టబు హైదరాబాదులో పుట్టి ముంబైలో స్థరపడిన సినిమా నటి. ఈమె నటి ఫరాహ్ చెల్లెలు, నటి దివ్యభారతి యొక్క స్నేహితురాలు. దివ్యభారతి ద్వారా దర్శకుడు రాఘవేంద్రరావుకు పరిచయం కాబడి తద్వారా కూలీ నెంబర్ వన్ చిత్రంతో తెలుగుతెరపై తెరంగేట్రం చేసింది.[1]

త్వరిత వాస్తవాలు టబు, జననం ...
టబు
Thumb
జననం
తబస్సుమ్ ఫాతిమా హష్మి

(1971-11-04) 1971 నవంబరు 4 (వయసు 52)
ఇతర పేర్లుటబు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1980,1985, 1991, 1994 – ప్రస్తుతం
మూసివేయి

నేపధ్యము

అసలు పేరు తబుస్సుమ్ హష్మి. 1971 నవంబరు 4న హైదరాబాదీ‌ ముస్లిం కుటుంబంలో జన్మించింది. తండ్రి జమాల్ అలీ హష్మి, తల్లి రిజ్వానా. ఆమె తల్లి ఒక పాఠశాల అధ్యాపకురాలు. బాల్యంలో ఉండగానే తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు. అధ్యాపకులైన అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరిగింది. హైదరాబాద్‌లోని సెయింట్ ఆన్స్ హై స్కూల్‌లో చదువుకొంది. ప్రముఖ నటులు షబానా అజ్మీ, బాబా అజ్మీలకి టబు స్వయానా మేనకోడలు. వాళ్లను స్ఫూర్తిగా తీసుకొని 1983లో హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లింది. నిన్నటితరానికి చెందిన ప్రముఖ కథానాయిక ఫరానాజ్ కూడా టబుకి బంధువు అవుతారు.

నటజీవితము

1980లోనే కెమెరా ముందుకెళ్లింది. 'బజార్' అనే చిత్రంలో బాలనటిగా ఓ చిన్న పాత్ర పోషించింది. ఆ తర్వాత ఐదేళ్లకు 'హమ్ నే జవాన్' లో దేవానంద్‌కి కూతురిగా నటించింది. పద్నాలుగేళ్ల వయసులో చేసిన ఆ పాత్ర ద్వారా టబు బాలీవుడ్ వర్గాల్ని ఆకట్టుకొంది. బోణీకపూర్ తన సంస్థలో నిర్మించనున్న 'రూప్‌కీ రాణీ చోరోంకా రాజా', 'ప్రేమ్' చిత్రాల కోసం టబుని కథానాయికగా ఎంపిక చేసుకొన్నాడు. 'ప్రేమ్'లో సంజయ్‌కపూర్ సరసన నటించింది టబు. అయితే ఆ చిత్రం పూర్తి కావడానికి సుమారు ఎనిమిదేళ్లు పట్టింది. సుదీర్ఘకాలం తర్వాత విడుదలైనా, ఆ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో టబుకి ఏ మాత్రం కలిసిరాలేదు

తెలుగు సినీరంగ ప్రవేశము

'కూలీ నెంబర్ 1' చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమైంది. 1987లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆ చిత్రం చక్కటి ఆదరణ పొందింది. దగ్గుబాటి వెంకటేష్ సరసన నటించిన టబు గురించి తెలుగు ప్రేక్షకులంతా ప్రత్యేకంగా మాట్లాడుకొన్నారు. అంతలోనే హిందీ చిత్రాలతో మరింత బిజీ అయిపోయింది. 'విజయ్‌పథ్'లో అజయ్ దేవగణ్ సరసన నటించి తొలి విజయాన్నందుకొంది. ఇక ఆ చిత్రం తర్వాత మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. 'సాజన్ చలే ససురాల్', 'జీత్' చిత్రాలు ఆమెని స్టార్ కథానాయికని చేశాయి. 90వ దశకమంతా బాగా కలిసొచ్చింది. అటు గ్లామర్ పాత్రలతోనూ, ఇటు నటనకు ప్రాధాన్యమున్న కథల్లోనూ నటించింది. హిందీలో చేసిన 'మాచీస్' చిత్రం టబుకి ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. పంజాబీ మహిళ పాత్రలో ఆమె ఒదిగిపోయిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఆ వెంటనే ప్రియదర్శన్ దర్శకత్వంలో కాలాపానీ చేసింది. అది కూడా గుర్తింపును తీసుకురావడంతోపాటు తమిళంలో అవకాశాల్ని తెచ్చిపెట్టింది.

