రాజేష్ ఖన్నా
భారతీయ చిత్ర నటుడు, నిర్మాత మరియు దర్శకుడు / From Wikipedia, the free encyclopedia
రాజేశ్ ఖన్నా (అసలు పేరు జతిన్ ఖన్నా; డిసెంబర్ 29, 1942 - 18 జూలై, 2012) హిందీ సినిమా నటుడు, నిర్మాత, రాజకీయ వేత్త. భారతీయ సినిమా మొదటి సూపర్ స్టార్ గా వ్యవహరింపబడే ఈయన 163 చిత్రాలలో నటించారు. 1970 నుండి తను సోలోగా నటించిన చిత్రాలు వరుసగా 15 విజయవంతం కావటంతో ఈయనకు ఈ పేరు సార్థకమైనది. ఇంతవరకూ ఈ రికార్డుని ఎవరూ బద్దలకొట్టలేక పోయారు. మార్చి 1973 లో డింపుల్ కపాడియాతో వివాహం జరిగింది. డింపుల్ తొలిచిత్రం బాబీ (హిందీ) విడుదలకి ఆరు నెలల ముందు ఈ వివాహం జరిగింది. డింపుల్ కూడా ఖన్నా అభిమాని కావటం యాదృచ్ఛికం. అయితే 1984 లో వీరిద్దరూ విడిపోయారు. వీరి పెద్ద కుమార్తె ట్వింకిల్ ఖన్నా, నటుడు అక్షయ్ కుమార్ ని వివాహమాడినది. చిన్న కుమార్తె రింకే ఖన్నా కూడా లండన్ లోని ఒక వ్యాపారవేత్తని వివాహమాడినది.
త్వరిత వాస్తవాలు రాజేశ్ ఖన్నా, జననం ...
రాజేశ్ ఖన్నా | |
---|---|
జననం | జతిన్ ఖన్నా (1942-12-29)1942 డిసెంబరు 29 |
మరణం | 2012 జూలై 18(2012-07-18) (వయసు 69) |
ఇతర పేర్లు | Jatin Khanna Kaka RK |
వృత్తి | Film actor and producer |
క్రియాశీల సంవత్సరాలు | 1966–2012 (actor)
1991–1996 (politics) 1971–1995 (producer) |
జీవిత భాగస్వామి | డింపుల్ కపాడియా (1973–1984) |
పిల్లలు | ట్వింకిల్ ఖన్నా రింకీ ఖన్నా |
మూసివేయి