From Wikipedia, the free encyclopedia
వెనుజ్వేలా Venezuela (/ˌvɛnəˈzweɪlə/ ( listen) VEN-ə-ZWAYL-ə; Spanish pronunciation: [beneˈswela]) దక్షిణ అమెరికా లోని ఒక సుసంపన్న దేశము. అధికారికంగా " వెనుజ్వేలా బోలివారియ గణతంత్రం " అంటారు.ఫెడరల్ రిపబ్లిక్ అయిన ఇది దక్షిణ అమెరికా ఉత్తర సముద్రతీరంలో ఉంది.దేశానికి పశ్చిమ సరిహద్దులో కొలంబియా, దక్షిణ సరిహద్దులో బ్రెజిల్, తూర్పు సరిహద్దులో గయానా, ఈశాన్య సరిహద్దులో " ట్రినిడాడ్ , టొబాగో " ద్వీపం ఉన్నాయి.దేశ వైశాల్యం 916,445 కి.మీ2 (353,841 చ. మై.) జనసంఖ్య 3,17,75,371. దేశం అత్యంత అధికమైన జీవ వైవిధ్యం కలిగి ఉంది. జీవవైవిధ్యంలో వెనుజ్వేలా ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. ఈ దేశములో అపార చమురు నిల్వలు ఉన్నాయి. ఈ దేశ అతివలు తరచుగా అందాల పోటీలలో గెలుస్తుంటారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఏంజెల్స్ జలపాతము ఈ దేశములోనే ఉంది.[5] పశ్చిమంలో ఆండెస్ పర్వతాలు, దక్షింఅంలో అమెజాన్ బేసిన్ వర్షారణ్యాల వరకు లాస్ లానోస్ మైదానాలు, మద్యభూభాగంలో కరీబియన్ సముద్రతీరాలు, తూర్పుభూభాగంలో ఒరినోకో డెల్టా మీదుగా మానవనివాసాలు విస్తరించి ఉన్నాయి.ప్రస్తుతం వెనుజ్వేలా అని పిలువబడే ఈ ప్రాంతం స్థానికుల వ్యతిరేకతను అధిగమించి 1522లో స్పెయిన్ కాలనీ రాజ్యంగా ఉండేది. 1811లో ఇది మొదటి ఫ్రెంచి అమెరికన్ కాలనీ రాజ్యం నుండి " ఫస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వెనుజ్వేలా "గా ప్రకటించబడింది. అయినప్పటికీ 1821 వరకు సురక్షిత రాజ్యంగా స్థాపించబడలేదు. అప్పటి వరకూ వెనుజ్వేలా ఫెడరల్ రిపబ్లిక్ గ్రాన్ కొలంబియాలో శాఖగా ఉంది. 1830లో వెనుజ్వేలా ప్రత్యేకమైన పూర్తి స్వతంత్ర దేశంగా అవతరించింది. 19వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం సగం (1958) వరకు వెనుజ్వేలా రాజకీయ అల్లర్లు , నియంతృత్వ ధోరిణి మొదలైన సమస్యలను ఎదుర్కొన్నది.దేశంలో ప్రాంతీయ కౌడిల్లోస్ (సైనిక వీరులు) ఆధిక్యత కొనసాగింది.1958 నుండి దేశంలో డెమిక్రటిక్ ప్రభుత్వాల పాలన కొనసాగింది. 1980 , 1990 లలో నెలకొన్న ఆర్థికసంక్షోభం పలు రాజకీయ సంక్షోభాలకు దారితీసాయి.1989లో తీవ్రమైన కరకాజో తిరుగుబాటు, 1992 లో రెండు మార్లు తిరుగుబాటు ప్రయత్నాలు , 1993లో ప్రభుత్వనిధులను అపహరించాడని అధ్యక్షుడు " కార్లోస్ అండ్రెస్ పెరెజ్ "కు వ్యతిరేకంగా చేసిన అభిశంశన తీర్మానం ఇందులో భాగంగా ఉన్నాయి.ప్రభుత్వం పతనం తరువాత 1998లో ఎన్నికలు నిర్వహించబడ్డాయి. 1999 లో బొలివేరియన్ విప్లవంతో వెనుజ్వేలాలో కొత్తరాజ్యాంగం రూపొందించబడింది. తరువాత దేశానికి " రిపబ్లికా బొలివేరియన్ డీ వెనుజ్వేలా " (బొలివేరియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనుజ్వేలా) గా పేరు మార్పిడి జరిగింది. వెనుజ్వేలా ఒక ఫెడరల్ ప్రెసిడెంషియల్ రిపబ్లిక్. ఇందులో 23 రాష్ట్రాలు ఉన్నాయి. కాపిటల్ జిల్లాలో కారాకాస్, ఫెడరల్ డిపెండెంసీలైన ద్వీపాలు భాగంగా ఉన్నాయి.ఎస్సెక్యుబో నదికి ఉత్తరంలో ఉన్న గయానా ప్రాంతాలన్నింటినీ (1,59,500 చ.కి.మీ) వెనుజ్వేలా విలీనం చేసుకుంది.[6] లాటిన్ అమెరికన్ దేశాలలో అధికంగా నగరీకరణ చేయబడిన దేశాలలో వెనుజ్వేలా ఒకటి. [7][8] వెనుజులియన్లలో అత్యధిక ప్రజలు ఉత్తరభూభాగంలోని నగరప్రాంతాలలో నివసిస్తున్నారు. ప్రత్యేకంగా రాజధాని నగరం, అతిపెద్ద వెనుజ్వేలా నగరం అయిన కారాకాస్ నగరంలో అధికంగా నివసిస్తున్నారు.
వెనుజ్వేలా బోలివారియ గణతంత్రం
| |
---|---|
రాజధాని and largest city | కారకస్ |
అతిపెద్ద నగరం | రాజధాని |
జాతీయ భాష | స్పానిష్[b] |
జాతులు (2011[1]) |
|
పిలుచువిధం | వెనుజులియన్ |
ప్రభుత్వం | Federal అధ్యక్ష తరహా రాజ్యాంగ |
నికోలస్ మడురో | |
జార్జ్ అరియేజా | |
డియోస్దాడో కాబెల్లో | |
శాసనవ్యవస్థ | జాతీయ అసెంబ్లీ |
స్వాతంత్ర్యము | |
• స్పెయిన్ నుండి | 5 జూలై 1811 |
• from Gran Colombia | 13 జనవరి 1830 |
• Recognized | 30 March 1845 |
20 డిసెంబరు 1999 | |
విస్తీర్ణం | |
• మొత్తం | 916,445 కి.మీ2 (353,841 చ. మై.) (33rd) |
• నీరు (%) | 0.32[d] |
జనాభా | |
• 2011 census | 28,946,101 (44th) |
• జనసాంద్రత | 30.2/చ.కి. (78.2/చ.మై.) (181st) |
GDP (PPP) | 2013 estimate |
• Total | $408.805 billion[2] |
• Per capita | $13,634[2] |
GDP (nominal) | 2013 estimate |
• Total | $382 424 billion[2] |
• Per capita | $11,527[2] |
జినీ (2010) | 39[3] medium |
హెచ్‌డిఐ (2013) | 0.748[4] high · 61st |
ద్రవ్యం | Bolívar fuerte[e] (VEF) |
కాల విభాగం | UTC–4 (VET) |
వాహనాలు నడుపు వైపు | right |
ఫోన్ కోడ్ | +58 |
Internet TLD | .ve |
|
'
20వ శతాబ్దంలో ఆయిల్ నిక్షేపాలు కనుగొనబడ్డాయి. అంతకు ముందు అభివృద్ధి చెందని కాఫీ, కొకకయా వంటి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ఆయిల్ ఎగుమతులు ఆక్రమించి దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి దశకు తీసుకువచ్చాయి. 1980 ఆయిల్ గ్లట్ ఋణ సంక్షోభం, ఆర్థిక సంక్షోభాలకు దారితీసింది. 1996 నాటికి ద్రవ్లోల్భణం 100% నికి చేరుకుని 1995 నాటికి పేదరికం 66% నికి చేరుకుంది.[9] 1998 నాటికి తలసరి జి.డి.పి 1963 స్థాయికి చేరుకుంది. 1978 తలసరి జి.డి..పి.లో ఇది మూడవవంతు ఉంది. [10] 2000 నాటికి ఆయిల్ ధరలు కొత అధికరించి దేశ ఆదాయం అధికరించింది.[11] తరువాత వెనుజ్వేలా ప్రభుత్వం పాపులిస్ట్ విధానాలు చేపట్టింది. ఇది వెనుజ్వేలా ప్రభుత్వ ఆర్థిక స్థితిని అభివృద్ధి చేసి కొనుగోలు శక్తిని అభివృద్ధి చేసి ఆర్థిక అసమానతను, పేదరికాన్ని తగ్గించింది.[11]
[12][13][14] అయినప్పటికి తరువాత ఈ విధానాలు వివాదాస్పదం అయ్యాయి. ఫలితంగా ఆర్థిక వత్తిడి, పేదరికం, వ్యాధులు, శిశుమరణాలు, పోషకారలోపం, నేరం అధికరించాయి.[15][16][11][17][18][19][20][21]
1499 లో అలొంసే డీ ఒజెడా నాయకత్వంలో ఒక బృందం జరిగిన అన్వేషనలో భాగంగా వెనుజ్వేలా సముద్రతీరానికి చేరుకుంది. మరాకైబో సరోవరతీరంలో ఉన్న నివాసాలు నావికుడు అమెరిగో వెస్పుక్సికు వెనిస్ నగరాన్ని గుర్తుకుతీసుకువచ్చింది. అందువలన ఆయన ఈప్రాంతానికి వినెజియోలా, పిక్కోలా వెనెజియా అని పేరు పెట్టాడు.[22] ఈపేరు స్పానిష్ ప్రభావంతో ప్రస్తుత వినుజులాగా రూపాంతరం చెందింది.[22] [23] 16వ శతాబ్దంలో పేర్కొన్న జర్మన్ పదం " క్లెయిన్ - వెనెడిగ్ " పదానికి కూడా లిటిల్ వెనిస్ అనే అర్ధాన్ని స్పురించజేస్తుంది.అయినప్పటికీ వెస్పుక్కీ, ఒజెడా బృందాలకు చెందిన సభ్యుడు " మార్టిన్ ఫెర్నాండెజ్ డీ ఎంసియో " తన రచనలో వైవిధ్యమైన అభిప్రాయం వెలిబుచ్చాడు. ఈప్రాంతంలో వెనుసియేలా అనే స్థానికజాతి ప్రజలు నివసించిన కారణంగా ఈప్రాంతానికి వెనుజ్వేలా అనే పేరు వచ్చిందని ఆయన వివరించాడు.[24]
