చెక్ గణతంత్రం
From Wikipedia, the free encyclopedia
చెక్ గణతంత్రం (Czech: Česká republika [ˈtʃɛskaː ˈrɛpublɪka] ( listen) చెస్క రెపూబ్లిక),[3] చెహియా అని కూడా అంటారు.[4] ఇది మధ్య ఐరోపా లోని ఒక భూపరివేష్టిత దేశం. దీని ఈశాన్య సరిహద్దులో పోలండ్, పశ్చిమ సరిహద్దులో జర్మనీ, దక్షిణ సరిహద్దులో ఆస్ట్రియా, తూర్పు సరిహద్దులో స్లొవేకియా దేశాలు సరిహద్దుగా ఉన్నాయి.[5] దీని రాజధాని, పెద్దనగరంగా ప్రాగ్ ఉంది. దేశవైశాల్యం 78,866 చ.కి.మీ. దేశంలో ఖండాంతర వాతావరణం నెలకొని ఉంటుంది. చెక్ గణతంత్రంలో ప్రాచీన బొహీమియ, మొరెవియ భూభాగాలు, సైలీసియ కొంత భూభాగం ఉంది.[6] ఇది యూనిటరీ పార్లమెంటు రిపబ్లిక్కును కలిగి ఉంటుంది.దేశం మొత్తం జనసంఖ్య 10.6 మిలియన్లు. రాజధాని ప్రాగ్ నగరం జనసంఖ్య సుమారు 12 లక్షలు.[7]
Česká republika చెక్ గణతంత్రం |
||||||
---|---|---|---|---|---|---|
నినాదం ["Pravda vítězí"] Error: {{Lang}}: text has italic markup (help) (Czech) "Truth prevails" |
||||||
జాతీయగీతం |
||||||
Location of చెక్ గణతంత్రం (dark green) – on the European continent (light green & dark grey) |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | Prague 50°05′N 14°28′E | |||||
అధికార భాషలు | Czech | |||||
ప్రజానామము | చెక్ | |||||
ప్రభుత్వం | Parliamentary republic | |||||
- | President | Václav Klaus | ||||
- | Prime Minister | Petr Nečas | ||||
స్వాతంత్ర్యం | (ఏర్పాటు 870) | |||||
- | from Austria–Hungary | అక్టోబరు 28, 1918 | ||||
- | from Czechoslovakia | జనవరి 1, 1993 | ||||
Accession to the European Union |
మే 1, 2004 | |||||
- | జలాలు (%) | 2 | ||||
జనాభా | ||||||
- | 20081 అంచనా | 10,467,542 (78వది) | ||||
- | 2001 జన గణన | 10,230,060 | ||||
జీడీపీ (PPP) | 2008 అంచనా | |||||
- | మొత్తం | $265.880 billion[1] (39వది²) | ||||
- | తలసరి | $25,754[1] (33వది) | ||||
జీడీపీ (nominal) | 2008 అంచనా | |||||
- | మొత్తం | $217.215 బిలియన్లు[1] (36వది) | ||||
- | తలసరి | $21,040[1] (36వది) | ||||
జినీ? (1996) | 25.4 (low) (5వది) | |||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2006) | 0.897 (high) (35వది) | |||||
కరెన్సీ | చెక్ కొరూన (CZK ) |
|||||
కాలాంశం | CET (UTC+1) | |||||
- | వేసవి (DST) | CEST (UTC+2) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .cz³ | |||||
కాలింగ్ కోడ్ | ++4204 | |||||
1 | డిసెంబరు 31, 2008 (See Population changes). | |||||
2 | Rank based on 2005 IMF data. | |||||
3 | Also .eu, shared with other European Union member states. | |||||
4 | Shared code 42 with స్లొవేకియా until 1997. |
9 వ శతాబ్దం చివరలో గ్రేట్ మోరావియన్ సామ్రాజ్యంలో డచీ ఆఫ్ బోహెమియాగా చెక్ రాజ్యం ఏర్పడింది. 907 లో ఎంపైర్ పతనం తరువాత అధికార కేంద్రాన్ని మొరావియా నుండి పోహ్మిస్లిడ్ రాజవంశం బహేమియాకు బదిలీ చేశారు. 1002 లో డచీ పవిత్ర రోమన్ సామ్రాజ్యం భాగంగా ఉంది [8][9] 1198 లో బోహెమియా రాజ్యంగా మారింది. 14 వ శతాబ్దంలో పెద్దభూభాగ స్థాయికి చేరి బోహెమియా రాజు పాలనలో ఉంది.బొహీమియా రాకుమారుడు పవిత్ర రోమన్ చక్రవర్తి ఎన్నికలో ఓటు వేశాడు. 14 - 17 వ శతాబ్దాల మధ్య కాలంలో ప్రేగ్ ఇంపీరియల్ సీటు హోదాను కలిగి ఉంది. ప్రొటెస్టంట్ బోహేమియన్ సంస్కరణలచే నడుపబడిన 15 వ శతాబ్దపు హుస్సైట్ యుద్ధాల్లో పాల్గొని రాజ్యం ఆర్థిక ఆంక్షలు ఎదుర్కొంది. రోమన్ కాథలిక్ చర్చి నాయకులతో ఐదు వరుస క్రూసేడ్లను ఓడించింది.
