డింపుల్ కపాడియా
భారతదేశ నటి, హిందీ చిత్రాల్లో ప్రముఖంగా నటించింది. / From Wikipedia, the free encyclopedia
డింపుల్ కపాడియా (జననం 8 జూన్ 1957)[1] ఒక భారతీయ సినిమా నటి. ప్రముఖ హిందీ నటుడు రాజ్ కపూర్ 1973లో తానే నిర్మించి, దర్శకత్వం వహించిన "బాబీ" చిత్రంలో ఈమెను పరిచయం చేశాడు. అప్పుడు ఆమె వయసు 16 సంవత్సరాలు. అదే సంవత్సరం ఈమె హిందీ సినిమా నటుడు రాజేష్ ఖన్నాను వివాహం చేసుకుని సినిమాల నుండి విరమించింది. 1984లో రాజేష్ ఖన్నాతో విడాకులు తీసుకున్న తర్వాత తిరిగి సినిమా రంగప్రవేశం చేసింది. తొలి చిత్రం బాబీ, 1985లో విడుదలైన "సాగర్" చిత్రాలలో ఈమె నటనకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారం లభించింది.[2]
త్వరిత వాస్తవాలు డింపుల్ కపాడియా, జననం ...
డింపుల్ కపాడియా | |
---|---|
జననం | డింపుల్ చున్నీబాయ్ కపాడియా (1957-06-08) 1957 జూన్ 8 (వయసు 67) |
వృత్తి | సినిమా నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1973; 1984–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | రాజేష్ ఖన్నా (1973–1982; విడిపోయారు) |
పిల్లలు | ట్వింకిల్ ఖన్నా రింకే ఖన్నా |
బంధువులు | సింపుల్ కపాడియా (సోదరి) అక్షయ్ కుమార్ (అల్లుడు) |
మూసివేయి