![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/99/Flag_of_Guyana.svg/langte-640px-Flag_of_Guyana.svg.png&w=640&q=50)
గయానా
From Wikipedia, the free encyclopedia
గయానా (ఆంగ్లం : Guyana) (pronounced /ɡaɪˈɑːnə/ or /ɡaɪˈænə/), [2][3] అధికారికనామం కోఆపరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ గయానా, [4] పాతపేరు బ్రిటిష్ గయానా. దక్షిణ అమెరికా లోని ఉత్తర తీరంలో గల దేశం.కరీబియ దేశాలు, కరీబియన్ సంఘంతో ఉన్న బలమైన రాజకీయ, సాంస్కృతిక, చారిత్రక సంబంధాల కారణంగా గయానాను కరీబియన్ దేశాలతో కూడా చేర్చారు. దేశం సరిహద్దులలో తూర్పున సురినామ్, దక్షిణం, ఆగ్నేయాన బ్రెజిల్, పశ్చిమాన వెనుజులా, ఉత్తరాన అట్లాంటిక్ మహాసముద్రం ఉన్నాయి.దేశం విస్తీర్ణం 2,15,000 చ.కి.మీ., జనాభా దాదాపు పదిలక్షలు. రాజధాని జార్జిటౌన్. దక్షిణ అమెరికాలోని అతి చిన్న దేశాలలో గయానా 4వ స్థానంలో ఉంది.మొదటి మూడు స్థానాలలో సురినామె, ఉరుగ్వే, " ఫ్రెంచి గయానా " ఉన్నాయి.
Co-operative Republic of Guyana |
||||||
---|---|---|---|---|---|---|
|
||||||
నినాదం "One people, one nation, one destiny" |
||||||
జాతీయగీతం |
||||||
![]() |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | జార్జిటౌన్ 6°46′N 58°10′W | |||||
అధికార భాషలు | ఆంగ్లం, అరవాక్, హిందీ | |||||
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు | en:Guyanese Creole, పోర్చుగీస్, స్పానిష్ భాష , en:Akawaio, Macushi, Wai-Wai, అరవాక్, భోజ్పురి | |||||
జాతులు | 43.5% East Indian, 30% నల్లవారు, 17% Mixed, 9% అమెరిండియన్ | |||||
ప్రజానామము | గయనీస్ | |||||
ప్రభుత్వం | Semi-presidential republic | |||||
- | President | David Granger | ||||
- | Prime Minister | Moses Nagamootoo | ||||
స్వతంత్రం | ||||||
- | from the యునైటెడ్ కింగ్డం | 26 మే 1966 | ||||
- | జలాలు (%) | 8.4 | ||||
జనాభా | ||||||
- | March12,2009 అంచనా | 1,182,2241 (154వది) | ||||
- | 2005 జన గణన | 769,095 | ||||
జీడీపీ (PPP) | 2008 అంచనా | |||||
- | మొత్తం | $3.682 బిలియన్లు[1] | ||||
- | తలసరి | $4,035[1] | ||||
జీడీపీ (nominal) | 2008 అంచనా | |||||
- | మొత్తం | $1.130 బిలియన్లు[1] | ||||
- | తలసరి | $1,479[1] | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) | ![]() |
|||||
కరెన్సీ | Guyanese dollar (GYD ) |
|||||
కాలాంశం | (UTC-4) | |||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .gy | |||||
కాలింగ్ కోడ్ | +592 | |||||
1 | Around one-third of the population (230,000) live in the capital, Georgetown. |
గయానాలో అమెజాన్ నది ఉత్తరభూములు ఉన్నాయి. తూర్పున ఒరినొకొ నది (లాండ్ ఆఫ్ మెనీ వాటర్స్) ప్రవహిస్తుంది.పలు స్థానికజాతి ప్రజలకు ఆవాసమైన గయానా 18వ శతాబ్దంలో బ్రిటిష్ ఆధీనంలోకి రాక ముందు ఇక్కడ డచ్ సెటిల్మెంట్లు ఉన్నాయి.ఇది బ్రిటిష్ గయానాగా పాలించబడింది.1950 వరకూ గయానా ఆర్థికరగంలో తోటల ద్వారా లభించిన ఆదాయం ఆధిక్యత చేసింది.1966లో గయానాకు స్వతంత్రం లభించింది.1970లో అధికారికంగా కామంవెల్త్ దేశాలలోని రిపబ్లిక్ చేయబడింది.బ్రిటిష్ వారసత్వ పరిపాలన ప్రభావం దేశ రాజకీయ, పాలనావిధానం మీద అధికంగా ఉంది.దేశప్రజలలో ఇండియన్లు, ఆఫ్రికన్లు, అమెరిండియన్లు, పలు ఇతర జాతీయులు ఉన్నారు.
దక్షిణ అమెరికా దేశాలలో గయానాలో మాత్రమే ఆగ్లం అధికారభాషగా ఉంది.అత్యధికమైన ప్రజలకు గయానీస్ క్రియోల్ వాడుకభాషగా ఉంది.ఆంగ్లం ఆధారిత క్రియోల్ భాష ప్రథమ భాషగా ఉంది.ఆంగ్లోఫోన్ కరీబియన్ దేశాలలో ఒకటి. వెస్టిండీస్ ద్వీపాలలో లేని ద్వీపంకాని కొన్ని కరీబియన్ దేశాలలో గయానా ఒకటి.గయానా సభ్యదేశంగా ఉన్న కారికోం (చి.ఎ.ఆర్.ఐ.సి.ఒ.ఎం) ప్రధానకార్యాలయం గయానా రాజధాని నగరం జార్జిటౌన్లో ఉంది. 2008లో గయానా " యూనియన్ ఆఫ్ సౌత్ అమెరికన్ నేషంస్ " ఫండింగ్ మెంబర్గా ఉంది.