మానవ అవాసాల సాక్ష్యాల ఆధారంగా ప్రస్తుత వెనుజ్వేలా ప్రాంతంలో 15,000 పూర్వం నుండి మానవులు నివసించారని విశ్వసిస్తున్నారు. పశ్చిమ వెనుజ్వేలాలోని రియో పెడ్రెగల్ నది ఎగువప్రాంతంలో ఈ సమయంలో ఆకు ఆకారం ఉన్న ఉపకరణాలు, చెక్కుడు ఉపకరణాలు, ప్లానికాంవెక్స్ స్క్రాపింగ్ ఉపకరణాలు రూపొందించి ఉపయోగించబడ్డాయని ఆధారాలు నిరూపిస్తున్నాయి.[25]లేట్ ప్లెయిస్టోసెనే కాలంనాటి ఈటెమొన వంటి వేట ఉపకరణాలు వ్యాయవ్య వెనుజ్వేలా ఎల్.జాబొ ప్రాంతాలలో లభించాయి. రేడియోకార్బన్ డేటింగ్ ఆధారంగా ఈ ఉపకరణాలు క్రీ.పూ 13,000 నుండి 7,000 నాటివని భావిస్తున్నారు.[26]స్పెయిన్ విజయానికి ముంది ఇక్కడ నివసించిన ప్రజలగురించిన జనసంఖ్య స్పష్టంగా తెలియనప్పటికీ దాదాపు ఒక మిలియన్ ప్రజలు ఇక్కడ నివసించారని అంచనా వేస్తున్నారు.[27] అదనంగా ప్రస్తుతం ఇండిజెనిస్ ప్రజలుగా గుర్తించబడుతున్న ప్రజలలో కలినా ప్రజలు (కరిబ్స్), అయుకె,కాక్యూషియో, మరిచే, టిమొటొ- కుయికా సాంస్కృతిక ప్రజలు భాగంగా ఉండేవారు. వీరిలో అధికంగా అభివృద్ధి చెందిన నాగరికత కలిగిన ప్రజలు నీటిపారుదల సౌకర్యాలు కలిగిన టెర్రస్ వ్యవసాయభూములతో చక్కని ప్రణాళికా బద్ధమైన గ్రామాలు నిర్మించుకుని నివసించారు.వారు నీటిని నిల్వచేకుని వాడుకునే వారు.[28] వారినివాసాలు ప్రధానంగా రాళ్ళు,కొయ్యలు, పైకప్పులతో నిర్మించుకున్నారు. వారు చాలాభాగం ప్రశాంతంగా జీవించారు. వారు వ్యవసాయ ఆధారిత జీవితం సాగించారు. ప్రధానంగా ఉర్లగడ్డలు, ఉల్కో పంటలు పండించారు. [29] వారు ఆంత్రొపొమార్ఫిక్ సెరామిక్ హస్థకళావస్తువులు తయారుచేసారు. వారు నారుతో వస్త్రాలను, నివాసాల కొరకు చాపలు నేసారు. వారు అరెపా అనే ధాన్యం కనిపెట్టారు.ఇది వెనుజ్వేలా ప్రధాన ఆహారాలలో ఒకటి. యురేపియన్ విజయం తరువాత యురేపియన్ వారి వలన వ్యాపించిన అంటువ్యాధుల కారణంగా స్థానికజాతి ప్రజలసంఖ్య క్షీణించింది.[27] కొలంబియన్ పూర్వపు ప్రజలలో కొందరు కొలంబియా ఉత్తర భాగంలో ఉన్న జాతులు మొక్కజొన్న పండిస్తున్నారు. దక్షిణ కొలంబియా ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు కర్రపెండలం పండిస్తున్నారు.[27] ఇలానొస్లో చాలాభాగం స్లాష్ అండ్ బర్న్ విధానం అనుసరిస్తున్నారు. [27]
1498లో క్రిస్టోఫర్ కొలబస్ అమెరికాకు మూడవమారు ప్రయాణంచేస్తూ గల్ఫ్ ఆఫ్ పరియా చేరుకున్నాడు. [30] భూభాగంలో విస్తారంగా ఉన్న మంచినీటిని చూసి ఆశ్చర్యచకితుడై కొలంబస్ ఈప్రాంతాన్ని " భూలోక స్వర్గం " అని వర్ణించాడు.కొలమస్ భూలోకస్వర్గంగా భావించిన ఈప్రాంతానికి " లాండ్ ఆఫ్ గ్రేస్ " అని నామకరణం చేసాడు. అది ప్రస్తుతం వెనుజ్వేలా ముద్దుపేరుగా మారింది.1522లో వెనుజ్వేలా ప్రధానభూమిలో స్పెయిన్ స్థాపించిన శాశ్వత సెటిల్మెంటు (కుమనా నగరం) దక్షిణ అమెరికాలో మొదటి సెటిల్మెంటుగా భావించబడుతుంది.present-day[update] 16వ శతాబ్దంలో స్పెయిన్ రాజు కాంట్రాక్ట్ ద్వారా జర్మన్ వెల్సర్ బ్యాంకింగ్ కుటుంబానికి మినహాయింపు ప్రాంతంగా (1528-1546) ఇచ్చాడు. స్థానిక నాయకులు గుయాయికైపురొ (సిర్కా 1530-1568), టమనకొ (1573లో మరణించాడ్) స్పానిష్ దాడులను అడ్డగించడానికి ప్రయత్నించారు.కొత్తగా చేరిన యురేపియన్లు వారిని అణిచివేసారు. కరాకాస్ స్థాపుకుడు " డియాగొ డీ లొసాడా " అదేశంతో టమనకొ మరణించాడు.[31] 16వ శతాబ్దంలో స్పెయిన్ కాలనైజేషన్ సమయంలో కలినా సంతతికి చెందిన ప్రజలు తమకుతాముగా రోమన్ కాథలిజం స్వీకరించాడు. దీనిని అడ్డగించిన గిరిజన నాయకుల పేర్లు వారి స్మారకార్ధం (కారకాస్, చకాయో, లాస్ టెకక్యూ) కొన్ని ప్రాంతాలకు పెట్టారు.వారు ఉత్తర సముద్రతీరంలో ఆరంభకాల సెటిల్మెంట్లను స్థాపించడంపై దృష్టి కేంద్రీకరించారు.[27] 18వ శతాబ్దం మద్యలో స్పానిష్ ఒరియంటో నది లోతట్టు ప్రాంతాలకు విస్తరించారు. ఇక్కడ వారిని యెకునా ప్రజలు (మకిరిటారే ప్రజలు) తీవ్రంగా అడ్డగించారు (1775-1776).[32]తూర్పు వెనుజ్వేలా స్పానిష్ ప్రాంతాలను " న్యూ అండలుసియా ప్రొవింస్ " రూపొందించారు.16వ శతాబ్దం ఆరంభంలో ఇది " రాయల్ అయుడియంసియా ఆఫ్ శాంటో డోమింగో " పాలనలో ఉండేది. 18వ శతాబ్దం ఆరంభంలో వెనుజ్వేలా లోని అధికభాగం " వైశ్రాయల్టీ ఆఫ్ న్యూగ్రనడా "లో భాగంగా ఉండేది.1777 లో ఇది " కేప్టెంసీ జనరల్ " పేరుతో స్వయప్రతిపత్తి కలిగి ఉంది. 1567లో మద్య సముద్రతీరప్రాంతంలో కారకాస్ పట్టణం స్థాపించబడింది. " లా గుయైరా " నౌకాశ్రయానికి సమీపంలో ఉన్నందున ఇది చాలా కీలకప్రాంతంగా మారింది. ఈప్రాంతం పర్వత లోయలలో ఉన్నందున సముద్రపు దొంగల నుండి రక్షణ లభించింది. ఇది సారవంతమైన , ఆరోగ్యవంతమైన వాతావరణ పరిస్థితులను కలిగి ఉంది.[33]
అమెరికన్ విప్లవం , ఫ్రెంచి విప్లవంలో పాల్గొన్న " ఫ్రాంసిస్కో డీ మిరాండా " నాయకత్వంలో అసఫలమైన పలు వరుస తిరుగుబాట్లు జరిగిన తరువాత 1811 జూలైలో వెనుజ్వేలా స్వతంత్రం ప్రకటించబడింది.[34] తరువాత వెనుజులియన్ స్వతంత్రయుద్ధం ఆరంభం అయింది. 1812లో కారకాస్ భూకంపం సంభవించింది. భూకంపానికి ఇలానెరో వెనుజులియన్ తిరుగుబాటు మొదలైంది. భూకంపం , తిరుగుబాటు కలిసి వెనుజ్వేలాను పతనం చేసింది. .[35] 1813 ఆగస్టు 7న రెండవ రిపబ్లిక్ ఆఫ్ వెనుజ్వేలా కొన్ని మాసాల తరువాత పతనం అయింది.[36]" సైమన్ బొలివర్ " జోస్ అంటానియన్ పాయెజ్ , అంటానియో జోస్ డీ సుక్రే సాయంతో 1821 లో " బాటిల్ ఆఫ్ కరబొబొ "లో విజయం సాధించిన తరువాత వెనుజ్వేలాకు సార్వభౌమాధిపత్యం లభించింది.[37] 1823 జూలై 24న " జోస్ ప్రుడెంసియో పడిల్లా " , " రాఫెల్ అర్డనెటా " బాటిల్ ఆఫ్ లేక్ మరకైబొ యుద్ధంలో విజయంతో వెనుజ్వేలా స్వాతంత్ర్యం హరించాడు.[38] న్యూ గ్రనడా కాంగ్రెస్ బొలివర్‌కు గ్రనడియన్ సైనికాధికారం ఇచ్చింది. తరువాత ఆయన కొన్ని దేశాలకు స్వతంత్రం కల్పించి " గ్రాన్ కొలంబియా "ను స్థాపించాడు. [37] బొలివర్ కొరకు పలు యుద్ధాలలో పాల్గొని విజయం సాధించిన సుక్రే ఈక్వెడార్‌కు స్వతత్రం కల్పించి బొలీవియాకు రెండవ అధ్యక్షుడు అయ్యాడు. వెనుజ్వేలా 1830 వరకు " గ్రాన్ కొలంబియా "లో భాగంగా ఉంది. పాయెజ్ నాయకత్వంలో జరిగిన తిరుగుబాటు సమయంలో స్వతంత్ర వెనుజ్వేలా ప్రకటన చేయబడింది. కొత్త రిపబ్లిక్కు పాయెజ్ మొదటి అధ్యక్షుడు అయ్యాడు.[39] రెండు దశాబ్ధాల యుద్ధాలలో వెనుజ్వేలా నాలుగవ వంతు నుండి మూడవ వంతు జనాభా క్షీణించిన తరువాత 1830 నాటికి జనసంఖ్య 8,00,000 ఉంది.[40]
వెనుజ్వేలా జంఢాలో ఉన్న పసుపు వర్ణం భూసంపదకు, నీలివర్ణం సముద్రానికి (వెనుజ్వేలాను అది స్పెయిన్ నుండి వేరు చేస్తుంది) , ఎరుపు వర్ణం స్వతంత్రంకొరకు చిందించిన రక్తానికి సంకేతంగా ఉన్నాయి.[41] 1854లో వెనుజ్వేలాలో బానిసత్వం నిషేధించబడింది.[40] 19వ శతాబ్ధపు వెనుజ్వేలా చరిత్రలో అధికభాగం రాజకీయ అల్లర్లు , నియంతృత్వపాలన చోటుచేసుకుంది.[42] 1830 - 1863 మద్య స్వతంత్రసమర వీరుడు పాయెజ్ మూడు మార్లు అధ్యక్షపదవి అధిష్టించి మొత్తం 11 సంవత్సరాలు పాలన చేసాడు. మద్య కాలంలో ఒక మిలియన్ కంటే అధిక జనసంఖ్య లేని దేశంలో లక్షలాది మంది మరణాలకు కారణమైన ఫెడరల్ యుద్ధం (1859-1863) కొనసాగింది. 1870-1887 మద్యకాలంలో అంటానియా గుజ్మన్ బ్లానొ, కౌడిల్లో 13 సంవత్సరాలపాలన జరిగింది. మద్యలో మరొక ముగ్గురు అధ్యక్షుల పాలన జరిగింది.1895 లో గయానా ఎసెక్విబా విషయంలో గ్రేట్ బ్రిటన్ , వెనుజ్వేలా మద్య సాగిన వివాదాలలో బ్రిటన్ బ్రిటిష్ గయానా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నది. [43] 1889లో సిప్రియానొ కాస్ట్రొ తన స్నేహితుడు " జుయాన్ విసెంటే గొమెజ్ " సాయంతో టాచిరా స్టేట్‌లోని అండీన్ వద్ద ఉన్న తన ఆర్మీ బేస్ నుండి సైన్యాలను నడిపించి కార్కాస్ అధికారం చేజిక్కించుకున్నాడు. .
మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మరాకైబొ సరోవరం వద్ద బృహత్తర చమురు నిల్వలు కనిపెట్టబడ్డాయి. అత్యధికంగా వ్యవసాయ ఎగుమతుల ఆధారితమైన వెనుజ్వేలా ఆర్థికరంగంలో ఆయిల్ నిల్వలు మార్పులు తీసుకువచ్చాయి. ఆయిల్ వలన దేశ ఆదాయంతో త్వరితగతిలో అధికమైన అభివృద్ధి 1980 వరకూ కొనసాగింది. 1935లో వెనుజ్వేలా తలసరి జి.డి.పి. లాటిన్ అమెరికా దేశాలలో అత్యధికంగా గుర్తించబడింది.[44] గొమెజ్ దీని నుండి లంచంరూపంలోఅధికమొత్తం అదాయం పొందాడు. అదే సమయం కొత్త ఆదాయవనరుతో అధికారం కేంద్రీకృతం చేసి తన అధికారాన్ని బలోపేతం చేసుకోవడానికి ఆయనకు అవకాశం లభించింది.కొంతకాలం అధ్యక్షపదవిని ఇఅతరులకు వదులుకున్నా 1935లో మరణించే వరకు వెనుజ్వేలాలో గోమెజ్ అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా కొనసాగాడు. గొమెసిస్టా నియంతృత్వ విధానం ఎలెజర్ లోపెజ్ కాంట్రెరాస్ కాలంలో కూడా కొనసాగింది. అయినా 1941 నుండి ఇసియాస్ మెడినా అంగారిటా పలు సంస్కరణలతో పాలనలో కొంత వెసులుబాటు కలిగింది.రెండవ ప్రపంచ యుద్ధం తరువాత దక్షిణ ఐరోపా ప్రాంతాల నుండి (ప్రధానంగా స్పెయిన్, ఇటలీ, పోర్చుగల్ , ఫ్రాన్స్) , బీద లాటిన్ అమెరికన్ దేశాల నుండి వలస ప్రజలు వెనుజ్వేలా చేరిన తరువాత వెనుజ్వేలా సొసైటీలో మార్పులు తీసుకు వచ్చింది.
