![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/47/Bharthana_Althan_area.jpg/640px-Bharthana_Althan_area.jpg&w=640&q=50)
సూరత్
గుజరాత్ రాష్ట్రం, సూరత్ జిల్లా లోని ఒక నగరం / From Wikipedia, the free encyclopedia
సూరత్,పశ్చిమభారతదేశం,గుజరాత్ రాష్ట్రం,సూరత్ జిల్లా లోని ఒక నగరం.ఇది సూరత్ జిల్లా పరిపాలనా రాజధాని.సూరత్ అనేపదానికి గుజరాతీ, హిందీ భాషలలోముఖం అని అర్ధం.అరేబియాసముద్రంలో సంగమించే ప్రదేశానికి సమీపంలోతపతి నది ఒడ్డున ఉన్నఇది ఒకపెద్దఓడరేవుగా ఉండేది.ఇదిఇప్పుడు దక్షిణ గుజరాత్లోవాణిజ్య,ఆర్థికకేంద్రంగా ఉంది.ఇది పశ్చిమభారతదేశంలోని అతిపెద్ద పట్టణ ప్రాంతాలలోఒకటి.ఇది బాగా స్థిరపడిన వజ్రా,వస్త్ర పరిశ్రమలను కలిగి ఉంది. దుస్తులు,ఉపకరణాలకు ప్రధాన సరఫరా కేంద్రం.ప్రపంచంలోనివజ్రాల సరఫరాలోదాదాపు 90% నగరంలోఅవసరమైన రూపుప్రకారంకత్తిరించుట,మెరుగు దిద్దటం చేయబడతాయి.[13][14][15] ఇదిఅహ్మదాబాద్ తర్వాత గుజరాత్లో రెండవ అతిపెద్ద నగరం. సూరత్ నగరం,భారతదేశంలో జనాభా ప్రకారం ఎనిమిదవ అతిపెద్ద నగరం ,తొమ్మిదవ అతిపెద్ద పట్టణ సముదాయం.ఈనగరం 284 కి.మీ. (176 మై.) లో విస్తరించి ఉంది.రాష్ట్రరాజధాని గాంధీనగర్‌కు దక్షిణాన 265 కి.మీ. (165 మై.) అహ్మదాబాద్‌కు దక్షిణాన 289 కి.మీ. (180 మై.) ముంబైకి ఉత్తరంగాఉంటుంది.నగరం కేంద్రం అరేబియా సముద్రానికి దగ్గరగా తపతి నదిపై ఉంది.[16]
Surat
Suryanagari | |
---|---|
Metropolis | |
From top: Tapi River panorama, Gaurav path, University Road, Swaminarayan Mandir, Pandit Deendayal Upadhyay Indoor Stadium, Vesu Skyline, Science city Surat, Surat Airport | |
Nickname: Diamond City of India[1] | |
Coordinates: 21°12′18″N 72°50′24″E | |
Country | ![]() |
రాష్ట్రం | గుజరాత్ |
జిల్లా | Surat |
Zone | 7 |
Government | |
• Type | Mayor–Council |
• Body |
|
• Mayor | Hemali Boghawala (BJP)[2] |
• Municipal Commissioner | Shri Banchhanidhi Pani, IAS |
• Police Commissioner | R. B. Brahmbhatt, IPS[3] |
విస్తీర్ణం | |
• Total | 461.60 కి.మీ2 (178.22 చ. మై) |
Elevation | 13 మీ (43 అ.) |
జనాభా | |
• Total | 69,36,534 |
• Rank | 2nd in Gujarat |
• జనసాంద్రత | 15,000/కి.మీ2 (39,000/చ. మై.) |
• Metro rank | 9th |
• Demonym | Surati |
Time zone | UTC+5:30 (భా.ప్రా.కా) |
Pincode(s) | 394 XXX, 395 XXX |
ప్రాంతపు కోడ్ | 91-261-XXX-XXXX |
Vehicle registration | GJ-05, GJ-19, GJ-28[9] |
Sex ratio | 1.27[10] ♂/♀ |
Coastline | 35 కి.మీ. (22 మై.) |
Language | Gujarati |
Literacy rate | 86.65%[11] |
Gross domestic product | $60 billion[12] |
Website | https://surat.nic.in/ |
ఎకనామిక్ టైమ్స్ నిర్వహించిన ఒకఅధ్యయనం ప్రకారంసూరత్ నగరం 2019 నుండి2035వరకుప్రపంచంలోనేఅత్యంత వేగంగాఅభివృద్ధి చెందుచున్ననగరంగాఆసమయంలోగుర్తించబడింది.[17] 2001 నుండి 2008 మధ్యఆ ఏడుఆర్థికసంవత్సరాల్లో నగర వార్షిక స్థూల దేశీయోత్పత్తి రేటు 11.5% శాతంగానమోదైంది.[18][19] వార్షిక సర్వే ఆఫ్ ఇండియాస్ సిటీ-సిస్టమ్స్ (ఎ.ఎస్.ఐ.సి.ఎస్.) సంస్థ ద్వారా సూరత్ "ఉత్తమ నగరం"గా పురస్కారం పొందింది. మైక్రోసాఫ్ట్ సిటీ నెక్స్ట్ ఇనిషియేటివ్ ఐ.టి. సేవల మేజర్లు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రోతో జతకట్టి చేసిన పరిశీలనలో భారతదేశంలో మొట్టమొదటి స్మార్ట్ ఐటి సిటీగా సూరత్ ఎంపిక చేయబడింది.[20] నగరంలో 2.97 లక్షల అంతర్జాల వినియోగదారులు ఉన్నారు,.ఇది నగరం మొత్తం జనాభాలో 65% శాతం మంది ఉన్నారు.[21] ఐ.బి.ఎం. స్మార్టర్ సిటీస్ ఛాలెంజ్ గ్రాంటు కోసం 2015లో సూరత్ నగరం ఎంపికైంది.[22][23] ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్లాగ్షిప్ స్మార్ట్ సిటీస్ మిషన్ కింద స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయనున్న ఇరవై భారతీయ నగరాల్లో సూరత్ నగరంఒకటిగా ఎంపికైంది.[24]
2020 స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రకారం 2020 ఆగష్టు 21 నాటికి సూరత్ భారతదేశంలోని రెండవ అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఎంపికైంది.[25][26] ఇదిఒక పెద్ద పైప్‌లైన్ మంటలను ఎదుర్కొంది,దీనివలనకొంత నష్టం జరిగింది.[27]
వజ్రాల కత్తిరింపు, మెరుగు పెట్టటానికి ప్రసిద్ధి చెందిన సూరత్‌ను "భారతదేశ వజ్ర నగరం" పిలుస్తారు.[1] నగరంలో ఎస్సార్, లార్సెన్ అండ్ టూబ్రో, రిలయన్స్ మౌలిక సదుపాయాల సంస్థవంటి వివిధసాంకేతిక పరిశ్రమలు ఇంజనీరింగ్ ప్లాంట్లు ఉన్నాయి .రెసిలెన్స్ విభాగంలోసూరత్ యునెస్కోతో నెట్ఎక్స్ప్లో స్మార్ట్ సిటీస్ అవార్డు 2019ని గెలుచుకుంది.ఫ్రాన్స్‌లోని పారిస్‌లో జరిగే యునెస్కో హౌస్‌లో సూరత్ మేయర్ ఈ అవార్డును అందుకున్నారు.[28]