కథానాయికగా టబు తెలుగుపై చెరగని ముద్ర వేసింది. చేసింది తక్కువ సినిమాలే అయినా, టబు అనగానే తెలుగు ప్రేక్షకులు 'మా కథానాయికే' అంటుంటారు. 'కూలీ నెంబర్ 1' తర్వాత చాలా రోజులకి 'నిన్నే పెళ్లాడతా'లో నటించింది. సినిమాలో నాగార్జునతో టబు కెమిస్ట్రీ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకొన్నారు. ఆ తర్వాత 'చెన్నకేశవరెడ్డి', 'ఆవిడా మా ఆవిడే', 'అందరివాడు', 'పాండురంగడు', 'ఇదీ సంగతి' తదితర చిత్రాల్లో నటించి అలరించింది. ఆమె తమిళంలో నటించిన 'కాదల్ దేశమ్' తెలుగులో 'ప్రేమదేశం'గా విడుదలై ఘనవిజయం అందుకొంది.

ఆమె ఆచితూచి కథల్ని ఎంచుకొంటుంది. మనసుకు నచ్చిన పాత్రల్లోనే నటిస్తుంది. దర్శకుడు, నిర్మాత తదితర విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని నటిస్తుంది. అందుకే ఆమె ప్రయాణం కాస్త నిదానంగా సాగినట్టు అనిపిస్తుంటుంది. 'బార్డర్', 'విరాసత్', 'బివి నెంబర్ 1', 'హమ్ సాథ్ సాథ్ హై', 'హేరా ఫేరీ', 'అస్తిత్వ', 'చాందినీ బార్', 'మక్బూల్', 'చీనీ కమ్' తదితర చిత్రాలతో ఆమె ప్రయాణం బిజీబిజీగా సాగింది. తమిళంలోనూ 'కాదల్ దేశమ్', 'కండుకొండేన్ కండుకొండేన్'లాంటి సినిమాలు చేసింది. మలయాళంలో 'స్నేగితీయే', 'ఉరుమి'లాంటి చిత్రాల్లో నటించింది బెంగాలీ, మరాఠీ చిత్రాల్లోనూ నటించి తన అభిరుచిని చాటింది.

అంతర్జాతీయ చిత్రాలు

మీరానాయర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆంగ్ల చిత్రం 'ది నేమ్‌సేక్'లో టబు కీలక పాత్ర పోషించింది. 2012లో విడుదలైన 'లైఫ్ ఆఫ్ పై'లోనూ ఓ కీలక పాత్ర పోషించి అలరించింది. టబు హిందీలో చేసిన 'చీనీకమ్' కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆదరణను చూరగొంది. ఆ చిత్రానికి అమెరికా, ఇంగ్లండ్‌లలో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. భారత ప్రభుత్వం టబుకి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. పలు అంతర్జాతీయ పురస్కారాలు సైతం ఆమెని వరించాయి.

వ్యక్తిగత జీవితము

టబు ఇంకా పెళ్ళి చేసుకోలేదు. ఆమె ప్రేమలో పడిందని పలు మార్లు మీడియాలో ప్రచారం సాగింది. అక్కినేని నాగార్జునతో సన్నిహితంగా మెలుగుతోందని, బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలాతోనూ బంధం ఉందని అంటుంటారు. అయితే టబు మాత్రం, నా బాయ్‌ఫ్రెండ్స్ అంటూ చాలా మంది పేర్లు ప్రచారంలోకి వస్తుంటాయి. బాయ్‌ఫ్రెండ్స్ ఎంతమందైనా రావొచ్చు, పోవచ్చు.

అభిరుచులు

ఒక పత్రికా ముఖాముఖి లో తన అభిరుచులను ఈ విధముగా తెలియజేసింది.

