![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/9c/Orvakal_Rock_Formations.jpg/640px-Orvakal_Rock_Formations.jpg&w=640&q=50)
ఓర్వకల్లు రాతి ఉద్యానవనం
From Wikipedia, the free encyclopedia
ఓర్వకల్లు రాతి ఉద్యానవనం కర్నూలు జిల్లా, ఓర్వకల్లు గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి సహజంగా ఏర్పడిన రాతి నిర్మాణాలు.[1][2] ఓర్వకల్లు జిల్లా కేంద్రమయిన కర్నూలు నుండి సుమారు 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కర్నూలు నుండి నంద్యాల వెళ్ళే జాతీయ రహదారి 18 కి చుట్టుపక్కలా వీటిని చూడవచ్చు. ఇక్కడ గాజు పరిశ్రమలో విరివిగా ఉపయోగించే క్వార్ట్జ్, సిలికా లాంటి ముడి పదార్థాలతో సహజ శిలలు ఏర్పడ్డాయి. ఇక్కడ సినిమాలు కూడా చిత్రీకరిస్తుంటారు.[3]
త్వరిత వాస్తవాలు ఓర్వకల్లు రాతి ఉద్యానవనం, సమీప పట్టణం ...
ఓర్వకల్లు రాతి ఉద్యానవనం | |
---|---|
![]() | |
సమీప పట్టణం | కర్నూలు, ఆంధ్రప్రదేశ్ |
అక్షాంశరేఖాంశాలు | 15°41′30″N 78°09′09″E |
నవీకరణ | N.K.G |
తెరుచు సమయం | 24 గంటలు |
మూసివేయి