1945లో సివిలియన్ - మిలటరీ తిరుగుబాటు మెడినా అంగారిటా మూడు సంవత్సరాల కాలం ప్రజాస్వామ్యం కొనసాగింది. 1947లో అధ్యక్ష ఎన్నికలలో " రొములో గల్లెగొస్ " విజయం సాధించాడు. ఇది స్వేచ్ఛగా , చక్కగా జరిగిన మొదటి ఎన్నికగా విశ్వసించబడింది. 1948లో మార్కోస్ పెరెజ్ జిమెనెజ్ , గల్లెగోస్ రక్షణమంత్రి కార్లోస్ డెల్గడో చల్బౌడ్ నాయకత్వంలో సైనిక తిరుగుబాటు చేసి గల్లెగొను పదవి నుండి తొలగించారు. సైనిక ప్రభుత్వంలో అత్యంత ప్రభావితుడైన పెరెజ్ చల్బౌద్ను పప్పెట్ అధ్యక్షునిగా చేసి పాలన సాగించాడు.1950లో కిడ్నాప్ చేసి హత్యచేయబడిన చల్బౌద్ మరణం వెనుక పెరెజ్ హస్థం ఉందని అనుమానించారు. 1952 అధ్యక్ష ఎన్నికలలో సైనిక ప్రభుత్వం ఓటమిపాలైంది. ఎన్నికలను నిర్లక్ష్యం చేసి పెరెజ్ అధ్యక్షపదవి వహించి 1958 వరకు పాలన సాగించాడు.పెరెజ్ 1958 జనవరి 23 న బలవంతంగా పదవి నుండి తొలగించబడ్డాడు. [45] ప్రజాస్వామ్యం స్థాపించడానికి " కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ వెనుజ్వేలా " మినహాయింపుగా రాజకీయపార్టీలన్ని కలిసి " పుంటో ఫిజో పాక్ట్ " మీద సంతకం చేసాయి.తరువాత డెమొక్రటిక్ యాక్షన్ , సి.ఒ.పి.ఇ.ఐ తరువాత నాలుగు దశాబ్ధాల కాలం రాజకీయాలలో ఆధిక్యత కలిగి ఉన్నాయి.
1960లో ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ నేషనల్ లిబరేషన్ , ది రివల్యూషనరీ లెఫ్ట్ మూవ్మెంట్ (1960 లో డెమొక్రటిక్ యాక్షన్ నుండి వెలుపలికి వచ్చాయి) వంటి గొరిల్లా తిరుగుబాటులు సంభవించాయి. రఫీల్ కాల్డెరా అధ్యక్షతలో (1969-1974) తిరుబాటులు సమసిపోయాయి. 1968 వెనుజ్వేలా అధ్యక్ష ఎన్నికలలో సి.ఒ.పి.ఇ.ఐ.తరఫున కాల్డెరా విజయం సాధించాడు. ప్రజాస్వామ్య ఎన్నికల ద్వారా వెనుజ్వేలాలో మొదటి సారిగా డెమొక్రటిక్ యాక్షన్ పార్టీ మినహాయింపుగా ఇతర పార్టీ విజయం సాధించింది.
1973లో కార్లోస్ ఆండ్రెస్ పెరెజ్ వెనుజ్వేలా అధ్యక్ష ఎన్నికలలలో విజయం సాధించాడు. అదే సంవత్సరం వెనుజ్వేలా ఆయిల్ క్రైసెస్ సంభవించింది. అందువలన వెనుజ్వేలా ఆదాయం పతనం అయింది. 1976లో ఆయిల్ పరిశ్రమలు జాతీయం చేయబడ్డాయి. పర్యవసానంగా ప్రభుత్వ వ్యయం , ఋణం అభివృద్ధి చెందింది. ఇది 1980 వరకు కొనసాగింది. తరువాత ఆయిల్ ధరలు పతనం కారణంగా వెనుజ్వేలా ఆదాయం మరింత దిగజారింది. 1983లో ప్రభుత్వం ద్రవ్యమారక విలువ తగ్గించింది. నాటకీయంగా వెనుజులియన్ జీవవన స్థాయికి దిగువకు చేరుకుంది. విఫలమైన పలు ఆర్థిక విధానాలు , ప్రభుత్వంలో అధికరించిన లంచగొండితనం బీదరికం , నేరాలు అధికరించడానికి దారితీసాయి. రాజకీయాలలో అస్థిరత నెలకొంది.[46] 1980- 1990 ఆర్థిక సంక్షోభం పొలిటికల్ సంక్షోభానికి దారి తీసాయి. 1989లో ఇవి వందలామంది ప్రాణాలను బలిగొన్నాయి.1992 రెండుమార్లు తిరుగుబాటు ప్రయత్నాలు జరిగాయి. [47] 1993లో అధ్యక్షుడు కార్లోస్ అండ్రెస్ పెర్జ్ మీద లమచగొండి తనం కారణంతో అభిశమ్శన తీర్మానం తీసుకురాబడింది. అధ్యక్షుడు రఫీల్ కాల్డెరా తిరుగుబాటు నాయకుడు " హుగో చావెజ్ "కు క్షమాభిక్ష ఇచ్చాడు.
బొలివేరియన్ రివల్యూషన్ వామపక్ష సోషలిస్ట్ ఉద్యమంగా భావించబడుతుంది.ఉద్యమానికి " ఫిఫ్త్ రిపబ్లిక్ మూవ్మెంటు " , తరువాత " యునైటెడ్ సోషలిస్టు పార్టీ ఆఫ్ వెనుజ్వేలా " స్థాపకుడు వెజునులియన్ అధ్యక్షుడు " హ్యూగో చావెజ్ " నాయకత్వం వహించాడు. 19వ శతాబ్దం ఆరంభంలో వెనుజ్వేలా , లాటిన్ అమెరికా ఉద్యమాలకు నాయకత్వం వహించిన " సైమన్ బొలివర్ " స్మారకార్ధం ఆయన పేరును ఈ ఉద్యమానాకి పెట్టారు. బొలివర్ అమెరికన్ - స్పానిష్ యుద్ధాలలో పాల్గొని ఉత్తర , ఖండాలలోని పలుదేశాలకు స్పానిష్ నుండి స్వతంత్రం రావడానికి ప్రధానపాత్ర వహించాడు. చావెజ్ , మద్దతుదారులు బొలివేరియన్ విప్లవం ద్వారా బృహత్తర ప్రజా ఉద్యం ప్రారంభించి బొలివేరియనిజం, పాపులర్ డెమొక్రసీ , ఆర్థిక స్వాతత్రం, ఆదాయాన్ని సమంగా అందరికి అందేలా చూడడం , రాజకీయ అవినీతికి ముగింపు పలకడం స్థాపించాలని ఆశించారు.
అభిశంశన తీర్మానం తరువాత " చావెజ్ " ఎన్నికలలో (1968) విజయం సాధించాడు. బొలివారియన్ రెవల్యూషన్ ఫలితంగా 1999 లో అసెంబ్లీ సరికొత్తగా వెనుజ్వేలా రాజ్యాంగం రూపొందించింది. పేదవారికి సహాయం అందించడానికి చావెజ్ బొలివరియన్ రివల్యూషన్ ఆరంభించాడు. 2002 ఏప్రిల్‌లో చావెజ్ ప్రత్యర్థులు చేసిన ప్రబల ప్రదర్శన తరువాత చావెజ్ స్వల్పకాలం పదవి నుండి తొలగించబడ్డాడు.[48] రెండు రోజుల తరువాత సైనిక చర్యతో ప్రత్యెర్ధులను బలహీన పరచి చావెజ్ తిరిగి పదవిని చేపట్టాడు.[49][50] చావెజ్ అధికారంలో ఉన్న సమయంలోనే వెనుజులియన్ జనరల్ స్ట్రైక్ (2002 డిసెంబరు నుండి 2003 ఫిబ్రవరి వరకు) జరిగింది.స్ట్రైక్ కారణంగా జి.డి.పి. 27% పతనం అయింది. [51] స్ట్రైక్ తరువాత వెనుజ్వేలా పలుమార్లు ద్రవ్యమారకం తగ్గించవలసిన వత్తిడికి గురైంది.[52][53][54][55][56] ద్రవ్యమారక విలువ తగ్గించడం పరిస్థితిలో కొతంత అభివృద్ధి కలుగజేసింది. చావెజ్ వెనుజిలియన్ రిఫరెండం (2004) వంటి పలు రాజకీయ శోధనలను ఎదుర్కొన్నాడు. 2006 ఎన్నికలలో చావెజ్ మరోమారు అధ్యక్షునిగా ఎన్నిక చేయబడ్డాడు. తిరిగి 2012లో అధ్యక్షినిగా ఎన్నిక చేయబడ్డాడు. ఆరోగ్యసమస్యలు ఎదురైన కారణంగా రెండు సంవత్సరాల కాలం కేంసర్ వ్యాధితో పోరాడి చావెజ్ 2013 మార్చి 5న మరణించాడు. [57] 2013 ఏప్రిల్‌లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. [58] 2010 నాటికి పేదరికం మరింత అధికం అయింది.[59] చావెజ్ మరణం తరువాత నికోలస్ మడురొ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. దేశంలో లోటు అధికం అయిన కారణంగా వెనుజ్వేలాలో మరొకమారు ద్రవ్యమారక విలువ తగ్గించబడింది.[60] లోటులో పాలు, పిండి, ఇతర ముఖ్యావసర వస్తువులు ఉన్నాయి.ఇది పోషాకార లోపానికి (ప్రత్యేకంగా పిల్లలలో) కారణం అయింది. [61][62] 2014లో వెనుజ్వేలా ఎకనమిక్ రిసెషన్‌లోకి ప్రవేశించింది.[63] 2015 నాటికి వెనుజ్వేలా ద్రవ్యోల్భణం 100% నికి చేరుకుంది. [64] 2014-2017 మద్య సాగిన నిరసనలకు ఆర్థిక సమస్యలు, లంచగొండితనం ప్రధాన కారణం అయ్యాయి.[65][66] వీటిలో 50 నిరసనదారులు మరణించారు.
2013 ఏప్రిల్ 14న నికోలస్ మదురో 50.60% ఓట్లతో అధ్యక్షుడయ్యాడు. ది డెమొక్రటిక్ యూనిటీ రౌండ్ టేబుల్ ఆయన ఎన్నిక మోసపూరితమైనదని రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని ఆరోపించింది.[67][68][69] 2014 ఏప్రిల్ ఆరంభంలో పెద్ద ఎత్తున హింసాత్మకచర్యలు, లంచగొండితనం, ద్రవ్యోల్భణం, నిత్యావసర వస్తువుల కొరత మొదలైన సమస్యల కారణంగా ప్రభుత్వవిధానాలను వ్యతిరేకిస్తూ లక్షలాది వెనుజులియన్లు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.[70][71][72][73][74] నిరసనల కారణంగా 40 దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి.[75] " లియోపొల్డొ లోపెజ్ ", " ఆటానియో లెడెజ్మా " వంటి ప్రపక్ష నాయకులు ఖైదు చేయబడ్డారు.[75][76] [77][78][79][80] లియోపొల్డొ లోపెజ్ ఖైదును మానవహక్కుల బృందాలు నిందించాయి.[81] 2015 వెనుజ్వేలా అధ్యక్ష ఎన్నికలలో ప్రతిపక్షం విజయం సాధించింది.[82]
2016 జూలైలో అద్యక్షుడు మాడురొ తన అధికారాన్ని ఉపయోగించి ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించాడు. డిక్రీ ప్రజలను వ్యవసాయక్షేత్రాల, తోటలలో పనిచేసేలా వత్తిడి చేసింది.[83] 2016లో కొలంబియన్ బార్డర్ క్రాసింగులను తాత్కాలికంగా తెరచి ఉంచి ప్రజలు అత్యావసర వస్తువులు, ఆహారం, ఔషధాలు కొనుగోలు చేసుకోవడానికి అనుమతించారు. [84] 2016 సెప్టెంబరులో స్పానిష్ అధ్యయన ప్రచురణ (స్టడీ పబ్లిష్డ్) " డైయిరొ లాస్ అమెరికాస్ " [85] 15% వెనుజులియన్లు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లలో మిగిన ఆహారంతో జీవిస్తున్నారని తెలియజేసింది.క్షీణించిన సాంఘిక స్థితి, అధికరించిన బీదరికం, ఆహారలోపం జైళ్ళలో ఖైదీలసంఖ్య అధికరించడానికి దారితీసింది.[86] 2017 మార్చిలో ప్రతిపక్ష నాయకులు అధ్యక్షుడు " నికోలస్ మాడిరొ "కు నియంతగా ముద్రవేసారు.[87] 2017 జూన్ 28న ఒక పోలీస్ మెన్ " ఆస్కార్ పెరిజ్ " కాకాస్లో ఒక పోలీస్ హెలికాఫ్టర్‌ను దొంగిలించి సుప్రీం కోర్టు మీద బాంబు వేసాడు. తరువాత హింసాత్మక పాలనకు వ్యతిరేకంగా పిలుపునిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన తరువాత ఇంటీరియర్ బిల్డింగ్ సమీపంలో కాల్చివేయబడ్డాడు. హెలికాఫ్టర్ మీద " 350 ఫ్రీడం " బ్యానర్ అతికించబడింది. — మాడురో ఈ దాడిని " టెర్రరిస్ట్ అటాక్ "గా పేర్కొన్నాడు.[88]
వెనుజ్వేలా దక్షిణ అమెరికా ఉత్తరభాగంలో ఉంది. భౌగోళికంగా వెనుజ్వేలా ప్రధానభూభాగం దక్షిణ అమెరిన్ ప్లేట్లో నిలిచి ఉంది. దేశవైశాల్యం 9,16,445 చ.కి.మీ. ఇందులో భూభాగం 8,82,050 చ.కి.మీ. వైశాల్యపరంగా వెనుజ్వేలా ప్రపంచంలో 33వ స్థానంలో ఉంది.వెనుజ్వేలా 0-13 డిగ్రీల ఉత్తర అక్షాంశం , 59-74 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది.