  • ఖాళీ సమయాల్లో సంగీతం వింటుంటా. సినిమాలు చూస్తుంటా. చిన్న చిన్న పద్యాలు రాయడం ఓ హాబీ.
  • ఇష్టమైన కథానాయకులు... అమితాబ్ బచ్చన్, దేవానంద్, షారుఖ్‌ ఖాన్, అమీర్‌ ఖాన్, కమల్‌హాసన్, రజనీకాంత్.
  • ఇష్టమైన కథానాయికల గురించి చెప్పాల్సొస్తే శ్రీదేవి ముందు వరసలో ఉంటారు. రేఖ, నర్గీస్ నటనని కూడా అమితంగా ఇష్టపడతా. నాకు రోల్‌మోడల్... షబానా ఆజ్మీ.
  • నచ్చిన రంగులు... నలుపు, తెలుపు. నేను ధరించే దుస్తులు ఎక్కువగా ఆ రంగుల్లోనే ఉంటాయి.
  • ఇష్టమైన ప్రదేశాలు ముంబై, న్యూజిలాండ్.
  • ఇళయరాజా, ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అంటే చెవికోసుకుంటా.
  • సీ ఫుడ్స్‌తో పాటు భారతీయ వంటకాల్ని ఇష్టంగా తింటా.
  • గాయకుల్లో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, హరిహరన్‌లంటే ఇష్టం.
  • తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలు బాగా మాట్లాడతాను.
  • ఎదుటివారిలో నచ్చేది... అమాయకత్వం, కష్టపడే తత్వం, ప్రకృతిని ప్రేమించే గుణం.
  • నచ్చనది... బద్దకం, అపరిశుభ్రత, కఠినత్వం.
  • నచ్చిన ఆటలు క్రికెట్, ఈత.

