![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/55/Vivek_Ranjan_Agnihotri_%2528cropped%2529.jpg/640px-Vivek_Ranjan_Agnihotri_%2528cropped%2529.jpg&w=640&q=50)
వివేక్ అగ్నిహోత్రి
From Wikipedia, the free encyclopedia
వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఒక భారతీయ చలన చిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్, రచయితగా హిందీ సినిమాల్లో పనిచేస్తున్నాడు. ఆయన భారత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డు సభ్యుడు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్‌లో భారతీయ సినిమా సాంస్కృతిక ప్రతినిధిగా ఉన్నాడు. అతను ది తాష్కెంట్ ఫైల్స్ (2019) చిత్రంలో ఉత్తమ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ కై జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. అగ్నిహోత్రి అడ్వర్టోరియల్ ఏజెన్సీలతో తన వృత్తిని ప్రారంభించాడు. టెలి-సీరియల్ల నిర్మాణంతో పాటు దర్శకత్వం వహించాడు. క్రైమ్ థ్రిల్లర్ చాక్లెట్ (2005)తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తరువాత అనేక చిత్రాలకు దర్శకత్వం వహించాడు.