త్రిభుజాకారంలో ఉండే వెనుజ్వేలా మొత్తం ఉత్తర సముద్రతీర పొడవు 2,800 కి.మీ. ఇందులో కరీబియన్ సముద్రంలో ఉన్న ద్వీపాలు , ఈశాన్య సరిహద్దులో ఉన్న అట్లాంటిక్ సముద్ర ద్వీపాలు ఉన్నాయి. పరిశోధకులు వెనుజ్వేలాను 4 భౌగోళిక భాగాలుగా విభజించారు.ఉత్తరదిశలో ఉన్న పర్వతప్రాంతాలు దక్షిణ అమెరికా వాయవ్య సరిహద్దులో ఉన్నాయి. దేశంలోని అత్యంత ఎత్తైన పికొ బొలివర్ (4979 మీ ఎత్తు) ఈప్రాంతంలోనే ఉంది. దక్షిణసరిహద్దును ఆనుకుని గయానా ఎగువభూములు ఉన్నాయి. అమెజాన్ ఉత్తరభాగంలో ఉన్న ఈప్రాంతంలో ప్రపంచంలోని ఎత్తైన జలపాతం అయిన ఏంజెల్ జలపాతాలు ఉన్నాయి. అలాగే పెద్ద టేబుల్ వంటి పర్వతభాగం "తెపుయి " ఉంది. దేశం మద్యభాగంలో ఇలానొస్ ఉంది.ఇక్కడ కొలంబియన్ సరిహద్దుల వరకు విస్తరించిన విస్తారమైన మైదానాలు ఉన్నాయి. లాటిన్ అమెరికాలో అత్యంతపెద్ద డ్రనేజ్ బేసిన్లలో జన్మించిన ఒరియెంటో నది సుసంపన్నమైన సారవంతమైన మట్టిని అందిస్తూ వెనుజ్వేలాలోని వ్యవసాయక్షేత్రాలకు జలాలను అందించే ప్రధాన జలవనరుగా ఉంది.అదనంగా వెనుజ్వేలాలో కరోని నది, అక్యురే నదులు అనే రెండు ప్రధాన నదులు ఉన్నాయి. వెనుజ్వేలా పశ్చిమ సరిహద్దులో కొలంబియా,తూర్పు సరిహద్దులో గయానా, దక్షిణ సరిహద్దులో బ్రెజిల్ దేశాలు ఉన్నాయి. ట్రినాడ్, టొబాగొ, గ్రెనడా, కురాకయొ,అరుబ్, లీవార్డ్ అంటిల్లెస్ మొదలైన కరీబియన్ సముద్రద్వీపాలు వెనుజిలియన్ సముద్రతీరంలో ఉన్నాయి.వెనుజ్వేలా వెనుజ్వేలాకు గయానోతో (ఎస్సెక్యుబొ ప్రాంతం ), కొలంబియా ( " గల్ఫ్ ఆఫ్ వెనుజ్వేలా " ) భూభాగవివాదాలు ఉన్నాయి. సంవత్సరాల సంప్రదింపుల తరువాత 1885లో సరిహద్దు వివాదాలు సమసి పోయాయి. [89] వెనుజ్వేలా ప్రకృతి వనరులలో పెట్రోలియం, సహజవాయువు, ఇనుము, బంగారం, ఇతర ఖనిజాలు ప్రధానమైనవి. వెనుజ్వేలాలో విశాలమైన వ్యవసాయక్షేత్రాలు, నీరు ఉన్నాయి.
వెనుజ్వేలా భూమద్య రేఖాప్రాంతంలో ఉంది. దిగువభూభాగంలో ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. ఎగువభూభాగంలో ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. వర్షపాతం వాయవ్యభూభాగంలోని సెమీయరిడ్ భూభాగంలో 430 మి.మీ., తూర్పు భూభాగంలోని ఒరినొకొ డెల్టా, దక్షిణ భూభాగంలో ఉన్న అమెజాన్ జంగిల్లో వర్షపాతం 1000 మి.మీ ఉంటుంది. వర్షపాతం ముందుగా నవంబరు నుండి ఏప్రిల్ వరకు తరువాత ఆగస్టు నుండి అక్టోబరు వరకు ఉంటుంది. ఈసీజన్లను హాట్-హ్యూమిడ్, కోల్డ్- డ్రై సెషంస్ అని పేర్కొంటారు. తూర్పు పడమరలుగా విస్తరించిఉన్న " కార్డిలెరా డీ లా కోస్టా పర్వతశ్రేణి" భూభాగంలోనే అత్యధికంగా ప్రజలు నివసిస్తూ ఉన్నారు.[42] వెనుజ్వేలా ఎత్తు, ట్రాపికల్ డ్రై, డ్రై వింటర్,, పోలార్ వాతావరణం ఆధారంగా 4 భౌగోళిక వాతావరణ మండలాలుగా విభజించబడి ఉంది. [90][91][92] 800 మి ఎత్తుకంటే తక్కువ ఉన్న ప్రాంతాన్ని ట్రాపికల్ జోన్లో ఉష్ణోగ్రత 26-28 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. 800-2000మీ ఎత్తు వరకు ఉండే టెంపరేట్ భూభాగం ఉష్ణోగ్రత 12-25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది.ఈభూభాగంలోనే వెనుజ్వేలా రాజధాని నగరంతో చేర్చి పలు ప్రధాన నగరాలు ఉన్నాయి.2000-3000 మీ ఎత్తు ఉన్న కోల్డ్ - జోన్ భూభాగంలో ఉష్ణోగ్రత 9-11 డిగ్రీల సెంటీగ్రీడ్ ఉంటుంది. 3000 మి ఎత్తుకంటే అధికంగా ఉన్న ఆండెస్ పర్వతప్రాంతంలో ఉన్న పచ్చిక మైదానాలు, స్నోఫీల్డ్ ప్రాంతంలో ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది.మచిక్యూస్లో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.[93] [94]
వెనుజ్వేలా " నియోట్రాపిక్ ఎకోజోన్ "లో ఉంది. దేశంలో చాలాభూభాగం " ట్రాపికల్ అండ్ సబ్ట్రాపికల్ మాయిస్ట్ బ్రాడ్లీఫ్ ఫారెస్ట్ "తో కప్పబడి ఉంటుంది. ఇది 17 బృహత్తర జీవవైవిధ్యం (మెగా డైవర్స్) కలిగిన దేశాలలో ఒకటిగా గుర్తించబడుతుంది.[95] వెనుజ్వేలా పశ్చిమంలో ఆనెడెస్ పర్వతశ్రేణి, దక్షిణంలో అమెజాన్ బేసిన్ వర్షారణ్యాలు, మద్యలో " ఇలానోస్ " మైదానాలు, కరీబియన్ సముద్రతీరం మీదుగా, తూర్పున ఒరినొకొ నది డెల్టా వరకు విస్తరించి ఉంది. ఇంకా వాయవ్యంలో ఇసుక క్సెరిక్ పొదలు, ఈశాన్యంలో మడ అరణ్యాలు (మాన్ గ్రోవ్ ఫారెస్ట్) ఉన్నాయి.[42] వెనుజ్వేలా మేఘారణ్యాలు (క్లౌడ్ ఫారెస్ట్), వర్షారణ్యాలు సుసంపన్నంగా ఉంటాయి. .[96]
వెనుజ్వేలా జంతుజాలం వైవిధ్యమైనది. ఈకడ మనాటీ, త్రీ- టయ్డ్-స్లాత్, టూ- టయ్డ్ - స్లాత్, అమెజాన్ నది డాల్ఫిన్, ఒరినొకొ మొసలి (6.6 మీ వరకు పెరుగుతుంది)మొదలైన జంతుజాలం ఉంది. వెనుజ్వేలాలో 1,417 పక్షిజాతులు ఉన్నాయి.వీటిలో 48 జాతులు మరెక్కడా కనిపించవు.[97] వెనుజ్వేలాలో ఇబిస్, అస్ప్రే, కింగ్‌ఫిషర్, యెల్లొ- ఆరెంజ్ వెనుజిలియన్ ట్రౌపియల్ (జాతీయపక్షి)మొదలైన పక్షులు ఉన్నాయి.గెయింట్ యాంట్ ఈటర్, చిరుత, కేపీబరా, ప్రంపంచంలోని అతిపెద్ద రోడెంట్ మొదలైన క్షీరదాలు ఉన్నాయి.వెనుజ్వేలాలోని అవియన్, క్షీరదజాతులు అధికంగా ఒరినొకొ దక్షిణంలో ఉన్న అమెజాన్ వర్షారణ్యాలలో ఉన్నాయి.[98]
ఆర్.డబల్యూ.జి. డెనిస్ అందించిన వివరాల ఆధారంగా ఫంగీ (నాచు)[99] గురించిన డిజిటలైడ్ రికార్డులు లభిస్తున్నాయి.[100] డేటాబేస్ ఆధారంగా వెనుజ్వేలాలో 3,900 జాతుల ఫంగస్ జాతులు ఉన్నాయని భావిస్తున్నారు. అయినప్పటికీ మొత్తం నమోదు చేయబడలేదు. వెనుజ్వేలాలో వీటికంటే అధికమైన ఫంగస్ జాతులు ఉన్నాయని భావిస్తున్నారు. ప్రపంచంలోని మొత్తం ఫంగస్ జాతులలో 7% వెనుజ్వేలాలో ఉన్నాయని విశ్వసిస్తున్నారు. [101]
వెనుజ్వేలాలోని మేఘారణ్యాలు, దిగువభూమిలోని వర్షారణ్యాలలో 25,000 జాతులు లతలు ఉన్నాయి. [96] వీటిలో ఫ్లర్ డీ మాయో తీగ (కేట్లెయా మొసియె) ఇది జాతీయ పూవుగా నిర్ణయించబడింది.
వెనుజ్వేలా ఎండిమిజం అధికంగా ఉన్న 20దేశాలలో ప్రథమస్థానంలో ఉంది.[102] వెనుజ్వేలాలోని జంతుజాలంలో 23% సరీసృపాలు, 50% ఉభయచరాలు ఎండిమిక్గా (మరెక్కడా కనిపించవు).[102] ప్రస్తుతం లభించే సమాచారం స్వల్పమైనా మొదటి ప్రయత్నంలో వెలువరించిన వివరాలు వెనుజ్వేలాలోని 1334 జాతుల ఫంగసులు ఎండిమిక్ తెలియజేస్తున్నాయి.[103] 21,000 (38%)జాతుల మొక్కలు మరెక్కడా కనిపించవు.
