చెన్నై యెళుంబూరు (గతంలో మద్రాస్ ఎగ్మోర్ /చెన్నై ఎగ్మోర్ గా పిలిచేవారు) దక్షిణ భారతదేశం లోని చెన్నై లో యెళుంబూరు(ఎగ్మోర్) అను ప్రాంతం లో కల ఒక రైల్వే స్టేషను ,
ఈ స్టేషన్ నుండి దక్షిణ, మధ్య తమిళనాడు, కేరళ ప్రాంతములకుమరియు కొన్ని ఉత్తరాది ప్రాంతములకు రైళ్ళు కలవు. చెన్నై నగరంలోని రెండు ప్రధాన రైల్వే టెర్మినల్స్ లో ఇది ఒకటీ కాగా మరొకటి చెన్నై సెంట్రల్. ఈ స్టేషనును తమిళం లో చెన్నై యెళుంబూర్ గా వ్యవహరిస్తారు . దేశంలో ఉత్తర తూర్పు (ఈశాన్య), తూర్పు ప్రాంతాలకు సంఖ్య పరంగా చెన్నై సెంట్రల్ నుండి వాటి కంటే తక్కువ అయినప్పటికీ, కొన్ని రైళ్లు కూడా ఇక్కడ నుండి వెళ్ళడము, బయలుదేరడము జరుగుతుంది. ఇక్కడ చెన్నై బీచ్ - తాంబరం సబర్బన్ రైల్వే లైన్ కూడా ఈ స్టేషన్ ద్వారా పోతుంది.
పూలనీ ఆండీ నుండి కొనుగోలు చేసిన భూమిని స్పష్టంగా ఒక స్టేషన్‌గా 1906 నుండి నిర్మించారు.[1] భవనం గోపురాలు, కారిడార్లు గంభీరమైన గోథిక్ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ఇది చెన్నై నగరానికి ప్రముఖ ప్రదేశాలలో ఒకటిగా ఉంది. ఈ రైల్వే స్టేషన్‌కు ఇటీవల తెరిచిన ఉత్తర ద్వారం చెన్నై నగరంలో ఆర్టీరియల్ పూనమలీ హై రోడ్ మీద ఉంది.
స్టేషన్ చరిత్ర, నిజానికి ఇది ఒక కోటగా ఉంది. ఎగ్మోర్ రెడో తన మాటలలో, సంత్హోమ్ యొక్క ఒక భాగమైన లీడ్స్ బురుజులా (లీథ్ కోట), పోలి ఉన్నది, అని చెప్పారు. ఇది ఒకప్పుడు బ్రిటిష్ మందుగుండు నిల్వ చేయడానికి ఉపయోగించిన. దాని స్థానంలో నుండి స్టేషన్ వచ్చినదని చెబుతారు.[2]
చెన్నై యెళుంబూరు నుండి ప్రారంభమగు రైళ్లు
చెన్నై యెళుంబూరు - తిరునల్వేలి-నెల్లై ఎక్స్‌ప్రెస్ - సూపర్‌ఫాస్ట్ - రాత్రి రైలు - వయా తిరుచిరాపల్లి
చెన్నై యెళుంబూరు - మధురై -వైగై ఎక్స్‌ప్రెస్- సూపర్‌ఫాస్ట్ - పగలు రైలు - వయా తిరుచిరాపల్లి
చెన్నై యెళుంబూరు - మధురై -పాండ్యన్ ఎక్స్‌ప్రెస్- సూపర్‌ఫాస్ట్ - రాత్రి రైలు - వయా తిరుచిరాపల్లి
చెన్నై యెళుంబూరు - కన్యాకుమారి-కన్యాకుమారిఎక్స్ప్రెస్ - సూపర్‌ఫాస్ట్ - రాత్రి రైలు - వయా తిరుచిరాపల్లి, మధురై
చెన్నై యెళుంబూరు - తూత్తుక్కుడి -పెరల్ సిటీ ఎక్స్‌ప్రెస్-సూపర్‌ఫాస్ట్ - రాత్రి రైలు - వయా తిరుచిరాపల్లి, మధురై
Pain, Paromita (27 Jun 2008). "Heritage tracks". Business Line. Chennai: The Hindu. Archived from the original on 16 ఏప్రిల్ 2014. Retrieved 8 Nov 2012.