గోండియా
From Wikipedia, the free encyclopedia
గోండియా, మహారాష్ట్రలోని ఒక పట్టణం. ఇది గోండియా జిల్లా ముఖ్యపట్టణం.[2] ఈ ప్రాంతంలో వడ్ల మిల్లులు పుష్కలంగా ఉన్నందున గోండియాను రైస్ సిటీ అని కూడా పిలుస్తారు.[3] పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.
గోండియా | |
---|---|
— పట్టణం — | |
Nickname(s): రైస్ సిటీ | |
[[File:|250px|none|alt=|Location of గోండియా]] | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
జిల్లా | గోండియా |
Government | |
- Type | పురపాలక సంఘం |
జనాభా (2011) | |
- మొత్తం | 1,32,821 |
భాషలు | |
- అధికారిక | మరాఠీ[1] |
Time zone | IST (UTC+5:30) |
PIN | 441601,441614 |
Telephone code | +91-07182 |
Vehicle registration | MH-35 |
లింగనిష్పత్తి | 991 per 1000 male. ♂/♀ |
సమీప నగరం | టిరోరా (33km) |
భౌగోళికం
శీతోష్ణస్థితి
శీతోష్ణస్థితి డేటా - Gondia (1981–2010, extremes 1946–2012) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 34.5 (94.1) |
38.5 (101.3) |
42.5 (108.5) |
46.1 (115.0) |
47.5 (117.5) |
47.5 (117.5) |
44.2 (111.6) |
38.4 (101.1) |
39.4 (102.9) |
38.0 (100.4) |
35.7 (96.3) |
35.1 (95.2) |
47.5 (117.5) |
సగటు అధిక °C (°F) | 28.5 (83.3) |
31.2 (88.2) |
35.9 (96.6) |
40.3 (104.5) |
42.3 (108.1) |
37.9 (100.2) |
31.5 (88.7) |
30.6 (87.1) |
32.1 (89.8) |
32.6 (90.7) |
30.9 (87.6) |
28.9 (84.0) |
33.6 (92.5) |
సగటు అల్ప °C (°F) | 13.2 (55.8) |
15.6 (60.1) |
19.9 (67.8) |
24.2 (75.6) |
27.7 (81.9) |
26.8 (80.2) |
24.1 (75.4) |
24.0 (75.2) |
23.6 (74.5) |
21.4 (70.5) |
16.6 (61.9) |
12.6 (54.7) |
20.8 (69.4) |
అత్యల్ప రికార్డు °C (°F) | 6.6 (43.9) |
6.7 (44.1) |
11.4 (52.5) |
11.6 (52.9) |
13.8 (56.8) |
20.4 (68.7) |
19.8 (67.6) |
18.3 (64.9) |
19.2 (66.6) |
13.3 (55.9) |
8.5 (47.3) |
5.0 (41.0) |
5.0 (41.0) |
సగటు వర్షపాతం mm (inches) | 24.3 (0.96) |
22.9 (0.90) |
13.9 (0.55) |
8.8 (0.35) |
10.6 (0.42) |
180.5 (7.11) |
386.1 (15.20) |
374.5 (14.74) |
177.6 (6.99) |
46.5 (1.83) |
13.6 (0.54) |
11.4 (0.45) |
1,270.7 (50.03) |
సగటు వర్షపాతపు రోజులు | 1.4 | 1.7 | 1.4 | 0.9 | 1.0 | 8.6 | 16.2 | 16.8 | 8.9 | 3.2 | 0.6 | 0.6 | 61.4 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) | 48 | 37 | 30 | 25 | 25 | 50 | 73 | 78 | 71 | 57 | 51 | 47 | 50 |
Source 1: India Meteorological Department[4][5] | |||||||||||||
Source 2: Government of Maharashtra[6] |
రవాణా
రోడ్డు
ముంబై-నాగ్‌పూర్-కోల్‌కతా రహదారి, జిల్లా గుండా వెళుతున్న ఏకైక జాతీయ రహదారి, గోండియా, విదర్భ ప్రాంతంలోని నాగ్‌పూర్ నుండి రోడ్డు మార్గంలో సుమారు 170 కి.మీ. దూరంలో ఉంది. నాగ్‌పూర్ నుండి రాష్ట్ర రవాణా బస్సులో గోండియా చేరుకోవడానికి 4 గంటల ప్రయాణం పడుతుంది. గోండియా నుండి జబల్‌పూర్, నాగ్‌పూర్, రాయ్‌పూర్ హైదరాబాద్‌లకు బస్సులు నడుస్తున్నాయి.
రైలు
గోండియా జంక్షన్ రైల్వే స్టేషను మహారాష్ట్రలోని పెద్ద జంక్షన్లలో ఒకటి. ఇది A-గ్రేడ్ స్టేషన్.
ఇది హౌరా-ముంబై మార్గంలో ఉంది. స్టేషన్‌లో ఏడు ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి, వీటిపై త్రాగునీరు, టీ స్టాల్స్, బల్లలు, వెయిటింగ్ షెడ్‌లు ఉన్నాయి. పండ్ల దుకాణం, బుక్‌స్టాల్ కూడా ఉన్నాయి. స్టేషన్‌లో ఎగువ తరగతుల్లో ప్రయాణించే ప్రయాణికుల కోసం ఎయిర్ కండిషన్డ్ వెయిటింగ్ రూమ్‌లు, దిగువ తరగతుల్లో ప్రయాణించే ప్రయాణికుల కోసం మామూలు వెయిటింగ్ హాల్ ఉన్నాయి.
విమానాశ్రయం
గోండియా విమానాశ్రయం, పట్టణం నుండి 12 kమీ. (39,000 అ.) దూరం లోని కమ్తా గ్రామం వద్ద ఉంది. ఈ ఎయిర్‌స్ట్రిప్‌ను 1940లో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ వారు నిర్మించారు.[7] ప్రారంభంలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంటు దీన్ని నిర్వహించేది. 1998 ఆగష్టు [8] నుండి 2005 డిసెంబరు వరకు ప్రభుత్వ యాజమాన్యంలోని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MIDC) అధీనంలో ఉండేది. ఆ తర్వాత దీనిని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నిర్వహిస్తోంది. ఎయిర్‌బస్ A-320, బోయింగ్ 737. తదితర విమానాలు దిగేలా, విమానాశ్రయం రన్‌వేను 2,300 మీటర్లు (7,500 అ.) కు విస్తరించారు.[9]
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.