![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/te/thumb/c/c7/2023_CWC_Logo.svg.png/640px-2023_CWC_Logo.svg.png&w=640&q=50)
2023 క్రికెట్ ప్రపంచ కప్
క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో 13వది. / From Wikipedia, the free encyclopedia
2023 ఐసిసి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్, క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో 13వది. ఇది, నాలుగేళ్ళ కోసారి పురుషుల జాతీయ జట్లు పోటీ పడే వన్డే ఇంటర్నేషనల్ (ODI) క్రికెట్ టోర్నమెంటు. దీన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) నిర్వహిస్తుంది. 2023 అక్టోబరు 5 నుండి 2023 నవంబరు 19 వరకు జరిగిన ఈ టోర్నమెంటుకు భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది.
2023 ఐసిసి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ | |
---|---|
![]() అధికారిక లోగో | |
తేదీలు | అక్టోబరు 5 – నవంబరు 19 |
నిర్వాహకులు | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ |
క్రికెట్ రకం | వన్ డే ఇంటర్నేషనల్ (ODI) |
టోర్నమెంటు ఫార్మాట్లు | రౌండ్ రాబిన్, నాకౌట్ |
ఆతిథ్యం ఇచ్చేవారు | ఇండియా |
ఛాంపియన్లు | ![]() |
పాల్గొన్నవారు | 10 |
ఆడిన మ్యాచ్‌లు | 48 |
మ్యాన్ ఆఫ్ ది సీరీస్ | ![]() |
అత్యధిక పరుగులు | ![]() |
అత్యధిక వికెట్లు | ![]() |
అధికారిక వెబ్సైటు | అధికారిక వెబ్సైటు |
← 2019 2027 → |
ఈ టోర్నమెంటులో 10 జట్లు పోటీపడ్డాయి. 2019 కప్పును గెలుచుకున్న ఇంగ్లాండు డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది. 1987, 1996, 2011 లలో ఉపఖండంలోని ఇతర దేశాలతో కలిసి టోర్నమెంట్లను నిర్వహించిన తర్వాత భారతదేశం, తానొక్కటే ఆతిథ్యమిచ్చిన మొదటి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్పు ఇది.
2023 నవంబరు 19న నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, భారత్‌ను ఓడించి కప్పు గెలుచుకుంది. సెమీఫైనల్స్ రెండూ ముంబై లోని వాంఖెడే స్టేడియం లోను, కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్ లోనూ జరిగాయి.