టబు నటించిన చిత్రాలు

మరింత సమాచారం సంవత్సరం, చిత్రం ...
సంవత్సరం చిత్రం పాత్ర భాష ఇతర వివరాలు
1985హమ్‌ నౌజవాన్ప్రియహిందీబాలనటి
1991కూలీ నెం 1రంజనితెలుగు
1994పెహలా పెహలా ప్యార్సప్నఉర్దూ
1994విజయ్‌పథ్మోహిని "మోనా"హిందీఫిలింఫేర్ ఉత్తమ నూతన నటి
1995ప్రేమ్లచి/సోనియా జైట్లీహిందీ
1995సాజన్ కీ బాహోమేకవితహిందీ
1995సిసింద్రీతెలుగుప్రత్యేక గీతం
1995హకీకత్సుధహిందీ
1996సాజన్ చలే ససురాల్దివ్య ఖురానాహిందీ
1996కాలాపానీపార్వతిమలయాళంDubbed into Tamil as Siraichalai, Telugu as Kalapani and Hindi as Saza E Kalapani.
1996కాదల్ దేశందివ్యతమిళంతెలుగు లో ప్రేమదేశం గా విడుదలైంది
1996హిమ్మత్అంజుహిందీ
1996తూ చోర్ మై సిపాహికాజల్హిందీ
1996జీత్తుల్సిహిందీSpecial appearance
ప్రతిపాదన–ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటి
1996నిన్నే పెళ్లాడుతామహాలక్ష్మీతెలుగుఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నటి
1996మాచిస్వీరేంద్రహిందీm:en:National Film Award for Best Actress
ప్రతిపాదన–ఫిలింఫేర్ ఉత్తమ నటి
1997విరాసత్జెహ్నాహిందీFilmfare Award for Best Actress (Critics' Choice)
Nominated–Filmfare Award for Best Actress
1997దర్మియాచిత్రహిందీ
1997బోర్డర్కులదీప్ భార్యహిందీ
1997ఇరువర్సెంతామరైతమిళ్తెలుగులో ఇద్దరుగా విడుదల
1998తాయిన్ మణికొండిరాణితమిళ్
1998చాచి 420జానకి పాశ్వాన్హిందీ
1998ఆవిడా మా ఆవిడేఅర్చనతెలుగు
19982001:దో హజార్ ఏక్బిల్లుహిందీ
1998హనుమాన్అంజఆంగ్లము
1999కొహ్రామ్ఇన్స్పెక్టర్ కిరణ్ పాక్టర్హిందీ
1999హం సాథ్ సాధ్ హైసాధనహిందీ
1999హు తు తుపన్నాహిందీFilmfare Award for Best Actress (Critics' Choice)
Nominated–Filmfare Award for Best Actress
1999బీవీ నెంబర్ 1లవ్లీహిందీ
1999తక్షక్సుమన్హిందీ
2000స్నేగితియేACP గాయత్రితమిళ్
2000కవర్ స్టోరీజాస్మిన్మలయాళం
2000హేరా ఫేరీఅనురాథా శివశంకర్ పనికర్హిందీ
2000కండుకొండేన్ కండుకొండేన్సౌమియతమిళ్తెలుగులో ప్రియురాలు పిలిచింది
2000తక్రీబ్రోషిణి చౌబేహిందీ
2000దిల్ పే మత్ లే యార్కామ్యా లాల్హిందీ
2000షికారిసుమన్హిందీ
2000అస్తిత్వఅదితిమరాఠీFilmfare Award for Best Actress (Critics' Choice)
Nominated–Filmfare Award for Best Actress
2000ఘాత్కవిత చౌదరిహిందీ
2001దిల్ నే ఫిర్ యాద్ కియారోష్నీ బాత్రాహిందీ
2001చాందినీ బార్ముంతాజ్ అలీ అంసారీహిందీNational Film Award for Best Actress
Nominated–Filmfare Award for Best Actress
2001ఆందాని ఆఠనా ఖర్చా రుపయామీనాహిందీతెలుగు క్షేమంగా వెళ్ళి లాభంగా రండికి హిందీ పునర్నిర్మాణం
2002మా తుఝే సలాంకెప్టెన్ సోనియా ఖన్నాహిందీ
2002ఫిల్‌హాల్...రేవా సింగ్హిందీ
2002చెన్నకేశవరెడ్డిసీతతెలుగు
2002జిందగీ ఖూబ్‌సూరత్ హైషాలుహిందీ
2002సాధియాసావిత్రీ రావుహిందీఅతిథి పాత్ర
2003అబర్ అరణ్యఅమ్రితబెంగాలీ
2003ఖంజర్: ది నైఫ్శిల్పహిందీ
2003హవాసంజనహిందీ
2003జాల్ ది ట్రాప్నేహా పండిట్హిందీ
2003మక్బూల్నిమ్మిహిందీ
2004మీనాక్షి: ఎ టేల్ ఆఫ్ త్రీ సిటీస్మీనాక్షి/మరియాహిందీ
2005సిల్‌సిలేరెహానాహిందీ
2005భాగ్‌మతిభాగ్‌మతిహిందీ
2005అందరివాడుశాంతితెలుగు
2006షాక్ (సినిమా)Geethaతెలుగు
2006ఫనామాలిని త్యాగిహిందీ
2007సర్‌హద్ పార్పమ్మిహిందీ
2007ది నేమ్‌ సేక్ఆషిమా గంగూలీఆంగ్లము
2007చీనీ కమ్నీనా వర్మహిందీFilmfare Award for Best Actress (Critics' Choice)
2007ఓం శాంతి ఓమ్స్వీయ పాత్రహిందీSpecial appearance in song "Deewangi Deewangi"
2007రాకిల్ పట్టుగాయత్రీ వర్మమలయాళం
2008ఇదీ సంగతిస్వరాజ్య లక్ష్మితెలుగు
2008పాండురంగడుఅమృతతెలుగుNominated—m:en:Filmfare Award for Best Supporting Actress – Telugu
2010తో బాత్ పక్కీరాజేశ్వరిహిందీ
2010ఖుదా కసమ్నీతు సింగ్హిందీ
2011ఉరుమిమలయాళంSpecial appearance in song "Aaranne Aarane"
2012లైఫ్ ఆఫ్ పైగీత పటేల్ఆంగ్లము
2013డేవిడ్ఫ్రెన్నీహిందీ
2013డేవిడ్తమిళ్
2014జై హోగీతా అగ్నిహోత్రిహిందీ
TBAబందా యే బిందాస్ హైహిందీచిత్రీకరణ జరుగుతున్నది
2014యాంగ్రీ బర్డ్ మలయాళంచిత్రీకరణ జరుగుతున్నది
2014హైదర్హిందీచిత్రీకరణ జరుగుతున్నది
2020అల వైకుంఠపురములోటబుతెలుగు
2022భూల్ భులయా 2కనికా శర్మహిందీ
2024 క్రూ
మూసివేయి

పురస్కారాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.