1526 లో మోహాక్స్ యుద్ధం తరువాత మొత్తం క్రౌన్ ఆఫ్ బోహెమియా క్రమంగా హహబ్స్బర్గ్ రాచరికంలో ఆస్ట్రియా ఆర్చ్యుచి, హంగేరి రాజ్యంతో కలిసిపోయింది. కాథలిక్ హాబ్స్బర్గలకు వ్యతిరేకంగా ప్రొటెస్టంట్ బోహేమియన్ తిరుగుబాటు (1618-20) ముప్పై సంవత్సరాల యుద్ధానికి దారితీసింది. వైట్ మౌంటైన్ యుద్ధం తరువాత హాబ్స్బర్గర్లు తమ పాలనను ఏకీకృతం చేశారు. ప్రొటెస్టెంటిజాన్ని నిర్మూలించి రోమన్ క్యాథోలిజాన్ని పునఃస్థాపించారు. క్రమంగా జర్మనీకరణ విధానాన్ని అనుసరించారు. 1806 లో పవిత్ర రోమన్ సామ్రాజ్యం రద్దుతో బోహేమియన్ సామ్రాజ్యం ఆస్ట్రియా సామ్రాజ్యంలో భాగం అయ్యింది. చెక్ భాష ఈప్రాంతం అంతటా విస్తరించిన రోమనిటిక్ జాతీయవాద ఫలితంగా ఒక పునరుద్ధరణను చవిచూసింది. 19 వ శతాబ్దంలో చెక్ భూములు రాజరిక పారిశ్రామిక వేదికగా మారాయి. తదనంతరం చెకొస్లోవేకియా రిపబ్లిక్ ప్రధాన కేంద్రంగా ఉన్నాయి. చెక్ గణతంత్రం 1918 లో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యం కూలిపోయిన తరువాత స్థాపించబడింది.
చెకోస్లోవేకియా అంతర్యుద్ధ కాలంలో యూరప్ లోని ఈ ప్రాంతంలో మాత్రమే ప్రజాస్వామ్యం ఉంది.[10] అయినప్పటికీ చెకొస్లోవేకియా చెక్ భూభాగాన్ని రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఆక్రమించింది. 1945 లో సోవియట్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ సైన్యాలు చెక్ భూభాగానికి విముక్తిని కలిగించాయి.యుద్ధం తరువాత జర్మనీ మాట్లాడే ప్రజలలో చాలామంది యుద్ధాన్ని బహిష్కరించిన తరువాత జర్మనీ ప్రజలు ఈప్రాంతం వదిలి పోయారు. చెకోస్లోవేకియా కమ్యూనిస్ట్ పార్టీ 1946 ఎన్నికలలో గెలిచింది. 1948 లో జరిగిన తిరుగుబాటు తరువాత చెకొస్లోవేకియా సోవియట్ ప్రభావంతో ఏకపార్టీ కమ్యూనిస్టు రాజ్యంగా మారింది. 1968 లో పాలనతో అసంతృప్తి అధికరించింది. ఇది సాగించిన సంస్కరణ ఉద్యమం " ప్రాగ్ స్ప్రింగ్ " అని పిలువబడింది. ఇది సోవియట్ నేతృత్వంలోని దాడితో ముగిసింది. కమ్యూనిస్ట్ పాలన కూలిపోయిన తరువాత మార్కెట్ ఆర్థిక వ్యవస్థ తిరిగి ప్రవేశపెట్టబడింది. 1989 వెల్వెట్ విప్లవం వరకు చెకోస్లోవేకియా ఆక్రమణకు గురైంది. 1993 జనవరి 1 న చెకోస్లోవేకియా శాంతియుతంగా రద్దు చేయబడింది. దాని స్వతంత్ర రాజ్యాలు చెక్ గణతంత్రం, స్లొవేకియా స్వతంత్ర రాజ్యాలుగా మారాయి.
1999 లో చెక్ గణతంత్రం నాటోలో చేరింది, 2004 లో యూరోపియన్ యూనియన్ (ఇ.యు.); ఇది ఐక్యరాజ్యసమితి, ఒ.ఇ.సి.డి, ఒ.ఎస్.సి.ఇ, కౌన్సిల్ ఆఫ్ యూరప్ లలో సభ్యదేశంగా ఉంది.ఇది ఒక అభివృద్ధి చెందిన దేశం.[11] అభివృద్ధి చెందిన ఆర్థికవ్యవస్థను కలిగి ఉంది.[12] అధిక ఆదాయం కలిగిన ఆర్థికవ్యవస్థ,[13] ఉన్నత జీవన ప్రమాణాలు కలిగిన అభివృద్ధి చెందిన దేశంగా ఉంది.[14][15][16] " యునైటెడ్ నేషన్స్ డెవెలెప్మెంటు ప్రోగ్రాం " వర్గీకరణలో దేశం మానవ అభివృద్ధిలో 14 వ స్థానంలో ఉంది.[17] చెక్ గణతంత్రం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, ఉచిత ట్యూషన్ అందించే విశ్వవిద్యాలయ విద్యతో కూడిన సంక్షేమ స్థితిలో ఉంది. అది కూడా 6 వ అత్యంత ప్రశాంతమైన దేశంగా గుర్తించబడుతుంది. అదేసమయంలో బలమైన ప్రజాస్వామ్య పరిపాలన పనితీరును సాధించింది.