![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e4/Mushfiqur_Rahim_2018_%2528cropped%2529.jpg/640px-Mushfiqur_Rahim_2018_%2528cropped%2529.jpg&w=640&q=50)
ముష్ఫికర్ రహీమ్
From Wikipedia, the free encyclopedia
ముష్ఫికర్ రహీమ్ (జననం 1987 మే 9) బంగ్లాదేశ్ జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వైస్ కెప్టెన్. అతను కుడిచేతి వాటం మిడిల్ ఆర్డర్ బ్యాటరు, వికెట్ కీపరు.
![]() 2018 లో ముష్ఫికర్ | ||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ముష్ఫికర్ రహీమ్ | |||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | (1987-05-09) 1987 మే 9 (వయసు 37) బోగ్రా, బంగ్లాదేశ్ | |||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | Mushi,[1] Musfiq[2] | |||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 3[3] అం. (1.60 మీ.) | |||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్-కీపర్-బ్యాటరు | |||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 41) | 2005 మే 26 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2023 జూన్ 14 - Afghanistan తో | |||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 81) | 2006 ఆగస్టు 6 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2023 సెప్టెంబరు 6 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||
వన్డేల్లో చొక్కా సంఖ్య. | 15 (formerly 9) | |||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 6) | 2006 నవంబరు 28 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2022 సెప్టెంబరు 1 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 15 | |||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||
2006, 2008– | Rajshahi Division | |||||||||||||||||||||||||||||||||||
2007 | Sylhet Division | |||||||||||||||||||||||||||||||||||
2012 | Duronto Rajshahi, Nagenahira Nagas | |||||||||||||||||||||||||||||||||||
2013 | Sylhet Royals | |||||||||||||||||||||||||||||||||||
2015 | Sylhet Super Stars | |||||||||||||||||||||||||||||||||||
2016 | కరాచీ కింగ్స్, Barisal Bulls | |||||||||||||||||||||||||||||||||||
2017 | Rajshahi Kings | |||||||||||||||||||||||||||||||||||
2018 | నంగన్హర్ లెపర్డ్స్ | |||||||||||||||||||||||||||||||||||
2019/20 | Khulna Tigers | |||||||||||||||||||||||||||||||||||
2020 | Beximco Dhaka | |||||||||||||||||||||||||||||||||||
2023 | Sylhet Strikers | |||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2023 మార్చి 11 |
ముష్ఫికర్ తన అంతర్జాతీయ కెరీర్‌ను, 2005లో 16 ఏళ్ల వయసులో ఇంగ్లండ్‌పై ప్రారంభించాడు. అతని కెరీర్లో తొలి టెస్టు మ్యాచ్‌లో స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌గా ఆడించారు. తద్వారా లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో ఆడిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. అతను బంగ్లాదేశ్ స్పిన్ దాడికి మద్దతుగా నిల్చిన సమర్థుడైన కీపరు. 2010లో భారత్‌తో జరిగిన టెస్టులో అతని ఖ్యాతి వచ్చింది. అతను 11,000 పరుగులు చేసి, 400+ అవుట్లు చేసిన వికెట్ కీపర్‌గా అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకడు.[4]
బంగ్లాదేశ్ మాజీ కోచ్ జామీ సిడాన్స్ ప్రకారం, ముష్ఫికర్ రహీమ్ బ్యాటింగ్ చాలా బహుముఖంగా ఉంట్యుంది. అతను టాప్ ఆర్డర్లో ఒకటి నుండి ఆరు వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. అతన్ని బంగ్లాదేశ్ అభిమానులు "మిస్టర్ డిపెండబుల్" అని పిలుస్తారు. ప్రతి ఫార్మాట్లోనూ 1000+ పరుగులు చేసిన కొద్దిమంది కీపర్లలో ఒకడు.[5] అతను టెస్టు క్రికెట్లో బంగ్లాదేశ్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరరు.[6] టెస్టు క్రికెట్ చరిత్రలో రెండు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్.[7][8][9][10][11] టెస్టుల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ కూడా.[12] 150 అంతర్జాతీయ మ్యాచ్‌లు గెలిచిన ఏకైక బంగ్లాదేశ్ ఆటగాడు ముష్ఫికర్.[13]