వెనుజ్వేలా అత్యధిక జీవవైద్యం కలిగిన 10 ప్రపంచ దేశాలలో ఒకటి. ఆర్థిక, రాజకీయాల కారణంగా అత్యధికంగా అరణ్యనిర్మూలన చేస్తున్న దేశాలలో కూడా వెనుజ్వేలా ఒకటిగా ఉంది.వెనుజ్వేలాలో ప్రతిసంవత్సరం దాదాపు 2,87,600 హెక్టారుల అరణ్యం శాశ్వతంగా నిర్మూలించబడుతుంది. కొన్ని ప్రాంతాలాలో గనులత్రవ్వకాలు, ఆయిల్ అన్వేషణ, లాగింగ్ మూలంగా అరణ్యాల పరిస్థితి దిగజారుతూ ఉంది.1990, 2005 మద్య వెనుజ్వేలా అధికారికంగా 8.3% అరణ్యం (4.3 మిలియన్ల హెక్టార్లు) నిర్మూలించబడింది. ప్రతిస్పందనగా పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రకృతి వనరులను కాపాడడానికి ఫెడరల్ రక్షణ కల్పించబడింది. ఉదాహణగా 20%-30% అరణ్యం రక్షించబడింది. [98] దేశం బయోస్ఫేర్ రిజర్వ్ " వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫేర్ రిజర్వ్ "లో భాగంగా ఉంది. రాంసర్ కాంవెంషన్లో 5 చిత్తడి నేలలు నమోదు చేయబడ్డాయి.[104] 2003 లో దేశంలోని 70% భూభాగం (200 సంరక్షిత ప్రాంతాలు వీటిలో 43 నేషనల్ పార్కులు ఉన్నాయి) కంసర్వేషన్ మేనేజ్మెంటు ఆధీనంలోకి చేర్చబడ్డాయి.[105] వెనుజ్వేలాలోని 43 నేషనల్ పార్కులలో కనైమా నేషనల్ పార్క్, మొరొకాయ్ నేషనల్ పార్క్ , మొచిమా నేషనల్ పార్క్ ప్రధానమైనవి. దక్షిణ సరిహద్దులో యనోమి ప్రజల రిజర్వ్ ఉంది.వ్యవసాయదారులు, మైనర్స్ , యనోమీ కాని సెటిలర్ల ఉపయోగంలో 32,000 చ.కి.మీ ఉంది. " ఇంటెండెడ్ నేషనల్ డిటర్మైండ్ కంట్రిబ్యూషంస్ "లో చేర్చబడని కొన్ని దేశాలలో వెనుజ్వేలా ఒకటి.[106][107]
" సెంటేల్ బ్యాంక ఆఫ్ వెనుజ్వేలా " మానిటరీ పాలసీ ద్వారా వెనుజులన్ బొలివర్ (వెనుజ్వేలా కరెంసీ) అభివృద్ధి బాధ్యత వహిస్తుంది. సెంటేల్ బ్యాంక ఆఫ్ వెనుజ్వేలా అధ్యక్షుడు వెనుజ్వేలా ప్రతినిధిగా " ఇంటర్నేషన్ మానిటరీ ఫండ్ "లో సేవలందిస్తూ ఉంటాడు." ది హెరిటేజ్ ఫౌండేషన్ " ప్రపంచంలో ఆస్తిహక్కులు బలహీనంగా ఉన్న దేశంగా వెనుజ్వేలాను పేర్కొన్నది.వెనుజ్వేలా పెట్రోలియం రగం ఆధిక్యత వహిస్తున్న మిశ్రిత ఆర్థికరంగాన్ని కలిగి ఉంది.[108] అది దాదాపు జి.డి.పి.లో మూడవ వంతుకు భాగస్వామ్యం వహిస్తుంది. 2016 సరాసరి తలసరి జిడి.పి. $15,000 యు.ఎస్.డి. ప్రంపంచదేశాలలో వెనుజ్వేలా తలసరి సరాసరి జి.డి.పి.లో 109వ స్థానంలో ఉంది. [45] వెనుజ్వేలాలో మినహాయింపు ఇస్తూ " గాసొలైన్ యూసీజ్ అండ్ ప్రైసింగ్ " (లీస్ట్ ఎక్స్పెంసివ్ పెట్రోల్) ప్రపంచంలో అతితక్కువ వెలకు అందిస్తుంది.2011 గణాంకాల ఆధారంగా 60% వెనుజ్వేలా రిజర్వులు బంగారం రూపంలో ఉంది. వైశాల్యపరంగా దేశాల సరాసరి బంగారు నిల్వలకు ఇది 8 రెట్లు అధికం. వెనుజ్వేలా బంగారం అధికంగా లండన్ లోఉంది. 2011 నవంబరు 25న మొదటివిడతగా $ 11 బిలియన్ల యు.ఎస్.డి. బంగారం కారకాస్ చేరింది. బంగారం స్వదేశానికి తీసుకురావడం సావరిన్ స్టెప్ చావెజ్ పేర్కొన్నాడు. యు.ఎస్., ఐరోపా అల్లర్లలో దేశ విదేశీరిజర్వులను రక్షించడం అవసరం ఆయన అని పేర్కొన్నాడు.[109] అయినప్పటికీ వెనుజ్వేలా అతిత్వరగా తిరిగి వచ్చిన బంగారాన్ని వేగంగా వ్యయంచేసింది.[110]
పారిశ్రామికరంగం జి.డి.పి.లో 17%కి భాగస్వామ్యం వహిస్తుంది. వెనుజ్వేలా స్టీల్, అల్యూమినియం, సిమెంట్ మొదలైన వాటిని భారీగా ఉత్పత్తిచేసి ఎగుమతి చేస్తుంది.సియుడాడ్, గయానా సమీపంలోని గురి ఆనకట్ట వద్ద ఉత్పత్తిచేయబడుతున్న విద్యుత్తు వనుజులాలో ఉత్పత్తి చేయబడుతున్న మొత్తం విద్యుత్తులో నాల్గింట మూడు వంతులు ఉంటుంది. విద్యుత్తు తయారుచేస్తున్న అతిపెద్ద ప్రపంచ సంస్థలలో ఇది ఒకటి. ఇతర ఉత్పత్తులలో ఎలెక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, బివరేజెస్, ఆహారాలు ప్రాధాన్యత వహిస్తున్నాయి. వ్యవసాయం వెనుజ్వేలాలో 3% జి.డి.పి.కి, 10% ఉపాధికి భాగస్వామ్యం వహిస్తుంది.వ్యవసాయ క్షేత్రాలు వెనుజ్వేలా మొత్తం వైశాల్యంలో 25% మాత్రమే ఉన్నాయి. వెనుజ్వేలా వ్యవసాయ ఉత్పత్తులలో స్వయంసమృద్ధం కాదు. 2012లో వెనుజ్వేలా మొత్తం ఆహార వాడకం 26 మిలియన్ మెట్రిక్ టన్నులు 2003 నుండి వెనుజ్వేలా వ్యవసాయ ఉత్పత్తులు 94.8% అభివృద్ధి చెందింది.[111]
20వ శతాబ్దంలో ఆయిల్ అన్వేషణ జరిపిన తరువాత ప్రంపంచంలో అధికంగా ఆయిల్ ఉత్పత్తి చేస్తున్న దేశాలలో వెనుజ్వేలా ఒకటిగా, ఫండింగ్ సభ్యదేశంగా మారింది. గతంలో అభివృద్ధి చేయబడని కాఫీ, కొకొయా మొదలైన వ్యవసాయ ఉత్పత్తులు ఆయిల్ ఎగుమతులతో చేర్చి ఎగుమతులు వెనుజ్వేలా ఆర్థికరగం, ఆదాయాలలో ఆధిక్యత చేస్తున్నాయి.1980 ఆయిల్ సంక్షోభం విదేశీఋణాల సంక్షోభానికి, దీర్ఘకాల ఆర్థిక సంక్షోభానికి దారితీసాయి. ఇది 1996లో ద్రవ్యోల్భణం 100%, 1995 నాటికి పేదరికం 66%కి చేరుకుంది. [9] 1998 నాటికి తలసరి జి.డి.పి. 1993 స్థాయికి చేరుకుంది. అలాగే 1978 జి.డి.పి.లో మూడవ వంతుకు పడిపోయింది. [10] 1990లో కూడా వెనుజ్వేలాలో బ్యాంకింగ్ సంక్షోభం మొదలైంది.2001లో ఆయిల్ ధరలు తిరిగి కోలుకున్న తరువాత వెనుజ్వేలా ఆర్థికరంగం తిరిగి వేగవంతంగా అభివృద్ధి చెందింది.2000లో బొలివియన్ మిషనరీ వంటి సేవాసంస్థల సహకారంతో వెనుజ్వేలా సాంఘికాభివృద్ధి (ప్రత్యేకంగా ఆరోగ్యం, విద్య, పేదరికం నిర్మూలన) ఆరంభం చేసింది. 2000 లో వెనుజ్వేలా, 188 ఇతర దేశాలు నిర్ణయించిన 8 అంశాలతో కూడిన " మైలేనియం డెవెలెప్మెంటు " కలిగించి ప్రేరణ ఆధారంగా అధ్యక్షుడు చావెజ్, ఆయన ప్రభుత్వంచేత పలు సాంఘికాభివృద్ధి విధానాలు ప్రవేశపెట్టబడ్డాయి.[112]
చేవెజ్ ప్రభుత్వం భవిష్యత్తు అత్యవసరాలకు భద్రపరచకుండా నిధులను ధారాళంగా వ్యయం చేయడం ప్రశ్నార్ధంకంగా మారింది. 2010 నాటికి ప్రభుత్వవిధానాల కారణంగా ఆర్థిక వివాదాలు, పేదరికం అభివృద్ధి చెందాయి.[17][18][113][114] ఆర్థికసంక్షోభం కరెంసీ డివాల్యుయేషన్కు దారితీచిన కారణంగా చావెజ్ ప్రభుత్వం కరెంసీ కంట్రోల్ ప్రవేశపెట్టింది.ఫలితంగా ఇది తరువాత సంవత్సరాలలో దేశీయమార్కెట్కు సమాంతరంగా డాలర్ మార్కెట్ అభివృద్ధికి దారితీసింది. " యు.ఎన్. మైలేనియం డెవెలెప్మెంట్స్ గోల్స్ " వెలువరించిన తరువాత వెనుజులియన్ ప్రభుత్వం వెలువరించిన డేటా వివాదాస్పదమైంది.
[62][115] అత్యావసర ఆహారాల కొరత కారణంగా వెనుజ్వేలాలో పోషకాహార లోపం అధికరించింది.[62] 2013లో దేశంలో నెలకొన్న లోటు కారణంగా కరెంసీ విలువ తగ్గించబడింది. [116][117][118] లోటులో అదనంగా టయిలెట్ పేపర్, పాలు, పిండి చేర్చబడ్డాయి.[119] టాయ్‌లెట్ పేపర్ కొరత కారంణంగా భీతి అధికమై ప్రభుత్వం టాయ్‌లెట్ పేపర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంది. తరువాత ఆహారవినియోగ సంస్థలను జాతీయంచేయడం వైపుగా ప్రభుత్వం అడుగులు వేసింది.[120][121] 2013లో అధ్యక్షుడు " నికోలస్ మడురొ " తీసుకున్న నిర్ణయం తరువాత వెనుజ్వేలా బాండ్స్ విలువ పలుమార్లు తగ్గించబడింది. ఆయన తీసుకున్న మరొక నిర్ణయం కారణంగా షాపులు, గోడౌన్లు మూసి వస్తువులను అమ్మివేయవలసిన వత్తిడి అధికమై భవిష్యత్తు లోటును అధికరించడానికి దారి తీసింది.[122] 2016లో వెనుజ్వేలా కంస్యూమర్ ధరలు 800% అధికం అయ్యాయి. ఎకనమీ 18.6% క్షీణించింది.[123]
సమీప దశాబ్ధాలలో పర్యాటకరంగం గణనీయంగా అభివృద్ధి చేయబడింది. వెనుజ్వేలా భౌగోళిక ప్రాధాన్యత, వైవిధ్యమైన ప్రకృతిసౌందర్యం, సుసంపన్నమైన జీవవైవిధ్యం, ఉష్ణమండల వాతావరణం దేశాన్ని ప్రముఖ పర్యాటకగమ్యంగా మారుస్తుంది.ఆహ్లాదకరమైన అదేసమయంలో అనుకూలమైన దేశంలోని ఏప్రాంతమైనా సంవత్సరం అంతటా సందర్శించే వీలుకలిగిస్తుంది.మార్గరిటా ద్వీపం వినోదానికి, రిలాక్సేషన్‌కు ప్రధాన పర్యాటక ఆకర్షణగా ఉంది. ఆధునిక ఇంఫ్రాస్ట్రక్చర్, అందమైన సముద్రతీరాలు వాటర్ స్పోర్ట్స్‌కు అనుకూలంగా ఉంటుంది. ఫీవర్స్ కేస్టిల్, ఫోర్ట్రెస్, చర్చీలు సంప్రదాయ ఈప్రాంతానికి సంప్రదాయ సౌందర్యం ఇస్తున్నాయి.
" ది ఆర్చిపిలాగో ఆఫ్ రొక్యూస్" ఒక ద్వీపసమూహం, కేయాస్లతో ఏర్పడింది. అందమైన సముద్రతీరాలతో ఇది దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలలో ఒకటి. మొర్రొకాయ్ పార్కులో సమీపంలోని చిన్నచిన్న ద్వీపసమూహం భాగంగా ఉన్నాయి. ఇది కరీబియన్ ప్రాంతంలోని ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా వేగవంతంగా అభివృద్ధి చెందింది.
కనామియా నేషనల్ పార్క్ 30,000 చ.కి.మీ వైశాల్యంలో గయానా, బ్రెజిల్ సరిహద్దులలో విస్తరించి ఉంది. వైశాల్యపరంగా ఇది ప్రపంచంలో 6వ స్థానంలో ఉంది. పార్కులోని 65% రాక్ ప్లాట్యూలతో (టెపుయిస్) నిండి ఉంటుంది. అసమానమైన జీవవైవిధ్యం కలిగిన ఈనేషనల్ పార్క్ గొప్ప భౌగోళిక ఆసక్తి కలిగిస్తుంది. ఇక్కడ ఉన్న ఏజెల్ జలపాతం ప్రపంచంలో అత్యంత ఎత్తైన జలపాతంగా (979 మీ) గుర్తించబడుతుంది.
