![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/cd/Flag_of_Afghanistan_%25282013%25E2%2580%25932021%2529.svg/langte-640px-Flag_of_Afghanistan_%25282013%25E2%2580%25932021%2529.svg.png&w=640&q=50)
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు
From Wikipedia, the free encyclopedia
ఆఫ్ఘనిస్తాన్ పురుషుల జాతీయ క్రికెట్ జట్టు అంతర్జాతీయ క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. 19వ శతాబ్దం మధ్యకాలం నుండి ఆఫ్ఘనిస్తాన్‌లో క్రికెట్ ఆడుతున్నారు. అయితే 21వ శతాబ్దం ప్రారంభంలోనే జాతీయ జట్టు విజయాలు సాధింజ్చడ్మం మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు 1995లో ఏర్పడింది. 2001లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి)కి అనుబంధ సభ్యునిగా,[14] 2003లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC [15] సభ్యునిగా మారింది. దాదాపు ఒక దశాబ్దం అంతర్జాతీయ క్రికెట్ ఆడిన తర్వాత, 2017 జూన్ 22 న లండన్‌లో జరిగిన ఐసిసి సమావేశంలో, ఆఫ్ఘనిస్తాన్‌కు పూర్తి ఐసిసి సభ్యత్వం (అందువలన టెస్ట్ హోదా ) ఇచ్చింది. ఐర్లాండ్‌తో కలిపి, ఇది టెస్ట్ క్రికెట్ ఆడే దేశాల సంఖ్య పన్నెండుకు చేరుకుంది. ఐసిసి అనుబంధ సభ్యత్వం నుండి పూర్తి సభ్య హోదాను సాధించిన మొదటి దేశం ఇది.[16][17]
![]() | |||||||||||||
అసోసియేషన్ | ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు | ||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వ్యక్తిగత సమాచారం | |||||||||||||
టెస్టు కెప్టెన్ | హష్మతుల్లా షాహిదీ | ||||||||||||
ఒన్ డే కెప్టెన్ | హష్మతుల్లా షాహిదీ | ||||||||||||
Tట్వంటీ I కెప్టెన్ | రషీద్ ఖాన్[1][2] | ||||||||||||
కోచ్ | జోనాథన్ ట్రాట్ | ||||||||||||
చరిత్ర | |||||||||||||
టెస్టు హోదా పొందినది | 2017 | ||||||||||||
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ | |||||||||||||
ICC హోదా | అనుబంధ సభ్యత్వం (2001) అసోసియేట్ సభ్యత్వం (2013) పూర్తి సభ్యత్వం (2017) | ||||||||||||
ICC ప్రాంతం | ఆసియా | ||||||||||||
| |||||||||||||
టెస్టులు | |||||||||||||
మొదటి టెస్టు | v. ![]() | ||||||||||||
చివరి టెస్టు | v. ![]() | ||||||||||||
| |||||||||||||
వన్డేలు | |||||||||||||
తొలి వన్డే | v. ![]() | ||||||||||||
చివరి వన్డే | v. ![]() | ||||||||||||
| |||||||||||||
పాల్గొన్న ప్రపంచ కప్‌లు | 3 (first in 2015) | ||||||||||||
అత్యుత్తమ ఫలితం | 6వ స్థానం (2023) | ||||||||||||
ఐసిసి ప్రపంచ కప్ క్వాలిఫయరులో పోటీ | 2 (first in 2009) | ||||||||||||
అత్యుత్తమ ఫలితం | ఛాంపియన్స్ (2018) | ||||||||||||
ట్వంటీ20లు | |||||||||||||
తొలి టి20ఐ | v. ![]() | ||||||||||||
చివరి టి20ఐ | v. ![]() | ||||||||||||
| |||||||||||||
ఐసిసి టి20 ప్రపంచ కప్ లో పోటీ | 6 (first in 2010) | ||||||||||||
అత్యుత్తమ ఫలితం | సూపర్ 10 (2016) | ||||||||||||
ఐసిసి టి20 ప్రపంచ కప్ క్వాలిఫయరులో పోటీ | 4 (first in 2010) | ||||||||||||
అత్యుత్తమ ఫలితం | ఛాంపియన్స్ (2010) | ||||||||||||
| |||||||||||||
As of 10 November 2023 |
2023 ఫిబ్రవరి నాటికి ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) క్రికెట్లో జట్టు 10వ స్థానంలో ఉంది.[18] 2019 ఫిబ్రవరి 23 న డెహ్రాడూన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన 278/3 స్కోరుతో అత్యధిక T20I స్కోరుతో ప్రపంచ రికార్డు స్థాపించింది.
2021 ఆగస్టులో, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ నియంత్రణలోకి వచ్చినప్పటి నుండి భవిష్యత్తులో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆఫ్ఘనిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు పాల్గొనడంపై ఆందోళనలు, సందేహాలు తలెత్తాయి.[19][20] 2021 ఆగస్టు 15 న తాలిబాన్ స్వాధీనం సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న ఆఫ్ఘన్ జాతీయ క్రికెటర్లు, వారి కుటుంబాల భద్రతపై ఆందోళనలు తలెత్తాయి [21] 2021 ఆగస్టు 31 నాటికి, ఆఫ్ఘనిస్తాన్ మహిళల జాతీయ క్రికెట్ జట్టులోని ముగ్గురు కెనడాకు వలస వెళ్లగా, ఇతరులు తమను తాలిబాన్ ఎలా చూస్తారని భయపడుతున్నారు.
అంతర్జాతీయ మ్యాచ్‌లలో పురుషుల క్రికెట్ జట్టు భాగస్వామ్యానికి తాలిబాన్ అంతరాయం కలిగించదని, 2021 సెప్టెంబరులో శ్రీలంకలో ప్రారంభం కానున్న పాకిస్తాన్‌తో మొట్టమొదటి ద్వైపాక్షిక సిరీస్‌ను ఆడేందుకు ఆఫ్ఘనిస్తాన్‌ను అనుమతిస్తామని తాలిబాన్ ప్రతినిధులు పేర్కొన్నారు.[22][23] టూర్‌ను 2022కి రీషెడ్యూల్ చేస్తున్నట్లు 2021 ఆగస్టులో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇది తరువాత 2023కి మార్చారు. పర్యటన 2023 మార్చి 24 - 27 మధ్య జరిగింది.[24]
రాజకీయ గందరగోళం ఉన్నప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు మీడియా మేనేజర్ హిక్మత్ హసన్ 2021 ఐసిసి పురుషుల T20 ప్రపంచ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ పాల్గొంటుందని ధ్రువీకరించారు.[25]