సల్ఫ్యూరిక్ ఆమ్లం
రసాయన పదార్ధము / From Wikipedia, the free encyclopedia
సల్ఫ్యూరిక్ ఆమ్లం"' లేదా "'గంధకామ్లం'" (ఆంగ్లం: Sulfuric acid లేదాsulphuric acid) ఒక బలమైన శక్తి వంతమైన ఖనిజ ఆమ్లం.సల్ఫ్యూరిక్ ఆమ్లం పదార్థాలను తినివేయు/క్షయింపచేసే (corrosive ) గుణం కల్గిన ఆమ్లం. సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క సంకేత అణుఫార్ములా H2SO4.సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క అణుభారం 98.079 గ్రాములు/మోల్.ఇది కొద్దిగా ఘాటైన వాసన కల్గి ఉంది. సల్ఫ్యూరిక్ ఆమ్లం రంగులేకుండా లేదా పసుపు రంగులో ఉండును.[4] చిక్కనైన ద్రావణం. సల్ఫ్యూరిక్ ఆమ్లం అన్ని గాఢతలలో నీటిలోకరుగును. చారిత్రక పరంగా సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఆయిల్ ఆఫ్ విట్రియోల్(oil of vitriol) అని పిలిచేవారు.
| |||
పేర్లు | |||
---|---|---|---|
IUPAC నామము
Sulfuric acid | |||
ఇతర పేర్లు
Oil of vitriol | |||
గుర్తింపు విషయాలు | |||
సి.ఎ.ఎస్. సంఖ్య | [7664-93-9] | ||
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 231-639-5 | ||
కెగ్ | D05963 | ||
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:26836 | ||
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | WS5600000 | ||
SMILES | OS(=O)(=O)O | ||
| |||
ధర్మములు | |||
H 2SO 4 | |||
మోలార్ ద్రవ్యరాశి | 98.079 g/mol | ||
స్వరూపం | Clear, colorless liquid | ||
వాసన | odorless | ||
సాంద్రత | 1.84 g/cm3, liquid | ||
ద్రవీభవన స్థానం | 10 °C (50 °F; 283 K) | ||
బాష్పీభవన స్థానం | 337 °C (639 °F; 610 K) When sulfuric acid is above 300 °C (572 °F), it will decompose slowly | ||
నీటిలో ద్రావణీయత |
miscible | ||
బాష్ప పీడనం | 0.001 mmHg (20 °C)[1] | ||
ఆమ్లత్వం (pKa) | −3, 1.99 | ||
స్నిగ్ధత | 26.7 cP (20 °C) | ||
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |||
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
−814 kJ·mol−1[2] | ||
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
157 J·mol−1·K−1[2] | ||
ప్రమాదాలు | |||
భద్రత సమాచార పత్రము | External MSDS | ||
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు | |||
జి.హెచ్.ఎస్.సంకేత పదం | Danger | ||
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు | H314 | ||
GHS precautionary statements | P260, P264, P280, P301+330+331, P303+361+353, P363, P304+340, P305+351+338, P310, P321, P310, P405, P501 | ||
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} | ||
R-పదబంధాలు | R35 | ||
S-పదబంధాలు | (S1/2) S26 మూస:S30 S45 | ||
జ్వలన స్థానం | {{{value}}} | ||
Threshold Limit Value | 15 mg/m3 (IDLH), 1 mg/m3 (TWA), 2 mg/m3 (STEL) | ||
Lethal dose or concentration (LD, LC): | |||
LD50 (median dose) |
2140 mg/kg (rat, oral) | ||
LC50 (median concentration) |
50 mg/m3 (guinea pig, 8 hr) 510 mg/m3 (rat, 2 hr) 320 mg/m3 (mouse, 2 hr) 18 mg/m3 (guinea pig)[3] | ||
LCLo (lowest published) |
87 mg/m3 (guinea pig, 2.75 hr)[3] | ||
US health exposure limits (NIOSH): | |||
PEL (Permissible) |
TWA 1 mg/m3[1] | ||
REL (Recommended) |
TWA 1 mg/m3[1] | ||
IDLH (Immediate danger) |
15 mg/m3[1] | ||
సంబంధిత సమ్మేళనాలు | |||
Related {{{label}}} | {{{value}}} | ||
సంబంధిత సమ్మేళనాలు |
Sulfurous acid Peroxymonosulfuric acid Sulfur trioxide Oleum | ||
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |||
Y verify (what is YN ?) | |||
Infobox references | |||
సల్ఫ్యూరిక్ ఆమ్లం డైప్రోటిక్ ఆమ్లం(అనగా ద్రావణాలలో కరుగునపుడు రెండు ప్రోటానులనులేదా రెండూ హైడ్రోజన్ పరమాణువులను దానం/దత్తముచేయు ఆమ్లం). ఆమ్ల గాఢతను బట్టి సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క గుణాలు, ధర్మాలు మారును. సల్ఫ్యూరిక్ ఆమ్లానికి లోహాలను, జీవకణాలను (living tissues) హరించు గుణం, రాళ్ళను కూడా కరగించు లక్షణం ఆమ్లంకున్న బలమైన ఆమ్లగుణం వలన కల్గుతున్నది. అధిక గాఢత కల్గిన ఆమ్లాన్ని తాకడం వలన లేదా మీదపడటం వలన చాలా నష్టం కల్గును, తీవ్రగాయాలు ఏర్పడును. ఆమ్లం జలవిశ్లేషణ ద్వారా రసాయన గాయాలు ఏర్పరచగా, పదార్థాల నిర్జలీ కరణ(dehydration) వలన ఏర్పడు ఉష్ణం వలన రెండవస్థాయిలో తాపగాయాలు/కాల్పుబొబ్బలు ఏర్పడును. కళ్ళలో పడిన శాశ్విత అంధత్వం కల్గును. కడుపులోకి వెళ్ళిన లోపలి అవయవాలు నయంకాని విధంగా పాడైపో వును. అందు వలన ఈ అమ్లాన్ని వాడునపుడు తగిన జాగ్రతలు తీసుకోన వలెను. ఈ ఆమ్లం అర్ద్రతాకర్షణ కల్గినండున, గాలిలోని నీటిని కూడా శోషించుకొనును. సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని పలురకాలుగా ఉపయోగి స్తున్నారు. గృహాలలో డ్రైన్ క్లీనరుగా, సీసము (మూలకము)-ఆమ్ల బ్యాటరీలలో ఎలక్ట్రోలైట్గాను, శుభ్రపరచు ద్రావణంగా ఉపయోగిస్తారు.అందుకే రసాయన పరిశ్రమలలో ప్రాముఖ్యత కల్గి ఉంది.ముఖ్యంగా ఖనిజాల ప్రాసెసింగులో, రసాయన ఎరువుల తయారీలో, ఆయిల్ రిఫైనింగు పరిశ్రమలలో ఉపయోగిస్తారు[4]. అలాగే వ్యర్ద/వృధా జలాల ట్రీట్మెంట్/చికిత్స లోని, రసాయనాల సంశ్లేషణలో ఈ ఆమ్లాన్ని వాడెదరు. సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని పలువిధాలలో ఉత్పత్తి చేయుదురు.