జనవరి 1: సెయింట్ జాన్స్ యుద్ధం. దీనిలో బ్రిటిష్ కాలనీ న్యూఫౌండ్లాండ్ రాజధాని సెయింట్ జాన్స్ను ఫ్రెంచివారు స్వాధీనం చేసుకున్నారు.
జనవరి 6: పశ్చిమ ఐరోపాలో 1709 నాటి గ్రేట్ ఫ్రాస్ట్. 500 సంవత్సరాలలో అత్యంత శీతల కాలం ఏర్పడింది. ఇది ఆ నాటి రాత్రి వేళ మొదలైంది. మూడు నెలల పాటు కొనసాగింది. దీని ప్రభావం మొత్తం ఏడాదంతా ఉంది. [1] ఫ్రాన్స్‌లో, అట్లాంటిక్ తీరం, సీన్ నది గడ్డకట్టాయి. పంటలు దెబ్బతిన్నాయి. 24,000 పారిసియన్లు మరణించారు. తేలియాడే మంచు ఉత్తర సముద్రంలోకి ప్రవేశించింది.
జనవరి 10: అబ్రహం డర్బీ I, ఇంగ్లాండ్‌లోని ష్రాప్‌షైర్‌లోని తన కోల్‌బ్రూక్‌డేల్ బ్లాస్ట్ ఫర్నేస్‌లో కోక్ ఇంధనాన్ని ఉపయోగించి పోత ఇనుమును విజయవంతంగా ఉత్పత్తి చేశాడు. [2][3][4]
మార్చి 28: ఐరోపాలో మొదటిసారిగా డ్రెస్డెన్లో హార్డ్-పేస్ట్ పింగాణీని ఉత్పత్తి చేసినట్లు జోహాన్ ఫ్రెడరిక్ బాట్గర్ చెప్పాడు.
ఏప్రిల్: మిర్వైస్ హోటాక్, కాందహార్‌ను పెర్షియన్ గవర్నరు నుండి చేజిక్కించుకున్నాడు.
జూలై 8: గ్రేట్ నార్తర్న్ వార్: కోసాక్ హెట్మనేట్ ( ఉక్రెయిన్ ) లో పోల్టావా యుద్ధం - రష్యా చక్రవర్తి పీటర్ ది గ్రేట్, చార్లెస్ ఆధ్వర్యంలోని స్వీడన్ దళాలపై నిర్ణయాత్మక విజయం సాధించి రష్యా దండయాత్రను ముగించాడు. దీంతో ఐరోపాలో ఓ ప్రధాన శక్తిగా స్వీడన్ పాత్ర ముగిసింది.
డిసెంబరు 25: లండన్ నుండి, పది నౌకలు న్యూయార్క్ కాలనీకి 4,000 మందికి పైగా ప్రజలతో బయలుదేరాయి.
డేనియల్ గాబ్రియల్ ఫారెన్‌హీట్ ఆల్కహాల్ థర్మామీటర్ ని కనుగొన్నాడు.
తేదీ తెలియదు: 79 AD లో, వెసూవియస్ అగ్నిపర్వత విస్ఫోటనంలో పాంపేతో పాటు బూడిదలో మునిగిపోయిన హెర్కులానియం, అనే పురాతన పట్టణం అనుకోకుండా ఒక బావిని తవ్వుతూండగా బయటపడింది.