From Wikipedia, the free encyclopedia
ఇది ఆంగ్ల పదం "గ్లాస్" నుండి వచ్చింది. గ్లాస్ కి రూడ్యర్థం గాజు.
గాజు (Glass) ఒకరకమైన పారదర్శక లేదా పారభాసిక పదార్థము. అది అస్ఫాటిక పదార్థము. ఇది ఘనరూపంలో కన్పిస్తున్నా నిజమైన ఘన పదార్థం కాదు. దీన్ని శీతలీకరణం చెందిన ద్రవముగా గుర్తించవచ్చు. గాజు ద్రవాన్ని త్వరగా చల్లబర్చడం వల్ల దాని స్నిగ్థత అధికమై ఘనరూపాన్ని సంతరించుకుంటుంది. అందుచేత గాజును అతి శీతలీకరణం చెందిన ద్రవము అంటారు.
గాజుకి అనేక రంగాలలో (గృహోపకరణాలలో, పారిశ్రామిక రంగంలో, ప్రయోగశాలలో) అనేక ఉపయోగాలు ఉన్నాయి. గాజుని అనేక పద్ధతులలో తయారు చెయ్యవచ్చు. ఆదిలో గాజు తయారీకి ముడి పదార్థం ఇసకలో అత్యధిక శాతంగా ఉండే సిలికా (అనగా సిలికాన్ డయాక్సైడ్ లేదా Si2 కాని quartz అనే పదార్థం కాని). మనం సాధారణంగా "గాజు" అన్నప్పుడు ఈ సిలికా గాజు గురించే అని గమనించాలి. సీసాల వంటి సామానులలో వాడే గాజులో (దీనినే సోడా-సున్నం గాజు అంటారు) సింహభాగం సిలికాన్ డయాక్సైడ్ (75% Si2) తో పాటు సోడియం ఆక్సైడ్ (Na2O), సోడియం కార్బనేట్ (Na2CO3), కేల్సియం ఆక్సైడ్ (CaO) లేదా సున్నం (lime), తదితర చిల్లర ఘటక ద్రవ్యాలు వాడతారు.
గాజు తయారీ మూడు దశలలో జరుగుతుంది.
గాజు తయారీకి వాడే ముడి పదార్థాలు: సోడా యాష్ (Na2CO3), సున్నపురాయి ( CaCO3) ఇసుక (SiO2) ఈ పదార్థాలను సరియైన పాళ్ళలో కలిపి, మరమిల్లులో వేసి సన్నని పొడిగా మారేవరకు దంచుతారు. ఈ మిశ్రమపు పొడిని బాచ్ అంటారు. దీనికి కొన్ని పగిలిన గాజుముక్కలను (కల్లెట్) కలుపుతారు. కల్లెట్ గాజు యొక్క ద్రవీభవన స్థానాన్ని తగ్గిస్తుంది. ఈ మొత్తం మిశ్రమాన్ని 10000C వరకు కొలిమిలో వేడిచేస్తారు. ఈ కింది రసాయన చర్యలు జరిగి "గాజు ద్రవం" యేర్పడుతుంది.
Na2CO3 + CaCO3 + 4SiO2 → Na2SiO34SiO2 + CO2
"గాజు గాల్" అనే పేరుతో గాజు పైన తేలియాడే మలినాలను తొలగిస్తారు. ఈ స్థితిలో కొన్ని లోహాల ద్రావణాలను కలిపి రంగు గాజును రూపొందిస్తారు.
పై దశలో ఏర్పడిన ద్రవ రూపంలో గల గాజును కొంత మేరకు చల్లబరుస్తారు. ఇలా చల్లబరచిన ద్రవగాజును మూసలలో వేసి అవసరమైన ఆకృతిని పొందుపరుస్తారు.
ద్రవగాజును త్వరగా చల్లబరిస్తే అది పెళుసుగా తయారగును. అందుచేత గాజును ప్రత్యేక పద్ధతిలో చల్లబరుస్తారు. దీన్ని మందశీతలీకరణం అంటారు. ద్రవగాజును కన్వేయర్ బెల్టులపై పోసి ఒక పొడవైన గదిలో గల అధిక ఉష్ణోగ్రతా ప్రదేశం నుండి అల్ప ఉష్ణోగ్రతా ప్రదేశానికి నెమ్మదిగా పంపుతారు. అందుచేత గాజు నెమ్మదిగా చల్లబడుతుంది. మందశీతలీకరణం వల్ల గాజుకు అధిక బలం వస్తుంది.
ఒక్కో రకమైన గాజుకు కొన్ని ప్రత్యేక ధర్మాలు,ప్రత్యేక ఉపయోగాలు ఉన్నాయి.
గాజు రకము | ధర్మాలు,ఉపయోగాలు |
సోడా గాజు లేదా మెత్తని గాజు | త్వరగా కరుగుతుంది కిటికీ అద్దాలు,గాజు సీసాల తయారీ |
పైరక్స్ గాజు | ప్రయోగ శాలలో గాజు పరికరాలు |
క్వార్ట్జ్ గాజు | విద్యుత్ బల్బులు,దృశా పరికరాలు |
ప్లింట్ గాజు | దృశా పరికరాలు |
గట్టి గాజు | త్వరగా కరుగదు.నీటికి,ఆమ్లాలకు లొంగదు. గట్టి గాజుపరికరాల తయారీ |
బోరోసిలికేట్ గాజు | అల్ప వ్యాకోచము,కుదుపునూ రసాయనాలనూ తట్టుకోగలదు ప్రయోగశాల పరికరాలను,గొట్టపు ద్వారాలను తయారుచేయుటకు |
కొన్ని లోహ లవణాలను/లోహ ఆక్సైడ్లను మందశీతలీకరణం కంటే ముందుగా గాజుకు కలిపి చల్లబరిస్తే రంగు గాజులు లభిస్తాయి.
లోహ ఆక్సైడ్/లవణము | పేరు | రంగు |
Cr2O3 | క్రోమియం ఆక్సైడ్ | ఆకుపచ్చ |
MnO2 | మాంగనీస్ డై ఆక్సైడ్ | ఊదా |
CuSO4 | కాపర్ సల్ఫేట్ | నీలము |
AuCl3 | ఆరం క్లోరైడ్ | కెంపు రంగు |
Cu2O | క్యూప్రస్ ఆక్సైడ్ | ఎరుపు |
గాజును వేడిచేసి మెత్తబరచి దాని లోనికి గాలిని ఊది కోరిన ఆకృతి గల గాజు వస్తువులు తయారుచేసే సాంకేతిక నైపుణ్యాన్ని గ్లాస్ బ్లోయింగ్ అంటారు. గాజు వస్తువు ఎరుపుగా మారె వరకు ఆక్సీ-ఎసిటిలీన్ మంటలో వేడిచేస్తారు. వేడి చేసిన చోట గాజు మెత్తబడుతుంది. దీనిలోనికి నోటితో గాని,యంత్ర సహాయంతో గాని గాలిని ఊదుతారు. గ్లాస్ బ్లోయింగ్ ప్రక్రియ పైరెక్స్, బోరోసిలికేట్ గాజుతో మాత్రమే సాధ్యము. ఇతర గాజులైటే పగిలిపోతాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.