భారతదేశం లోని పాత జాతీయ రహదారి From Wikipedia, the free encyclopedia
పాత జాతీయ రహదారి 2 లేదా పాత ఎన్‌హెచ్ 2, (ప్రస్తుతం జాతీయ రహదారి 19 ) భారతదేశంలో ఒకప్పటి ప్రధాన జాతీయ రహదారి, ఇది ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను కలుపుతుంది. ఇది భారతదేశంలోని పాత ఎన్‌హెచ్ 91, పాత ఎన్‌హెచ్ 1 తో పాటు చారిత్రక గ్రాండ్ ట్రంక్ రోడ్డులో ప్రధాన భాగం. ఈ రహదారి రాజధాని ఢిల్లీని కోల్‌కతాతో పాటు ఫరీదాబాద్, మధుర, ఆగ్రా, కాన్పూర్, అలహాబాద్, వారణాసి, ధన్ బాద్, అసన్సోల్, దుర్గాపూర్, బర్ధమాన్ వంటి ముఖ్యమైన నగరాలను కలుపుతుంది. [1]
National Highway 2 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
Part of AH1 | ||||
పొడవు | 1,465 కి.మీ. (910 మై.) స్వర్ణ చతుర్భుజి: 1454 కి.మీ. (ఢిల్లీ – కోల్‌కతా) ఉద: 253 కి.మీ. (ఢిల్లీ – ఆగ్రా) తూప: 35 కి.మీ. (బారా – కాన్పూర్) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
పశ్చిమ చివర | న్యూ ఢిల్లీ | |||
జాబితా
| ||||
తూర్పు చివర | కోల్‌కతా వద్ద దంకుని | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | ఢిల్లీ: 12 km, హర్యానా: 74 km, ఉత్తర ప్రదేశ్: 752 km, బీహార్: 202 km, జార్ఖండ్: 190 km, పశ్చిమ బెంగాల్: 235 km. ఇది టర్కీ నుండి జపాను దాకా ఉన్న ఆసియా రహదారుల నెట్వర్కులోని AH1 లో భాగం | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | న్యూ ఢిల్లీ, ఫరీదాబాద్, ఆగ్రా, ఎటావా, ఔరాయా, అక్బర్పూర్, పన్కి, బర్రా , కిద్వాయ్ నగర్, కాన్పూర్, చకేరి, రూమా, మహారాజ్‌పూర్, సర్సౌల్. బింద్కి, ఫతేపూర్ జిల్లా, ఖాగా, కౌశాంబి, అలహాబాద్, వారణాసి, ముఘల్సరాయ్, మోహానియా, బర్హి, పనాగఢ్, పల్సిట్ | |||
రహదారి వ్యవస్థ | ||||
| ||||
|
2010లో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అన్ని జాతీయ రహదారులకు సంఖ్యలను మార్చిన తర్వాత, ఎన్‌హెచ్ 2 ను ఎన్‌హెచ్ 19, ఎన్‌హెచ్ 44 గా మార్చారు. పాత ఎన్‌హెచ్ 2 సంఖ్య ఇపుడు ఉనికిలో లేదు. ఢిల్లీ, ఆగ్రా భాగం ఎన్‌హెచ్ 44లో భాగం గాను, ఆగ్రా కోల్‌కతా భాగం ఎన్‌హెచ్ 19 లో భాగం గానూ అయ్యాయి. [2]
ఇది భారతదేశంలోని జాతీయ రహదారి నెట్‌వర్క్‌లో భాగంగా ఉంది. అధికారికంగా 1,465 కి.మీ. పైగా పొడవు ఉంది. ఢిల్లీ (12), హర్యానా (74), ఉత్తరప్రదేశ్ (752), బీహార్ (202), జార్ఖండ్ (190), పశ్చిమ బెంగాల్ (235) రాష్ట్రాల గుండా వెళ్తుంది.
ఎన్‌హెచ్ 2 ఫరీదాబాద్‌లోని ఢిల్లీ ఫరీదాబాద్ స్కైవే వద్ద బదర్పూర్ సరిహద్దు ద్వారా హర్యానాలోకి ప్రవేశిస్తుంది. ఇది ఢిల్లీ మెట్రో లోని ఫరీదాబాద్ కారిడార్‌కు సమాంతరంగా నడుస్తుంది. ఉత్తర ప్రదేశ్‌లోకి ప్రవేశించే ముందు పాల్వాల్ గుండా వెళ్తుంది.
