గుజరాత్ నుండి ఒరిస్సా దాకా వెళ్ళే జాతీయ రహదారి From Wikipedia, the free encyclopedia
జాతీయ రహదారి 53, భారతదేశంలోని జాతీయ రహదారి.[1] ఇది గుజరాత్‌లోని హజీరాను, ఒడిశాలోని పరదీప్ పోర్టునూ కలుపుతుంది. ఎన్‌హెచ్-53 గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది.[2] ఇది భారతదేశంలో AH46 నెట్‌వర్క్‌లో భాగం. AH46 పొడవు 1975 కి.మీ. దీనిని సూరత్ - కోల్‌కతా హైవే అని కూడా అంటారు. ఇది మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల గుండా వెళుతుంది.[3]
National Highway 53 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
Part of AH46 | ||||
పొడవు | 1,849 కి.మీ. (1,149 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
పశ్చిమ చివర | హజీరా | |||
తూర్పు చివర | పరదీప్ రేవు | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా | |||
రహదారి వ్యవస్థ | ||||
| ||||
|
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్AI) అమరావతి, అకోలా మధ్య 75 కిలోమీటర్ల (కిమీ) పొడవైన రహదారిని అతి తక్కువ సమయంలో--105 గంటల 33 నిమిషాలలో నిర్మించి గిన్నిస్ ప్రపంచ రికార్డ్ సృష్టించింది. కొత్తగా నిర్మించిన ఈ రహదారి జాతీయ రహదారి 53 లో భాగం.
ప్రాథమిక జాతీయ రహదారి 53 యొక్క మార్గం భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల గుండా వెళుతుంది. [1] [2]
హజీరా, సూరత్, వ్యారా, సోంగాధ్, ఉచ్చల్ - మహారాష్ట్ర సరిహద్దు.
గుజరాత్ సరిహద్దు నవాపూర్ నందుబార్ ధులే, జల్గావ్, మల్కాపూర్, ఖమ్గావ్, అకోలా, అమరావతి, కరంజా(వార్ధా) నాగ్‌పూర్, భండారా, తిరోరా, గోండియా, డియోరీ
మహారాష్ట్ర సరిహద్దు - రాజ్‌నంద్‌గావ్, దుర్గ్, భిలాయ్, రాయ్‌పూర్, అరంగ్, ఘోరారీ, పితోరా, సరైపాలి - ఒడిశా సరిహద్దు.
ఛత్తీస్‌గఢ్ సరిహద్దు - బార్‌ఘర్, సంబల్పూర్, తిలీబానీ, దేవ్‌ఘర్, బార్కోట్, పల్లహార, సమల్ బ్యారేజ్, గొడిభంగా, తాల్చేర్, కామాఖ్యనగర్, భుబన్, సుకింద, దుబ్రి, చంధిఖోల్, హరిదాస్పూర్, సిలిపూర్, భూతాముందాయ్, పరాదీప్ పోర్ట్ .
మహారాష్ట్రలోని ధూలే నుండి ఒడిశాలోని పల్లహరా వరకు ఉన్న జాతీయ రహదారి 53 భాగం, ఆసియా రహదారి 46 లో భాగం. [4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.