" ఎకనమిక్ పాలసీ ఆఫ్ ది హుగొ చావెజ్ ", ధరల క్రమబద్ధీకరణ సమయంలో వెనుజ్వేలాలో నెకొన్న నిత్యావసరాల లోటు ప్రధానపాత్ర వహించింది. [124][125] నికోలస్ మదురొ ప్రభుత్వపాలనలో వెనుజులియన్ ప్రభుత్వ విధానాలు అమలైన సమయంలో " గ్రేటర్ షార్టేజ్ " (గొప్పలోటు) సంభవించింది. ధరలు నియంత్రించడానికి విదేశాలతో వ్యాపారం చేస్తున్న వారి నుండి యునైటెడ్ స్టేట్స్ డాలర్లు సేకరించబడ్డాయి.[126] పాలు, రకరకాల మాంసం, కోడి మాంసం, కాఫీ, బియ్యం, ప్రి కుక్డ్ పిండి, వెన్న, బ్రీస్ట్ ఇంప్లాంట్స్, నిత్యావసర వస్తువులైన టాయిలెట్ పేపర్లు, పర్సనల్ హైజెనిక్ ఉత్పత్తులు, ఔషధాల కొరత ఏర్పడింది.[124][127][128] లోటు ఫలితంగా వెనుజులియన్లు ఆహారం కొరకు వెతుకులాటలో గంటల సమయం క్యూలైన్లలో ఎదురు చూసి కొన్ని మార్లు అవసరమైన వస్తువులు పొందలేక నిరాశతో వెనుదిరిగిన సమయాలు ఉన్నాయి.[129][130] వెనుజులియన్ ప్రభుత్వం ఆహారపు, నిత్యావసర వస్తువుల బందిపోట్లు లోటుకు కారణమని ఆరోపించింది.[131] ప్రణాళికాబద్ధత, నిర్వహణాలోపం కారణంగా కరువు సంభవించింది. 2016లో విద్యుత్తు సరఫరా లోటును భర్తీ చేయడానికి మదురొ ప్రభుత్వం రోలింగ్ బ్యాక్ ఔట్ విధానం ప్రకటించారు.[132] ప్రభుత్వ పనివారం " సోమవారం నుండి మంగళవారం " నికి కుదించబడింది.[133]2016లో ఒక మల్టీ యూనివర్శిటీ అధ్యయనం ఆకలికారణంగా 75% వెనుజులియన్లు బరువును కోల్పోయారు. ఆహారకొరత కారణంగా ప్రజలు సరాసరిగా 8.6 కి.గ్రా బరువు కోల్పోయారు.[134] 2016-2017 మద్య వెనుజులియన్లు ఆహారం కొరకు ప్రతిదినం వెతుకులాట కొనసాగించారు. అడవిలో లభించే పండ్లు లేక చెత్తలో పడిన ఆహారం తిని జీవించారు. ఆహారం కొరకు గంటలతరబడి క్యూలో నిలిచారు.[130][135][136][137][138] 2017లో ప్రీస్టులు వెనుజులియన్లు తమ చెత్తను అవసరమైన వారి కొరకు వదిలివెళ్ళమని బోధించారు. [139] 2017 మార్చిలో వెనుజ్వేలాలోని ప్రపంచంలో బృహత్తర ఆయిల్ నిల్వలు తరిగిపోవడం మొదలైంది. కొన్ని నివేదికలు ఆయిల్ దిగుమతి చేసుకోవడం మొదలైందని తెలియజేసాయి.[140]
వెనుజ్వేలా బృహత్తర ఆయిల్, సహజవాయునిల్వలను కలిగిన దేశాలలో ఒకటిగా ఉంది. క్రూడాయిల్ ఉత్పత్తి దారులలో మొదటి పది దేశాలలో ఒకటిగా ఉంది. [141] 2010లో 41.4% క్రూడాయిల్ ఉత్పత్తితో సౌదీ అరేబియాను అధిగమించింది.[142] దేశం ప్రధాన పెట్రోలియం నిల్వలు మరకైబొ సరసులో, జులియాలో గల్ఫ్ ఆఫ్ వెనుజ్వేలా ప్రాంతం, ఒరినొకొ రివర్ బేసిన్ ప్రాంతంలో (తూర్పు వెనుజ్వేలా) ప్రాంతంలో ఉన్నాయి. [143] వెనుజ్వేలా నాన్ కాంవెంషనల్ ఆయిల్ నిల్వలు (ఎక్స్ట్రా హెవీ - క్రూడాయిల్) బిటుమెన్, టార్ శాండ్స్ (ప్రపంచ కాంవెంషనల్ ఆయిల్ నిల్వలకు ఇది సమానం) వద్ద ఉన్నాయి.[144] జలవిద్యుత్తు మీద అధికంగా ఆధారపడుతున్న కొన్ని దేశాలలో వెనుజ్వేలా ఒకటి. గురి ఆనకట్ట అతిపెద్ద ఆనకట్టలలో ఒకటిగా గుర్తించబడుతుంది.20వ శతాబ్దం ప్రథమార్ధంలో యు.ఎస్. ఆయిల్ కంపెనీలు వెనుజ్వేలాలో అత్యధికంగా జోక్యం చేసుకున్నాయి. అవి మినహాయింపులను కొనుగోలు చేయడంలో ఆసక్తి చూపాయి.[145] 1943లో కొత్త ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు ఆదాయం 50/50 పంచుకోవడానికి అంగీకరించాయి. ఒ.పి.ఇ.సి.కి కొత్తగా స్థాపించబడిన డెమొక్రటిక్ ప్రభుత్వం, హైడ్రోకార్బన్ మంత్రి " పబ్లొ పెరెజ్ అల్ఫొంసొ " నాయకత్వం వహించాడు. " ది కంసార్టియం ఆఫ్ ఆయిల్- ప్రొడ్యూసింగ్ కంట్రీస్ " ఆయిల్ ధర నిర్ణయానికి మద్దతు ఇచ్చింది..[146]1973లో వెనుజ్వేలా ఆయిల్ కంపెనీలను జాతీయం చేయడానికి ఓటు వేసింది. 1976 జనవరి 1 నాటికి అది అమలులోకి వచ్చింది. పెట్రోలియోస్ డీ వెనుజ్వేలా పేరుతో ఆయిల్ కంపెనీలు జాతీయం చేయబడ్డాయి. తరువాత సంవత్సరాలలో వెనుజ్వేలా విస్తారంగా రిఫైనరీలు నిర్మించి యు.ఎస్., ఐరోపా లలో మార్కెటింగ్ చేసింది. [147] 1990లో పి.డి.వి.ఎస్.ఎ. ప్రభుత్వం నుండి స్వతంత్రం పొందింది. విదేశీపెట్టుబడులు ఆహ్వానించబడ్డాయి.2001 నాటికి హుగొ చావెజ్ లా విదేశీపెట్టుబడులపై పరిమితి విధించబడింది. అధ్యక్షుడు రాజీనామా కోరుతూ 2002 డిసెంబరు -2003 ఫిబ్రవరి వరకు సాగిన నేషనల్ స్టైక్‌లో పి.డి.వి.ఎస్.ఎ. కీలకమైన పాత్రవహించింది. మేనేజర్లు, ఉన్నత వేతనం అందుకుంటున్న సాంకేతిక నిపుణులు ప్లాంటులు మూసివేసి వారి ఉద్యోగాల నుండి వైదొలిగారు. పి.డి.వి.ఎస్.ఎ రిఫైనరీలు దాదాపు మూతబడ్డాయి.తరువాత వర్కర్లు తిరిగి రావడం, కొత్త వర్కర్లను నియమింకుని కంపెనీలు తిరిగి పనిచేసాయి. సమ్మె కారణంగా బాధ్యతను నిర్లక్ష్యం చేసారన్న కారణంతో 40% ఉద్యోగులు (18,000 మంది) ఉద్యోగాలనుండి తిలగించబడ్డారు[148][149]
వెనుజ్వేలా లోని కారకాస్ సమీపంలోని మైక్యుయెషియా వద్ద ఉన్న " సైమన్ బొలివర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ", మరకైబొ వద్ద ఉన్న " లా చినిటా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ " ద్వారా వాయుమార్గంలో ప్రంపంచదేశాలతో అనుసంధానించబడి ఉంది. అలాగే మరకైబొ, ప్యూర్టో కాబెల్లో వద్ద ఉన్న " లా గుయైరా " నౌకాశ్రం " సముద్రమార్గంలో వెనుజ్వేలాను ప్రపంచదేశాలతో అనుసంధానిస్తుంది. అమెజాన్ వర్షారణ్యాల దక్షిణ , తూర్పు ప్రాంతాలలో క్రాస్ బార్డర్ ట్రాంస్ పోర్ట్; పశ్చిమంలో పర్వతప్రాంతం కొలంబియాతో సరిహద్దు(2213 కి.మీ) పంచుకుంటున్నది.ఒరినొటొ నది నౌకాయానానికి అనువుగా ఉండి వెసల్స్‌ను సముద్రం నుండి 400 కి.మీ దూరంవరకు చేరవేయడానికి సహకారం అందిస్తుంది. ఇది ప్రధాన పారిశ్రామిక నగరం అయిన సియుడాడ్ను అట్లాంటిక్ మహాసముద్రంతో అనుసంధానిస్తుంది. వెనుజ్వేలా పరిమితమైన రైలుమార్గాలను కలిగి ఉంది. వెనుజ్వేలా నుండి ఇతర దేశాలకు రైలు మార్గాలు లేవు.హుగొ చావెజ్ ప్రభుత్వం రైలుమార్గాలను విస్తరించడానికి ప్రయత్నించింది. వెనుజ్వేలా $7.5 బిలియన్లను చెల్లించడంలో విఫలమైన కారణంగా రైలుమార్గ నిర్మాణం నిలిపివేయబడింది. [విడమరచి రాయాలి] చైనాకు $500 మిలియన్ ప్రణాళిక ఇవ్వబడింది.[150] పలు ప్రధాన నగరాలలో మెట్రొ సిస్టం ఉంది; 1983 నుండి " ది కారకాస్ మెట్రొ " పనిచేస్తుంది. మరకైబొ మెట్రొ , వాలెంషియా మెట్రొ సమీపకాలంలో ప్రారంభించాయి. వెనుజ్వేలా మొత్తం రహదారి పొడవు 1,00,000 కి.మీ. రైలుమార్గాల పొడవులో వెనుజ్వేలా ప్రపంచదేశాలలో 45వ స్థానంలో ఉంది.[151] రహదారిలో మూడవ వంతు పేవ్చేయబడి ఉన్నాయి.
మంచినీటి సరఫరా , శానిటేషన్ జనసంఖ్య అధికరించిన కారణంగా 2006 లో విస్తరించబడ్డాయి.అనేకమంది ప్రజలకు పైప్ వాటర్ అంబాటులో లేదు.సరఫరా చేయబడుతున్న నీటి నాణ్యత మిశ్రితంగా ఉంది. మంచి నీరు మద్యమద్య నిలిపి సరఫరా చేయబడుతూ ఉంది. మురికి నీరు ట్రీట్ చేయబడడం లేదు. నాన్ రెవెన్యూ వాటర్ 62% ఉంది. ప్రాంతీయ సరాసరి 40%.2003లో నీటి పన్ను నిలిపివేయబడిన కారణంగా పైపు నీరు వ్యయరహితం(ఇన్ ఎక్స్పెంసివ్). కేద్రీకృతమైన విధానం 1990 నుండి వికేంద్రీకరణ చేయబడింది. పర్యావరణ మంత్రిత్వశాఖ విధానాలను రూపొందిస్తుంది. 80% ప్రజలకు హైడ్రొవెన్ కంపెనీ మంచినీటి సరఫరా చేస్తుంది.మిగిలిన వారికి 5 స్టేట్స్కు స్వంతమైన వాటర్ కంపెనీలు అందిస్తున్నాయి. ది కార్పొరాసియన్ వెనుజ్వేలా డీ గయానా , కమ్యూనిటీ బేస్డ్ సేవాసంస్థలు నీటిసరఫరా చేస్తున్నాయి. [152]
లాటిన్ అమెరికా దేశాలలో అత్యధికంగా నగరీకరణ చేయబడిన దేశాలలో వెనుజ్వేలా ఒకటి.[7][8] వెనుజులియన్లలో అత్యధికమంది ఉత్తర ప్రాంత నగరాలలో నివసిస్తున్నారు. రాజధాని నగరం , దేశంలో అతిపెద్ద నగరం అయిన " కారకాస్ " నగరంలో మరింత అధికంగా నివసిస్తున్నారు. 93% ప్రజలు ఉత్తర వెనుజ్వేలా నగరాలలో నివసిస్తున్నారు. 73% ప్రజలు సముద్రతీరానికి 100 కి.మీ కంటే తక్కువ దూరం ఉన్న ప్రాంతాలలో నివసిస్తున్నారు.[155] " సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ వెనుజ్వేలా " సాంఘికశాస్త్రవేత్తల అధ్యయనాల ఆధారంగా బొలివేరియన్ రివల్యూషన్ తరువాత 1.5 మిలియన్ల వెనుజులియన్లు (దేశజనాభాలో 4%-6%) వెనుజ్వేలాను వదిలి వెళ్ళారని భావిస్తున్నారు.[156][157] వెనుజ్వేలా భూభాగంలో సగం ఉన్న ఒరినొకొ దక్షిణ ప్రాంతంలో 5% ప్రజలు మాత్రమే నివసిస్తున్నారు. ఈప్రాంతంలో ముఖ్యత్వం కలిగిన అతిపెద్ద నగరం సియుడాడ్ గయానా నగరం. ఇది జనసాంధ్రతలో 6వ స్థానంలో ఉంది.[158] ఇతర నగరాలలో బార్క్విసిమెటొ, వలెంసియా, మరకే, మరకైబొ, బార్సిలొనా- ప్యూర్టొ లా క్రజ్, మెరిడా , శాన్ క్రిస్టోబల్ ప్రాధాన్యత వహిస్తున్నాయి.
