ట్వింకిల్ ఖన్నా
From Wikipedia, the free encyclopedia
ట్వింకిల్ ఖన్నా (జననం 1974 డిసెంబరు 29) అసలు పేరు టీనా జతిన్ ఖన్నా. ఈమె ప్రముఖ భారతీయ ఇంటీరియర్ డిజైనర్, పత్రికా కాలమిస్టు, రచయిత్రి, మాజీ నటి కూడా. ఆమె మొదటి సినిమా బర్సాత్ (1995)కు ఫిలింఫేర్ ఉత్తమ తొలి చిత్ర నటి పురస్కారం (బెస్ట్ ఫీమేల్ డెబ్యూ) పొందారు. తెలుగు చిత్రం శీను (1999)లో కథానాయికగా కనిపించారీమె. ప్రముఖ నటులు రాజేష్ ఖన్నా, డింపుల్ కపాడియాల కుమార్తె ఈమె. నటిగా ఆమె చివరి చిత్రం లవ్ కే లియే కుచ్ భి కరేగా (2001). బాబీ డియోల్, అజయ్ దేవగణ్, సైఫ్ అలీ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, వెంకటేష్, గోవిందా, అక్షయ్ కుమార్ వంటి నటులతో ఎన్నో సినిమాల్లో నటించారామె.
ట్వింకిల్ ఖన్నా | |
---|---|
జననం | ట్వింకిల్ ఖన్నా ముంబై, మహారాష్ట్ర, భారతదేశం |
విద్య | |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు |
|
జీవిత భాగస్వామి | |
పిల్లలు | ఆరవ్ కుమార్(జ.2002), నితార కుమార్(జ.2012) |
తల్లిదండ్రులు |
|
బంధువులు | రింకే ఖన్నా (సోదరి),సింపుల్ కపాడియా |
2001లో అక్షయ్ కుమార్ను వివాహం చేసుకున్నారు ట్వింకిల్. అదే సంవత్సరం నుండి సినిమాల్లో నటించడం కూడా మానేశారు. ఇంటీరియర్ డిజైనింగ్ లో ప్రొఫెషనల్ డిగ్రీ పట్టా లేకపోయినా, ఒక ఆర్కిటెక్ట్ వద్ద 2 ఏళ్ళు పనిచేసి, ఆ రంగంలో నైపుణ్యం సంపాదించుకున్నారు ఆమె. ముంబై ప్రధాన కార్యాలయంగా గల ది వైట్ విండో అనే ఇంటీరియర్ డిజైనింగ్ వ్యాపార సంస్థకు సహ యజమాని కూడా అయ్యారు. గ్రేజింగ్ గోట్ ప్రొడక్షన్స్ అనే సినీ నిర్మాణ సంస్థకు సహ వ్యవస్థాపకురాలుగా దాదాపు 6 చిత్రాలకు సహ నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు ట్వింకిల్. మరాఠీ భాషలో 72 మైల్స్ అనే సినిమా కూడా తీశారు. తీస్ మార్ ఖాన్ (2010)లో అతిథి పాత్రలో కనిపించారామె.