సి.కె.నాయుడు
From Wikipedia, the free encyclopedia
సి. కె. నాయుడుగా పేరు గాంచిన కొఠారి కనకయ్య నాయుడు భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్. పద్మభూషణ పురస్కారం అందుకొన్న తొలి క్రికెట్ ఆటగాడు, 1933లో విస్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అందుకున్నాడు. 1955లో భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ అందుకున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో రెండు దశాబ్దాలు (1916-1936) నాయుడు యుగంగా ప్రసిద్ధి గాంచాయి.[2]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | (1895-10-31)1895 అక్టోబరు 31 , Nagpur [1] | |||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 1967 నవంబరు 14(1967-11-14) (వయసు 72), Indore | |||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి వాటం స్లో మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
నాయుడు 1895, అక్టోబర్ 31న నాగపూర్లో ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు. నాగపూర్లో పెరిగిన ఈయన పాఠశాల రోజులనుండే క్రికెట్ ఆటలో ఎంతో ప్రతిభ కనపరిచాడు. ఈయన ప్రథమ శ్రేణి క్రికెట్ ఆటలో ప్రవేశము 1916లో హిందూ జట్టులో, యూరోపియన్ జట్టుకు వ్యతిరేకముగా జరిగింది. ఈయన ఆ ఆటలో తమ జట్టు 79 పరుగులకు 7 వికెట్లు పడిన పరిస్థితిలో 9వ ఆటగాడిగా బ్యాటింగుకు దిగాడు. మొదటి మూడు బంతులు అడ్డుకొని, నాలుగో బంతిని సిక్సర్ కొట్టాడు. ఇలా మొదలైన ఈయన ప్రాబల్యం తన క్రీడాజీవితపు చివరినాళ్ల వరకు చెక్కుచెదరలేదు.
ఆరు దశాబ్దాలపాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన కొద్దిమంది క్రీడాకారులలో సి. కె. నాయుడు ఒకరు. 1956-57 రంజీ ట్రోఫీలో తన 62 వ యేట అతను చివరిసారి ఆడాడు. ఆ మ్యాచ్లో 52 పరుగులు చేశాడు. రిటైర్ అయ్యాక కొన్నాళ్ళు జట్టు సెలెక్టర్ గా, రేడియో వ్యాఖ్యాతగా ఆటతో తన అనుబంధం కొనసాగించాడు.
ఈయన 1967, నవంబర్ 14న ఇండోర్లో మరణించాడు.