Racial and Ethnic Composition in Venezuela (2011 Census)[1] | ||||
---|---|---|---|---|
Race/Ethnicity | ||||
Mestizo | 51.6% | |||
White | 43.6% | |||
Black | 2.9% | |||
Afro-descendant | 0.7% | |||
Other races | 1.2% |
వెనుజ్వేలా ప్రజలు వైవిధ్యమైన పూర్వీకుల సంతతికి చెంది ఉన్నారు. వీరిలో అత్యధికంగా మెస్టిజోలు (పూర్వీకసంతతికి చెందిన మిశ్రిత ప్రజలు) ఉన్నారు. మొత్తం ప్రజలలో 51.6% మెస్టిజోలు , 43.6% శ్వేతజాతీయులు ఉన్నారు.[1] మొత్తం జనాభాలో సంగం మంది మొరెనొలుగా గుర్తించబడ్డారు.మొరెనొ అంటే " డార్క్ - స్కిండ్ " లేక " బ్రౌన్ - స్కిండ్ " అని అర్ధం స్పురిస్తుంది. లైట్ స్కిన్‌కు ఇది వ్యతిరేకం. ఈపదం మానవముఖం కంటే చర్మం వర్ణం ఆధారంగా మానవవర్గీకరణలో ఉపయోగించబడుతుంది.
వెనుజ్వేలాలో 2.8% తమకు తాము నల్లజాతీయులుగా (వీరిలో ఆఫ్రికన్ , స్థానికజాతి ప్రజలు ఉన్నారు) అంగీకరించారు, 0.7% ఆఫ్రికన్ సంతతికి చెందిన వారు, 2.6% స్థానికజాతి ప్రజలు, 1.2% ఇతర జాతులకు చెందిన ప్రజలు ఉన్నారు.[1][1] ఇండిజెనియస్ ప్రజలలో 58% వయూ ప్రజలు, 7% వరావ్ ప్రజలు, 5% కరినా, 4% పెమాన్, 3% పియారొయా, 3%జివి, 3% అను, 3% కుమనగొటొ, 2% యుక్పా, 2% చైమా , 1% యనొమమి ప్రజలు ఉన్నారు. మిగిలిన 9% ప్రజలు ఇతర స్థానికజాతులకు చెందిన ప్రజలు ఉన్నారు.[159]
2008లో " యూనివర్శిటీ ఆఫ్ బ్రసిలియా " నిర్వహించిన అటొసొమల్ (క్రొమొజొం) డి.ఎన్.ఎ. జన్యు అధ్యయనం ఆధారంగా వెనుజ్వేలా ప్రజలలో 60.6% యురేపియన్, 23% ఇండిజెనియస్ , 16.3% ఆఫ్రికన్ ప్రజలు ఉన్నారని భావిస్తున్నారు.[160] కాలనీ కాలం , రెండవ ప్రపంచ యుద్ధం తరువాత కనరీ ద్వీపాల నుండి యురేపియన్లు వలసలో వెనుజ్వేలా చేరుకున్నారు.[161] ఇది వెనుజ్వేలా ఆహారసంస్కృతి , అలవాట్ల మీద ప్రభావం చూపింది.[162][163][164] ఈప్రభావం వెనుజ్వేలాను 8వ కనరీ ద్వీపంగా పిలువబడేలా చేసింది.[165][166] 20వ శతాబ్ధం ఆరంభంలో ఆయిల్ అన్వేషణ ప్రారంభం అయిన తరువాత యునైటెడ్ స్టేట్స్ వెనుజులులాలో కంపెనీలు స్థాపించడం మొదలుపెట్టి వారితో యు.ఎస్. పౌరులను తీసుకువచ్చింది. యుద్ధం ఆరంభం , తరువాత యూరప్, మిడిల్ ఈస్ట్ , చైనా దేశాల నుండి వలస ప్రజలరాక మొదలైంది.[167] 20వ శతాబ్ధంలో మిగిలిన లాటిన్ అమెరికన్ దేశాలతో కలిసి వెనుజ్వేలాకు యూరప్ దేశాల నుండి మిలియన్ల మంది వలసప్రజలు వచ్చి చేరారు.[168][169] ప్రత్యేకంగా రెండవ ప్రపంచ యుద్ధం తరువాత వలసలు అధికం అయ్యాయి.[168][169][170] 1970లో ఆయిల్ ఎగుమతి వేగవంతం అయిన తరువాత ఈక్వెడార్, కొలంబియా , డోమినికన్ రిపబ్లిక్ నుండి మిలియన్ల కొద్ది వలస ప్రజలు వెనుజ్వేలాకు వచ్చి చేరారు. [170] వలసల వత్తిడి వేతనం మీద ప్రభావం చూపినందున కొంతమంది వెనుజులియన్లు యురేపియన్ వలసలను వ్యతిరేకించారు.[170] వెనుజులియన్ ప్రభుత్వం చురుకుగా వ్యవహరించి ఈస్టర్న్ యూరప్ ఇంజినీర్లను అవసరమైన పనులలో నియమించింది. [168] మిలియన్ల కొద్ది కొలంబియన్లు, మిడిల్ ఈస్ట్ , హైథీయన్ ప్రజలు వెనుజ్వేలాకు వలసగా రావడం 21వ శతాబ్ధం వరకు కొనసాగింది.[167]" వరల్డ్ రెఫ్యూజీ సర్వే 2008 " ఆధారంగా వెనుజ్వేలా కొలంబియా నుండి వచ్చిన 2,52,200 (2007) మంది శరణార్ధులు, కొత్తగా శరణు కోరిన 10,600 మంది ఆశ్రితులకు (2007) ఆతిథ్యం ఇచ్చిందని భావిస్తున్నారు.[171] వెనుజ్వేలాలో 5,00,000 - 10,00,000 మంది వలసప్రజలు చట్టవిరుద్ధంగా నివసిస్తున్నారని అంచనా.[172] దేశంలో మొత్తం 5,00,000 మంది 40 జాతులకు చెందిన ఇండిజెనియస్ (2.8%) ప్రజలు నివసిస్తున్నారు.[173] స్థానిక ప్రజలు అధికంగా వెనుజ్వేలా సరిహద్దుప్రాంతాలలో (బ్రెజిల్, గయానా, కొలంబియా దేశాల సరిహద్దుల వెంట) కేద్రీకృతమై ఉన్నారు.వీరిలో వైయూ, వరావ్ (వెస్ట్), వరావ్ (ఈస్ట్), యనోమమి (దక్షిణం), పెమాన్ ప్రజలు అధికంగా ఉన్నారు.
వెనులులాలో స్పానిష్ ఆధిక్యతలో ఉంది. స్పానిష్ భాషతో చేర్చి రాజ్యాంగం 30 భాషలను గుర్తించింది. వీటిలో వయూ, వరావ్, పెమన్, పలు ఇతర భాషలు ఉన్నాయి. స్థానిజాతులలో అధికంగా వాడుకలో ఉన్న వయూ భాషకు 1,70,000 మంది వాడుకరులు ఉన్నారు.[174] వలస ప్రజలకు స్పానిష్, చైనీస్ (4,00,000), పోర్చుగీసు (2,54,000) [174], ఇటాలియన్ (2,00,000),[175] వెనుజ్వేలాలో అధికంగా వాడుకలో ఉన్నాయి. స్పానిష్ భాషకు ఆధికారభాషా హోదా కల్పించబడింది. లెబనీస్, సిరియన్ కాలనీలో అరబ్ భాష (ఇస్లా మార్గరిటా, మరకైబొ, పుంటొ ఫిజొ, ప్యుర్టొ లా క్రజ్, ఎల్ టైగ్రే, మరకే, కరకాస్ ప్రాంతాలలో) వాడుక భాషగా ఉంది. పోర్చుగీసు భాషను పోర్చుగీసు ప్రజలేగాక పొరుగున ఉన్న బ్రెజిల్ వాసులలో కూడా వాడుకలో ఉంది. జరన్లకు జర్మన్ భాష వాడుకలో ఉంది. కొలోనియా టొవర్ ప్రజలకు అలెమన్నిక్ భాష వాడుకలో ఉంది. దీనిని జర్మన్లు కొలోనియరొ అని పిలుస్తారు. ఆంగ్లం అత్యధికగా అవసరార్ధం వాడబడుతుంది. ప్రొఫెషనల్స్, విద్యావేత్తలు, పై తరగతి, మద్యతరగతి ప్రజలు ఇంగ్లీష్ భాషను మాట్లాడుతున్నారు. ఎల్ కల్లవొ నగరంలో ఇంగ్లీష్ సర్వసాధారణంగా వాడుకలో ఉంది. ఇటాలియన్ ప్రైవేట్ విద్యా సంస్థలు, పాఠశాలలో బోధించబడుతుంది. ప్రభుత్వం ప్రాథమిక స్థాయిలో నిర్భంధ భాషగా ఇటాలియన్ భాషను బోధించాలని సూచిస్తుంది. అధికసంఖ్యాక ప్రజలకు బాస్క్యూ, గలిషియన్ భాషలు వాడుకలో ఉన్నాయి.
2011 ఓటింగ్ ఆధారంగా వెనుజ్వేలాలో 88% క్రైస్తవులు ఉన్నారు. వీరిలో రోమన్ కాథలిక్కులు 71%, ప్రొటెస్టెంట్లు (ప్రధానంగా ఎవాంజెలికన్లు ) 17% ఉన్నారు. 8% నాస్థికులు, 2% అథిస్థులు అగోనిస్టులు 6%, ఇతర మతస్థులు 3% ఉన్నారు.[176] వెనుజ్వేలాలో స్వల్పసంఖ్యలో ముస్లిములు, బౌద్ధులు, యూదులు సమూహాలుగా ఉన్నారు. వీరిలో లెబనీయులు, సిరియన్లు (1,00,000 మంది) సంతతికి చెందిన ప్రజలు న్యువ ఎస్పర్టా, ప్యుంటొ ఫిజొ, కారకాస్ ప్రాంతాలలో నివసుస్తున్నారు. బౌద్ధులు 52,000 మంది ఉన్నారు. వీరిలో చైనీయులు, జపానీయులు, కొరియన్లు ఉన్నారు. బౌద్ధులు అధికంగా కారకాస్, మరకే, ప్యూరిటొ ఆర్డాజ్, శాన్ ఫెలిప్, వెలెంసియా ప్రాంతాలలో కేంద్రీకరించి ఉన్నారు.యూదుల సంఖ్య సమీపకాలంలో తగ్గుముఖం పడుతుంది. [177][178][179][180][181] 1999 లో 22,000 మంది ఉన్న యూదుల సంఖ్య [182] 2015 నాటికి 7,000 లకు చేరుకుంది.[183]
వెనుజ్వేలా సంస్కృతి ప్రధానంగా మూడు వైద్యమైన సంస్కృతుల ప్రభావితమై సరికొత్త మిశ్తితమైన సరికొత్త వెనుజ్వేలా సంస్కృతి రూపొందింది.ఇందులో ఇండిజెనియస్, ఆఫ్రికన్, స్పెయిన్ సంస్కృతులు ప్రతిబింబిస్తుంటాయి. మొదటి రెండు సంస్కృతులు రెండు స్థానికజాతి ప్రజలకు చెందినవి. ఇవి రెండు ఒకదానితో ఒకటి పోలివుండి క్రంగా ఒకటిగా విలీనమై వెనుజులియన్ సంస్కృతిగా మార్పు చెందాయి.వెనుజులియన్ సంస్కృతి మిగిలిన లాటిన్ అమెరికన్ దేశాల సంస్కృతితో పోలివున్నప్పటికీ పర్యావరణ భేదాలు, సహజమైన భగోళిక ప్రకృతిసహజ వ్యత్యాసాలతో తన ప్రత్యేకత నిలబెట్టుకుంటుంది.ఇండిజెనియస్ సంస్కృతిలో పరిమితమైన పదాలు, ఆహారపద్ధతులు, ప్రదేశాల పేర్లు ఉంటాయి. ఆఫ్రికన్ ప్రభావం అదేవిధంగా ఉన్నప్పటికీ డ్రంస్ వాయిద్యప్రభావం అదనంగా వచ్చిచేరింది. స్పెయిన్ సంస్కృతి ప్రధానమైనది. కాలనైజేషన్ విధానం, సాంఘిక ఆర్థిక నిర్మాణం కారణంగా ఇది వెనుజ్వేలా సంస్కృతిని ప్రభావితం చేసి వెనుజ్వేలా సంస్కృతిలో విలీనమై వెనుజ్వేలా సంస్కృతిలో భాగమై వెనుజ్వేలా సంస్కృతిని సుసంపన్నం చేసింది.ఇది ప్రత్యేకంగా కాలనీశకంలో కరీబియన్ వలసప్రజలు అధికసంఖ్యలో నివసించిన అండలూసియా, ఎక్స్ట్రిమడురా ప్రాంతాలలో ఆరంభం అయింది. ఉదాహరణగా ఇక్కడ భవననిర్మాణాలు, సంగీతం, కాథలిక్ మతం, భాషలలో స్పెయిన్ ప్రభావం అధికంగా ఉంది.స్పానిష్ సంస్కృతి ప్రభావం కారణంగా బుల్‌ఫైట్, ఆహారవిధానాలు వెనుజ్వేలాలో విలీనం కావడం నిదర్శనంగా కనిపిస్తుంది. వెనుజ్వేలా అదనంగా భారతీయ, యురేపియన్ సంస్కృతులతో (19వ శతాబ్దంలో ప్రత్యేకంగా ఫ్రెంచి సంస్కృతి ప్రభావం) సుసంపన్నమై ఉంది.సమీపకాలంలో ఆయిల్ అన్వేషణ కారణంగా ప్రధాననగరాలకు యు.ఎస్., ఇటలీ, స్పెయిన్, పోర్చుగీసు దేశాల నుండి వలసలు మరింత అధికం అయ్యాయి. యు.ఎస్. ప్రజలు తమతో బేస్ బాల్ అభిరుచిని, యు.ఎస్. శైలి ఫాస్ట్ ఫుడ్, ప్రస్తుత నిర్మాణశైలి భవనాలు మొదలైన వాటిని వెనుజ్వేలాకు తీసుకువచ్చారు.
