనా విభాగాలు. సర్కిల్లు బహుళ గ్రామాలు, కొన్ని పట్టణాలను కలిగి ఉంటాయి.[10]
ఈ జిల్లా అరుణాచల్ తూర్పు లోక్సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
జిల్లాలో ప్రధాన పంటలు: మొక్కజొన్న, వరి, బీన్స్, ఏలకులు, ఆరెంజ్, బఠాణీ, ఆఫిల్.[12]
మిష్మి, జాఖ్రింగ్. (వీరిని జిల్లాలో ప్రధాన గిరిజనులుగా పరిగణిస్తారు).[13]
జిల్లా జంతుజాలంలో సుసంపన్నమై ఉంది. జిల్లాలో అరుదైన క్షీరదాలైన మిష్మి తకిన్, రెడ్ గొరల్, గాంగ్షన్ ముంత్జాక్, లీఫ్ ముంత్జాక్ ఉన్నాయి. అలాగే జిల్లాలో అరుదైన స్కేటర్ మోనల్, ఎ పైన్, పినస్ మెర్కుసి వంటి పక్షులు ఇక్కడ మాత్రమే కనిపిస్తుంటాయి.[14] సైన్సు ప్రపంచానికి సరికొత్తది అయినా ఎగిరే ఉడుత ఇక్కడ కనిపిస్తుంది. దీనికి " మిష్మి హిల్స్ జైంట్ ఫ్లైంగ్ స్క్వైరల్ ", పెట్ ఉరిస్టా మిష్మియంసిస్" అనవచ్చు.[15]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.