పశ్చిమ-తూర్పు అమరిక: జాతీయ రహదారి 2 మథుర జిల్లాలో హర్యానా నుండి ఉత్తర ప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. దానిలో కొంత భాగాన్ని మధుర రోడ్ అని పిలుస్తారు. మధుర ముందు ఇది హర్యానాలోని పాల్వాల్, ఫరీదాబాద్ నగరాల గుండా వెళ్తుంది. మధుర తర్వాత 200 కి.మీ. (120 మై.) దూరం లోని ఆగ్రా చేరుకుంటుంది. ఆగ్రాలో ఇది సుమారు 16 కి.మీ. (9.9 మై.) కవర్ చేస్తుంది . ఆగ్రాను తర్వాత అది ఫిరోజాబాద్ జిల్లా లోకి ప్రవేశిస్తుంది. తరువాత ఎటావాలో 15 కిమీ బైపాస్ గుండా వెళ్తుంది. ఇటావా నుండి బయలుదేరిన తర్వాత ఇది కాన్పూర్ నగరంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ 23 కి.మీ. (14 మై.) పొడవున్న 12 లేన్ల కాన్పూర్ ఓవర్ బ్రిడ్జి మీదుగా వెళ్తుంది. ఇది ఆసియాలో అతిపెద్ద ఓవర్ బ్రిడ్జిలలో ఒకటి. [3] కాన్పూర్‌లో ఇది దాదాపు 60 కి.మీ. (37 మై.) పారిశ్రామిక ప్రాంతాలను ( అక్బర్పూర్ - మహారాజ్‌పూర్ ) గుండా వెళ్తుంది. ఆపై అది ఫతేపూర్ జిల్లాకు చేరుకుని, ఫతేపూర్‌లో 16 కి.మీ. (9.9 మై.) కవర్ చేస్తుంది. ఆపై కౌశాంబి మీదుగా అలహాబాద్ చేరుకుని నగరంలో 16 కి.మీ. (9.9 మై.) ప్రయాణించి, వారణాసి, మొఘల్సరాయ్ లను చేరుతుంది. ఆ విధంగా ఉత్తర ప్రదేశ్ నుండి బయలుదేరుతుంది. ఈ జాతీయ రహదారి ఉత్తర భారతదేశంలో ప్రజా రవాణాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఆగ్రా, కాన్పూర్, ఫతేపూర్, అలహాబాద్లలో నిర్మించిన ఓవర్‌బ్రిడ్జిలు నగర ట్రాఫిక్ సమస్యలను తగ్గించాయి. అలహాబాద్ బైపాస్ ఎక్స్‌ప్రెస్ వే దేశంలోనే అతి పొడవైన బైపాస్ సెక్షన్.
పశ్చిమ-తూర్పు అమరిక: బీహార్‌లో ఎన్‌హెచ్ 2 ఉత్తరప్రదేశ్‌తో సరిహద్దుగా ఉన్న కర్మనాస నదిపై వంతెన నుండి ప్రారంభమై, రాష్ట్రంలో 202 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. ఆపై దోభి, చౌపరన్ మధ్య, బారచట్టి చుట్టూ జార్ఖండ్‌లోకి ప్రవేశిస్తుంది. మధ్యలో ఇది కైమూర్ జిల్లా గుండా వెళుతుంది. మొహానియా అందులో మొదటి ప్రధాన నగరం. అలాగే ఎన్‌హెచ్ 30 ని కలిసి పాట్నా నగరానికి దారి తీస్తుంది. తదుపరి ససారం, డెహ్రీ ల గుండా వెళ్తుయ్ంది. డెహ్రీ వద్ద సోన్ నది మీద జవహర్ సేతు మీదుగా వెళ్తుంది. దోభి వద్ద ఇది గయా, పాట్నా ( ఎన్‌హెచ్ 83 ) రహదారిని కలుస్తుంది.
తూర్పు-పశ్చిమ అమరిక: జార్ఖండ్‌లో ఎన్‌హెచ్ 2 190 కిలోమీటర్లు (120 మై.) నడుస్తుంది. ఎన్‌హెచ్ 2 నిర్సా వద్ద పాత గ్రాండ్ ట్రంక్ రోడ్‌కి తిరిగి వస్తుంది. గోవింద్పూర్ వద్ద ఎన్‌హెచ్ 2 ధన్‌బాద్, జంషెడ్పూర్లకు దారితీసే ఎన్‌హెచ్ 32ని కలుస్తుంది. డుమ్రి వద్ద, ఉత్తరాన ఉన్న రహదారి మధుబన్, గిరిదిహ్‌కు దారి తీస్తుంది. ఎన్‌హెచ్ 100 ఎన్‌హెచ్2ని కలిసే బాగోదర్ తదుపరి ముఖ్యమైన జంక్షన్. హజారీబాగ్ రోడ్ స్టేషన్‌కు వెళ్లే రహదారి ఉంది. బర్హి వద్ద ఎన్‌హెచ్31, ఎన్‌హెచ్33 లతో క్రాసింగ్ ఉంది. ఎన్‌హెచ్ 2 జార్ఖండ్ భాగంలో ఎక్కువ భాగం కోడెర్మా పీఠభూమిపై ఎగుడు దుగుడూ ప్రాంతం గుండా వెళుతుంది.
