ఇబ్రాహీం ఇస్లాం ప్రవక్తలో ముఖ్యుడు. బైబిల్, తౌరాత్ (తోరాహ్) లలో ఇతని పేరు 'అబ్రహాము' గా ప్రస్తావింపబడింది. తండ్రిపేరు ఆజర్ లేక తారఖ్, ఇతడు విగ్రహాలు తయారు చేసి అమ్ముకునే సంచారజాతికి చెందినవాడు, తానూ విగ్రహాలను తయారుచేసి అమ్మేవాడు. తనకుమారుణ్ణి (ఇబ్రాహీం ను) గూడా విగ్రహాలు అమ్మడానికి పంపేవాడు. విగ్రహాలుకొని వాటినిపూజించే ప్రజలను చూసి ఇబ్రాహీం ఆలోచనల్లో పడేవాడు. విగ్రహాలు మానవసృష్టి. సృష్టిని సృష్టికర్తగా భావించడం అహేతుకమని, వీటన్నికీ అతీతంగా విశ్వంలో ఏదో శక్తివుందని ఆసక్తియే అల్లాహ్ అని ప్రగాఢంగా నమ్మాడు. తనతండ్రి తయారుచేసిన విగ్రహాలను నమ్మలేక, అమ్మలేక తండ్రిచే నానాతిట్లూ తిన్నాడు. ఇబ్రాహీంకు ఇరువురు భార్యలు 'హాజిరా ', 'సారా '. ఇతని కుమారులు ఇస్మాయీల్, ఇస్ హాఖ్ లు, వీరూ ప్రవక్తలే. ఇబ్రాహీంకు ప్రవక్తలపితామహుడిగా గౌరవిస్తారు. ఇస్లాంలో ఇతనికి ఖలీలుల్లాగా బిరుదు గలదు. ఖలీలుల్లా, 'ఖలీల్ ' కలీల్ అంటే దేవుని స్నేహితుడు, మిత్రుడు అని అర్ధం. ఇస్లాంలో ఇతనికి హనీఫ్ అనే బిరుదు గూడాగలదు. హనీఫ్ అనగా ఏకేశ్వరవిధానాన్ని కనుగొన్నవాడు, లేదా పునర్వవస్థీకరించినవాడు. ఇస్లాం మతం ఆదమ్తో మొదలయితే, ఇబ్రాహీం చే పునర్య్వవస్థీకరించబడింది. ముహమ్మద్ ప్రవక్తచే పటిష్ఠం చేయబడింది. ఇతను ప్రవేశపెట్టిన విధానాన్ని ఇబ్రాహీం మతము అనికూడా సంబోధిస్తారు. కానీ, ఇతను క్రొత్త మతాన్ని స్థాపించలేదు, ఆదమ్ తో ప్రారంభమయిన ఇస్లాం మతాన్ని దృఢీకరించాడు. ఇతని తరువాత అవతరించిన మత ప్రవక్తలు మూసా (మోషే) (యూదమతము) ఈసా (యేసు) (క్రైస్తవ మతము), ముహమ్మద్ ప్రవక్త (ఇస్లాం) ముగ్గురూ తమ విశ్వాసానికి మూల పురుషులలో ఒకనిగా ఇతన్ని భావిస్తారు.

Thumb
ఇబ్రాహీం ప్రవక్త సమాధి.
త్వరిత వాస్తవాలు ఇబ్రాహీమ్ alayhi s-salām ( عليه السلام ), జననం ...
ఇబ్రాహీమ్

alayhi s-salām ( عليه السلام )
Ibrāhīm - إبراهيم
Thumb
ఇస్లామీయ లిపీకళాకృతి లో వ్రాయబడిన ఇబ్రాహీం పేరు. దాని తరువాత 'శాంతికలుగుగాకా అని వ్రాయబడియున్నది.
జననంసుమారు హిజ్రీ శకానికి 2510 పూర్వం
మరణంసుమారు 2329 BH (aged approximately 175)
మరణ కారణంOld Age
సమాధి స్థలంIbrahimi Mosque
జీవిత భాగస్వామిహాజిరా సారాహ్
పిల్లలుఇస్మాయీల్ , ఇస్ హాక్
మూసివేయి

ఇబ్రాహీం పేరు ఖురాన్ లోని 25 వివిధ సూరా లలో ప్రస్తావింపబడింది. మూసా (మోషే) తరువాత ఎక్కువగా ప్రస్తావింపబడిన పేరు ఇది.[1]

సాధారణంగా కాబా గృహాన్ని ఇబ్రాహీం నిర్మించారని భావిస్తారు. కాని కాబా గృహాన్ని ఆదమ్ ప్రథమంగా నిర్మించారు. కాలగర్భంలో జీర్ణమయినది. అల్లాహ్ ఆజ్ఞతో, ఇదేస్థానంలో ఇబ్రాహీం, ఇస్మాయీల్ లు కలసి పునర్నిర్మించారు. ఈ కాబా గృహాన్నే అల్లాహ్ ఆరాధనా ప్రథమగృహంగా వర్ణిస్తారు. కాబా బయట ఇతడి పాదముద్రగల రాయి గలదు. హజ్ యాత్రికులందరూ ఈరాతిని దర్శిస్తారు.

సున్నత్-ఎ-ఇబ్రాహీమి

సున్నత్ అనగా ఆచారం, సున్నత్-ఎ-ఇబ్రాహీమి అనగా, ఇబ్రాహీం ద్వారా సూత్రీకరించిన ఆచారాలు. అవి,

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.