వెనుజ్వేలా కళలను ప్రధానంగా మతం ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ 19వ శతాబ్దం నుండి కళాకారులు చారిత్రక, స్వతంత్రసమర కథానాయకులకు ప్రాధాన్యత ఇస్తూ కళలు రూపొందించడం ప్రారంభించారు.[184][185] ఈ ఉద్యమానికి " మార్టిన్ టోవర్ వై టోవర్ " నాయకత్వం వహించాడు. .[185][186] 20వ శతాబ్దంలో కళారంగంలో ఆధునికత ఆరంభం అయింది. [186] గుర్తించతగిన వెనుజులియన్ కళాకారులలో క్రిస్టోబల్ రోజాస్, అర్మాండో రెవెరాన్, మాన్యుయల్ కాబ్రే, కెనెటిక్ కళాకారులు, జెసస్- రాఫెల్ సోటో, జెగో, కరోల్స్ క్రజ్ - డియెజ్ ప్రధాన్యత వహిస్తున్నారు. [186] వీరిలో సమకాలీన కళాకారులు మరిసోల్ ఎస్కోబర్, యూసెఫ్ మెహ్రి కూడా ఉన్నారు.[187][188]
వెనుజులియన్ సాహిత్యం స్పానిష్ విజయం తరువాత విద్యావంతులైన ఇండిజెనియస్ సంఘాల నుండి ఆరంభం అయింది.[189] ఆరంభంలో వెనుజ్వేలా సాహిత్యాన్ని స్పానిష్ ప్రభావితం చేసింది. వెనుజులియన్ స్వతంత్రసమరం, వెనుజులియన్ రోమానిటిజం (జుయాన్ విసెంటే గాంజలెజ్ ఈప్రాంతంలో సాహిత్యకారుడుగా వెలుగులోకి వచ్చాడు) తరువాత సాహిత్యన్ని రాజకీయాలు ప్రభావితం చేసాయి. సాహిత్యాన్ని ప్రధానంగా రచనలు ఆధిక్యత చేసినా ఆండెస్ ఎలాయ్ బ్లాంకొ, ఫర్మిన్ టోరొ వంటి కవులు కవిత్వం ద్వారా వెనుజ్వేలా సాహిత్యచరిత్రలో తమదైన ముద్ర నమోదు చేసుకున్నారు. రచయితలు, నవలారచయితలలో రొములో గల్లెజొస్, టెరస డీ లా పర్రా, ఆర్టురొ అస్లర్ పియట్రి, ఆండ్రియానొ గాంజలెజ్ లెయాన్, మైగ్యుయల్ ఒటెరొ సిల్వ, మరియానొ పికాన్ సలాస్ ప్రధాన్యత వహిస్తున్నారు. గొప్ప కవి, మానవతావాది ఆండ్రెస్ బెల్లో కూడా విద్యావేత్తగా, మేధావిగా (ఆయన సైమన్ బొలివర్ బాల్యకాల ట్యూటర్, మెంటర్) గుర్తించబడ్డాడు. ఇతరులలో ల్యూరియానొ వల్లెనిల్లా, జోస్ గిల్ ఫొర్టౌల్ తమ సానుకూలధోరిణి విశ్లేషణతో గుర్తించబడ్డారు.
వెనుజ్వేలా ఇండిజెనియస్ సంగీతశైలిని అన్ సొలో ప్యూబ్లొ, సెరెంటా గయానెసా సంగీతబృందాలు విశదీకరిస్తుంటాయి. వెనుజ్వేలా జాతీయ సంగీత వాయిద్యం కుయాట్రొ.ఇలానోస్లోని అల్మా లియానెరా (పెడ్రొ ఎలియాస్ గుటియెర్రెజ్, రాఫెల్ బొలివర్ కొరొనాడో), ఫ్లొరెంటినొ వై ఎల్ డియాబ్లొ (అల్బెర్టొ అర్వెలో టొర్రియాల్బ) కాంసియాట్రొ ఎన్ లా లానురా (జుయాన్ విసెంట్ టొర్రియాల్బా, కబల్లో (సైమన్ డియాజ్) ప్రాంతాలలో వైవిధ్యమైన ప్రత్యేక సంగీతశైలి సంగీతాలు వెలుగులోకి వచ్చాయి. జులియన్ గైటా శైలి కూడా చాలాప్రాబల్యత సంతరించుకుంది.సాధారణంగా ఇది క్రిస్మస్ సమయంలో ప్రదర్శించబడింది.[190] సుసంపన్నమైన సంస్కృతి కలిగిన వెనుజ్వేలాలో కలిప్స్కొ, బాంబుకొ, ఫులియా, కాంటోస్, డీ పిలాడో డీ మైజ్, కాంటోస్ డీ లవండెరాస్, సెబుకాన్, మారెమారే నృత్యరీతులు ప్రధానమైనవి.[191] టెరెసా కార్రెనొ 19వ శతాబ్ధపు ప్రపంచప్రసిద్ధి చెందిన పియానో కాళాకారుడుగా గుర్తించబడ్డాడు. చివరి సంవత్సరాలలో క్లాసికల్ సంగీతం అద్భుత ప్రదర్శనలు ఇచ్చి తన ఘనత చాటుకుంది. సైమన్ బొలివర్ యూత్ ఆర్కెస్ట్రా గుస్టోవ్ డుడామెల్, జోస్ ఆంటొనియొ అబ్రెయు మార్గదర్శకంలో పలు యురేపియన్ కాంసర్ట్ హాల్స్ (2007లో లండన్ ప్రొంస్), పలు అద్భుతప్రదర్శనలు ఇచ్చి పలుమార్లు గౌరవించబడింది. 21వ శతాబ్దం ఆరంభంలో " మొవిడ అక్యుస్టిక అర్బనా " పేరుతో కొంతమంది సంగీతకారులు దేశసంప్రదాయ సంగీతాన్ని రక్షించడానికి తమస్వంత పాటలను సంప్రదాయ సంగీతవాయిద్యాలతో మేళవించి సంగీతాన్ని రూపొందించారు.[192][193] ఈసంప్రదాయంలో " టాంబొర్ అర్బనొ " [194] లాస్ సింవెర్గ్యుయెంజాస్, ది సి4ట్రియొ, అరొజ్కొ జాం మొదలైన బృందాలు రూపొందించబడ్డాయి.[195] ఆఫ్రో - వెనుజులియన్ సంగీత సంప్రదాయాలు అత్యధికంగా " బ్లాక్ ఫోల్క్ సెయింట్స్ ", " శాన్ బెనిటొ " పండుగలతో సంబంధితమై ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన పాటలు వేరు వేరు వేదికలలో ప్రదర్శించబడుతుంటాయి.
వెనుజ్వేలా బేస్ బాల్ ఆరభం గురించి స్పష్టంగా తెలియడం లేదు. అయినప్పటికీ వెనుజ్వేలాలో బేస్ బాల్ 19వ శతాబ్దంలో నుండి ఆదరణ పొదింది.[196] 20వ శతాబ్దంలో ఆయిల్ కంపెనీలలో పనిచేయడానికి వెనుజ్వేలా చేరుకున్న అమెరికన్లు బేస్ బాల్ వెనుజ్వేలాలో ప్రాబల్యత సంతరించుకోవడానికి సహకారం అందించారు.[197] 1930 నాటికి బేస్ బాల్ వెనుజ్వేలాలో మరింత ప్రాచుర్యం సంతరించుకుంది. 1945 నాటికి " వెనుజులియన్ ప్రొఫెషనల్ బేస్ బాల్ లీగ్ " స్థాపించబడింది.తరువాత ఈ క్రీడ దేశంలో మరింత ప్రాచుర్యం పొందిన క్రీడగా మారింది.[198][199]బేస్ బాల్ క్రీడకు లభించిన విస్తారమైన ప్రజాదరణ వెనుజ్వేలాకు పొరుగున ఉన్న దక్షిణ అమెరికా దేశాలలో ప్రత్యేకత కలిగించింది. అసోసియేషన్ ఫుట్ బాల్ ఖండంలో ఆధిక్యత కలిగి ఉంది. [197][199][200] బేస్ బాల్, ఫుట్ బాల్ వెనుజ్వేలా ప్రధాన క్రీడలుగా ఉన్నాయి.[201] వెనుజ్వేలా " 2012 ఎఫ్,ఐ.బి.ఎ. వరల్డ్ ప్లింపిక్ క్వాలిఫైయింగ్ టోర్నమెంటు ఫర్ మెన్ ", ఎఫ్.ఐ.బి.ఎ. అమెరికాస్ చాంపియన్ షిప్ " క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. ఇవి పొలియెడ్రొ డీ కారకాస్‌లో నిర్వహించబడ్డాయి. వెనుజ్వేలాలో " వెనుజ్వేలా నేషనల్ ఫుట్ బాల్ టీం " ప్రజాదరణ పొందడంలో విజయం సాధించింది. వరల్డ్ కప్ సమయంలో ఫుట్ బాల్ క్రీడకు మరింత గుర్తింపు కలుగుతూ ఉంది.[201] కొప అమెరికా క్రీడలకు ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి ఆతిథ్యం ఇస్తుంది.[202] మునుపటి " ఫార్ములా 1 " డ్రైవర్ " పాస్టర్ మాల్డొనాడో " స్వదేశం వెనుజ్వేలా. [203] " 2012 స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ " లో ఆయన మొదటి విజయం సాధించి మొదటి , ఏకైక వెనుజ్వేలా " ఫార్ములా 1 " క్రీడాకారుడుగా పేరు తెచ్చుకున్నాడు.[203] మాల్డొనాబొ వెనుజ్వేలాలో " ఫార్ములా 1 " క్రీడకు ప్రాచుర్యం కలిగించాడు.[204]" 2012 సమ్మర్ ఒలింపిక్స్ " లో వెనుజులియన్ రుబెన్ లిమార్డొ ఫెంసింగ్ క్రీడలో బంగారు పతకం సాధించాడు.[205]
వెనుజులియన్ ఆహారం ఈప్రాంతంలో వైవిధ్యమైన ఆహారసంస్కృతులలో ఒకటి. వెనుజ్వేలాలోని వాతావరణ బేధాలు , సాంస్కృతిక మిశ్రమ కలయిక ఆహారసంస్కృతిలో ప్రతిఫలిస్తుంటాయి.ఆహారాలలో హల్లకా, పబెల్లాన్ క్రిల్లొ, అరెపాస్, పిస్కా అండినా, టర్కరి డీ చివొ, జలియా డీ మంగొ, పటకాన్ , ఫ్రైడ్ కమిగుయానస్ ప్రజాదరణ చూరగొన్నాయి.
వెనుజ్వేలా అందాలపోటీలలో కూడా తనదైన ముద్ర వేసింది. " ఓస్మెల్ సౌసా " 22 టైటిల్స్ గెలుచుకుంది. [206] అదనంగా " మిస్ వెనుజ్వేలా " దేశం అంతటా ఆసక్తిగా వీక్షించబడుతుంది.
వెనుజ్వేలా సాధించిన కిరీటాలు:
వెనుజ్వేలా గ్లోబల్ బ్యూటీస్ వెబ్ పేజీ జాబితాలో ప్రథమ స్థానం సాధించింది. వెనుజ్వేలా మహిళలు డయానా మెండోజ, (మిస్ యూనివర్స్ 2008), స్టెఫనియా ఫెర్నాండెజ్ (మిస్ యూనివర్స్ 2009) సాధించిన తరువాత వెనుజ్వేలా గిన్నిస్ రికార్డ్ స్థాపించింది.[207]
" కార్లోస్ రౌల్ విల్లనుయెవా " వెనుజ్వేలాలో ముఖ్యమైన ఆర్కిటెక్టుగా గుర్తింపు సంపాదించాడు: ఆయన రూపకల్పనలో యూనివర్శిటీ ఆఫ్ వెనుజ్వేలా (ప్రపంచ వారసత్వసంపదలలో ఒకటి), ఔలా మగ్నా నిర్మించబడ్డాయి. ఆయన రూపకల్పనలో కాపిటొలో,ది బరాల్ట్ దియేట్రే, ది టెరెస కర్రెనొ కల్చరల్ కాంప్లెక్స్, జనరల్ రఫీల్ అర్డనేటా బ్రిడ్జ్ నిర్మించబడ్డాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.