(తూర్పు-పడమర అమరిక) పశ్చిమ బెంగాల్లో ఎన్‌హెచ్ 2 కోల్‌కతా శివార్లలోని దంకుని వద్ద ప్రారంభమవుతుంది. [4] 6 కిలోమీటర్లు (3.7 మై.) నివేదిత వంతెన తరువాత, బెల్గోరియా ఎక్స్‌ప్రెస్‌వే దీనిని బరాక్‌పూర్ ట్రంక్ రోడ్, జెస్సోర్ రోడ్/ ఎన్‌హెచ్ 34 లకు కలుపుతుంది. ప్రత్యామ్నాయంగా, కోల్‌కతాకు వెళ్లే ట్రాఫిక్ దంకుని వద్ద ఎన్‌హెచ్ 6 పైకి మళ్ళి, కోల్కతాలోకి ప్రవేశించడానికి కోనా ఎక్స్‌ప్రెస్‌వే/ఎన్‌హెచ్ 117, విద్యాసాగర్ సేతును అనుసరిస్తుంది.
ఎన్‌హెచ్ 2 లోని నాలుగు-వరుసల పశ్చిమ బెంగాల్ భాగం బరాకర్ నుండి దంకుని వరకు విస్తరించి ఉంది. 65 కిలోమీటర్లు (40 మై.) దంకుని- పల్సిట్ భాగాన్ని దుర్గాపూర్ ఎక్స్‌ప్రెస్‌వే అని కూడా అంటారు. పల్సిట్ నుండి అసన్సోల్ శివార్ల వరకు ఇది శక్తిగఢ్, బర్ధమాన్, రాణిగంజ్ వంటి పట్టణాలను దాటవేస్తూ పాత గ్రాండ్ ట్రంక్ రోడ్డును అనుసరిస్తుంది. దుర్గాపూర్, ఆండాల్ పట్టణాల గుండా వెళుతుంది. పల్సిట్-పనాగఢ్ భాగం 64 కిలోమీటర్లు (40 మై.), పనాగర్-రాణిగంజ్ భాగం 42 కిలోమీటర్లు (26 మై.) . పనాగఢ్ డార్జిలింగ్ వద్ద మలుపు వద్ద ఎన్‌హెచ్ 2 పనాగర్-మోర్గ్రామ్ హైవేని కలుస్తుంది. అసన్సోల్ శివార్లలో ఎన్‌హెచ్ 2, గ్రాండ్ ట్రంక్ రోడ్డు నుండి విడిపోతుంది. గ్రాండ్ ట్రంక్ రోడ్డు పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్, నీమత్పూర్, కుల్టీ, బరాకర్, జార్ఖండ్‌లోని చిర్కుందా, కుమార్ధుబిలోని రద్దీ ప్రాంతాల గుండా వెళుతుంది. ఒక బైపాస్ అసన్సోల్ శివార్లను నిర్సాతో కలుపుతుంది. ఇక్కడ ఎన్‌హెచ్ 2 తిరిగి గ్రాండ్ ట్రంక్ రోడ్లో కలుస్తుంది. రాణిగంజ్-బరాకర్ మార్గం 33 కిలోమీటర్లు (21 మై.) . విస్తరించిన 120 కిలోమీటర్లు (75 మై.) పనాగర్- ధన్‌బాద్ మార్గాన్ని 2001లో తెరిచారు.[5]
130 కిలోమీటర్లు (81 మై.) పనాగర్-దంకుని విభాగంలో పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం పొడవు టోల్ జోన్‌గా ఉంటుంది. అసన్సోల్, పల్సిట్ దంకుని - ఈ మూడు ప్రదేశాలలో టోల్ ప్లాజాలు ఉన్నాయి. అసన్సోల్ టోల్ ప్లాజా ఇప్పుడు మూసివేయబడింది. దుర్గాపూర్ సమీపంలోని బాన్స్కోపా వద్ద టోల్ ప్లాజా కూడా ఉంది. జార్ఖండ్‌లోని మైథాన్ మోర్ వద్ద బరాకర్ నదిపై వంతెనను దాటిన కొద్ది కిలోమీటర్ల దూరంలో కొత్త టోల్ బూత్ ఏర్పాటు చేసారు. ఎన్హెచ్ఏఐ గణాంకాల ప్రకారం, 2008లో ప్రతిరోజూ దాదాపు 8,50,000 నుండి 9,00,000 వాహనాలు బరాకర్, దంకునిల మధ్య తిరిగాయి. స్థూల టోల్ వసూళ్లు రోజుకు రూ.25,00,000. ఎన్‌హెచ్ 2 వెంట పెద్ద సంఖ్యలో బస్సులు తిరుగుతాయి. ఒక్క దుర్గాపూర్ కోల్‌కతాల మధ్యనే సౌత్ బెంగాల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ 47 బస్సులను నడుపుతోంది. 2008లో సౌత్ బెంగాల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బుర్ద్వాన్, కోల్‌కతాల మధ్య బస్సు సర్వీసులను ప్రారంభించింది. 2011లో బుర్ద్వాన్, కోల్‌కతాల మధ్య రాయల్ ఎక్స్‌ప్రెస్ ఏసీ బస్సు సర్వీసును ప్రారంభించారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.